logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సత్తి యాడి ఆలయానికి శుభ్రత–అందం: బంజారా బిడ్డ డా. బోడ అనిల్ నాయక్ సేవలు... వరంగల్ జిల్లా నర్సంపేట పరిధిలో సత్తి యాడి (లక్ష్మీ దేవత) ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసి, ఆలయం చుట్టూ ఉన్న పరిరక్షణ గోడకు రంగులు వేయించి అందంగా తీర్చిదిద్దారు బంజారా బిడ్డ డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్. ఈ కార్యక్రమం ద్వారా ఆలయానికి మరింత శోభ చేకూరింది. ఈ సందర్భంగా డా. అనిల్ నాయక్ మాట్లాడుతూ, లంబాడీ దేవుళ్ల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగుకాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదని అన్నారు. నర్సంపేట పరిధిలోని బంజారా యువత, ప్రజలందరూ ఐక్యంగా కలిసి రేపు జరగబోయే సత్తి యాడి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

on 22 March
user_Chetty:Ramesh
Chetty:Ramesh
నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
on 22 March
15a3dfbe-8969-4e29-8ff6-5e1176cc5b6a

సత్తి యాడి ఆలయానికి శుభ్రత–అందం: బంజారా బిడ్డ డా. బోడ అనిల్ నాయక్ సేవలు... వరంగల్ జిల్లా నర్సంపేట పరిధిలో సత్తి యాడి (లక్ష్మీ దేవత) ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసి, ఆలయం చుట్టూ ఉన్న పరిరక్షణ గోడకు రంగులు వేయించి అందంగా తీర్చిదిద్దారు బంజారా బిడ్డ డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్. ఈ కార్యక్రమం ద్వారా ఆలయానికి మరింత శోభ చేకూరింది. ఈ సందర్భంగా డా. అనిల్ నాయక్ మాట్లాడుతూ, లంబాడీ దేవుళ్ల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగుకాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదని అన్నారు. నర్సంపేట పరిధిలోని బంజారా యువత, ప్రజలందరూ ఐక్యంగా కలిసి రేపు జరగబోయే సత్తి యాడి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…
    2
    *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం 
ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…
    user_Srinivas goud Reporter
    Srinivas goud Reporter
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    14 hrs ago
  • నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. ఈ కార్యక్రమం నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నర్సంపేట సెగ్మెంట్‌లో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆరు జిల్లాల నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, అనిల్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    1
    నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. ఈ కార్యక్రమం నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నర్సంపేట సెగ్మెంట్‌లో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆరు జిల్లాల నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, అనిల్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    16 hrs ago
  • ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్గ్రౌండ్ కేబుల్స్ రక్షణ కోసం ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. టవర్ అనుమతులు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
    1
    ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్గ్రౌండ్ కేబుల్స్ రక్షణ కోసం ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. టవర్ అనుమతులు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    11 hrs ago
  • ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను లోబరుచుకుని, అత్యాచారం చేసిన నిందితుణ్ణి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. టౌన్ పోలీసుల కథనం ప్రకారం…నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన నిందితుడు చిలుకబత్తిని రంజిత్, S/o వెంకన్న, 19 సం,,లు, వృత్తి:డెకరేషన్ వర్క్, అనే యువకుడు, 15 సం,,ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గత సోమవారం మహబూబాబాద్ కు వచ్చిన బాలికను తన బైక్ పై ఎక్కించుకుని వెళ్ళిపోయినాడు. ఈ విషయమై బాలిక తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితున్ని అదుపులోకి తీసుకుని, అతనిపై కిడ్నాప్ మరియు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించినామని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.*
    1
    ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను లోబరుచుకుని, అత్యాచారం చేసిన నిందితుణ్ణి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. టౌన్ పోలీసుల కథనం ప్రకారం…నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన నిందితుడు చిలుకబత్తిని రంజిత్, S/o వెంకన్న, 19 సం,,లు, వృత్తి:డెకరేషన్ వర్క్, అనే యువకుడు, 15 సం,,ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గత సోమవారం మహబూబాబాద్ కు వచ్చిన బాలికను తన బైక్ పై ఎక్కించుకుని వెళ్ళిపోయినాడు. ఈ విషయమై బాలిక తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితున్ని అదుపులోకి తీసుకుని, అతనిపై కిడ్నాప్ మరియు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించినామని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.*
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యులు మల్లా రాజిరెడ్డి 46 ఏళ్ళ తర్వాత స్వస్థలానికి చేరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో ఇటీవల అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మల్లా రాజిరెడ్డి మంథనికి చేరుకుని కుటుంబసభ్యులు, బంధుమిత్రులను కలుసుకున్నారు. ఆత్మీయ పలకరింపులతో ఆనందంగా గడిపిన మల్లా రాజిరెడ్డి చాలాకాలం విప్లవోద్యమంలో పనిచేశానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే చట్టబద్దంగా సామాజిక సేవ చేస్తానని తెలిపారు. రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
    2
    పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యులు మల్లా రాజిరెడ్డి 46 ఏళ్ళ తర్వాత స్వస్థలానికి చేరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో ఇటీవల అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మల్లా రాజిరెడ్డి మంథనికి చేరుకుని కుటుంబసభ్యులు, బంధుమిత్రులను కలుసుకున్నారు. ఆత్మీయ పలకరింపులతో ఆనందంగా గడిపిన మల్లా రాజిరెడ్డి చాలాకాలం విప్లవోద్యమంలో పనిచేశానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే చట్టబద్దంగా సామాజిక సేవ చేస్తానని తెలిపారు.
రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇస్తున్న నగదును 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇస్తున్న 5 లక్షలు ఇల్లు నిర్మించుకునేందుకు అరకొరగా ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం సిమెంటు ధరలు, ఇనుప చువ్వా, హమాలీల ధరలు భారీగా పెరిగినందున 10 లక్షలకు పెంచాలని కోరారు. అదేవిధంగా బిల్లులను వారంలో కచ్చితంగా లబ్ధిదారుడికి అందే విధంగా చూడాలన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నెలలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ మాటలను నిలబెట్టుకోవాలని కోరారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మహిళలకు నగదును పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన .ఊకే ముత్తయ్య దొర. కొమ్ము విజయకుమార్. నరపోగు దీప్తి. నరేష్.వెంట ఆధార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    1
    తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇస్తున్న నగదును 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని ఆధార్  పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇస్తున్న 5 లక్షలు ఇల్లు నిర్మించుకునేందుకు అరకొరగా ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం సిమెంటు ధరలు, ఇనుప చువ్వా,  హమాలీల ధరలు భారీగా పెరిగినందున 10 లక్షలకు పెంచాలని కోరారు. అదేవిధంగా బిల్లులను వారంలో కచ్చితంగా లబ్ధిదారుడికి అందే విధంగా చూడాలన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నెలలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ మాటలను నిలబెట్టుకోవాలని కోరారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా  మహిళలకు నగదును పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన .ఊకే ముత్తయ్య దొర. కొమ్ము విజయకుమార్. నరపోగు దీప్తి. నరేష్.వెంట ఆధార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    10 hrs ago
  • కాకతీయుల కాలం నాటి నర్సంపేట శివారు మాదన్నపేట చెరువు వేసవికాలంలోనూ నిండుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రకృతి సౌందర్యంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ చెరువు టూరిస్టులకు ఆకర్షణగా మారుతోంది. అయితే బోటు ప్రయాణం వంటి సదుపాయాలు లేకపోవడంతో సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుస సెలవు దినాల్లో పెద్ద సంఖ్యలో వచ్చే టూరిస్టుల కోసం అభివృద్ధి పనులు చేపట్టి, బోటింగ్ ఏర్పాటు చేయాలని టూరిస్టులు కోరుతున్నారు.
    1
    కాకతీయుల కాలం నాటి నర్సంపేట శివారు మాదన్నపేట చెరువు వేసవికాలంలోనూ నిండుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రకృతి సౌందర్యంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ చెరువు టూరిస్టులకు ఆకర్షణగా మారుతోంది. అయితే బోటు ప్రయాణం వంటి సదుపాయాలు లేకపోవడంతో సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుస సెలవు దినాల్లో పెద్ద సంఖ్యలో వచ్చే టూరిస్టుల కోసం అభివృద్ధి పనులు చేపట్టి, బోటింగ్ ఏర్పాటు చేయాలని  టూరిస్టులు కోరుతున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.