Shuru
Apke Nagar Ki App…
ప్రజాబంధు ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరం – 43 మందికి పరీక్షలు, 22 మందికి ఆపరేషన్ అవసరం కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రజాలైఫ్ కేర్ ఆసుపత్రిలో ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 43 మందిని పరీక్షించగా, అందులో 22 మందికి ఆపరేషన్ అవసరమని గుర్తించి, విడతల వారీగా ఆపరేషన్లు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రతి మంగళవారం కంటి పరీక్షలు నిర్వహిస్తామని, కంటి శుక్లాలు ఉన్నవారు, కంటి చూపు మందగించినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ శాసనసభ్యుడు, ఫౌండేషన్ అధ్యక్షుడు డా.పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.
Krishna
ప్రజాబంధు ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరం – 43 మందికి పరీక్షలు, 22 మందికి ఆపరేషన్ అవసరం కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రజాలైఫ్ కేర్ ఆసుపత్రిలో ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 43 మందిని పరీక్షించగా, అందులో 22 మందికి ఆపరేషన్ అవసరమని గుర్తించి, విడతల వారీగా ఆపరేషన్లు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రతి మంగళవారం కంటి పరీక్షలు నిర్వహిస్తామని, కంటి శుక్లాలు ఉన్నవారు, కంటి చూపు మందగించినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ శాసనసభ్యుడు, ఫౌండేషన్ అధ్యక్షుడు డా.పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.
More news from Kumuram Bheem Asifabad and nearby areas
- *బీసీలకు అన్యాయం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం** *కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నం – బీసీ నాయకులను అడ్డుకున్న పోలీసులు* *బీసీల హక్కుల కోసం పోరాటం ఆపేది లేదు: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్* ఆసిఫాబాద్: బీసీ కులగణన విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీ కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం 2025 మే 1న ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టకుండా బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఓబీసీ కుటుంబాలను సమగ్రంగా లెక్కించి, ప్రత్యేక బీసీ కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ కాలమ్ కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ మద్దతు ఇవ్వకుండా అసెంబ్లీని బహిష్కరించడం బీసీల పట్ల ఆ పార్టీ వైఖరికి నిదర్శనమన్నారు. పోలీసులు అడ్డుకున్నా బీసీల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని, కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీ కులగణనను శాస్త్రీయంగా నిర్వహించే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని రూప్నార్ రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లోబడే లాహు కుమార్, బీసీ సంక్షేమ సంఘం ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు సాయి కృష్ణ నాయకులు, అసద్, జయరాజ్, వెంకన్న,ముబీన్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- టైగర్ లేకున్నా టైగర్ జోన్ అమలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు అభయారణ్యంలో టైగర్ లేకుండా టైగర్ జోన్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారం మండలానికి చెందిన బద్రి నాయక్ మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూలో పాల్గొన్నారు. జన్నారంలో అమలు చేస్తున్న ఎకో జోన్ తో ఇసుక రాక ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని వాపోయారు. అధికారులు స్పందిస్తూ ఎకో జోన్ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.1
- డేంజర్ జోన్ గా జగిత్యాల బైపాస్ రోడ్డు: గుంతలు పూడ్చేదెప్పుడు? ప్రయాణం సురక్షితమయ్యేదెప్పుడు? జగిత్యాల పట్టణంలో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే కొత్త బస్ స్టాండ్ సమీపంలోని తెలంగాణ వైన్స్ చౌరస్తా నుండి బైపాస్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రోడ్డు పునర్నిర్మాణం లేదా డ్రైనేజీ/పైప్‌లైన్ పనుల కోసం తవ్విన భారీ గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చకుండా, మట్టి మరియు రాళ్ల శిథిలాలను (Debris) రోడ్డు పైనే అస్తవ్యస్తంగా వదిలేశారు. ప్రాణసంకటంగా రాత్రి ప్రయాణం: తెలంగాణ వైన్స్ చౌరస్తా వద్ద నిత్యం వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ గుంతల వద్ద ఎటువంటి రేడియం సూచికలు గానీ, ప్రకాశించే బారికేడ్లు గానీ ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ప్రమాదాల బారిన పడే అవకాశం లేకపోలేదు ట్రాఫిక్ దిగ్బంధం: కొత్త బస్ స్టాండ్ వైపు, బైపాస్ వైపు వెళ్లే వాహనాలు ఈ గుంతలను తప్పించబోయి హఠాత్తుగా బ్రేకులు వేయడం వల్ల చౌరస్తా ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ నిలిచిపోతోంది. ప్రయాణికులకు దుమ్ము ఇబ్బందులు: రోడ్డుపై విసిరేసినట్లున్న కంకర, మట్టి వల్ల వాహనాలు వెళ్లేటప్పుడు విపరీతంగా దుమ్ము రేగి కాలినడకన వెళ్లే ప్రయాణికులు, స్థానిక దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త బస్ స్టాండ్ మరియు బైపాస్ రోడ్డును కలిపే ఈ కీలకమైన చౌరస్తా వద్ద ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ మరియు ఆర్ అండ్ బి (R&B) అధికారులు తక్షణమే స్పందించాలి. వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి, తవ్విన గుంతలకు శాశ్వత మరమ్మతులు చేపట్టి వాహనదారుల ప్రయాణాన్ని సురక్షితం చేయాలని స్థానికులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.1
- సెప్టెంబర్ 26న ప్రారంభ సభ ప్రజా కళా జాతరలో భాగస్వామ్యంకై కరపత్రం విడుదల 50 ఏళ్ల అరుణోదయలో 50 ఏళ్ల విమలక్క ప్రస్థానం సెప్టెంబర్ 26న ప్రారంభ సభ ప్రజా కళా జాతరలో భాగస్వామ్యంకై ఆహ్వానం కరపత్రం విడుదల ఏ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కోశాధికారి జి రాములు ఆధ్వర్యంలో ఈరోజు రాంనగర్ లో కరెక్ట్ కరపత్రాల విడుదల కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ... సెప్టెంబర్ 26న ప్రారంభ సభ విమలక్క ప్రస్థానం 50 గంటల పాటు ఏకధాటిగా పాట ఆట మాటలతో సాగే ఈ సభను విజయవంతం కొరకు కరపత్రాలు విడుదల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సభలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర చత్తీస్ గడ్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ నుండి కళాకారులు తెలుగు రాష్ట్రంలోని డజన్ల కొద్ది కళారూపాలు వందలాది కళాకారుల దీనిలో భాగస్వామవుతున్నారు హైదరాబాద్ సుందరయ్య పార్క్ నుండి ఆర్టీసీ కల్యాణ మండపం వరకు ఊరేగింపుగా వెళ్లి జెండా ఆవిష్కరణ నిర్వహించి ప్రారంభ సభలో ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ లక్ష్మి ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు ఆచార్య కట్ట భగవంతు రెడ్డి ప్రొఫెసర్ వినయ్ బాబు పోతల రమేష్ ముఖ్య అతిధి హాజరై ఈ ప్రారంభ సభను పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర కార్యదర్శి పల్లె లింగన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు యాకుబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు జనగాం చిన్నయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బతుకుల రాజన్న, జిల్లా కమిటీ సభ్యులు పద్మ, ఏఐఎస్టియు పెద్దపెల్లి జిల్లా నాయకులు ఎం రామస్వామి, రామగుండం డివిజన్ అధ్యక్షుడు ఆర్ యాకయ్య, ఎండి మహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.1
- kamaraddy dist banswada lo ex m la bajirddy press meet, news1
- చెరువును తలపిస్తున్న భీంపూర్ మండలంలోని ప్రధాన రహదారులు భీంపూర్ మండలంలోని వడూరు నుంచి ఆర్లీ(టీ) గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం గుంతలలో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఆయా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాపోయారు. ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందించి రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.1
- గణేష్ నవరాత్రి ఉత్సవాలలో బాగంగా బేల్లూరిలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణము న్యూస్, జైనాథ్: మండలంలోని బేల్లూరి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం సాయంత్రం గణనాథుడికి నిర్వహించిన ప్రత్యేక హారతి కార్యక్రమంలో గ్రామస్తులంతా ఒకచోటికి చేరారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామస్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ పారాయణంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. లంబోదరుడి దర్శనానికి వచ్చిన భక్తులకు పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- हैदराबाद में राउडी शीटर की निर्मम हत्या, वाइन शॉप के अंदर घुसकर तलवार-चाकुओं से हैदराबाद में राउडी शीटर की निर्मम हत्या, वाइन शॉप के अंदर घुसकर तलवार-चाकुओं से काटा हैदराबाद: 15 सितंबर मेचल जिले के नागशोल (नागोल) पुलिस स्टेशन के अंतर्गत आने वाले बंडलागुडा इलाके में सोमवार रात कुछ अज्ञात हमलावरों ने एक राउडी शीटर की बेरहमी से हत्या कर दी। मृतक की पहचान भद्राद्री कोठागुडेम जिले के इलेन्दु निवासी राउडी शीटर नईम के रूप में हुई है। पुलिस से मिली जानकारी के अनुसार, हमलावरों से जान बचाकर भागने की कोशिश कर रहा नईम पास ही स्थित 'सुप्रीम वाइन शॉप' के अंदर घुस गया था। लेकिन, बेखौफ हमलावरों ने उसे बख्शा नहीं और वाइन शॉप के अंदर ही धारदार हथियारों से ताबड़तोड़ वार कर उसकी हत्या कर दी। इस सनसनीखेज वारदात को अंजाम देने के बाद आरोपी मौके से एक कार में सवार होकर फरार हो गए। पुरानी रंजिश हो सकती है वजह घटना की सूचना मिलते ही नागगोल पुलिस तुरंत हरकत में आई और मौके पर पहुंचकर स्थिति का जायजा लिया तथा साक्ष्य जुटाए। पुलिस का शुरुआती तौर पर मानना है कि इस हत्या के पीछे पुरानी रंजिश मुख्य कारण हो सकती है। विशेष टीमों का गठन पुलिस ने बताया कि घटनास्थल और आसपास लगे सीसीटीवी कैमरों के फुटेज खंगाले जा रहे हैं। इसके साथ ही, आरोपियों द्वारा इस्तेमाल की गई कार का पता लगाने और फरार हमलावरों को दबोचने के लिए विशेष टीमों (स्पेशल पुलिस टीमों) का गठन कर सघन तलाशी अभियान शुरू कर दिया गया है।1