ఓటు అనే ఆయుధం అమూల్యమైనది – ప్రజాస్వామ్యానికి ప్రాణాధారమైనది... రాంపురం రెడ్డి సోదరులు... ఓటు అనే ఆయుధం అమూల్యమైనది – ప్రజాస్వామ్యానికి ప్రాణాధారమైనది! మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ముఖ్య గమనిక: రాంపురం రెడ్డి సోదరులు, ప్రస్తుతం కొత్త ఓటర్ల నా మొదటి కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుందని మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న మండల గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కొత్తగా ఓటర్ కార్డు అప్లై చేసుకోవాలని తెలిపారు. పెద్దాయన వై.సీతారామరెడ్డి మంత్రాలయం శాసనసభ్యులు వై. బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డి యువ నాయకులు వై.ధరణీధర్ రెడ్డి ఆదేశాలు పిలుపు మేరకు...ప్రస్తుతం కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. మన నియోజకవర్గ భవిష్యత్తును నిర్దేశించే ఓటర్ల జాబితాను పకడ్బందీగా సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.ఈ సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పేరుపేరునా విజ్ఞప్తి.గ్రామ, వార్డు స్థాయిలో వెంటనే పరిశీలించాల్సిన ముఖ్యాంశాలు: కొత్త ఓటర్ల నమోదు: 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకుడిని గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరినీ నూతన ఓటరుగా నమోదు చేయించండి.మరణించిన వారి వివరాలు: గ్రామంలో/వార్డులో మరణించిన వారి పేర్లను గుర్తించి, జాబితా నుంచి తొలగించేందుకు తగిన చర్యలు చేపట్టండి.వలసలు / మార్పులు-చేర్పులు: ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిన వారి వివరాలు మరియు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఓటు బదిలీ చేసుకున్న వారి సమాచారాన్ని సరిచూడండి. నకిలీ & డబుల్ ఓట్ల నిర్మూలన: ఒకే వ్యక్తి పేరుతో రెండు చోట్ల ఉన్న డబుల్ ఓట్లను గుర్తించి, జాబితాలో ఒకే సరైన ఓటు ఉండేలా స్పష్టమైన వివరాలు సేకరించండి. వార్డు వారీ ఓట్ల సమీక్ష: మీ పరిధిలోని పోలింగ్ బూత్‌లు, వార్డుల వారీగా మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? జాబితాలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా? అనే పూర్తి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించండి.మన ఓటు మన బలం – మన హక్కు! అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించి, ఎలాంటి అవకతవకలు లేని స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీలో భాగస్వాములు కావాలని వారు కోరారు.

- చిన్నకడబూరులో శివాలయ దేవాలయంకు వైభవంగా నూతన ధ్వజస్తంభం మహోత్సవం వేడుకలు పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో ఉన్న శ్రీ అంజినేయ స్వామి దేవాలయం పక్కన ఉన్న శివాలయ దేవాలయంకు నూతన ధ్వజస్తంభంను బుధవారం వైభవంగా జరిగింది.ఈ నూతన ద్వజస్థంభ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ధనుర్లగ్న శుభ ముహూర్తమున పండితులు వేద మంత్రాలు పఠిస్తుండంగా ఆలయ ధర్మకర్త గౌళ్ళ నల్లారెడ్డి ఆధ్వర్యంలో మరియు ఆలయ,గ్రామ పెద్దల సమక్షంలో అశేష భక్తవాహిణి నడుమ కన్నుల పండుగగా జరిగిందని ఆలయ ,కమిటీ పెద్దలు బుధవారం తెలిపారు.ప్రత్యేకంగా హోమం ద్వారా శివాలయ దేవాలయం నందు భ్రమరాంబిక,గణపతి,కుమారస్వామి, విగ్రహాలకు అలాగే ధ్వజస్తంభ ప్రతిష్టాపన ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది.అనంతరం టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ప్రత్యేకంగా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలను గౌరవించారు.వేద పండితులు ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవముకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.హోమం కాల్చిన అనంతరం శివాలయ దేవాలయముకు నూతనంగా ఏర్పాటు చేసిన నూతన ధ్వజ స్తంభ ప్రతిష్టాపనకు వచ్చిన భక్తాదులు ప్రత్యేక పూజలు గావించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మీసేవ ఆంజనేయులు, మల్లికార్జున,ఆలయ పెద్దలు గౌళ్ళ నల్లారెడ్డి,తయాన్న,నారాయణస్వామి,ముత్తన్న,కోడిగుడ్ల లక్ష్మన్న, వీరారెడ్డి,ఎల్లన్న ,గిడ్డయ్య,సొసైటీ డైరెక్టర్ యం.జి నరసన్న,కోస్గి డైరెక్టర్ కలగట్ల లక్ష్మన్న,బుసిరెడ్డి, జనసేన నాయకులు మహదేవ, గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు,శివాలయం స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.2
- మానససరోవర యాత్రికులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా పరామర్శ..! మానససరోవర యాత్రకు వెళ్లిన ఆదోనికి చెందిన శ్రీ రఘునాథ్ శాస్త్రి, భాస్కర్ శాస్త్రి కుటుంబ సభ్యులతో సహా నలుగురు హిమాలయాల్లో చిక్కుకున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నట్లు వారు ఎమ్మెల్యేకు తెలిపారు. వారిని సురక్షితంగా ఆదోనికి తీసుకురావడానికి అవసరమైన తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.1
- నూతన పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ జిల్లా వెంకట్రాంరెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో సుధాకర్ రెడ్డి,లాలు భాష ఆహ్వానం మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ జిల్లా వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పెట్రోల్ బంకును ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- ఆరాధన మహోత్సవములు 29, 30, 31 నాడు జరుగును. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ | భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ॥ జోగుళాంబ గద్వాల జిల్లా, తెలంగాణ జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య మూల మహా సంస్థానము మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి 355 వ ఆరాధన మహోత్సవములు శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి పరమపూజ్య 1008 వ శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీ పాదులవారి ఆజ్ఞానుసారముగా సమస్త భగవద్భక్తులకు ఆహ్వానం. స్థానిక శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం, షేరేల్లివీధి యందుశ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవములు ఈ నెల 29, 30, 31. తారీకు వరకు విశేషంగా నిర్వహించబడును శ్రీ రాఘవేంద్రస్వామి మఠం|| దుర్వాది ధ్వాంతరవయే వైష్ణవేందీవరేందవే ।శ్రీ రాఘవేంద్ర గురవే నమః అత్యంత దయాలవే ॥. శ్రీ రాఘవేంద్రస్వామి వారు సశరీరముగా బృందావన ప్రవేశము చేసి నేటికి 355 సం||లు అయినది. ఇప్పటికి కూడ భక్తుల సర్వాభీష్టములు తీర్చుతూ భక్తుల పాలిటి కలియుగ కల్పతరువు కామధేనువై విరాజిల్లుచున్నారు. కావున సమస్త భగవద్ భక్తులు శ్రీ స్వామి వారి ఆరాధనా మహోత్సవములందు పాల్గొని తను, మన, ధనములతో సేవలు గావించి తీర్థప్రసాదములు స్వీకరించి, శ్రీ స్వామి విశేషానుగ్రహమునకు పాత్రులు కాగలరని ప్రార్ధన.శ్రీ శేషదాస మరియు శ్రీ రాఘవేంద్ర భజనమండలీ గద్వాల వారిచే భజన కార్యక్రమములు.తేది 26-08-2026 బుధవారము ఉ॥ 9-00 గం॥లకు ఋగ్వేద నిత్య నూతన ఉపాకర్మతేది 28-08-2026 శుక్రవారము10-00యజుర్వేద నిత్యనూతన ఉపాకర్మసామూహిక శ్రీ సత్యనారాయణస్వామి పూజసా॥ 6-00 గం॥లకుగోపూజ, ధ్వజారోహణం, లక్ష్మీపూజ,ధాన్యపూజ మొ॥నవి జరుగును.తేది 29-08-2026 నుండి 31-08-2026 వరకు జరుగు రోజువారి కార్యక్రమములుఉ॥5-00 గం॥లకు,ఉ 8-00 గంలకు10-30,ఉ॥ 11-00 గం॥లకుఉ॥ 11-30 గం॥లకుమ॥ 12-30 గం॥లకుసుప్రభాతం, నిర్మాల్య విసర్జనంమహా పంచామృత అభిషేకంప్రహ్లాదుల వారి పాదుపూజ, అష్టోత్తర పారాయణం సహితంతులసీ అర్చనఅలంకార సేవహస్తోదకం తీర్థప్రసాదముల వితరణ,29-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము30-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము31-08-2026 | 09 పురవీధులగుండా ప్రహ్లాదరాయల రధోత్సవ కార్యక్రమము జరుగును.2
- అలంపూర్: సంగమేశ్వర దేవాలయం కి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి ఏర్పాటు!! కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు!! పనుల ఆటంగానికి సహకరించాలని కోరిన సభ్యులు అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న సంగమేశ్వర దేవాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి లేక వచ్చిన భక్తులు దేవాలయం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో స్పందించిన కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు దాదాపు 18 లక్షలతో ఆర్చి పనులు ప్రారంభించారు. ఈ పనుల ద్వారా భక్తులకు కొద్దిగా ఆటంకం కలగవచ్చని భక్తులు సహకరించాలని వారు కోరారు.1
- తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ భారతరత్న మదర్ థెరిస్సా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆమె మార్గంలో నడిచి సేవాకార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్, రేమండ్ హార్ ఉడ్, నరేష్, డెంజిల్, ప్రభు, ఆంథోనీ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.1
- మంగనూరులో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు బిజినేపల్లి: మండలంలోని మంగనూరు గ్రామంలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ఒకరికొకరు రక్షణ సూత్రాలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ‘నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష, మనమంతా దేశానికి రక్ష’ అంటూ విద్యార్థులు దేశభక్తిని చాటారు. అనంతరం మహాత్మా పూలే, అంబేద్కర్‌లకు జైకొడుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కొండయ్య, సభ్యులు వెంకటయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు1
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ బండి ఆత్మకూరు మండలం జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.1