ఆత్మకూరులో 2027 జనగణనకు సంబంధించి గృహాల జాబితా (House Listing) స్వీయ లెక్కింపు కార్యక్రమం ఆత్మకూరు మండలంలో 2027 జనగణనకు సంబంధించి గృహాల జాబితా (House Listing) స్వీయ లెక్కింపు కార్యక్రమం ఈ రోజు విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని సహాయ గణాంక అధికారి శ్రీ సాహెబ్ పీర్ గారు స్వయంగా పర్యవేక్షిస్తూ నిర్వహించారు.ఈ సందర్భంగా మండలంలోని అన్ని ఎన్యూమరేటర్స్ పర్యవేక్షకులు , గ్రామ రెవెన్యూ అధికారులు రీ-సర్వే డిప్యూటీ తహశీల్దార్ శ్రీ ఆంజనేయులు గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సహాయ గణాంక అధికారి స్వీయ లెక్కింపు విధానం (Self Enumeration) పై సవివరంగా అవగాహన కల్పించారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను సరిగ్గా నమోదు చేసుకునే విధానం, దాని ప్రాముఖ్యత, ఖచ్చితమైన సమాచారం అందించాల్సిన అవసరం గురించి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా గణకులు మరియు సంబంధిత అధికారులు తమ విధులు సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలు పొందారు. జనగణన 2027 కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అధికారులు తెలిపారు.
ఆత్మకూరులో 2027 జనగణనకు సంబంధించి గృహాల జాబితా (House Listing) స్వీయ లెక్కింపు కార్యక్రమం ఆత్మకూరు మండలంలో 2027 జనగణనకు సంబంధించి గృహాల జాబితా (House Listing) స్వీయ లెక్కింపు కార్యక్రమం ఈ రోజు విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని సహాయ గణాంక అధికారి శ్రీ సాహెబ్ పీర్ గారు స్వయంగా పర్యవేక్షిస్తూ నిర్వహించారు.ఈ సందర్భంగా మండలంలోని అన్ని ఎన్యూమరేటర్స్ పర్యవేక్షకులు , గ్రామ రెవెన్యూ అధికారులు రీ-సర్వే డిప్యూటీ తహశీల్దార్ శ్రీ ఆంజనేయులు గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సహాయ గణాంక అధికారి స్వీయ లెక్కింపు విధానం (Self Enumeration) పై సవివరంగా అవగాహన కల్పించారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను సరిగ్గా నమోదు చేసుకునే విధానం, దాని ప్రాముఖ్యత, ఖచ్చితమైన సమాచారం అందించాల్సిన అవసరం గురించి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా గణకులు మరియు సంబంధిత అధికారులు తమ విధులు సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలు పొందారు. జనగణన 2027 కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అధికారులు తెలిపారు.
- నంద్యాల జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి దగ్గర రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ గూడ్స్ రైలు ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలవ్వగా, కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.1
- చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం కరివేన చెరువు పంట కాలువ వద్ద " జలధార " కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి పంట కాలువలో పూడికతీత, సాగునీటి కాలువలను శుభ్రం చేశారు.భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలన్నదే జలధార ధ్యేయం అన్నారు.చెరువుల పునరుద్ధరణతో వర్షపునీటిని వడిసిపట్టి రైతులకు అందిస్తామన్నారు.1
- స్వల్పకాల వ్యవధిలోనే తక్కువ పెట్టుబడితో బంతిపూల సాగులో అధిక దిగుబడి సాధించవచ్చని వీపనగండ్లలో బంతిపూలు సాగు చేసిన రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పంటలతో పోలిస్తే బంతిపూల సాగుకు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి వస్తుందన్నారు. పంట దిగుబడిలో సరైన చర్యలు తీసుకుంటే ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు లాభాలు ఆర్జించవచ్చని పేర్కొంటున్నారు.1
- 2026-2027 విద్యా సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 17 నుండి 23 వరకు ఏర్పాటు చేసిన"బడి పిలుస్తోంది" "విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్"లో భాగంగా నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ; కోట (బాలురు) ప్రధానోపాధ్యాయులు ; ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు నేటి ఉదయ కాల సమయంలో బైరెడ్డి నగర్ కాలనీ నందు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.. ఇందులో భాగంగా బైరెడ్డి నగర్ కాలనీలోని వీధుల గుండా రంగు రంగుల జెండాలు చేత బట్టి,విద్యకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న పథకాలు, విద్య ఆవశ్యకత తెలిపే బ్యానర్లు పట్టుకుని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగాంచారు.అనంతరం బైరెడ్డి నగర్ కూడలి లో మానవ హారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ లోని ఇళ్ల v వద్ద ప్రధానోపాధ్యాయులు కౌసల్యా బాయి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని,అత్యున్నత విద్యార్హతలు , అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని కావున బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలో తప్పకుండా చేర్పించాలని తల్లి తండ్రులను కోరారు.* పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పెరుమాళ్ళ శ్రీనాథ్ నిర్వహణలో జరిగిన.ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ర్యాలీ లో పాఠశాప్రధానోపాధ్యాయురాలు కౌసల్యా బాయి, పాఠశాల ప్రథమ సహాయకులు సాలమ్మ , ఉపాధ్యాయినులు విజయ కుమారి, లలితమ్మ, లలిత కుమారి, సరోజిని దేవి, క్రాఫ్ట్ టీచర్ అనిత ఉపాధ్యాయులు వెంకట రమణ,ఈశ్వరయ్య, మల్లికార్జున రెడ్డి,వెంకటేశ్వర్లు, రామి రెడ్డి, నాగేశేషులు కంప్యూటర్ ఆపరేటర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.*1
- పెద్దపెల్లి జిల్లా వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు1
- Hi1
- ధరూర్: తెలంగాణ రాష్ట్రంలో నూతన రాజకీయ శక్తిగా ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఆవిర్భవించే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున కదలిరావాలని *నడిగడ్డ హక్కుల పోరాట సమితి ధరూర్ మండల అధ్యక్షుడు మరియు తెలంగాణ జాగృతి నాయకులు నెట్టెంపాడు గోవిందు పిలుపునిచ్చారు. మంగళవారం ధరూర్ మండల కేంద్రంలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో సమితి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ గోడ పత్రికలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ గడ్డపై ప్రశ్నించే గొంతుకగా బడుగు,బలహీన వర్గాల కోసం, అమరుల ఆశయ సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కృషి చేస్తున్నారని వారు తెలిపారు. తెలంగాణ గడ్డపై రాబోయే రోజుల్లో నూతన రాజకీయ శక్తిగా పెద్ద ఎత్తున ఆవిర్భవించే సభకు ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి మరియు తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు వెంకట్రాములు, మండల ఉపాధ్యక్షులు అడివి ఆంజనేయులు, మల్దకల్, మునెప్ప, ఆంజనేయులు,మండల కార్యదర్శి రాము, మండల నాయకులు వెంకటేష్, సుదర్శన్,శాంతన్న,వీరన్న, ఆంజనేయులు, గోవిందు,కృష్ణ,మద్దిలేటి,తదితరులు పాల్గొన్నారు.1
- బడి పిలుస్తోంది కార్యక్రమం లో భాగంగా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామ పురవీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.1