logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మారుమూల గ్రామం నుంచి మెరిసిన ఆణిముత్యం ఇంటర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన కోనం లోకేష్‌ చింతూరు, ఏప్రిల్ 15-04-2026 బుధవారం సరివేల మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి కోనం లోకేష్ కుమార్ ఇంటర్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి విశిష్ట ఫలితాన్ని సాధించి తన కుటుంబానికి ఆనందభాష్పాలు తెప్పించాడు. మొత్తం 1000 మార్కుల్లో 944 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. జంగారెడ్డిగూడెం విద్య వికాస్ కాలేజీ లో చదువుకుని సాధారణ కుటుంబ పరిస్థితుల్లోనూ కష్టపడి చదివి ఈ స్థాయి ఫలితాన్ని సాధించడం గ్రామస్థులను, ఉపాధ్యాయులను గర్వపడేలా చేసింది. చిన్న గ్రామం నుంచి పెద్ద లక్ష్యాన్ని సాధించిన లోకేష్ పట్టుదల అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా లోకేష్‌కు తల్లి సూర్యకుమారి, తండ్రి శ్రీనివాసరావు, మేనమామ బేడే సతీష్, లావణ్య, బాబాయి దుర్గాప్రసాద్, కావ్య తదితర కుటుంబ సభ్యులు ఘనంగా అభినందనలు తెలిపారు. అతని విజయంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. గ్రామ పెద్దలు, స్నేహితులు కూడా లోకేష్‌ను అభినందనలు తెలిపారు. ఈ విజయం సరివేల గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.

6 hrs ago
user_Sode Prasad
Sode Prasad
Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
6 hrs ago
8de135fb-9bff-4252-9e74-80b3c87d577c

మారుమూల గ్రామం నుంచి మెరిసిన ఆణిముత్యం ఇంటర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన కోనం లోకేష్‌ చింతూరు, ఏప్రిల్ 15-04-2026 బుధవారం సరివేల మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి కోనం లోకేష్ కుమార్ ఇంటర్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి విశిష్ట ఫలితాన్ని సాధించి తన కుటుంబానికి ఆనందభాష్పాలు తెప్పించాడు. మొత్తం 1000 మార్కుల్లో 944 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. జంగారెడ్డిగూడెం విద్య వికాస్ కాలేజీ లో చదువుకుని సాధారణ కుటుంబ పరిస్థితుల్లోనూ కష్టపడి చదివి ఈ స్థాయి ఫలితాన్ని సాధించడం గ్రామస్థులను, ఉపాధ్యాయులను గర్వపడేలా చేసింది. చిన్న గ్రామం నుంచి పెద్ద లక్ష్యాన్ని సాధించిన లోకేష్ పట్టుదల అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా లోకేష్‌కు తల్లి సూర్యకుమారి, తండ్రి శ్రీనివాసరావు, మేనమామ బేడే సతీష్, లావణ్య, బాబాయి దుర్గాప్రసాద్, కావ్య తదితర కుటుంబ సభ్యులు ఘనంగా అభినందనలు తెలిపారు. అతని విజయంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. గ్రామ పెద్దలు, స్నేహితులు కూడా లోకేష్‌ను అభినందనలు తెలిపారు. ఈ విజయం సరివేల గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
    2
    రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • Post by V Ramarao
    3
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.
    1
    40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో  ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి.
నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు.
పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు.
ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
    2
    పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం  ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల  సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న  అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, 
విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    8 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • monthly Passive income Start Cheyandi
    1
    monthly Passive income 
Start Cheyandi
    user_Siddu
    Siddu
    Business Networking Company పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • Post by SS NEWS
    1
    Post by SS NEWS
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • పాడేరు, ఏప్రిల్ 15: రాష్ట్ర గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌లో పోలీస్, రెవిన్యూ, ఆలయ, ఉత్సవ కమిటీలు సహా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రకటించిన మే 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహణను పోలీస్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేసినట్లు వెల్లడించారు. కొత్త తేదీల ప్రకారం ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
    1
    పాడేరు, ఏప్రిల్ 15: రాష్ట్ర గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌లో పోలీస్, రెవిన్యూ, ఆలయ, ఉత్సవ కమిటీలు సహా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ముందుగా ప్రకటించిన మే 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహణను పోలీస్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేసినట్లు వెల్లడించారు. కొత్త తేదీల ప్రకారం ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.