Shuru
Apke Nagar Ki App…
ఓబులేసు, సతీష్‌ది హత్య కాదు.. ప్రమాదవశాత్తు మరణమే: ఏఎస్పీ విభూ కృష్ణ బ్రహ్మంగారిమఠం: బి.మఠం పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 14/2026 కేసులో ఓబులేసు, కోడూరు సతీష్‌ల మృతి హత్య కాదని, ప్రమాదవశాత్తు జరిగిన మరణమేనని ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ స్పష్టం చేశారు. మాదిగ దండోరా నాయకుల సుదీర్ఘ ఆందోళన నేపథ్యంలో అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సంఘటనా స్థల ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజ్, పోస్టుమార్టం, ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాలతో పాటు జలవనరుల శాఖ సాంకేతిక నివేదికలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఏఎస్పీ తెలిపారు.
VEMULURIMALAKONDAIAH
ఓబులేసు, సతీష్‌ది హత్య కాదు.. ప్రమాదవశాత్తు మరణమే: ఏఎస్పీ విభూ కృష్ణ బ్రహ్మంగారిమఠం: బి.మఠం పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 14/2026 కేసులో ఓబులేసు, కోడూరు సతీష్‌ల మృతి హత్య కాదని, ప్రమాదవశాత్తు జరిగిన మరణమేనని ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ స్పష్టం చేశారు. మాదిగ దండోరా నాయకుల సుదీర్ఘ ఆందోళన నేపథ్యంలో అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సంఘటనా స్థల ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజ్, పోస్టుమార్టం, ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాలతో పాటు జలవనరుల శాఖ సాంకేతిక నివేదికలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఏఎస్పీ తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి1
- దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.1
- హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.1
- మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.1
- రైతులు ఉధ్యాన పంటలపై మెగ్గు చూపాలి:రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలపై మెగ్గు చూపాలని రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఉద్యాన పంటలను సందర్శించారు. అనంతరం రైతులు వేసిన అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్, ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి, మామిడి, అన్న యాపిల్ పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో పంటల సాగు, పద్ధతులు, మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా సూక్ష్మ సేద్య సాగు అధికారిణి విజయలక్ష్మి , నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరేంద్ర, రైతులు హుస్సేన్, హుస్సేన్ రెడ్డి,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.1
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ బండి ఆత్మకూరు మండలం జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.1
- నెల్లూరు నగరంలో మీలాడినవి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్టా నుండి గాంధీ బొమ్మ వరకు భారీ బహిరంగ ర్యాలీ ముస్లిం సోదరులు అందరు కూడా కలిసి ముస్లిం సోదరులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రశాంత ర్యాలీ కొనసాగించారు, ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మద్దతు తెలియజేశారు అదే క్రమంలో ముస్లిం సోదరులందరికీ కూడా తమ మత ప్రవక్త జయంతి సందర్భంగా ఇటువంటి వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది తెలియజేశారు, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు అంతా కూడా పాల్గొని విజయవంతంగా కొనసాగించారు, ఈ ర్యాలీ దాదాపు కోటమిట్ట గాంధీ బొమ్మ జెండా వీధి పరిసర ప్రాంతాలలో సాయంత్రం 8 నుండి 9:30 వరకు కొనసాగించారు, ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియజేశారు, ఇటువంటి ఆటంకాలు జరగకుండా పోలీసు వారు కట్టుదిట్టమైనటువంటి చర్యలను ఏర్పాటు చేశారు, పండు వాతావరణం తలపించే విధంగా కోలాహలంగా ఈ ర్యాలీని ప్రశాంతంగా కొనసాగించారు, ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులందరికీ కూడా మద్దతుగా క్రిస్టియన్ మతానికి సంబంధించిన సోదరులందరూ భారతీయ జెండాను చేపట్టి సంఘీభావం తెలిపారు.1
- గాజుల పల్లెలో బంతిపూల సాగు.. లాభాలు బాగు..ఉద్యాన పంటలపై ఆసక్తి రైతులు వరి, ఇతర పంటల సాగుతో పాటు ఉద్యాన పంటలపై ఆసక్తి చూపుతున్నారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో రైతు హుస్సేన్ రెడ్డి బిందు సేద్యం, విడ్ మ్యాట్ ద్వారా నాలుగు ఎకరాల పొలంలో బంతి పూలు, మూడు ఎకరాల్లో గులాబీ పూలు సాగుచేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఎకరాకు సుమారు 4 టన్ను పూలు దిగుబడి వస్తాయని.. బంతి సాగు వల్ల మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు రైతు తెలిపారు.1