Shuru
Apke Nagar Ki App…
ప్రజలకు సౌకర్యార్థం గ్రామంలోనే చౌకధరల దుకాణం ఏర్పాటు - ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇచ్చొడ మండలంలోని ఆడిగామ (బి) గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో శబరిమాత ఆలయం వద్ద నూతనంగా బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గ్రామస్తుల సౌకర్యార్తమే గ్రామంలో చౌకధరల దుకాణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
AlluriMahesh
ప్రజలకు సౌకర్యార్థం గ్రామంలోనే చౌకధరల దుకాణం ఏర్పాటు - ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇచ్చొడ మండలంలోని ఆడిగామ (బి) గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో శబరిమాత ఆలయం వద్ద నూతనంగా బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గ్రామస్తుల సౌకర్యార్తమే గ్రామంలో చౌకధరల దుకాణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- Post by Solanke Ravi4
- జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు టెన్త్ విద్యార్థులు చేరుకుంటున్నారు. అధికారుల సూచనల మేరకు శనివారం ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు బయలుదేరి వచ్చారు. ఈ సందర్భంగా తమ హాల్ టికెట్ నెంబర్లను సరిచూసుకొని వారి కేటాయించిన పరీక్ష గదులలోకి వెళ్తున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.1
- కామారెడ్డి చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం 500 కోట్లతో, అలాగే CRIF (సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్టియర్ ఫండ్) కింద 50 కోట్ల నిధులు కేటాయించాలని *కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి* నితిన్ గడ్కారీ గారిని కలిసి విన్నవించిన కామారెడ్డి *శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* గారు ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేయటం జరిగింది.. గతంలో 550 కోట్ల రూపాయల వ్యయంతో 54 కిలోమీటర్ల పొడవు తో కామారెడ్డి చుట్టు ఔటర్ రింగు రోడ్డు విషయమై గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గారిని కలసి స్థల పరిశీలన మరియు వ్యయం ప్రణాళికలు చేయాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన రహదారుల పొడిగింపు, అభివృద్ధి గురించి మరియు నూతన రహదారుల ఏర్పాటు గురించి సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్టియర్ ఫండ్ కింద లింగపూర్ నుండి టెక్రియల్ వరకు 50 కోట్ల నిధులు కేటాయించాలని మంత్రి గారికి విన్నవించినట్టు తెలిపారు. రింగు రోడ్డు పనుల ప్రణాళిక వేగవంతం చేయటానికి అధికారులకు ఆదేశించినట్టు, 50 కోట్ల నిధుల కేటాయింపు విషయమై కూడా సానుకులంగా స్పందించినట్టు తెలిపారు.1
- మండేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18,19వ తేదీల్లో నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల కళ్యాణం మహోత్సవంలో సిద్ధోగం లో భాగంగా శ్రీ ఎల్లమ్మ తల్లి వారి ఉత్సవ విగ్రహం మరియు గడపవనం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఇంటికి రాగా వారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి ఘన స్వాగతం పలుకుతూ వారి ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల అధ్యక్షులు వంకాయల కార్తీక్ గారు, మండపల్లి గ్రామం పెద్దలు బండి భూమయ్య, గుర్రపు మల్లేశం, వెంకట నరసయ్య మొదలగు వారు పాల్గొన్నారు.1
- గత కొంతకాలంగా కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తో కాలం చెల్లిందా అంటే ఔననే సమాధానం వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. 40 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్న తనకు పార్టీని వీడాలంటే బాదేస్తుందని తెలిపారు. తనతో పాటు అనుచరులు బాధపడుతున్నారని చెప్పారు. త్వరలోనే అందరితో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలుగు నూతన సంవత్సరంలో కొత్త విషయం వింటారని తన మనసులోని మాట చెప్పారు. బిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. జగిత్యాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస ఓటమిలను చవిచూశారు. జీవన్ రెడ్డిని పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆవేదనతో ఆందోళనలో ఉన్నారు.2
- మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు స్పాట్ డెడ్ మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ వద్ద నేషనల్ హైవే 765 డీ పై బైక్ ఘోర రోడ్డు ప్రమాదం. నర్సాపూర్ వైపు నుంచి మెదక్ వైపు వెళ్తున్న బైక్ మెదక్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్ టీ సీ బస్ డీ కొని ముగ్గురు మృతి. మృతులు హవేలీ ఘనపూర్ మండలం బూర్గుపల్లి కి చెందిన తండ్రి కొడుకులు అమృత్ గౌడ్ (51), రిశివర్ధన్ గౌడ్ (13), బొగడ భూపతి పూర్ కు చెందిన సాయ గౌడ్ (32) గా గుర్తింపు.1
- బోథ్ మండలంలోని పట్నాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరు అయిన రూ. 2 కోట్ల 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరతరగతిన పూర్తి చేసి ప్రజలు తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- ఆత్మవిశ్వాసంతో టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఐద్వా మహిళా సంఘం జన్నారం మండల అధ్యక్షురాలు పోతు విజయశంకర్ కోరారు. టెన్త్ పరీక్షల నేపథ్యంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి పదో తరగతి పరీక్షలు మైలురాయి వంటివి అన్నారు. భవిష్యత్తు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా వెళ్లేందుకు టెన్త్ పరీక్షలు నిచ్చెనగా ఉపయోగపడతాయన్నారు. పిల్లల భవిష్యత్తును బాగుండాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారని, వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉంటుందన్నారు. పరీక్షలను కష్టంగా కాకుండా ఇష్టపడి బాగా రాస్తే మంచి ర్యాంకు సాధించడం ఖాయమన్నారు. శనివారం నుండి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.1
- కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని నర్సరీ పనులను పరిశీలించిన డీఎల్పీఓ, జుక్కల్ ఉపాధి హామీ నర్సరీని జిల్లా పంచాయతీ అధికారి ప్రసాద్ శనివారం సందర్శించి, సాగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎండల తీవ్రత దృష్ట్యా నర్సరీలోని మొక్కలు, నారుమడులను ప్రతిరోజూ నీటితో సంరక్షించాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మారుతికి సూచించారు. కూలీల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.1