తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో ఉచిత యూనిఫామ్‌ల పంపిణీ గజ్వేల్ నియోజకవర్గం సెప్టెంబర్ 15 (ప్రజా ప్రతిభ): మర్కూక్ మండలంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో ప్రభుత్వం సరఫరా చేసిన రెండు జతల ఉచిత యూనిఫామ్‌లు 580 విద్యార్థులకుపంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధికారి వెంకట్ రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ వెంకట్ రాములు మాట్లాడుతూ — ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఎంతో నాణ్యమైన బట్టతో కూడిన యూనిఫామ్‌లను అందించడాన్ని హర్షించారు. అనంతరం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులందరూ ప్రతిరోజూ శుభ్రమైన దుస్తులు ధరించి, క్రమశిక్షణతో పాఠశాలకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల (సెల్ఫ్ ఉద్యోగులు) ప్రతినిధులు కవిత, భాస్కర్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు ఓంకార్, రాధాకృష్ణ, శ్రీనివాస్, తుమ్మ కుమార్, భూపతి రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

- రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా? రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా?2
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి తగ్గిన నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రధాన బుకింగ్ తో రూ.65 వేలు, బ్రేక్ దర్శనాలతో రూ.80,100, VIP దర్శనాలతో రూ.1,12,350, కార్ పార్కింగ్ రూ.1,75,000, ప్రసాద విక్రయాలతో రూ.4,21,770, వ్రతాలతో రూ.55 వేలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,00,486 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1
- శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలో లలిత స్తోత్రం కార్యక్రమం శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద బుధవారం లలిత స్తోత్ర కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, లలిత స్తోత్ర పారాయణం నిర్వహించారు. కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు పలువురు పాల్గొన్నారు.1
- నర్సాపూర్ పట్టణంలో హమరా ప్రసాద్‌పై మాల మహానాడు యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన నర్సాపూర్ పట్టణంలో హమరా ప్రసాద్‌పై మాల మహానాడు యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్‌పై కల్పిత వ్యాఖ్యలతో పుస్తకం రాశారంటూ ఆ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు దాడిగా నరేశ్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కుమార్ ఆరోపించారు. ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అంబేడ్కర్ ఆశయాలను, దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, రచనలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని అన్నారు. ఇలాంటి చర్యలు సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలోని ప్రధాన కూడలిలో ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, యువజన కార్యకర్తలు, స్థానిక దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.1
- సువర్ణ శివలింగ దర్శనంతో రమణేశ్వరంలో భక్తిశోభ రమణేశ్వరం సువర్ణ శివలింగం వద్ద పెరిగిన భక్తుల రద్దీ1
- కాచాపూర్ లో కరెంటు కోతలపై బిఆర్ఎస్ నాయకుల నిరసన కార్యక్రమం బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో కరెంటు కోతలపై బిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వ్యవసాయానికి 18 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కరెంటు కోతల వల్ల రైతుల సాగు చేసిన పంటలు ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని హెచ్చరించారు.1
- రేవంత్ రెడ్డి కుటుంబానికి 38 భూమి ఉంది: హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మా తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్1