షాద్‌నగర్ పై పీవీఆర్ ఫోకస్... బీజేపీ టికెట్‌పై ఆశలు కేశంపేట: షాద్‌నగర్ నియోజకవర్గ రాజకీయాల్లో పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి (పీవీఆర్) పేరు ఆసక్తికరంగా మారుతోంది. బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆసక్తితో నియోజకవర్గంలో తన రాజకీయ కార్యకలాపాలను విస్తరించేందుకు పీవీఆర్ ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పనిచేయడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతుల సమస్యలకు పరిష్కారం చూపడం, విద్యా–వైద్య సదుపాయాలను బలోపేతం చేయడం తన లక్ష్యాలుగా ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ సమస్యలపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. బీజేపీని గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యకర్తలు, యువతతో సమన్వయం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పీవీఆర్‌కు టికెట్ దక్కుతుందా లేదా అన్నది బీజేపీ అధిష్ఠానం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ భారతరత్న మదర్ థెరిస్సా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆమె మార్గంలో నడిచి సేవాకార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్, రేమండ్ హార్ ఉడ్, నరేష్, డెంజిల్, ప్రభు, ఆంథోనీ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.1
- ANS Comfort Mattresses Manufacturers in Hyderabad Call Now: 9912524242 Orthopedic Mattresses Mattresses Manufacturers company #Hyderabad sleep mattress manufacturers1
- భూములను నిషేధిత జాబితాలో ఎవరు పెట్టమన్నారు: హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలి ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది * మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- మల్కాజ్‌గిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, స్వామివారి దర్శనానికి స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు.1
- బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యాలయం ఎదుట బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న దేశపాండేకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. షామీర్‌పేట్ నివాసంలో దేశపాండేను కలిసిన ఈటల, బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందించాలని కోరారు. పేద బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు.1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- జమ్మిగడ్డలో గార్డెన్ల తొలగింపునకు కాలనీ వాసుల స్వచ్ఛంద నిర్ణయం జమ్మిగడ్డ సాయిలోక్ కాలనీలో ఇరుకైన రోడ్లపై ఇళ్ల ముందు ఏర్పాటు చేసిన గార్డెన్లతో వాహనాలు, అంబులెన్సుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కాలనీ అసోసియేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అధ్యక్షుడు ఎన్. శంకర్, జనరల్ సెక్రటరీ ఎన్. సురేష్ ఆధ్వర్యంలో గార్డెన్ల తొలగింపు డ్రైవ్ ప్రారంభించారు. అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దల సూచనతో పలువురు తమ ఇళ్ల వద్ద గార్డెన్లను స్వచ్ఛందంగా తొలగించారు. ఇతర కాలనీలు కూడా ఇదే విధంగా ముందుకు రావాలని కోరారు.1