Shuru
Apke Nagar Ki App…
మెదక్ : ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి కొల్చారం మండలం రాంపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురిని అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టినట్లు సమాచారం. ఢీ కొన్న ప్రభావంతో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
MERCY
మెదక్ : ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి కొల్చారం మండలం రాంపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురిని అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టినట్లు సమాచారం. ఢీ కొన్న ప్రభావంతో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం. మాజీ డిప్యూటీ స్పీకర్ యం.పద్మ దేవేందర్ రెడ్డి..మెదక్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం అపారమని కొనియాడారు. దేశ స్వపరిపాలనకు ఆదర్శంగా నిలిచేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దూరదృష్టి గల నాయకుడని తెలిపారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టడంతో పాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.అంబేద్కర్ ఆశయాలతో నవ సమాజ నిర్మాణానికి కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అకిరెడ్డి.కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు,న్యాయవాది జీవన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్,సంధ్య నవీన్, ఉదయ్ కుమార్,గౌస్,సోహెల్, జుబేర్ అహ్మద్, మహిళా నాయకురాలు అంకం.చంద్రకళ రాధ,నాయకులు, కిష్ట గౌడ్, అంజ గౌడ్, కిష్టయ్య, విశ్వం,లింగా రెడ్డి, ప్రభు రెడ్డి,కిషన్, మాయ. మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, ఏనుగుల రాజు, సునీల్,రవి లక్ష్మీనారాయణ,దశరథం,ఇందాడ్,సంతోష్ ,వెంకట్,ఆంజనేయులు,ప్రభాకర్ ,లక్ష్మణ్,కిషన్,మోహన్,ఇస్మాయిల్, రవి తదితరులు పాల్గొన్నారు.1
- అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకొని మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్స్ మన్సూర్, తొడుపునూరి రామకృష్ణ, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1
- పత్రిక ప్రకటన తేది: 13-04-2026 కామారెడ్డి జిల్లా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 135 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలపై తమ వినతిపత్రాలను సమర్పించగా, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి, వేగవంతమైన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, మేడంమోహన్, సీఈఓ జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.1
- నేటి యువతరం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 165 వ జయంతి సందర్భంగా సంగారెడ్డి లోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, మున్సిపల్ చైర్మన్ కూన వనిత, గ్రంథాల సంస్థ చైర్మన్ అంజయ్య ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి పాల్గొన్నారు.1
- Post by Vishwamber Rao1
- సంగారెడ్డిలో మహిళ రిజర్వేషన్ బిల్ పై హర్షం వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడిన సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి1
- భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అధికారులతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని మరియు కూడలిని పరిశీలించారు.ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించబోయే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలోని మున్సిపల్ ద్వారా నిర్వహించాల్సిన వాటర్ ఫౌంటెంట్ మరియు ఇతర నిర్వహణ పనులలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని మరియు అంబేద్కర్ చౌరస్తా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ దార్నం అరుణ లక్ష్మీనారాయణ, మున్సిపల్ డిఈ వాని , ఏఈ నరసింహస్వామి , అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సంఘం అధ్యక్షులు కత్తెర దేవదాస్ మరియు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు..1
- పత్రిక ప్రకటన తేది :13. 04.2026 కామారెడ్డి జిల్లా సోమవారం Arrive Alive” అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం ఏప్రిల్ 13 నుంచి కామారెడ్డి జిల్లాలో విస్తృత కార్యక్రమాలు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. పోలీస్, రవాణా, ఆర్ & బి, విద్య, వైద్య శాఖల సమన్వయంతో “Arrive Alive” ఇతివృత్తంతో ఏప్రిల్ 13 నుండి 18 వరకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగవాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కలెక్టర్ చాంబర్ లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రణాళికలో భాగంగా చేపట్టే అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పాదచారులు, వాహనదారులకు రహదారి భద్రతపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సంబంధిత శాఖల అధికారులు తమ పూర్తి శక్తి సామర్థ్యాలతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.1