logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ములుగు మండల బీజేపీ కార్యవర్గ సమావేశం ఆదివారం మండల అధ్యక్షుడు రాయంచు నాగరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బీజేపీ సిద్ధాంతాలను ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని సిరికొండ బలరాం విమర్శించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, పారదర్శక పాలన అందించడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. అదే సమయంలో ప్రజా సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు జినుకల కృష్ణాకర్ రావు, సీనియర్ నాయకులు దొంతిరెడ్డి రవి రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు హేమాద్రి, మండల ప్రధాన కార్యదర్శులు లకావత్ రాజ్ కుమార్, కుక్కల పవన్ కళ్యాణ్, కార్యదర్శులు గుండెబోయిన శ్రీహరి గౌడ్, వేల్పుల రఘువీర్, యాట సాగర్, బద్ధుల లక్ష్మి, కోశాధికారి వైనాల సంపత్, బూత్ అధ్యక్షులు ఓదెల జనార్ధన్, సముద్రాల అశోక్, శ్రీరాముల రాజేందర్, మేకల రవి, గొంగళ్ళ కట్టయ్య, అప్పని సురేష్, వంశీ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_A.SHANKAR
A.SHANKAR
ములుగు, ములుగు, తెలంగాణ•
2 hrs ago
257bd7a8-8e8a-4543-b4b9-8747dbb08dec

ములుగు మండల బీజేపీ కార్యవర్గ సమావేశం ఆదివారం మండల అధ్యక్షుడు రాయంచు నాగరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బీజేపీ సిద్ధాంతాలను ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని సిరికొండ బలరాం విమర్శించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత

89be7a18-1a16-4a38-a919-c9f6c9ca31cc

ఇవ్వడం లేదని, పారదర్శక పాలన అందించడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. అదే సమయంలో ప్రజా సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు జినుకల కృష్ణాకర్ రావు, సీనియర్ నాయకులు దొంతిరెడ్డి రవి రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు హేమాద్రి, మండల ప్రధాన కార్యదర్శులు లకావత్ రాజ్ కుమార్, కుక్కల పవన్ కళ్యాణ్, కార్యదర్శులు గుండెబోయిన శ్రీహరి గౌడ్, వేల్పుల రఘువీర్, యాట సాగర్, బద్ధుల లక్ష్మి, కోశాధికారి వైనాల సంపత్, బూత్ అధ్యక్షులు ఓదెల జనార్ధన్, సముద్రాల అశోక్, శ్రీరాముల రాజేందర్, మేకల రవి, గొంగళ్ళ కట్టయ్య, అప్పని సురేష్, వంశీ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

More news from Jayashankar Bhupalapally and nearby areas
  • కేంద్ర ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారం వెలువడింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు డిగ్రీ విద్యార్హత ఉండాలి. ఈ ఉద్యోగ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వీడియోను 'Cryancreations5191' అనే యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు.
    1
    కేంద్ర ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారం వెలువడింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు డిగ్రీ విద్యార్హత ఉండాలి. ఈ ఉద్యోగ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వీడియోను 'Cryancreations5191' అనే యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు.
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Mogullapally, Jayashankar Bhupalapally•
    4 hrs ago
  • హనుమకొండ పరిధిలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డిని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి రామల సునీత మరియు ఆలయ ప్రధాన అర్చకులు గౌరవశ్రీ శేషు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. జూలై 15 నుండి 29 వరకు ఆలయంలో వైభవంగా జరగనున్న శాకాంబరి నవరాత్రి మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా కోరుతూ వారు ఎమ్మెల్యేకు అధికారిక ఆహ్వాన పత్రికను అందజేసి, అమ్మవారి ప్రసాదాన్ని అందించి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున దర్శనం, తాగునీరు, పారిశుద్ధ్యం, క్యూలైన్లు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శాకాంబరి నవరాత్రి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని కృపాకటాక్షాలు పొందాలని వారు కోరారు.
    1
    హనుమకొండ పరిధిలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డిని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి రామల సునీత మరియు ఆలయ ప్రధాన అర్చకులు గౌరవశ్రీ శేషు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. జూలై 15 నుండి 29 వరకు ఆలయంలో వైభవంగా జరగనున్న శాకాంబరి నవరాత్రి మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా కోరుతూ వారు ఎమ్మెల్యేకు అధికారిక ఆహ్వాన పత్రికను అందజేసి, అమ్మవారి ప్రసాదాన్ని అందించి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున దర్శనం, తాగునీరు, పారిశుద్ధ్యం, క్యూలైన్లు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శాకాంబరి నవరాత్రి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని కృపాకటాక్షాలు పొందాలని వారు కోరారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    హనుమకొండ, హనుమకొండ, తెలంగాణ•
    8 hrs ago
  • రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వాస్తవాలు వెల్లడిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. రిటైర్డ్ ఇంజనీర్లపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెస్తోందని హరీష్ రావు పేర్కొన్నారు. మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేస్తే ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలోని వాస్తవాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే నీటి విడుదలకు అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. అయితే సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదలపై ప్రభుత్వం సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
    1
    రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వాస్తవాలు వెల్లడిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. రిటైర్డ్ ఇంజనీర్లపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెస్తోందని హరీష్ రావు పేర్కొన్నారు.

మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేస్తే ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలోని వాస్తవాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే నీటి విడుదలకు అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. అయితే సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదలపై ప్రభుత్వం సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో ప్రాజెక్టులను ఎండబెడుతుందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా విమర్శించారు. ఎల్ఎండీ, ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరాయని కరీంనగర్ లో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్ వద్ద లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రం పాలవుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ కు పేరు రాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పంపులను ఆన్ చేయడం లేదని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కన్నెపల్లి పంపులను ఆన్ చేయకపోతే, రైతులు పంప్‌హౌస్‌లను ముట్టడించడం తప్పదని ఆయన స్పష్టం చేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
    1
    కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో ప్రాజెక్టులను ఎండబెడుతుందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా విమర్శించారు. ఎల్ఎండీ, ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరాయని కరీంనగర్ లో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్ వద్ద లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రం పాలవుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ కు పేరు రాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పంపులను ఆన్ చేయడం లేదని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి కన్నెపల్లి పంపులను ఆన్ చేయకపోతే, రైతులు పంప్‌హౌస్‌లను ముట్టడించడం తప్పదని ఆయన స్పష్టం చేస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయ శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శివ మరియు బీజేపీ నాయకులతో కలిసి రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ, బండి సంజయ్ కుమార్ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదగడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్ చారీ, కార్యదర్శులు వడ్డెపల్లె లక్ష్మయ్య, బొప్పిశెట్టి సాయిరామ్, అకోజు అరుణ్ కుమార్, కోశాధికారి బుర్ర రాజు, శక్తి కేంద్ర ఇంచార్జీ నారోజు నరేష్, సీనియర్ నాయకులు కాయిత అరుణ్ రెడ్డి, ఆశాడపు శ్రీనివాస్, అబ్బిడి లింగారెడ్డి, బూత్ అధ్యక్షులు పోగుల శేఖర్, బొనగిరి రాజేష్, వరికోలు నాగరాజు, మొలుగూరి గణేష్, నాయకులు ఎల్కపల్లి నవీన్, రమేష్, శ్రీనుతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
    1
    హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయ శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శివ మరియు బీజేపీ నాయకులతో కలిసి రోగులకు పండ్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ, బండి సంజయ్ కుమార్ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదగడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్ చారీ, కార్యదర్శులు వడ్డెపల్లె లక్ష్మయ్య, బొప్పిశెట్టి సాయిరామ్, అకోజు అరుణ్ కుమార్, కోశాధికారి బుర్ర రాజు, శక్తి కేంద్ర ఇంచార్జీ నారోజు నరేష్, సీనియర్ నాయకులు కాయిత అరుణ్ రెడ్డి, ఆశాడపు శ్రీనివాస్, అబ్బిడి లింగారెడ్డి, బూత్ అధ్యక్షులు పోగుల శేఖర్, బొనగిరి రాజేష్, వరికోలు నాగరాజు, మొలుగూరి గణేష్, నాయకులు ఎల్కపల్లి నవీన్, రమేష్, శ్రీనుతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
    user_Mahesh Chary
    Mahesh Chary
    Photographer Husnabad, Siddipet•
    22 hrs ago
  • బీసీ అంటే ప్రపంచాన్ని నడిపించే వారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీల ఆత్మగౌరవ నినాదమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు.
    1
    బీసీ అంటే ప్రపంచాన్ని నడిపించే వారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీల ఆత్మగౌరవ నినాదమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • వడ్లను లారీల కొద్దీ యథేచ్ఛగా అక్రమంగా అమ్ముకుంటున్నా అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ధాన్యపు కొనుగోలు కేంద్రాలు ముగిసి నెల రోజులు గడుస్తున్నా, వరి ధాన్యం ఎక్కడికి తరలిపోతుందనే అంశంపై ఎటువంటి నిఘా లేకపోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చెక్ పోస్టులలో కనీస తనిఖీలు కూడా నిర్వహించకపోవడం అధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయనడానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. ఈ వరి ధాన్యం కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రైస్ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, రైస్ మిల్లర్లు, అధికారులు, బడా నేతలు కుమ్మక్కై ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. లారీల కొద్దీ వడ్లను అక్రమంగా అమ్ముకుంటుంటే అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.
    1
    వడ్లను లారీల కొద్దీ యథేచ్ఛగా అక్రమంగా అమ్ముకుంటున్నా అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ధాన్యపు కొనుగోలు కేంద్రాలు ముగిసి నెల రోజులు గడుస్తున్నా, వరి ధాన్యం ఎక్కడికి తరలిపోతుందనే అంశంపై ఎటువంటి నిఘా లేకపోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చెక్ పోస్టులలో కనీస తనిఖీలు కూడా నిర్వహించకపోవడం అధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయనడానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు.

ఈ వరి ధాన్యం కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రైస్ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, రైస్ మిల్లర్లు, అధికారులు, బడా నేతలు కుమ్మక్కై ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. లారీల కొద్దీ వడ్లను అక్రమంగా అమ్ముకుంటుంటే అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    19 hrs ago
  • రైతులకు సాగునీరు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి తమ రక్తం అడ్డమైతే ఆ రక్తాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తూ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాగా, ప్రభుత్వం మాత్రం రైతుల సంక్షేమం, సాగునీటి సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది.
    1
    రైతులకు సాగునీరు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి తమ రక్తం అడ్డమైతే ఆ రక్తాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తూ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాగా, ప్రభుత్వం మాత్రం రైతుల సంక్షేమం, సాగునీటి సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.