ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో SIR డ్రాఫ్ట్ ఓటర్ జాబితా హార్డ్ కాపీలను అందజేసిన కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ బాన్స్ వాడ ఆగస్ట్ 27 ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో SIR 2వ దశ ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితా హార్డ్ కాపీలను ఎల్లారెడ్డి నియోజకవర్గ SIR కోఆర్డినేటర్, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు. ఈ సందర్భంగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని సూచించారు. SIR ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఓటర్లకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో SIR డ్రాఫ్ట్ ఓటర్ జాబితా హార్డ్ కాపీలను అందజేసిన కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ బాన్స్ వాడ ఆగస్ట్ 27 ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో SIR 2వ దశ ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితా హార్డ్ కాపీలను ఎల్లారెడ్డి నియోజకవర్గ SIR కోఆర్డినేటర్, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు. ఈ సందర్భంగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని సూచించారు. SIR ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఓటర్లకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
- నందిపేట్ మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ ఏ.లక్ష్మాన్, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ప్రజల నుంచి 12 ఫిర్యాదులు అందాయని ఎండీఓ తెలిపారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. నేడు వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా తెలిసింది.1
- గుంతల రోడ్డుపై.. నిరసన బాట! డాంబర్ రోడ్డు కోసం 29న పాదయాత్ర.. సన్నాహక సమావేశంలో పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ జిల్లా, నిజాంపేట: మూడేళ్లుగా అధ్వానంగా ఉన్న చల్మెడ కమాన్–నందగోకుల్ రహదారికి డాంబర్ వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న పాదయాత్రకు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రావు, బాల్‌రెడ్డి, రంజిత్‌గౌడ్, దయాకర్, శ్రీకాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.2
- తునికి శివారులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీ నర్సాపూర్–మెదక్ ప్రధాన రహదారి పక్కన తునికి శివారులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్‌ను మండల ప్రత్యేక అధికారి, డీఎల్పీవో సురేష్‌బాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారుల బృందంతో కలిసి హాస్టల్‌లోని వసతులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదులు, వంటశాలను సందర్శించిన ఆయన విద్యార్థులకు తయారు చేస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చదువులో రాణించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సురేష్‌బాబు తెలిపారు.1
- జీపీ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూం ను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి. జీపీ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూం ను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి. గురువారం సిరిసిల్లలోని స్థానిక 12వ వార్డులో జీపీ మోటార్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంను మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు షోరూంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిశీలించి, వాటి పనితీరును, సాంకేతికతను, వినియోగదారులకు అందించే సౌకర్యాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల ఇంధన ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దోహదపడుతుందని ఈ సందర్భంగా అన్నారు . సిరిసిల్ల ప్రజలకు నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తూ, మెరుగైన సేవలు అందించాలని జీపీ మోటార్స్ నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు మొగిలి నాగరాజు, జీపీ మోటార్స్ నిర్వాహకులు, సిబ్బంది, స్థానిక ప్రజలు, వాహన వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.1
- సంగారెడ్డి జిల్లా బీరంగూడ పట్టణ పరిధిలో రాఖీ పండుగ సందర్భంగా వెలసిన రాఖీ స్టాల్స్ అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడలో రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ స్టాల్స్ భారీగా వెలిశాయి. వివిధ రకాల డిజైన్లు, రంగులతో ఆకట్టుకునే రాఖీలు స్టాల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. దీంతో రాఖీలు కొనుగోలు చేసేందుకు మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పండుగ నేపథ్యంలో బీరంగూడలో సందడి వాతావరణం నెలకొంది.1
- వెంకట్రావుపేటలో అధిక లోడుతో లారీలు రాకపోకలు సాగిస్తుండటంపై గ్రామస్థులు ఆందోళన కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటలో అధిక లోడుతో లారీలు రాకపోకలు సాగిస్తుండటంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తునికి శివారులోని ఎస్ఈడబ్ల్యూసీ గోదాముకు ప్రతిరోజూ దాదాపు 100 లారీలు గ్రామం మీదుగా వెళ్తున్నాయని తెలిపారు. భారీ వాహనాల రాకపోకలతో రహదారులు దెబ్బతినడంతో పాటు పైపులైన్లు ధ్వంసమవుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా పాఠశాలల సమీపంలో లారీలు అధిక వేగంతో తిరుగుతుండటంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. లారీల రాకపోకలను నియంత్రించి, అధిక లోడుతో వెళ్లే వాహనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ధర్నా నిర్వహించారు.1
- సిరిసిల్ల ట్రాపిక్ పోలీసులు రక్షాబంధన్ వేడుకల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన. సిరిసిల్ల ట్రాఫిక్ పోలీసులు నేతాజీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో విద్యార్థులతో కలిసి పాల్గొని, రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగించడం, వేగంగా మరియు రాంగ్ రూట్ లో వాహనాలు నడపకపోవడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకపోవడం, మైనర్ డ్రైవింగ్ చేయకపోవడం , మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం వంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించడంతో పాటు తమ కుటుంబ సభ్యుల భద్రతను కూడా కాపాడుకోవచ్చని సూచించారు.రక్షాబంధన్ సందర్భంగా సోదర–సోదరీమణుల అనుబంధంతో పాటు రోడ్డు భద్రత పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అక్కచెల్లెళ్ళు రక్ష బంధన్ సందర్భంగా అన్నతమ్ముళ్లకు హెల్మెట్ బహుమతి ఇచ్చి వాహనం నడిపే సమయల్లో హెల్మెట్ ధరించేలా చూడాలని పిలుపునిచ్చారు.4
- జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పోచమ్మ తల్లి విగ్రహ ఊరేగింపు జిన్నారం, ఆగస్టు 27: పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. భక్తులతో కలిసి ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జిన్నారం ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆగస్టు 30న జరిగే ప్రతిష్ఠా మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.1
- యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు4