*నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.* ---------------------------------------- నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో *ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు* ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా.. వైఎస్ఆర్ సీపీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ *కాకాని పూజిత* గారు, *జాతీయ జెండా ఎగరవేసి.. జెండా వందనం చేశారు.* ఈ సందర్బంగా *భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.* • ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని *కాకాని పూజిత* గారు అన్నారు. • భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాల వారు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ ఆగస్టు 15 అని తెలిపారు. • మహనీయుల త్యాగాలను.. స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి పౌరుడు.. భారత దేశ కీర్తి పతాకాలను చాటే విధంగా.. నడుచుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు మాట్లాడుతూ.. • పార్టీ కార్యాలయంలో.. నాయకులు కార్యకర్తల సమక్షంలో.. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. • కొన్ని వేల మంది స్వాతంత్ర్య సమర యోధుల.. ప్రాణ త్యాగాల ఫలితంగానే.. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధిచ్చిందని అన్నారు. • స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలితంగానే ఈ రోజు మనము స్వేచ్చా, సమానత్వంతో.. జీవిస్తూ.. స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నామన్నారు. • ఆదిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పౌరులు స్వేచ్ఛ సమానత్వం.. పొందే విధంగా వీలు కల్పిస్తున్నాయన్నారు. • ఏ ఉద్దేశంతో భారతదేశానికి మహనీయులు స్వాతంత్రం తీసుకువచ్చారో ఆ దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు..గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గొప్ప పాలన అందించారని తెలిపారు. • ముఖ్యంగా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో.. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు .. అట్టడుగు వర్గాల ప్రజలకు.. సంక్షేమ, అభివృద్ధి ఫలాలను చేరువ చేశారని తెలిపారు. • అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే.. అటవీక రాజ్యం గుర్తొస్తుందన్నారు. • కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆకృత్యాలను చూసి ఈరోజు ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. • భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగం ఉండాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తో పాటుగా కొంతమంది మహనీయులు కృషి చేసి భారతదేశానికి గొప్ప రాజ్యాంగం తీసుకువచ్చి.. ప్రజాస్వామ్య విలువలను సంరక్షించేలా విధానాలు రూపొందిస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ.. రాజ్యాంగ విలువలను కాలరాస్తూ.. దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. • నిన్నటి రోజున పులివెందుల ఎలక్షన్స్ లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలాగా.. వైఎస్ఆర్సిపి నాయకులు..ప్రజల పట్ల వ్యవహరించిన తీరు.. దుర్మార్గం అన్నారు. • పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని.. మీడియా గొంతు నొక్కి.. తెలుగుదేశం పార్టీ పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో చేసిన అరాచకం ప్రజలందరూ చూశారన్నారు. • ఏ వ్యక్తి బయటకు వచ్చి స్వేచ్ఛగా.. ఓటు వేయలేని విధంగా.. దౌర్జన్యం చేసి..టి డి పి కి సంబంధించిన వ్యక్తుల చేత ఏకపక్షంగా ఎలక్షన్ నిర్వహించడం చూస్తుంటే.. ఈ సమాజం ఎటు పోతుందో అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో కలుగుతుందన్నారు. • వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి, ప్రభుత్వం లో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో.. పులివెందులను ఏ విధంగా అభివృద్ధి చేశారో.. ప్రజలందరికీ తెలుసన్నారు. • కడప, పులివెందులలో తాగునీరు, రోడ్లు, స్కూల్స్,వ్యవసాయ రంగం, విద్యుత్, ఎయిర్ పోర్ట్.. వీటన్నిటిని ఎంతో చక్కగా.. వైయస్ కుటుంబం అభివృద్ధి చేసిందన్నారు. • ఈ రెండు ప్రాంతాల్లో.. ఉండే ప్రజలకు వైఎస్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందన్నారు • అలాంటి పులివెందులలో ఈరోజు వైఎస్ఆర్సిపి అభ్యర్థికి డిపాజిట్ రాకుండా చేశామని.. తెలుగుదేశం పార్టీ నేతలు కాలర్ ఎగరవేస్తూ విర్రవీగడం.. చూస్తుంటే వారు ఎంత.. దుర్మార్గంగా వ్యవహరించారో అర్థమవుతుందన్నారు. • ఈవీఎం ల ద్వారా మోసం చేయగలిగాము, బ్యాలెట్ పేపర్ విధానంలో కూడా.. ఎన్నికలు జరిగినా మేము మోసం చేయగలమన్న.. విధానంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది అంటే.. ఆ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. • తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న.. ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు.. ప్రజలే.. ఆ పార్టీకి.. భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. • రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యన్ని.. పరిరక్షించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని.. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి వచ్చి.. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పాలన అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Post by Omnamashivaya S1
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by KLakshmi Devi1
- Post by Nagesh Thalari3
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1