logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహిళల భద్రత మా బాధ్యత,మా లక్ష్యం *కోరుకొండ డిఎస్పీ సిహెచ్. జీవన గోకవరం, జూలై 31 : మహిళలు బాలికలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నివారణ వారి భద్రత ,రక్షణ పోలీసు లక్ష్యం అని రాజమహేంద్రవరం నార్త్ జోన్ డిఎస్పీ సిహెచ్.జీవన పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రం గోకవరంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు డీఎస్పీ జీవన అధ్యక్షతన కోరుకొండ సి ఐ ఎస్ వి వి ఎస్ మూర్తి పర్యవేక్షణలో గోకవరం ఎస్సై వి ఎన్ వి పవన్ కుమార్ స్థానిక హైస్కూల్ విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైకిల్ ర్యాలీ హైస్కూల్ నుండి ప్రారంభమై ఆర్టీసీ బస్టాండ్ కు చేరిన అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. మహిళలు బాలికలు మరియు చిన్నారులపై జరిగే నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏమైనా వేధింపులు దాడులు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన భద్రత యాప్ లు , టోల్ ఫ్రీ నెంబర్లను వినియోగించి తక్షణ సహాయం పొందవచ్చని పోలీసు అధికారులు వివరించారు ముఖ్యంగా మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉన్న అత్యవసర సేవలు పోలీసు హెల్ప్ లైన్లు శక్తి టీమ్స్ సేవలు భద్రత సదుపాయాల గురించి అవగాహన కల్పించారు. అలాగే చిన్నారుల రక్షణ బాలల హక్కులు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి విద్యార్థులకు ప్రజలకు సూచనలు చేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్ సుచరిత మాట్లాడుతూ మహిళల భద్రత మరియు ప్రజా రవాణాలో ప్రయాణించే మహిళలు బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు .ఈ కార్యక్రమానికి విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

3 hrs ago
user_పల్లె నరేష్
పల్లె నరేష్
ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago
c0f6dac1-6601-4fca-a12d-43b53c3f47b2

మహిళల భద్రత మా బాధ్యత,మా లక్ష్యం *కోరుకొండ డిఎస్పీ సిహెచ్. జీవన గోకవరం, జూలై 31 : మహిళలు బాలికలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నివారణ వారి భద్రత ,రక్షణ పోలీసు లక్ష్యం అని రాజమహేంద్రవరం నార్త్ జోన్ డిఎస్పీ సిహెచ్.జీవన పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రం గోకవరంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు డీఎస్పీ జీవన అధ్యక్షతన కోరుకొండ సి ఐ ఎస్ వి వి ఎస్ మూర్తి పర్యవేక్షణలో గోకవరం ఎస్సై వి ఎన్ వి పవన్ కుమార్ స్థానిక హైస్కూల్ విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైకిల్ ర్యాలీ హైస్కూల్ నుండి ప్రారంభమై ఆర్టీసీ బస్టాండ్ కు చేరిన అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. మహిళలు బాలికలు మరియు చిన్నారులపై జరిగే నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏమైనా వేధింపులు దాడులు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన భద్రత యాప్ లు , టోల్ ఫ్రీ నెంబర్లను వినియోగించి తక్షణ సహాయం పొందవచ్చని పోలీసు అధికారులు వివరించారు ముఖ్యంగా మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉన్న అత్యవసర సేవలు పోలీసు హెల్ప్ లైన్లు శక్తి టీమ్స్ సేవలు భద్రత సదుపాయాల గురించి అవగాహన కల్పించారు. అలాగే చిన్నారుల రక్షణ బాలల హక్కులు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి విద్యార్థులకు ప్రజలకు సూచనలు చేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్ సుచరిత మాట్లాడుతూ మహిళల భద్రత మరియు ప్రజా రవాణాలో ప్రయాణించే మహిళలు బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు .ఈ కార్యక్రమానికి విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరంలో కదం తొక్కిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ నాయకులు మైలవరం పంచాయతీ కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ... జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు.... జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ నాయకులు
    3
    ఎన్టీఆర్ జిల్లా 

మైలవరం నియోజకవర్గం 

 మైలవరంలో కదం తొక్కిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ నాయకులు

 మైలవరం పంచాయతీ కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ...

 జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం

 జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు....

 జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ నాయకులు
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • పత్తి మిరప సాగు చేసే రైతులు ఈ క్రాఫ్ట్ తప్పనిసరి - ఏటుకూరు బ్రహ్మయ్య. పెదకూరపాడు : రైతులు పండించే పంటకు ఈక్రాప్ చేసుకోవడం ద్వారా నష్టం వాటిల్లి నప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని మండల టిడిపి అధ్యక్షులు ఏటుకూరు బ్రహ్మయ్య అన్నారు. ఈ క్రాఫ్ట్ ఆన్లైన్ 31 తో ముగుస్తున్న కారణంగా ఈరోజు పత్తి మిరప సాగుచేసే రైతులు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలని అది రైతులకు భరోసా అని ఆయన అన్నారు.
    1
    పత్తి మిరప సాగు చేసే రైతులు ఈ క్రాఫ్ట్ తప్పనిసరి - ఏటుకూరు బ్రహ్మయ్య.
పెదకూరపాడు : 
రైతులు పండించే పంటకు ఈక్రాప్ చేసుకోవడం ద్వారా నష్టం వాటిల్లి నప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని మండల టిడిపి అధ్యక్షులు ఏటుకూరు బ్రహ్మయ్య అన్నారు. ఈ క్రాఫ్ట్ ఆన్లైన్ 31 తో ముగుస్తున్న కారణంగా ఈరోజు పత్తి మిరప సాగుచేసే రైతులు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలని అది రైతులకు భరోసా అని ఆయన అన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • ద్వేషం గోడలను కడుతుంది ప్రేమ మాత్రం దారులను తెరుస్తుంది ప్రేమతో చేసిన చిన్న సహాయం వేల మాటల కంటే గొప్పది
    1
    ద్వేషం గోడలను కడుతుంది ప్రేమ మాత్రం దారులను తెరుస్తుంది
ప్రేమతో చేసిన చిన్న సహాయం వేల మాటల కంటే గొప్పది
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    7 hrs ago
  • తుళ్లూరులో శాకంబరీ దేవిగా భద్రకాళి అమ్మవారు........... తుళ్లూరు శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరీ దేవిగా భక్తిశ్రద్ధలతో అలంకరించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయం భక్తులతో కళకళలాడగా.. ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    1
    తుళ్లూరులో శాకంబరీ దేవిగా భద్రకాళి అమ్మవారు...........
తుళ్లూరు శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరీ దేవిగా భక్తిశ్రద్ధలతో అలంకరించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయం భక్తులతో కళకళలాడగా.. ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    user_SIVA
    SIVA
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • ప్రభుత్వ సేవలు సకాలంలో ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమృతలూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన PGRS కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అమృతలూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సంబంధిత సమస్యలు ఆదాయ ధ్రువ పత్రాలు పింఛన్లు గృహ నిర్మాణం త్రాగునీటి సౌకర్యం రహదారులు ఇతర మౌలిక వసతులకు సంబంధించి వినతి పత్రాలు ఎమ్మెల్యేకి అందజేశారు.
    2
    ప్రభుత్వ సేవలు సకాలంలో ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమృతలూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన PGRS కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అమృతలూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సంబంధిత సమస్యలు ఆదాయ ధ్రువ పత్రాలు పింఛన్లు గృహ నిర్మాణం త్రాగునీటి సౌకర్యం రహదారులు ఇతర మౌలిక వసతులకు సంబంధించి వినతి పత్రాలు ఎమ్మెల్యేకి అందజేశారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    10 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఏపీడబ్ల్యూజేఎఫ్,ఏ పి బీజేఏ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
    1
    ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఏపీడబ్ల్యూజేఎఫ్,ఏ పి బీజేఏ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
    user_పల్లె నరేష్
    పల్లె నరేష్
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక 44 అడుగులకు చేరిన గోదావరి వరద భద్రాచలంలో గోదావరి ఉప్పొంగుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు నీటిమట్టం 44 అడుగులకు చేరింది. 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో, నేడు సాయంత్రానికి నీటిమట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, తగిన రక్షణ చర్యలు చేపట్టారు. భద్రాచాలంలో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. రానున్న గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలున్నాయి. ఈ నేపథ్యంలో వరద విధుల్లో ఉన్న అధికారులు అందరూ గోదావరి వరద మాన్యు వల్ ప్రకారం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.
    2
    భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక  44 అడుగులకు చేరిన గోదావరి వరద
భద్రాచలంలో గోదావరి ఉప్పొంగుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు నీటిమట్టం 44 అడుగులకు చేరింది. 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో, నేడు సాయంత్రానికి నీటిమట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, తగిన రక్షణ చర్యలు చేపట్టారు.
భద్రాచాలంలో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. రానున్న గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలున్నాయి. ఈ నేపథ్యంలో వరద విధుల్లో ఉన్న అధికారులు అందరూ గోదావరి వరద మాన్యు వల్ ప్రకారం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.