Shuru
Apke Nagar Ki App…
NSUI మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా నియామకమైన సోహైల్ షా ను సన్మానించిన ఎమ్మెల్యే NSUI మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా నియామకమైన సోహైల్ షా ను ఖానాపూర్ ఎమ్మెల్యే,నిర్మల్ డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మత్ ఖాన్, యువజన కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు సలావుద్దీన్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు దాసరి గణేష్. రఘువర్ధన్,రాజేష్,తదితరులు పాల్గొన్నారు
Bojanapu Surendar
NSUI మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా నియామకమైన సోహైల్ షా ను సన్మానించిన ఎమ్మెల్యే NSUI మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా నియామకమైన సోహైల్ షా ను ఖానాపూర్ ఎమ్మెల్యే,నిర్మల్ డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మత్ ఖాన్, యువజన కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు సలావుద్దీన్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు దాసరి గణేష్. రఘువర్ధన్,రాజేష్,తదితరులు పాల్గొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- టైగర్ లేకున్నా టైగర్ జోన్ అమలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు అభయారణ్యంలో టైగర్ లేకుండా టైగర్ జోన్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారం మండలానికి చెందిన బద్రి నాయక్ మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూలో పాల్గొన్నారు. జన్నారంలో అమలు చేస్తున్న ఎకో జోన్ తో ఇసుక రాక ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని వాపోయారు. అధికారులు స్పందిస్తూ ఎకో జోన్ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.1
- డేంజర్ జోన్ గా జగిత్యాల బైపాస్ రోడ్డు: గుంతలు పూడ్చేదెప్పుడు? ప్రయాణం సురక్షితమయ్యేదెప్పుడు? జగిత్యాల పట్టణంలో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే కొత్త బస్ స్టాండ్ సమీపంలోని తెలంగాణ వైన్స్ చౌరస్తా నుండి బైపాస్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రోడ్డు పునర్నిర్మాణం లేదా డ్రైనేజీ/పైప్‌లైన్ పనుల కోసం తవ్విన భారీ గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చకుండా, మట్టి మరియు రాళ్ల శిథిలాలను (Debris) రోడ్డు పైనే అస్తవ్యస్తంగా వదిలేశారు. ప్రాణసంకటంగా రాత్రి ప్రయాణం: తెలంగాణ వైన్స్ చౌరస్తా వద్ద నిత్యం వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ గుంతల వద్ద ఎటువంటి రేడియం సూచికలు గానీ, ప్రకాశించే బారికేడ్లు గానీ ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ప్రమాదాల బారిన పడే అవకాశం లేకపోలేదు ట్రాఫిక్ దిగ్బంధం: కొత్త బస్ స్టాండ్ వైపు, బైపాస్ వైపు వెళ్లే వాహనాలు ఈ గుంతలను తప్పించబోయి హఠాత్తుగా బ్రేకులు వేయడం వల్ల చౌరస్తా ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ నిలిచిపోతోంది. ప్రయాణికులకు దుమ్ము ఇబ్బందులు: రోడ్డుపై విసిరేసినట్లున్న కంకర, మట్టి వల్ల వాహనాలు వెళ్లేటప్పుడు విపరీతంగా దుమ్ము రేగి కాలినడకన వెళ్లే ప్రయాణికులు, స్థానిక దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త బస్ స్టాండ్ మరియు బైపాస్ రోడ్డును కలిపే ఈ కీలకమైన చౌరస్తా వద్ద ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ మరియు ఆర్ అండ్ బి (R&B) అధికారులు తక్షణమే స్పందించాలి. వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి, తవ్విన గుంతలకు శాశ్వత మరమ్మతులు చేపట్టి వాహనదారుల ప్రయాణాన్ని సురక్షితం చేయాలని స్థానికులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.1
- *బీసీలకు అన్యాయం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం** *కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నం – బీసీ నాయకులను అడ్డుకున్న పోలీసులు* *బీసీల హక్కుల కోసం పోరాటం ఆపేది లేదు: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్* ఆసిఫాబాద్: బీసీ కులగణన విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీ కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం 2025 మే 1న ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టకుండా బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఓబీసీ కుటుంబాలను సమగ్రంగా లెక్కించి, ప్రత్యేక బీసీ కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ కాలమ్ కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ మద్దతు ఇవ్వకుండా అసెంబ్లీని బహిష్కరించడం బీసీల పట్ల ఆ పార్టీ వైఖరికి నిదర్శనమన్నారు. పోలీసులు అడ్డుకున్నా బీసీల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని, కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీ కులగణనను శాస్త్రీయంగా నిర్వహించే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని రూప్నార్ రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లోబడే లాహు కుమార్, బీసీ సంక్షేమ సంఘం ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు సాయి కృష్ణ నాయకులు, అసద్, జయరాజ్, వెంకన్న,ముబీన్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- సెప్టెంబర్ 26న ప్రారంభ సభ ప్రజా కళా జాతరలో భాగస్వామ్యంకై కరపత్రం విడుదల 50 ఏళ్ల అరుణోదయలో 50 ఏళ్ల విమలక్క ప్రస్థానం సెప్టెంబర్ 26న ప్రారంభ సభ ప్రజా కళా జాతరలో భాగస్వామ్యంకై ఆహ్వానం కరపత్రం విడుదల ఏ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కోశాధికారి జి రాములు ఆధ్వర్యంలో ఈరోజు రాంనగర్ లో కరెక్ట్ కరపత్రాల విడుదల కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ... సెప్టెంబర్ 26న ప్రారంభ సభ విమలక్క ప్రస్థానం 50 గంటల పాటు ఏకధాటిగా పాట ఆట మాటలతో సాగే ఈ సభను విజయవంతం కొరకు కరపత్రాలు విడుదల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సభలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర చత్తీస్ గడ్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ నుండి కళాకారులు తెలుగు రాష్ట్రంలోని డజన్ల కొద్ది కళారూపాలు వందలాది కళాకారుల దీనిలో భాగస్వామవుతున్నారు హైదరాబాద్ సుందరయ్య పార్క్ నుండి ఆర్టీసీ కల్యాణ మండపం వరకు ఊరేగింపుగా వెళ్లి జెండా ఆవిష్కరణ నిర్వహించి ప్రారంభ సభలో ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ లక్ష్మి ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు ఆచార్య కట్ట భగవంతు రెడ్డి ప్రొఫెసర్ వినయ్ బాబు పోతల రమేష్ ముఖ్య అతిధి హాజరై ఈ ప్రారంభ సభను పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర కార్యదర్శి పల్లె లింగన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు యాకుబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు జనగాం చిన్నయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బతుకుల రాజన్న, జిల్లా కమిటీ సభ్యులు పద్మ, ఏఐఎస్టియు పెద్దపెల్లి జిల్లా నాయకులు ఎం రామస్వామి, రామగుండం డివిజన్ అధ్యక్షుడు ఆర్ యాకయ్య, ఎండి మహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.1
- శ్రీగిరి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి పాల కావడి సమర్పించిన భక్తులు.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పాల కావడి సేవ, పల్లకి సేవ, హారతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నయ్య గురుస్వామి మాట్లాడుతూ.. పాల కావడి స్వామివారికి సమర్పించడంతో ఆరోగ్యం బాగుంటుందని అదేవిధంగా వివాహలు, సంతానం లేని వారికి వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.1
- నిర్మల్ జిల్ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ముధోల్ కేజీబీవీను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మల్ జిల్లా: *విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ముధోల్ కేజీబీవీను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బందికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు అన్ని పూటల మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతి పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని తరగతులకు సంబంధించిన సిలబస్ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలన్నారు. ప్రతిరోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో తరగతులకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. పదవ తరగతి విద్యార్థుల బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం వారిని సిద్ధం చేయాలన్నారు. పదవ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి, ఇప్పటివరకు పూర్తయిన సిలబస్, రోజువారిగా అందిస్తున్న భోజనం, వసతి, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గణితం సబ్జెక్టుకు సంబంధించి పలు లెక్కలను బోర్డుపై విద్యార్థులతో చేయించి, లెక్కలు చేసిన విద్యార్థులను అభినందించి, పెన్నులను బహుమతులుగా ఇచ్చారు. బోర్డు పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు. ఏ సబ్జెక్టులో అయినా ఎటువంటి సందేహాలు ఉన్న వెంటనే సంబంధిత ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమీపంలో నిర్మాణం చివరి దశకు చేరుకున్న పాఠశాల భవంతిని కలెక్టర్ పరిశీలించారు. మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి భవనాన్ని వినియోగానికి తేవాలని తెలిపారు. ఈ తనిఖీలో డీఈవో భోజన్న, తహసిల్దార్ శ్రీలత, ఎంపీడీవో లవ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.2
- kamaraddy dist banswada lo ex m la bajirddy press meet, news1
- మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని బిఆర్ఎస్ నాయకుడి వినతి జన్నారంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాల ముందు మురుగు నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ నాయకులు సాయికిరణ్ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జన్నారంలో ప్రతి మంగళవారం వారసంత జరుగుతుందన్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుకు ఇరువైపులా మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తుందన్నారు. దీంతో చిరు వ్యాపారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, నీరు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.1