logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కుల రాజకీయాలు చేస్తున్నది టిడిపి నాయకులేనని మండపేట నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్, రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట కుల రాజకీయాలు చేస్తున్నది టిడిపి నాయకులేనని మండపేట నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్, రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నికల అనంతరం ముఖం చాటేసారని విమర్శించారు. ప్రస్తుతం కాపులకు అటు బీసీ కోట లేదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ డబ్ల్యూ ఎస్ కోటాలో రిజర్వేషన్లు అమలవుతున్నాయా లేదా అని ఆయన ప్రశ్నించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కాపుల రిజర్వేషన్లు ఎత్తివేసారంటూ టిడిపి నాయకులు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. జగన్ ఒకవేళ ఆ రిజర్వేషన్లను నిలిపివేస్తే కూటమి అధికారం చేపట్టి 26 నెలలు అవుతుందని ఈ కాలంలో కూడా కాపులను బీసీల్లో చేర్చే విధంగా రిజర్వేషన్లు అమలు చేయలేదంటే ఇప్పటికీ జగన్ అధికారమే చెల్లుతుందా అంటూ ఎద్దేవా చేశారు. ఒకవేళ జగన్ రద్దు చేస్తే అధికారం చేపట్టిన చంద్రబాబు అమలు చేయకుండా దిక్కులు చూస్తున్నారా అంటూ నిలదీశారు. కుల రాజకీయాల పేరిట రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్నది టిడిపి నని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా లోని సిదిరి అప్పలరాజు తనయుడు కేసు విషయంలో వారిని పరామర్శించేందుకు అక్కడికి వెళ్లారన్నారు. విశాఖ నుండి శ్రీకాకుళం వరకు ఒకటే జనం తరలివచ్చారన్నారు. జనాన్ని చూసి ఓర్చుకోలేక టిడిపి శ్రేణులు అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ట్రాఫిక్ ని అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం దా ప్రతిపక్షాందా అని నిలదీశారు. ప్రతి చోట కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. యాదవ కులానికి చెందిన యువకుడు మృతి చెందితే అతని కాకుండా సిదిరి అప్పలరాజును పరామర్శించడం ఏమిటని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో అటు కేంద్రమంత్రి ఇటు మంత్రులు ఎంతమంది ఉన్నా బాధితులను పరామర్శించేందుకు కృష్ణాజిల్లా నుండి మంత్రి పార్థసారథిని చంద్రబాబు రప్పించారని ఇది కుల రాజకీయం కాదా అంటూ నిలదీశారు. కాపుల గురించి మాట్లాడితే కుల రాజకీయం అని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేశారని జగన్ తీసేసారని రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు మాట్లాడ్డం సిగ్గుచేటు అన్నారు. ఐదు శాతం రిజర్వేషన్లు మంజునాథ్ కమిషన్ సిఫార్సు చేసిందన్నారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం దీనిని అమలు చేయలేక పోయిందని విమర్శించారు. ప్రస్తుతం ఆ ఐదు రిజర్వేషన్ లేదా ఈ డబ్ల్యూ సి ఏది అమలవుతుందో స్పష్టం చేయాలని నిలదీశారు. అప్పట్లో కాపు రిజర్వేషన్లను జగన్ ఆపితే ఇప్పుడు అధికారంలో ఉన్న టిడిపి ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ఇప్పుడు కూడా జగన్ కంట్రోల్లో ఈ ప్రభుత్వం పని చేస్తుందా అంటూ నిలదీశారు. 2014లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని టిడిపి ఎన్నికల హామీ ఇచ్చిందన్నారు. తర్వాత 2016లో దివంగత నేత ముద్రగడ పద్మనాభం ఎన్నికల హామీలు అమలు చేయాలంటూ ఉద్యమం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సందర్భంలో పద్మనాభం కుటుంబాన్ని తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. ముద్రగడ పై చంద్రబాబు కక్ష సాధించారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సభలో బొండా ఉమా మాట్లాడుతూ కాపులు బాధతో ఉన్నారని వారికి న్యాయం చేయాలని తాను చెప్పినట్లు బండ ఉమా పేర్కొన్నారని తెలిపారు. 2019లో కాపుల వల్లే ఓడిపోయామని అన్నారన్నారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం మృతి చెందారని ఇక ఆయన్ని వదిలేయండి అని తోట విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు అమలుకాని హామీలు ఇవ్వడం వాటిని అమలు చేయకపోవడం టిడిపికి అలవాటేనని ఎద్దేవా చేశారు. కాపులలో ఆత్మాభిమానం ఎక్కువ అని వారి ఆత్మ అభిమానిని దెబ్బతీసేలా టిడిపి మోసం చేస్తే గతంలో పరిస్థితి రాబోయే రోజుల్లో చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. బోండా ఉమకు షోకాజులు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ రాజబాబు, మాజీ విప్ పోతంశెట్టి ప్రసాద్, జడ్పీటీసీ పుట్టపూటి సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్, ముక్కాదాళియ్యా, మెండు బాపిరాజు, మారేడుబాక మాజీ సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.

17 hrs ago
user_Nandikolla Raghava
Nandikolla Raghava
Salesperson మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
17 hrs ago
7a33fbd6-b3b0-41e6-8453-ab8321b4ca06

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఆగస్టు 2న మూలారెడ్డి వర్ధంతి కార్యక్రమాలు :ఎమ్మెల్యే నల్లమిల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆగస్టు 2న బలభద్రపురంలో స్మారక పురస్కారాల సభ, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరవుతారని, సత్యవాణి, డాక్టర్ రామచంద్రరెడ్డిలకు పురస్కారాలు అందజేస్తామన్నారు.పసలపూడిలో మూలారెడ్డి విగ్రహావిష్కరణ జరుగుతుందని,కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
    1
    ఆగస్టు 2న మూలారెడ్డి వర్ధంతి కార్యక్రమాలు :ఎమ్మెల్యే నల్లమిల్లి 
దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆగస్టు 2న బలభద్రపురంలో స్మారక పురస్కారాల సభ, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరవుతారని, సత్యవాణి, డాక్టర్ రామచంద్రరెడ్డిలకు పురస్కారాలు అందజేస్తామన్నారు.పసలపూడిలో మూలారెడ్డి విగ్రహావిష్కరణ జరుగుతుందని,కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
    user_DEVENDRA
    DEVENDRA
    Journalist అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • డీఎస్సీపై లోకేష్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారు – ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి వ్యాఖ్యలు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మీడియా సమావేశంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణ, విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడిన ఆయన, ప్రభుత్వ చర్యలను వివరించారు. అలాగే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తూ పలు రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించబడగా, అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు.
    1
    డీఎస్సీపై లోకేష్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారు – ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మీడియా సమావేశంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణ, విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడిన ఆయన, ప్రభుత్వ చర్యలను వివరించారు. అలాగే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తూ పలు రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ మీడియా సమావేశం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించబడగా, అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    20 hrs ago
  • కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్‌హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
    1
    కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్‌హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
    user_SAI DURGA
    SAI DURGA
    Local News Reporter కిర్లంపూడి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • ఆషాడ మాసం సందర్భంగా శాకంబరీ దేవిగా అలంకరణలో దర్శనమిస్తున్న నూకాలమ్మ ఆషాడ మాసం పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఎస్ అన్నవరం నుకాలమ్మ ఆలయంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ని పలు రకాల కూరగాయలు పళ్ళు తో శాకంబరీ దేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి వేద పండితులు ఆధ్వర్యంలో శాస్త్రాకంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిని ఇచ్చారు. నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
    1
    ఆషాడ మాసం సందర్భంగా శాకంబరీ దేవిగా అలంకరణలో దర్శనమిస్తున్న నూకాలమ్మ
ఆషాడ మాసం పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఎస్ అన్నవరం నుకాలమ్మ ఆలయంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ని పలు రకాల కూరగాయలు పళ్ళు తో శాకంబరీ దేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి వేద పండితులు ఆధ్వర్యంలో శాస్త్రాకంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిని ఇచ్చారు. నిర్వాహకులు  భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
    user_Machha Mallesh
    Machha Mallesh
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • బాధితులను కాదు.. నిందితులను పరామర్శించడం దారుణం: కొల్లు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన పర్యటనపై రాష్ట్ర గనులు, భూగర్భశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. పరామర్శల పేరుతో కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఓదార్చడం కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. పరామర్శ పేరుతో గంజాయి బ్యాచ్‌ను పోగేసి ప్రదర్శనలు నిర్వహించడం అవసరమా అని జగన్‌ను ప్రశ్నించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కేసులో ఓ యాదవ యువకుడు మృతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా జైలులో ఉన్న నిందితులను ములాఖత్ పేరుతో కలవడం సిగ్గుచేటని అన్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఓదార్చకుండా నిందితులను పరామర్శించడం ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే బందోబస్తు విధుల్లో ఉన్న ఓ మహిళా ఎస్ఐ పట్ల జగన్ ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు. జైలు వద్ద ప్రదర్శనలు నిర్వహించేందుకే కావాలనే సాయంత్రం 5 గంటల వరకు వెళ్లకుండా రాజకీయ డ్రామా చేశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో స్పందించాల్సిన ప్రతిపక్ష నాయకుడు, పరామర్శల పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం తగదని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసేలా వ్యవహరించడం మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జగన్‌కు సూచించారు.
    1
    బాధితులను కాదు.. నిందితులను పరామర్శించడం దారుణం: కొల్లు
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన పర్యటనపై రాష్ట్ర గనులు, భూగర్భశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. పరామర్శల పేరుతో కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఓదార్చడం కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.
పరామర్శ పేరుతో గంజాయి బ్యాచ్‌ను పోగేసి ప్రదర్శనలు నిర్వహించడం అవసరమా అని జగన్‌ను ప్రశ్నించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కేసులో ఓ యాదవ యువకుడు మృతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా జైలులో ఉన్న నిందితులను ములాఖత్ పేరుతో కలవడం సిగ్గుచేటని అన్నారు.
చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఓదార్చకుండా నిందితులను పరామర్శించడం ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే బందోబస్తు విధుల్లో ఉన్న ఓ మహిళా ఎస్ఐ పట్ల జగన్ ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు.
జైలు వద్ద ప్రదర్శనలు నిర్వహించేందుకే కావాలనే సాయంత్రం 5 గంటల వరకు వెళ్లకుండా రాజకీయ డ్రామా చేశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో స్పందించాల్సిన ప్రతిపక్ష నాయకుడు, పరామర్శల పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం తగదని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసేలా వ్యవహరించడం మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జగన్‌కు సూచించారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    1
    వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్......

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • కల్లూరు ప్రజాదర్బార్ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి ప్రజాదర్బార్‌లో 3,500కి పైగా, అలాగే పాలేరు నియోజకవర్గంలో 25,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే అభ్యర్థనలు వస్తున్నాయని, పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇళ్లు మంజూరు చేయడం వల్ల నిర్మాణ వ్యయం అదుపులో ఉంటుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై 8 లక్షల 21 వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోపిందని పొంగులేటి ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, నిషేధిత జాబితా (22A) భూముల కేటాయింపులపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన 'సిట్' సమగ్ర విచారణ జరుపుతోందని తెలిపారు. త్వరలోనే ధరణి అక్రమాల గుట్టు రట్టు చేసి నివేదికను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. ​ రాష్ట్రవ్యాప్తంగా దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ సర్వే వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. పింక్ కలర్ షర్టు వేసుకున్న పేదవాడైనా సరే... కుల, మత, రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
    1
    కల్లూరు ప్రజాదర్బార్ కార్యక్రమంలో  బిఆర్ఎస్ నాయకులపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి ప్రజాదర్బార్‌లో 3,500కి పైగా, అలాగే పాలేరు నియోజకవర్గంలో 25,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే అభ్యర్థనలు వస్తున్నాయని, పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇళ్లు మంజూరు చేయడం వల్ల నిర్మాణ వ్యయం అదుపులో ఉంటుందన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రంపై 8 లక్షల 21 వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోపిందని పొంగులేటి ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, నిషేధిత జాబితా (22A) భూముల కేటాయింపులపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన 'సిట్' సమగ్ర విచారణ జరుపుతోందని తెలిపారు. త్వరలోనే ధరణి అక్రమాల గుట్టు రట్టు చేసి నివేదికను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.
​
రాష్ట్రవ్యాప్తంగా దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ సర్వే వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. పింక్ కలర్ షర్టు వేసుకున్న పేదవాడైనా సరే... కుల, మత, రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    20 hrs ago
  • కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్‌హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
    1
    కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్‌హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
    user_SAI DURGA
    SAI DURGA
    Local News Reporter కిర్లంపూడి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.