logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

"ఆపరేషన్ ముస్కాన్ - 12 " ద్వారా నల్లగొండ జిల్లా పోలీసుల విశేష విజయాలు : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిల్లల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన, నిరాశ్రయులైన మరియు ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్న చిన్నారులను గుర్తించి రక్షించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన "ఆపరేషన్ ముస్కాన్–12 " కార్యక్రమం లో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ విశేష ఫలితాలు సాధించిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జూలై నెల మొత్తం ప్రత్యేక కార్యాచరణగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో జిల్లా పోలీస్ శాఖలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తదితర శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైస్ మిల్లులు, బేకరీలు, హోటళ్లు, వర్క్‌షాపులు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, నిర్మాణ ప్రదేశాలు మరియు ఇతర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా మొత్తం 124 మంది చిన్నారులను సంరక్షించినట్లు ఎస్పీ వెల్లడించారు. వీరిలో 122 మంది బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారని తెలిపారు. చిన్నారులను అక్రమంగా పనుల్లో నియమించుకున్న 108 మంది యజమానులపై కేసులు నమోదు చేసి, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.సంరక్షించిన చిన్నారుల్లో అధిక సంఖ్యలో బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని, వీరిలో చాలామంది రైస్ మిల్లులు, బేకరీలు, హోటళ్లు మరియు ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.రక్షించిన చిన్నారులందరినీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచి, వారి కుటుంబ వివరాలను సేకరించి, చట్టపరమైన నిబంధనల మేరకు తల్లిదండ్రులకు అప్పగించడం లేదా అవసరమైన సంరక్షణ గృహాలకు తరలించడం జరిగిందని తెలిపారు. అలాగే వారి విద్య, పునరావాసం, సంక్షేమం కోసం సంబంధిత శాఖల ద్వారా అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థ సమాజానికి శాపమని, ప్రతి చిన్నారికి విద్య, రక్షణ, ఆరోగ్యం, సురక్షితమైన బాల్యం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను ఎలాంటి పనుల్లోనూ నియమించడం చట్టవిరుద్ధమని, అలాగే 14 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలలను ప్రమాదకర పరిశ్రమల్లో పనిలో పెట్టడం కూడా నేరమేనని స్పష్టం చేశారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.ప్రజలు తమ పరిసరాల్లో బాల కార్మికులు పనిచేస్తున్నట్లు గమనించినా, ఏ చిన్నారి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్లు తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–100/112, చైల్డ్ హెల్ప్‌లైన్–1098కు సమాచారం అందించి చిన్నారుల రక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆపరేషన్ ముస్కాన్-12 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు నెల రోజుల పాటు అదనపు ఎస్పీ రమేష్ గారి పర్యవేక్షణలో డీసీఆర్‌బీ సీఐ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో మూడు సబ్ డివిజనల్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పనిచేసి బాలలను రక్షించిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎస్ఐ అంజలి, సిబ్బంది, కార్మిక శాఖ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం గణేష్, ఎన్‌జీఓ శోభారాణి మరియు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

3 hrs ago
user_Praneeth
Praneeth
Nalgonda, Telangana•
3 hrs ago
d4ce87d9-fe08-4773-9cb5-efbce5cce5ce

More news from తెలంగాణ and nearby areas
  • మోత్కూర్ పాటిమట్ల ఎక్స్ రోడ్డులో 6 బెల్ట్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు – భారీగా అక్రమ మద్యం స్వాధీనం
    1
    మోత్కూర్ పాటిమట్ల ఎక్స్ రోడ్డులో 6 బెల్ట్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు – భారీగా అక్రమ మద్యం స్వాధీనం
    user_Sudagani HariKrishna goud
    Sudagani HariKrishna goud
    Nedu news paper గుండాల, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    23 hrs ago
  • ఒకే ఊరికి 100 ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మేస్త్రీలు ఇసుక డైమండ్ పెరుగుతుంది: మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకేసారి ఒకే గ్రామంలో 100 ఇందిర ఇండ్లు ఇస్తే, మేస్త్రీలు, ఇసుక డిమాండ్ పెరుగుతుంది అందుకే దశలవారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నాం -కలూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.
    1
    ఒకే ఊరికి 100 ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మేస్త్రీలు ఇసుక డైమండ్ పెరుగుతుంది: మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి 
ఒకేసారి ఒకే గ్రామంలో 100 ఇందిర ఇండ్లు ఇస్తే, మేస్త్రీలు, ఇసుక డిమాండ్ పెరుగుతుంది అందుకే దశలవారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నాం
-కలూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    2 hrs ago
  • ఈ రోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద Ola, Uber, Rapido క్యాబ్‌లు గంటల తరబడి బారులు తీరాయి. ఓలా, ఉబెర్ రాపిడ్ యాప్‌లను నమ్ముకుని లోన్‌లు తీసుకుని కార్లు కొనుగోలు చేసిన వేలాది మంది డ్రైవర్లు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగిన ఆదాయం లేక, పెరుగుతున్న ఖర్చులు, ఈఎంఐలు చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది. ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం, సంబంధిత అగ్రిగేటర్ సంస్థలు డ్రైవర్ల సమస్యలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేసే ప్రతి డ్రైవర్‌కు గౌరవప్రదమైన జీవనం హక్కు. వారి సమస్యలను ప్రభుత్వం, Ola, Uber, Rapido సంస్థలు వెంటనే పరిష్కరించి, న్యాయమైన ఛార్జీలు, పారదర్శక విధానాలు, జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరుతున్నరూ
    3
    ఈ రోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద Ola, Uber, Rapido క్యాబ్‌లు గంటల తరబడి బారులు తీరాయి.
ఓలా, ఉబెర్ రాపిడ్ యాప్‌లను నమ్ముకుని లోన్‌లు తీసుకుని కార్లు కొనుగోలు చేసిన వేలాది మంది డ్రైవర్లు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగిన ఆదాయం లేక, పెరుగుతున్న ఖర్చులు, ఈఎంఐలు చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది.
ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం, సంబంధిత అగ్రిగేటర్ సంస్థలు డ్రైవర్ల సమస్యలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కష్టపడి పనిచేసే ప్రతి డ్రైవర్‌కు గౌరవప్రదమైన జీవనం హక్కు.
వారి సమస్యలను ప్రభుత్వం, Ola, Uber, Rapido సంస్థలు వెంటనే పరిష్కరించి, న్యాయమైన ఛార్జీలు, పారదర్శక విధానాలు, జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరుతున్నరూ
    user_CHERUKU RAMESH
    CHERUKU RAMESH
    Chiropractor మేడిపల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • కోనారెడ్డి చెరువుకు కొత్త రూపు.. రూ.2 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలోని చారిత్రాత్మక కోనారెడ్డి చెరువు సుందరీకరణ, చెరువు కట్ట మరమ్మతుల కోసం రూ.2 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చెరువును మోడల్ చెరువుగా తీర్చిదిద్ది, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    1
    కోనారెడ్డి చెరువుకు కొత్త రూపు.. రూ.2 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలోని చారిత్రాత్మక కోనారెడ్డి చెరువు సుందరీకరణ, చెరువు కట్ట మరమ్మతుల కోసం రూ.2 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చెరువును మోడల్ చెరువుగా తీర్చిదిద్ది, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముదిగొండ నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ పనులను అధికారులు ప్రారంభించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు.ఎన్నో ఏళ్లుగా తాము నివాసం ఉంటున్న ఇళ్ళ ను కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం పనులు జరుగుతున్న రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
    1
    ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఖమ్మం జిల్లా ముదిగొండ లో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముదిగొండ నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ పనులను అధికారులు ప్రారంభించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు.ఎన్నో ఏళ్లుగా తాము నివాసం ఉంటున్న ఇళ్ళ ను కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం పనులు జరుగుతున్న రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • జాతీయ రహదారి విస్తరణ పనుల అడ్డుకట్ట: అధికారుల హామీతో విరమణ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం నుండి జాతీయ రహదారి వరకు అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విస్తరణ వల్ల తాము ఏళ్ల తరబడి నివాసముంటున్న ఇళ్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, పనులు జరుగుతున్న రహదారిపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసనను విరమించారు.
    1
    జాతీయ రహదారి విస్తరణ పనుల అడ్డుకట్ట: అధికారుల హామీతో విరమణ

ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రం నుండి జాతీయ రహదారి వరకు అధికారులు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విస్తరణ వల్ల తాము ఏళ్ల తరబడి నివాసముంటున్న ఇళ్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, పనులు జరుగుతున్న రహదారిపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసనను విరమించారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • శ్రీశ్రీ గంగాదేవి గుడి దగ్గర అర్ధరాత్రి చర్లమట్టి కొడుతున్నారు అలాగే కాంటాక్ట్ వరకు కూడా ఉదయం పనిచేస్తున్నారు నైట్ నైటు కొట్టే మట్టి ఇటుక బట్టీలకు పోతుంది అధికారులు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను
    1
    శ్రీశ్రీ గంగాదేవి గుడి దగ్గర అర్ధరాత్రి చర్లమట్టి కొడుతున్నారు అలాగే కాంటాక్ట్ వరకు కూడా ఉదయం పనిచేస్తున్నారు నైట్ నైటు కొట్టే మట్టి ఇటుక బట్టీలకు పోతుంది అధికారులు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను
    user_M Swamy
    M Swamy
    చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    23 hrs ago
  • చీకుపల్లి కల్వర్టును పరిశీలించిన మంత్రి సీతక్క.. వరద నష్టాల నివారణకు వేగవంతమైన చర్యలు ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద జాతీయ రహదారిపై వరదలతో దెబ్బతిన్న కల్వర్టును మంత్రి సీతక్క శనివారం పరిశీలించారు. అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించిన ఆమె, రాకపోకలను త్వరితగతిన పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఏర్పాట్లతో పాటు శాశ్వత పరిష్కారానికి అవసరమైన పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు రెండేళ్లుగా ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి చేరుకున్నప్పటికీ ముందస్తు ఏర్పాట్ల వల్ల పెద్దగా నష్టం జరగలేదని పేర్కొన్నారు. రామన్నగూడెం వద్ద లీకేజీల నివారణకు తాత్కాలిక పనులు పూర్తయ్యాయని, శాశ్వత పరిష్కారం కోసం రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
    1
    చీకుపల్లి కల్వర్టును పరిశీలించిన మంత్రి సీతక్క.. వరద నష్టాల నివారణకు వేగవంతమైన చర్యలు
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద జాతీయ రహదారిపై వరదలతో దెబ్బతిన్న కల్వర్టును మంత్రి సీతక్క శనివారం పరిశీలించారు. అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించిన ఆమె, రాకపోకలను త్వరితగతిన పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఏర్పాట్లతో పాటు శాశ్వత పరిష్కారానికి అవసరమైన పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు రెండేళ్లుగా ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి చేరుకున్నప్పటికీ ముందస్తు ఏర్పాట్ల వల్ల పెద్దగా నష్టం జరగలేదని పేర్కొన్నారు. రామన్నగూడెం వద్ద లీకేజీల నివారణకు తాత్కాలిక పనులు పూర్తయ్యాయని, శాశ్వత పరిష్కారం కోసం రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేవైఎం నిరసన.. విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిల్‌సుఖ్‌నగర్‌లో బీజేవైఎం నిరసన.. హైదరాబాద్:-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి విద్యార్థులను "క్రిమినల్స్"గా అభివర్ణించడాన్ని బీజేవైఎం నేతలు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండేతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
    4
    విద్యార్థులను ఉద్దేశించి 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేవైఎం నిరసన..
విద్యార్థులను ఉద్దేశించి 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిల్‌సుఖ్‌నగర్‌లో బీజేవైఎం నిరసన..
హైదరాబాద్:-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్యమంత్రి విద్యార్థులను "క్రిమినల్స్"గా అభివర్ణించడాన్ని బీజేవైఎం నేతలు తీవ్రంగా ఖండించారు. 
విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండేతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
నిరసన నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.