logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మాల మహానాడు ఆధ్వర్యంలో బోధన్‌లో నిరసన, అమర ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం, అంబేద్కర్ పై అనుచిత వాక్యాలు.. దళిత సంఘ నాయకులు ఆగ్రహం బోధన్, సెప్టెంబర్ 17: నిజామాబాద్ జిల్లా: ప్రతినిధి రాహుల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమర ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంపల్లి ఎల్లయ్య డిమాండ్ చేశారు. గురువారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అమర ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆనంపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేయడం, ఆయనపై తప్పుడు ప్రచారానికి దారితీసే విధంగా పుస్తకాన్ని రచించి విడుదలకు ప్రయత్నించడం దళిత సమాజం మనోభావాలను దెబ్బతీసే చర్యలని అన్నారు. అంబేద్కర్ కృషి, రాజ్యాంగ విలువలు, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాన్ని అవమానించే వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు.అమర ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో మాల మహానాడు నాయకులు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు, ప్రచారాలు చేసే వారిపై ప్రభుత్వం, పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు దళిత సమాజం ఐక్యంగా ముందుకు సాగుతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కార్యవర్గ సభ్యులు, బోధన్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నాయకులు, పట్టణ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_RAHUL
RAHUL
బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
1 hr ago

మాల మహానాడు ఆధ్వర్యంలో బోధన్‌లో నిరసన, అమర ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం, అంబేద్కర్ పై అనుచిత వాక్యాలు.. దళిత సంఘ నాయకులు ఆగ్రహం బోధన్, సెప్టెంబర్ 17: నిజామాబాద్ జిల్లా: ప్రతినిధి రాహుల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమర ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్

ప్రెసిడెంట్ ఆనంపల్లి ఎల్లయ్య డిమాండ్ చేశారు. గురువారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అమర ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆనంపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేయడం, ఆయనపై తప్పుడు ప్రచారానికి దారితీసే విధంగా

పుస్తకాన్ని రచించి విడుదలకు ప్రయత్నించడం దళిత సమాజం మనోభావాలను దెబ్బతీసే చర్యలని అన్నారు. అంబేద్కర్ కృషి, రాజ్యాంగ విలువలు, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాన్ని అవమానించే వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు.అమర ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో మాల మహానాడు నాయకులు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్‌ను అవమానించేలా

8a35e1ba-7d5a-4465-ba95-552306258748

వ్యాఖ్యలు, ప్రచారాలు చేసే వారిపై ప్రభుత్వం, పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు దళిత సమాజం ఐక్యంగా ముందుకు సాగుతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కార్యవర్గ సభ్యులు, బోధన్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నాయకులు, పట్టణ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • నిజాంసాగర్‌లో 11.383 టీఎంసీల నీటి నిల్వ... ప్రధాన కాల్వ నీటి విడుదల నిలిపివేత నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టులో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నమోదుల ప్రకారం నీటిమట్టం 1400.02 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 11.383 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ శూన్యంగా నమోదయ్యాయి. స్పిల్‌వే గేట్లు, ప్రధాన కాలువ నుండి విడుదల నిలిపివేయగా, జెన్కొ విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయింది.
    1
    నిజాంసాగర్‌లో 11.383 టీఎంసీల నీటి నిల్వ... ప్రధాన కాల్వ నీటి విడుదల నిలిపివేత 
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టులో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నమోదుల ప్రకారం నీటిమట్టం 1400.02 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 11.383 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ శూన్యంగా నమోదయ్యాయి. స్పిల్‌వే గేట్లు, ప్రధాన కాలువ నుండి విడుదల నిలిపివేయగా, జెన్కొ విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయింది.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    1 day ago
  • విద్యార్థి దశ నుంచే ఆర్థిక అక్షరాస్యత, సైబర్ నేరాలపై అవగాహన ఉండాలీ జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ . తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్డీఎం మాట్లాడుతూ, విద్యార్థులంతా చిన్ననాటి నుంచి బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒకరు ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉండి, పొదుపును పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో సైబర్ మోసాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు వీటిపై అవగాహన కలిగి ఉండి సైబర్ మోసాలకు గురికాకుండా ఉండాలన్నారు. విద్యార్థులు తమ తమ ఇళ్లలో సైబర్ మోసాల గురించి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రతి ఒకరు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    1
    విద్యార్థి దశ నుంచే  ఆర్థిక అక్షరాస్యత, సైబర్ నేరాలపై అవగాహన ఉండాలీ జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ . 
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఎల్డీఎం మాట్లాడుతూ, విద్యార్థులంతా చిన్ననాటి నుంచి బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒకరు ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉండి, పొదుపును పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో సైబర్ మోసాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు వీటిపై అవగాహన కలిగి ఉండి సైబర్ మోసాలకు గురికాకుండా ఉండాలన్నారు. విద్యార్థులు తమ తమ ఇళ్లలో సైబర్ మోసాల గురించి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రతి ఒకరు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    user_Venu
    Venu
    Nirmal U, Telangana•
    3 hrs ago
  • నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం. ........... నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తిల అధ్యక్షతన తెలంగాణ ప్రాజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి, మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి వందన సమర్పణ చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం, తెలంగాణ గేయాన్ని ఆలపించారు. ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకుని పారదర్శక, జవాబుదారీ, సంక్షేమంతో కూడిన సమర్థవంతమైన పాలన అందించడం, ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పిస్తూ, అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరేలా చేయడమే ప్రజాపాలన ప్రధాన లక్ష్యంమని మున్సిపల్ చైర్మన్ కావ్య తేలిపారు.
    1
    నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం. ...........
నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తిల అధ్యక్షతన తెలంగాణ ప్రాజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి, మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి వందన సమర్పణ చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం, తెలంగాణ గేయాన్ని ఆలపించారు. ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకుని పారదర్శక, జవాబుదారీ, సంక్షేమంతో కూడిన సమర్థవంతమైన పాలన అందించడం,  ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పిస్తూ, అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరేలా చేయడమే ప్రజాపాలన ప్రధాన లక్ష్యంమని మున్సిపల్ చైర్మన్ కావ్య తేలిపారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    9 hrs ago
  • ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బాలాజీ మందిరంలో ఆశీర్వాద దీపాలు వెలిగించిన బిజెపి నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలో బాలాజీ ఆలయంలో నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్లు జీవించి దేశ ప్రధానిగా ఉండి వికసిత్ భారత లక్ష్యం చేరుకొని విశ్వ గురువుగా మారాలని ఆయన ఆయురారోగ్యాలు బాగుండాలని ఆశీర్వాద దీపం కార్యక్రమం పేరుమీద దీపాలు వెలిగించి దేవుని కోరుకోనిప్రత్యేకపూజలోపాల్గోన్నబిజేపి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మెదక్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పట్లోల్ల మల్లిక ధార్మిక సెల్ కన్వీనర్ రాజేశ్వరి, బిజేపి ధార్మిక సెల్ జయంతి కన్వీనర్ కృష్ణ, 21 వార్డ్ కౌన్సిలర్ పబ్బా రాజమణి లక్ష్మణ్ 28 వార్డ్ కౌన్సిలర్ అఖిలభారత్, సౌజన్య ప్రభాకర్ అంకం శ్రీను మైనార్టీ మోర్చా అధ్యక్షుడు గ్యాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు
    1
    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బాలాజీ మందిరంలో ఆశీర్వాద దీపాలు వెలిగించిన బిజెపి నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి 
ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలో బాలాజీ ఆలయంలో నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్లు జీవించి దేశ ప్రధానిగా ఉండి వికసిత్ భారత లక్ష్యం చేరుకొని విశ్వ గురువుగా మారాలని ఆయన ఆయురారోగ్యాలు బాగుండాలని ఆశీర్వాద దీపం కార్యక్రమం పేరుమీద దీపాలు వెలిగించి దేవుని కోరుకోనిప్రత్యేకపూజలోపాల్గోన్నబిజేపి
మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మెదక్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పట్లోల్ల మల్లిక ధార్మిక సెల్ కన్వీనర్ రాజేశ్వరి, బిజేపి ధార్మిక సెల్ జయంతి కన్వీనర్ కృష్ణ, 21 వార్డ్ కౌన్సిలర్ పబ్బా రాజమణి లక్ష్మణ్ 28 వార్డ్ కౌన్సిలర్ అఖిలభారత్, సౌజన్య ప్రభాకర్ అంకం శ్రీను మైనార్టీ మోర్చా అధ్యక్షుడు గ్యాన్  సింగ్ తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    1 hr ago
  • వినాయక నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని ప్రేమ్ నగర్, బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె పలు శాఖల అధికారుల తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు.  అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వినాయక నిమజ్జనానికి కావలసిన నీటి సౌకర్యం, స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు, అగ్ని మాపక శాఖ అధికారులు సేవలు అందించాలని, పారిశుధ్య పనులు చేయించాలని, క్రేన్లు అందుబాటులో పెట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రాచారి, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
    1
    వినాయక నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె
వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని ప్రేమ్ నగర్, బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె పలు శాఖల అధికారుల తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు.  ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు.  
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వినాయక నిమజ్జనానికి కావలసిన నీటి సౌకర్యం, స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు, అగ్ని మాపక శాఖ అధికారులు సేవలు అందించాలని, పారిశుధ్య పనులు చేయించాలని, క్రేన్లు అందుబాటులో పెట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రాచారి, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
  • టేకు చెట్లు తొలగించిన కేసులు సర్పంచ్ భర్తకు జరిమానా.... టేకు చెట్లు తొలగించిన కేసులో సర్పంచ్ భర్తకు జరిమానా అనుమతి లేకుండా చెట్లు తొలగించారన్న ఫిర్యాదుపై అటవీశాఖ చర్యలు డిచ్‌పల్లి మండలం సాంపల్లిలో ఘటన నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 17 గ్రామంలో అభివృద్ధి పనుల పేరుతో వ్యక్తిగతంగా పెంచుకున్న టేకు చెట్లను అనుమతి లేకుండా తొలగించిన వ్యవహారంలో సాంపల్లి సర్పంచ్ సంధ్య భర్త మాసూరి ప్రశాంత్‌కు అటవీశాఖ అధికారులు రూ.13,325 జరిమానా విధించారు. ఈ ఘటన డిచ్‌పల్లి మండలంలో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగింది? సాంపల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం జేసీబీతో తవ్వకాలు చేపట్టిన సమయంలో గ్రామానికి చెందిన అంతరెడ్డి నర్సయ్య ఇంటి పక్కన ఏళ్లుగా పెంచుకుంటున్న టేకు చెట్లను తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనకు ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసు ఇవ్వకుండా సర్పంచ్ భర్త మాసూరి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర సమక్షంలో జేసీబీ సహాయంతో 12 టేకు చెట్లను తొలగించారని నర్సయ్య అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. డీఎఫ్‌వోకు ఫిర్యాదు ఏళ్ల తరబడి పెంచుకున్న చెట్లను తొలగించడంతో తీవ్రంగా నష్టపోయిన నర్సయ్య నేరుగా జిల్లా అటవీశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా చెట్లను తొలగించిన వారిపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదు నేపథ్యంలో ఇందల్వాయి ఎఫ్‌ఆర్‌వో రవి భట్ ఆదేశాల మేరకు అటవీశాఖ రేంజ్, బీట్ అధికారులు సాంపల్లి గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. చెట్ల తొలగింపు వ్యవహారంపై వివరాలను సేకరించారు. రూ.13,325 జరిమానా అటవీశాఖ విచారణ అనంతరం అనుమతి లేకుండా వ్యక్తిగతంగా పెంచుకున్న టేకు చెట్లను తొలగించిన వ్యవహారంలో మాసూరి ప్రశాంత్‌కు రూ.13,325 జరిమానా విధించినట్లు అధికారులు నిర్ణయించారు. అయితే చెట్ల తొలగింపు సమయంలో పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర కూడా అక్కడ ఉన్నారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ, జరిమానా విషయంలో ఆయన పేరును ప్రస్తావించకపోవడంపై నర్సయ్య సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై అటవీశాఖ అధికారులు మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందని గ్రామస్థులు కోరుతున్నారు. అభివృద్ధి పనులైనా.. నిబంధనలు పాటించాల్సిందే అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో చెట్లు అడ్డుగా ఉన్నా సంబంధిత శాఖల నిబంధనలు, అనుమతులు పాటించాల్సిందేనని గ్రామస్థులు పేర్కొంటున్నారు. పచ్చదనం పెంచాలని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులే చెట్ల తొలగింపు వ్యవహారంలో జరిమానా ఎదుర్కోవడం చర్చకు దారితీసిందన్నారు. అధికారిక అనుమతులు, నిబంధనలు పాటించకుండా చెట్లను తొలగిస్తే చర్యలు తప్పవనే విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
    1
    టేకు చెట్లు తొలగించిన కేసులు సర్పంచ్ భర్తకు జరిమానా....
టేకు చెట్లు తొలగించిన కేసులో సర్పంచ్ భర్తకు జరిమానా
అనుమతి లేకుండా చెట్లు తొలగించారన్న ఫిర్యాదుపై అటవీశాఖ చర్యలు
డిచ్‌పల్లి మండలం సాంపల్లిలో ఘటన
నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 17
గ్రామంలో అభివృద్ధి పనుల పేరుతో వ్యక్తిగతంగా పెంచుకున్న టేకు చెట్లను అనుమతి లేకుండా తొలగించిన వ్యవహారంలో సాంపల్లి సర్పంచ్ సంధ్య భర్త మాసూరి ప్రశాంత్‌కు అటవీశాఖ అధికారులు రూ.13,325 జరిమానా విధించారు. ఈ ఘటన డిచ్‌పల్లి మండలంలో చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది?
సాంపల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం జేసీబీతో తవ్వకాలు చేపట్టిన సమయంలో గ్రామానికి చెందిన అంతరెడ్డి నర్సయ్య ఇంటి పక్కన ఏళ్లుగా పెంచుకుంటున్న టేకు చెట్లను తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనకు ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసు ఇవ్వకుండా సర్పంచ్ భర్త మాసూరి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర సమక్షంలో జేసీబీ సహాయంతో 12 టేకు చెట్లను తొలగించారని నర్సయ్య అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
డీఎఫ్‌వోకు ఫిర్యాదు
ఏళ్ల తరబడి పెంచుకున్న చెట్లను తొలగించడంతో తీవ్రంగా నష్టపోయిన నర్సయ్య నేరుగా జిల్లా అటవీశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా చెట్లను తొలగించిన వారిపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు.
ఫిర్యాదు నేపథ్యంలో ఇందల్వాయి ఎఫ్‌ఆర్‌వో రవి భట్ ఆదేశాల మేరకు అటవీశాఖ రేంజ్, బీట్ అధికారులు సాంపల్లి గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. చెట్ల తొలగింపు వ్యవహారంపై వివరాలను సేకరించారు.
రూ.13,325 జరిమానా
అటవీశాఖ విచారణ అనంతరం అనుమతి లేకుండా వ్యక్తిగతంగా పెంచుకున్న టేకు చెట్లను తొలగించిన వ్యవహారంలో మాసూరి ప్రశాంత్‌కు రూ.13,325 జరిమానా విధించినట్లు అధికారులు నిర్ణయించారు.
అయితే చెట్ల తొలగింపు సమయంలో పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర కూడా అక్కడ ఉన్నారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ, జరిమానా విషయంలో ఆయన పేరును ప్రస్తావించకపోవడంపై నర్సయ్య సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై అటవీశాఖ అధికారులు మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందని గ్రామస్థులు కోరుతున్నారు.
అభివృద్ధి పనులైనా.. నిబంధనలు పాటించాల్సిందే
అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో చెట్లు అడ్డుగా ఉన్నా సంబంధిత శాఖల నిబంధనలు, అనుమతులు పాటించాల్సిందేనని గ్రామస్థులు పేర్కొంటున్నారు. పచ్చదనం పెంచాలని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులే చెట్ల తొలగింపు వ్యవహారంలో జరిమానా ఎదుర్కోవడం చర్చకు దారితీసిందన్నారు.
అధికారిక అనుమతులు, నిబంధనలు పాటించకుండా చెట్లను తొలగిస్తే చర్యలు తప్పవనే విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
    user_M rajeshwar
    M rajeshwar
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజాపాల దినోత్సవం నిర్మల్ మున్సిపల్ కర్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం. . నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మెన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తిల అధ్యక్షతన తెలంగాణ ప్రాజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి, మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి వందన సమర్పణ చేశారు. జాతియ జండా ఆవిష్కరించి జాతీయ గీతం తెలంగాణ గేయాన్ని ఆలపించారు. ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకుని పారదర్శక, జవాబుదారీ, సంక్షేమంతో కూడిన సమర్థవంతమైన పాలన అందించడం, ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పిస్తూ, అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరేలా చేయడమే ప్రజాపాలన ప్రధాన లక్ష్యం అని మున్సిపల్ చైర్మన్ కావ్య తేలిపారు.
    1
    నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజాపాల దినోత్సవం
నిర్మల్ మున్సిపల్ కర్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం. .
నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మెన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తిల అధ్యక్షతన తెలంగాణ ప్రాజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి,  మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి వందన సమర్పణ చేశారు. జాతియ జండా ఆవిష్కరించి జాతీయ గీతం తెలంగాణ గేయాన్ని ఆలపించారు. ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకుని పారదర్శక, జవాబుదారీ, సంక్షేమంతో కూడిన సమర్థవంతమైన పాలన అందించడం,  ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పిస్తూ, అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరేలా చేయడమే ప్రజాపాలన ప్రధాన లక్ష్యం అని మున్సిపల్ చైర్మన్ కావ్య తేలిపారు.
    user_Venu
    Venu
    Nirmal U, Telangana•
    7 hrs ago
  • ప్రెస్ నోట్ తేదీ 17-09-2026 మెదక్ జిల్లా దివ్యాంగులు ఆత్మ గౌరవంతో జీవించాలి --మెదక్ ఎంపీ రఘునందన్ రావు దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలి మెదక్ ఎంపీ రఘునందన్ రావు దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. గురువారం కలెక్టర్లోని సమావేశ మందిరంలో దివ్యాంగుల సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా వికలాంగుల కు ఈ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. మోదీ గారు గత 25 సంవత్సరాల పేద ప్రజలకు ప్రజా సేవ చేస్తున్నారని గుర్తు చేశారు.6 నెలలుగా 461 మంది దివ్యాంగులను గుర్తించి 850 దివ్యంగా సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.దివ్యాంగులు మొన్న జరిగిన గ్లాస్ కో క్రీడల్లో ప్రపంచంలో 4 వ స్థానం సాధించి 39 పథకాలు ఇండియాకు తీసుకొచ్చారని , ఇన్ని పథకాలు ఏ క్రీడలకు కూడా ఇండియాకు రాలేదని, దివ్యాంగులు ఎవరికి తక్కువకాని , ఆత్మవిశ్వాసంతో జీవించాలని అన్నారు.దివ్యాంగులు సమాజంలో గౌరవప్రదంగా, స్వయం ఆధారితంగా జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా అడ్డంకులు లేని, సమగ్ర, సౌకర్యవంతమైన సమాజ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. సహాయ పరికరాల పంపిణీ ద్వారా దివ్యాంగుల చలనశీలత, వినికిడి సామర్థ్యం, దైనందిన కార్యకలాపాల్లో స్వయం ఆధారితత మెరుగుపడటంతో పాటు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ వో అంబాదాస్ రాజేశ్వర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
    1
    ప్రెస్ నోట్ 
తేదీ 17-09-2026
మెదక్ జిల్లా 

దివ్యాంగులు ఆత్మ గౌరవంతో జీవించాలి 
--మెదక్ ఎంపీ రఘునందన్ రావు 

దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలి మెదక్ ఎంపీ రఘునందన్ రావు 
దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. 
గురువారం కలెక్టర్లోని సమావేశ మందిరంలో దివ్యాంగుల సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా వికలాంగుల కు ఈ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. 
మోదీ గారు గత 25 సంవత్సరాల పేద ప్రజలకు ప్రజా సేవ చేస్తున్నారని గుర్తు చేశారు.6 నెలలుగా 461 మంది దివ్యాంగులను గుర్తించి 850 దివ్యంగా సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.దివ్యాంగులు మొన్న జరిగిన గ్లాస్ కో  క్రీడల్లో ప్రపంచంలో 4 వ స్థానం సాధించి 39 పథకాలు ఇండియాకు తీసుకొచ్చారని , ఇన్ని పథకాలు ఏ క్రీడలకు కూడా ఇండియాకు రాలేదని, దివ్యాంగులు ఎవరికి తక్కువకాని , ఆత్మవిశ్వాసంతో జీవించాలని అన్నారు.దివ్యాంగులు సమాజంలో గౌరవప్రదంగా, స్వయం ఆధారితంగా జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 
దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా అడ్డంకులు లేని, సమగ్ర, సౌకర్యవంతమైన సమాజ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ..
సహాయ పరికరాల పంపిణీ ద్వారా దివ్యాంగుల చలనశీలత, వినికిడి సామర్థ్యం, దైనందిన కార్యకలాపాల్లో స్వయం ఆధారితత మెరుగుపడటంతో పాటు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ వో అంబాదాస్ రాజేశ్వర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    2 hrs ago
  • నిజామాబాద్ రాజా రాజేంద్ర చౌరస్తాలో దారుణ హత్య కోరుట్లకు చెందిన హరిబాబును నరికి చంపిన దుండగులు కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో హరిబాబుపై దాడి కారులో వచ్చిన పలువురు వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం హరిబాబుపై కత్తులతో విచక్షణారహితంగా దాడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం హత్య అనంతరం కారులో పరారైన దుండగులు ఐదు నెలల క్రితం భార్య, యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో హరిబాబు నిందితుడు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన హరిబాబు బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్దికాలానికే హరిబాబు హత్య పాత కక్షలే హత్యకు కారణమా? అన్న కోణంలో అనుమానాలు రాజా రాజేంద్ర చౌరస్తాలో హత్యతో కలకలం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుల కోసం పోలీసులు గాలింపు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం
    1
    నిజామాబాద్ రాజా రాజేంద్ర చౌరస్తాలో దారుణ హత్య

కోరుట్లకు చెందిన హరిబాబును నరికి చంపిన దుండగులు


కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో హరిబాబుపై దాడి
కారులో వచ్చిన పలువురు వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం
హరిబాబుపై కత్తులతో విచక్షణారహితంగా దాడి
తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం
హత్య అనంతరం కారులో పరారైన దుండగులు
ఐదు నెలల క్రితం భార్య, యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో హరిబాబు నిందితుడు
ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన హరిబాబు
బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్దికాలానికే హరిబాబు హత్య
పాత కక్షలే హత్యకు కారణమా? అన్న కోణంలో అనుమానాలు
రాజా రాజేంద్ర చౌరస్తాలో హత్యతో కలకలం
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
దుండగుల కోసం పోలీసులు గాలింపు
సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.