Shuru
Apke Nagar Ki App…
టేక్మాల్ మండలంలో ఘనంగా మీలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు టేక్మాల్‌లో ఘనంగా మీలాద్ ఉన్ నబీ ఉత్సవాలు టేక్మాల్: మండల కేంద్రంలో మీలాద్ ఉన్ నబీ ఉత్సవాలను ముస్లిం మైనారిటీలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు ప్రవక్త మహమ్మద్ ప్రవచించిన శాంతి, సోదరభావం, మానవత్వం వంటి సందేశాలను ప్రజలకు వివరించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, మత పెద్దలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పలు ఏర్పాట్లు చేశారు. మత సామరస్యాన్ని కాపాడుతూ మీలాద్ ఉన్ నబీ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించారు.
ఓంప్రకాశ్ గౌడ్
టేక్మాల్ మండలంలో ఘనంగా మీలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు టేక్మాల్‌లో ఘనంగా మీలాద్ ఉన్ నబీ ఉత్సవాలు టేక్మాల్: మండల కేంద్రంలో మీలాద్ ఉన్ నబీ ఉత్సవాలను ముస్లిం మైనారిటీలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు ప్రవక్త మహమ్మద్ ప్రవచించిన శాంతి, సోదరభావం, మానవత్వం వంటి సందేశాలను ప్రజలకు వివరించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, మత పెద్దలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పలు ఏర్పాట్లు చేశారు. మత సామరస్యాన్ని కాపాడుతూ మీలాద్ ఉన్ నబీ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించారు.
More news from తెలంగాణ and nearby areas
- “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపణ యూరియా కోసం వెళ్లిన రైతులకు అదనపు ఎరువుల భారం తప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుక్ చేసుకున్న యూరియాతో పాటు మరో ఎరువును తప్పనిసరిగా కొనుగోలు చేయాలని డీలర్లు ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిప్పలతుర్తిలో ఓ దుకాణదారుడు రైతులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలిపారు. అంతేకాకుండా, “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. రైతుల ఫిర్యాదులపై వ్యవసాయ శాఖ డీఏ, ఎంఓలు స్పందించారు. యూరియాతో పాటు ఇతర ఎరువులను బలవంతంగా అంటగట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- *కోర్టు పరిధిలో భూమి..! కబ్జాలోకి ఎలా వచ్చింది.?* *ఈదులనాగులపల్లిలో సర్వే నంబర్లు 134, 135పై రైతుల ఆందోళన* *తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తారంటున్న రైతులు* *కోర్టు పరిధిలో ఉన్న భూములలొ జేసీబీలతో రోడ్డు పనులు ఎలా చేస్తారు* *రియల్ వ్యాపారుల పనులను అడ్డుకున్న గ్రామస్తులు* *అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతుల ప్రశ్న* *తహసీల్దార్‌కు ఫిర్యాదు.. కలెక్టర్‌ను కలవనున్న గ్రామస్తులు* *భూముల రక్షణ కొరకు కార్యాచరణ కమిటీ ఏర్పాటు* *రోడ్డు పనులకు అనుమతులు ఎవరు అనుమతులు ఇచ్చారు* *కోర్టు వివాదం నడుస్తుండగానే పనులెలా సాగిస్తారు* తమ భూములు తమకు దక్కేవరకు పోరాటం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామ రైతులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, ఈదులనాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లోని భూములపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థాన పరిధిలో ఉండగానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడం రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు చేపట్టేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారులు జేసీబీలతో భూమి చుట్టూ మట్టి రోడ్డు వేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటికే కొంత దూరం వరకు మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో వివాదం కొనసాగుతున్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు, రోడ్డు పనులు, ఇతర మార్పులు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రైతులు ఆర్‌సీ పురం తహసీల్దార్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆమె ఇది తన పరిధిలోకి రాదని తప్పించుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు జరుగుతున్న అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, భూముల రికార్డులు, కోర్టు కేసు వివరాలను పరిశీలించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. వివాదాస్పద భూములను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. భూముల పరి రక్షణ కోసం కార్యచరణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి పోరాట కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో రియల్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడంపై అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోని భూములలో రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? రికార్డులను పరిశీలించకుండానే పనులు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, రికార్డులు, కోర్టు కేసు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే తమ భూమి తమకు దక్కేవరకు పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.3
- కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు” కామారెడ్డి: రక్తదాన సేవల్లో విశేష కృషి చేస్తున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త అందజేశారు. డాక్టర్ బాలు 2007 సంవత్సరం నుంచి నిరంతరం రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ, తాను వ్యక్తిగతంగా 84 సార్లు రక్తదానం చేయడంతో పాటు, తలసేమియా బాధిత చిన్నారుల కోసం సుమారు 6,000 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. అలాగే ఇప్పటివరకు 25 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేకమందికి సకాలంలో రక్తాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విశిష్ట సేవలను గుర్తించిన వాసవి ఆర్ట్ థియేటర్స్ చైర్మన్ డాక్టర్ నీల శ్రీధర్ “వాసవి నవరత్న అవార్డు”ను ప్రకటించారు. ఈ అవార్డును ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త చేతుల మీదుగా డాక్టర్ బాలుకు అందజేశారు. ఈu సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ నీల శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, “2007 నుంచి రక్తదాన సేవలను కొనసాగిస్తున్నాను. ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో రక్తాన్ని అందించగలగడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది” అని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా రక్తదాన సేవలను విస్తృతంగా నిర్వహించి, సుమారు 100 యూనిట్ల ప్లాస్మా, 1,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి బాధితులకు అందించినట్లు తెలిపారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అత్యవసర సమయంలో రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రత్యేకంగా తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరమవుతుందని, వారి జీవితాంతం రక్తం అవసరమయ్యే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు మరింత విస్తృతంగా రక్తదాన శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రక్తదానం ఒక గొప్ప మానవతా సేవ అని, ఒక వ్యక్తి చేసే రక్తదానం మరొకరి కుటుంబానికి ప్రాణాధారంగా మారుతుందని డాక్టర్ బాలు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి, అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. తన రక్తదాన సేవలకు సహకరిస్తున్న రక్తదాతలు, శ్రేయోభిలాషులు, వాసవి సంస్థ ప్రతినిధులు, సామాజిక సేవకులు మరియు మీడియా ప్రతినిధులకు డాక్టర్ బాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. “రక్తదానం చేద్దాం – ప్రాణాలను కాపాడుదాం” అనే మానవతా సందేశంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- కస్తూర్బా పాఠశాలలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు...... ......... చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మదీనా మసీదు కమిటీ, మైనారిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు స్వీట్లు, నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, ప్రేమ మార్గంలో నడవాలని, చదువుతో పాటు మంచి విలువలను పెంపొందించుకోవాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో జాకీర్, జాంగీర్, మైముద్, ఫారూక్, ఎండీ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.1
- మల్కాజ్‌గిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, స్వామివారి దర్శనానికి స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు.1
- కొండా సుష్మిత అదెవతి... దానికెందుకు ఇస్తాం మేము టికెట్.. మా పార్టీకే సంబంధం లేదు.. మా పార్టీలో సభ్యత్వం లేదు.. కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం. కొండా సుష్మిత అదెవతి... దానికెందుకు ఇస్తాం మేము టికెట్.. మా పార్టీకే సంబంధం లేదు.. మా పార్టీలో సభ్యత్వం లేదు.. కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం.1
- మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునేందుకు లబ్ధిదారులు చౌకధరల దుకాణాల వద్ద బారులు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునేందుకు లబ్ధిదారులు చౌకధరల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో రేషన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. మరోవైపు సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొందరు డీలర్లు టోకెన్ల విధానాన్ని అనుసరిస్తూ లబ్ధిదారులకు బియ్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. మూడు నెలల కోటా కావడంతో రేషన్ దుకాణాల వద్ద రద్దీ మరింత పెరిగింది. సర్వర్ సమస్యను త్వరగా పరిష్కరించి, అందరికీ ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.1