నల్లబెల్లి కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం...... .నల్లబెల్లి, మార్చి 31: నల్లబెల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిర్వహించిన ధర్నా సిగ్గుచేటు చర్య అని పేర్కొన్నారు. రంగయ్య చెరువు రిజర్వాయర్ ద్వారా నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట ప్రాంతాల రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టును తీసుకువచ్చామని తెలిపారు. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రీడిజైన్ పేరుతో ప్రాజెక్టును రద్దు చేసి రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రిజర్వాయర్ పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని ప్రయత్నిస్తుంటే, కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. కాల్వల పనులను పూర్తి చేయకుండా వదిలేసి ఇప్పుడు ధర్నాలు చేయడం తగదన్నారు. గతంలో కాల్వ పనులు పూర్తి చేయకపోవడంతో సుమారు 300 ఎకరాలు ఎండిపోయాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా పనులు చేపట్టామని తెలిపారు. అధికారంలో లేని సమయంలో రైతులపై కపట ప్రేమ చూపిస్తున్న వారికి రైతులే సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, మాజీ మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘుపతిరావు, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ చరణ్ సింగ్, మండల కార్యదర్శి జెట్టి రామూర్తి, ఉపాధ్యక్షులు కొంరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- హైదరాబాద్..శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి1
- హన్మకొండ జిల్లా నగరంలోని నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఔట్సోర్సింగ్ కార్మికుడి మృతి నేపథ్యంలో ఆందోళన జరిగింది. గుండ్లసింగారం సబ్ స్టేషన్లో విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్‌కు గురైన గాదే పున్నం చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, తోటి కార్మికులు మృతదేహంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 18 వ వార్డులో దోమల నివారణ చర్యల్లో భాగంగా వాట్ కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్ ఆధ్వర్యంలో ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు.దోమలను చంపడానికి, వ్యాప్తిని అరికట్టడానికి ఇంటింటికీ తిరిగి ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వార్డు ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లాలో కొత్త తరహాలో దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ద ప్రభావంతో గ్యాస్ కొరత నేపథ్యంలో గ్యాస్ పేరుతో మహిళను మోసం చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన గుడిపాటి ఆగమ్మ అనే మహిళ ఇంటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. గ్యాస్ సిలిండర్ వచ్చిందని తమతో పాటు రావాలని చెప్పడం తో ఆ మహిళ వారిని అనుసరించింది. మహిళను మభ్యపెట్టిన దుండగులు మహిళను మోసం చేసి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న నాలుగున్నర తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో మహిళా మోసపోయనని గ్రహించి ఇంట్లోకి వెళ్లి చూడగా బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు. చేసింది. రంగంలో దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.1
- సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సింగరేణి హెడ్డాఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు, హెడ్డాఫీసు చేరుకొని ప్రధాన ద్వారం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. పొర్లు దండాలతో విన్నూత రీతీలో నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకోవడంతో హెడ్డాఫీసు ఏరియా ఉద్రిక్తంగా మారింది. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతోపాటు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తదితరులను పోలీసులు నిర్బంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్'కు తరలించారు.2
- ఈరోజు నకిరేకల్ లో BRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ & ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా BRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వదిలేసి ఆశ వర్కర్లను మోసం చేస్తుంది. అధికారంలోకి రావడానికి ముందు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా తప్పించుకోవడం స్పష్టమైన ద్రోహం. హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద శాంతియుతంగా ధర్నా చేయడానికి ముందుగా అనుమతి ఇచ్చి, రాష్ట్ర నాయకులు, ఆశ వర్కర్లను అరెస్టు చేయడం ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట, ఇది ప్రజాస్వామ్యాన్ని బలవంతంగా గొంతు నొక్కే చర్య. ఈ విధానం నియంతృత్వ పాలనకు సంకేతం. ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఆశా వర్కర్లను అనగదొక్కే ప్రయత్నం చేస్తే అది ప్రజల ఆగ్రహన్నీ రెచ్చగొట్టడమే. ప్రభుత్వం వెంటనే తన నిరంకుశ వైఖరిని విరమిచ్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఎగసిపడుతుందన్నారు. ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నకిరేకల్ లో ఈరోజు BRTU రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలివేరు ప్రభాకర్ గారు & ఆశా ల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షురాలు సింగం రేణుక ఆధ్వర్యంలో BRTU అనుబంధ ఆశ వర్కర్లు నకిరేకల్ PHC వద్ద నల్ల బ్యాడ్జీ లు ధరించి ధర్నా చేసి నకిరేకల్ మెయిన్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఆశ వర్కర్ల డిమాండ్లు: 1. ఆశ వర్కర్లకు ఇచ్చిన 18000 ఫిక్స్డ్ వేతనాలు వెంటనే అమలు చేయాలి. 2. ప్రజాస్వామ్య పోరాటoను అణచివేయడం వెంటనే ఆపాలి. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఇది కేవలం ప్రారంభం మాత్రమే పోరాటం మరింత తీవ్రత దాలుస్తుందని అన్నారు .ఆశ వర్కర్లను తక్కువగా అంచనా వేయకండి. ఆశాల న్యాయమైన డిమాండ్ లను వెంటనే నెరవేర్చమని BRTU డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో SK సుల్తానా, కొండ అనసూర్య, A హైమావతి, M నీలావతి, M స్వప్న, V సుజాత, CH ఇందిర, P లలిత, P రేణుక, Y విజయలక్ష్మి, CH నాగమణి, B జ్యోతి తదితరులు పాల్గొన్నారు.4
- పెద్దపల్లి జిల్లా రైతాంగానికి నిన్నటి రాత్రి ఒక పీడకలలా మారింది. ఒక్కసారిగా మారిన వాతావరణం అకాల వర్షం ఈదురుగాలలతో మామిడి కాయలు నేల రాలడంతో అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటలు కళ్లముందే నేలపాలవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.1
- జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులోని సాయిబాబా గుడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన ఐలయ్యగా గుర్తించారు. అతడిని ముందుగా జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.1