నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నాఖా బందీ నిర్వహించి ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండతో పాటు ప్రధాన పట్టణాలు, జాతీయ రహదారులు, రద్దీ కూడళ్లు, అనుమానాస్పద ప్రాంతాలు మరియు రాత్రి వేళల్లో యువకుల గుంపులు ఎక్కువగా తిరిగే ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా 47 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి ఈ విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు మరియు ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, నంబర్ ప్లేట్లను పరిశీలించడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్లు మార్పులు చేసిన వాహనాలు, నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే మొత్తం 738 వాహనాలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలను నమోదు చేశారు. నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వాహనాల కదలికలపై కూడా పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారు, రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అదేవిధంగా యువత చట్టాలను గౌరవించి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించిన ఎస్పీ, రోడ్లపై స్టంట్లు చేయడం, అధిక శబ్దాలతో వాహనాలు నడపడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలపై వెంటనే సమాచారం అందించాలని, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నాఖా బందీ నిర్వహించి ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండతో పాటు ప్రధాన పట్టణాలు, జాతీయ రహదారులు, రద్దీ కూడళ్లు, అనుమానాస్పద ప్రాంతాలు మరియు రాత్రి వేళల్లో యువకుల గుంపులు ఎక్కువగా తిరిగే ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా 47 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి ఈ విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు మరియు ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, నంబర్ ప్లేట్లను పరిశీలించడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్లు మార్పులు చేసిన వాహనాలు, నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే మొత్తం 738 వాహనాలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
అదేవిధంగా రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలను నమోదు చేశారు. నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వాహనాల కదలికలపై కూడా పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారు, రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అదేవిధంగా యువత చట్టాలను గౌరవించి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించిన ఎస్పీ, రోడ్లపై స్టంట్లు చేయడం, అధిక శబ్దాలతో వాహనాలు నడపడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలపై వెంటనే సమాచారం అందించాలని, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలం కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా, మెదక్ జిల్లా కొల్చారం ప్రాంతానికి చెందిన శ్రీ మాధవానంద సరస్వతి స్వామి అక్కడికి విచ్చేశారు. కాళేశ్వరం చేరుకున్న స్వామివారు సరస్వతి నదిలో పుణ్యస్నానం ఆచరించారు. పుణ్యస్నానం అనంతరం, శ్రీ మాధవానంద సరస్వతి స్వామి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని, పార్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆశీర్వాద మండపంలో అర్చకులు, అధికారులు, భక్తులకు స్వామివారు ఆశీర్వచనాలు అందజేశారు. సరస్వతి అంత్య పుష్కరాల వేళ, మాధవానంద సరస్వతి స్వామి భక్తి శ్రద్ధల మధ్య ఆలయ దర్శనాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే, గోదావరి పరివాహక ప్రాంతంలోని దేవాలయాలను ₹1000 కోట్ల నిధులతో అభివృద్ధి చేయడానికి కార్యాచరణను రూపొందించినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. అలాగే, భద్రాచల దేవస్థానంలో కూడా ₹350 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించామని తెలిపారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభమై, పుష్కరాల సమయం నాటికి పూర్తి చేయబడతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ₹100 కోట్లు ఇస్తామని చెప్పి, కనీసం ₹100 పైసలు కూడా ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ప్రభుత్వమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.1
- కూసుమంచి మండల కేంద్రంలోని చారిత్రక శ్రీ గణపేశ్వరాలయ (శివాలయం) అభివృద్ధి పనులకు ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్ల 30 లక్షల 50 వేల నిధులతో చేపట్టనున్న ఈ పనులు ఆలయ పూర్వ వైభవాన్ని పెంపొందించేలా, భక్తులకు సకల వసతులు కల్పించేలా ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.1
- సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ పట్టణ సమీకృత కార్యాలయ సముదాయంలో ఆదివారం గజ్వేల్ నియోజకవర్గ మహిళలకు కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల నుండి 1053 మంది కళ్యాణ లక్ష్మి, 56 మంది షాది ముబారక్ లబ్ధిదారులకు మొత్తం 11 కోట్ల 9 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. దీనితో పాటు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కాటమయ్య కిట్లను కూడా మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని, ముఖ్యంగా పేదల సంక్షేమం కోసం పని చేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు పిల్లలకు ఉదయం అల్పాహారం అందిస్తున్నామని, ఇంటర్ కళాశాలల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేయించామని, అలాగే 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా స్కూల్‌ను స్థాపించి నిరుపేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించనున్నామని పేర్కొన్నారు. వైద్యం విషయంలో, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ మరియు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల ద్వారా రోగులకు భరోసా కల్పించామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేసి, అక్కడ చదువుతున్న పిల్లలకు 2000 రూపాయల స్టైఫండ్ అందిస్తున్నామని, మంచి శిక్షణతో పాటు జర్మన్ భాష నేర్పించి ఆయా దేశాల్లో ఉద్యోగాలు చేయించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 3500 స్లాబ్ లెవెల్ నిర్మాణాలు మంజూరయ్యాయని, ఈ ప్రగతి విజయవంతంగా కొనసాగుతోందని అధికారులను అభినందించారు. వచ్చే నెల రోజుల్లో నియోజకవర్గానికి మరో 2500 ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజాపాలన ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరుపేద కుటుంబాలకు మేలు చేసేందుకు సంక్షేమ పథకాలన్నీ సమర్థవంతంగా పని చేస్తున్నాయని తెలిపారు. రబీ సీజన్‌లో ఊహించిన దానికంటే 30% ఎక్కువ ధాన్యం రావడంతో కొనుగోలు సమస్యలు తలెత్తాయని, అయితే అన్ని సమస్యలను పరిష్కరించి, రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. జిల్లాలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగిందని, ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యే మహిళలు ఇందిరమ్మ చీరలు ధరించి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె హైమావతి మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడానికి అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని, అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో ఉందని, మంజూరైన ప్రతి ఇంటిని పూర్తి చేసేలా అధికారులు పని చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను బలోపేతం చేయడానికి మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం పథకం కూడా అమలు చేస్తుందని తెలిపారు. ఏంఎల్ సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాలని లబ్ధిదారులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత వహించి, అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు గజ్వేల్ పట్టణంలో బస్ బేను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకున్నామని, ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్‌ను కూడా పూర్తి చేయించాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ చంద్రకళ, మున్సిపల్ చైర్మన్ చందన, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వివరాలను జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సిద్దిపేట జిల్లా వారు జారీ చేశారు.1
- ఘాజీపూర్‌లో జరిగిన ఒక దారుణ సంఘటనలో, రాత్రి వేళ ఒక యువకుడిని కాల్చి చంపారు. ఈ హత్య కేసు నేపథ్యంలో, పోలీసులు అత్యంత అప్రమత్త మోడ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు, ఘాజీపూర్ పోలీసులు, వారణాసి జోన్ పోలీసులు, డిఐజి వారణాసి, ఎస్‌పి ఘాజీపూర్‌లతో సహా మొత్తం పోలీసు బలగం నేర పరిశోధనలో నిమగ్నమై ఉంది. ప్రత్యేక బృందాలు, ఎన్‌కౌంటర్ బృందాలను రంగంలోకి దించి, శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేయాలని, బాధితుడికి న్యాయం జరగాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.1
- ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకొని ఖమ్మంలో ఉచిత మెగా వైద్య శిబిరం, మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఖమ్మం కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఉచిత మెగా వైద్య శిబిరం, మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు యావత్ దేశానికే మార్గదర్శకంగా నిలిచాయని, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ప్రారంభించిన రెండు రూపాయలకు కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాల వంటి సంక్షేమ పథకాలు అన్ని రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలిచాయని మంత్రి గుర్తుచేశారు. ఎన్టీఆర్ స్పూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రామరాజ్యం, ఇందిరమ్మ రాజ్యాన్ని కలిపి ప్రజాపాలనను అందిస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిత్యం తపించిన మంచి మనసున్న నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన అభివర్ణించారు. ఎన్టీఆర్ దీవెనలతో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసిన కమ్మ మహాజన సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు.1
- తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నాయకులలో నాయిని నరసింహారెడ్డి పాత్ర ఎంతో విశిష్టమైనదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. కేసీఆర్ పిలుపునివ్వగానే, నాయిని ఎటువంటి సంశయం లేకుండా అమెరికాలో ఉండగానే తమ పదవికి రాజీనామా చేశారని దేశపతి శ్రీనివాస్ గుర్తుచేసుకున్నారు. ఉద్యమానికి నాయిని చేసిన సేవలను గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరు పెట్టి గౌరవించిందని దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. నాయిని నరసింహారెడ్డి తెలంగాణ ఉద్యమానికి అంకితమైన గొప్ప నేత అని ఆయన స్పష్టం చేశారు.1
- వరంగల్ క్రిస్టియన్ కాలనీలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్‌లో కోటి రూపాయల ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఆధునిక సౌండ్ సిస్టం, నూతన భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. మంత్రి కొండా సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుతో కలిసి ఈ ప్రారంభోత్సవం చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ అభివృద్ధి పనులు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రార్థనా కార్యక్రమాలను మరింత సౌకర్యవంతంగా నిర్వహించేందుకు ఈ సౌండ్ సిస్టం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చర్చ్ సీనియర్ పాస్టర్ పుల్లా జగ్జీవన్ బాజ్జి, కమిటీ ప్రతినిధులు, క్రైస్తవ సమాజ సభ్యులు పాల్గొన్నారు.1
- ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో గల శ్రీ గణపేశ్వర ఆలయం అభివృద్ధి పనులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ఆలయ అభివృద్ధి కోసం 3 కోట్ల 72 లక్షల రూపాయలను కేటాయించి శ్రీకారం చుట్టారు. ఈ అభివృద్ధి పనులలో భాగంగా ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, ఆలయ శిఖరం, మరియు మరికొన్ని మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామ్ సహాయం రఘురామిరెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా నాయకులు, కూసుమంచి సర్పంచ్ కృష్ణవేణి, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1