Shuru
Apke Nagar Ki App…
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దాం: కలెక్టర్ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం ఆర్మూర్ మండలం పిప్రిలో జరిగిన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడారు. అరైవ్-అలైవ్ కార్యక్రమాల ఔన్నత్యాన్ని గుర్తిస్తూ ప్రతి ఒక్కరూ భాగస్వాములై, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తమవంతు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
Chinna
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దాం: కలెక్టర్ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం ఆర్మూర్ మండలం పిప్రిలో జరిగిన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడారు. అరైవ్-అలైవ్ కార్యక్రమాల ఔన్నత్యాన్ని గుర్తిస్తూ ప్రతి ఒక్కరూ భాగస్వాములై, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తమవంతు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
More news from తెలంగాణ and nearby areas
- Post by Vishwamber Rao1
- కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరూ లేని తాళాలు వేసిన ఇండ్లను ఎంచుకున్నారు. 6 ఇండ్లలో తాళాలు పగులగొట్టి చోరి కి పాల్పడ్డారు. ఒ వృద్ధురాలి ఇంట్లో పెన్షన్,రైతు బంధు డబ్బులు 12 వేలు ఎత్తుకెళ్లగా మరో ఇంట్లో 23 వేలు 20 తులాల వెండి,తులం నర బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇంటికి తాళాలు వేసి వెళ్తే డబ్బులు విలువ అయిన వస్తువులు వెంబడ తీసుకు వెళ్లలని ఆటోకు మైకు పెట్టీ గ్రామాల్లో పోలీసులు ప్రచారం చేసిన కూడా ఇండ్లనే టార్గెట్ చేస్తున్నారు దొంగలు.1
- పత్రిక ప్రకటన తేది: 13-04-2026 కామారెడ్డి జిల్లా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 135 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలపై తమ వినతిపత్రాలను సమర్పించగా, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి, వేగవంతమైన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, మేడంమోహన్, సీఈఓ జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.1
- మెట్‌పల్లి, ఏప్రిల్ 13: మెట్‌పల్లి డిపోలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జాతీయ రోడ్డు భద్రత–2026 కార్యక్రమాన్ని డిపో ఎస్‌టీఐ టి. ప్రమీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం డిపో నుంచి పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ ఏ. రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ పి. కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం డీఎస్పీ రాములు మాట్లాడుతూ, ఒక ప్రైవేట్ వాహనం సరుకులు తీసుకెళ్తే అవి పాడవుతాయని, కానీ బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరి ప్రాణ భద్రత డ్రైవర్ చేతుల్లో ఉంటుందని తెలిపారు. అందువల్ల డ్రైవర్లు అత్యంత జాగ్రత్తగా, బాధ్యతతో వాహనం నడపాలని సూచించారు.అనంతరం డిపో నుండి పాత బస్టాండ్ వరకు డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ, భద్రతా సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మెకానిక్ సూపర్వైజర్ ఏ. చంద్రయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ పవన్, ఎం.డి. ముజిబ్ ఖాన్ (ఆర్‌హెచ్‌సీ), ట్రాఫిక్ సూపర్వైజర్లు, మెకానికల్ సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ మరియు భద్రతా సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.3
- గత కొంతకాలంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యాపారవేత్తలను చంపుతానని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విత్తనాల నాగరాజు అను రౌడీ షీటర్ ని , జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు, మెట్టుపల్లి డి.ఎస్.పి ఏ రాములు గారి ఆధ్వర్యంలో, ఈరోజు కోరుట్ల పట్టణంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది గతంలో కూడా విత్తనాలు నాగరాజు పై రెండు మర్డర్ కేసులు మరియు ఎక్స్ట్రాక్షన్ కేసులు నమోదు కాబడినవి అలాగే ఇతనిపై గతంలో PD Act కూడా నమోదు చేసి జైలుకు పంపించనైనది. అలాగే ఈరోజు అరెస్టు చేసిన కేసులో విత్తనాల నాగరాజు తో పాటు మరొక నిందితుడు కూడా ఉన్నట్లు ఆ దర్యాప్తులో తెలిసినది ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు తొందర్లోనే అతని పట్టుకుని అరెస్టు చేస్తాం వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారిని కూడా రిమాండ్ చేస్తాం ఈ కేసుని చాలా మైనేట్గా దర్యాప్తు చేస్తున్నాం, అదేవిధంగా విత్తనాల నాగరాజు అనే రౌడీషీటర్ తో కానీ ఇతని సహచరులతో కానీ ఎవరైనా సంబంధాలు కలిగి ఉండి వారితో తిరిగిన ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిగా పెట్టి వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోబడును, అలాగే ఎవరైనా ఎవరినైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడి బలవంతపు వసూలు చేస్తే వారిపై చట్టపరంగా చాలా కఠిన చర్యలు తీసుకోబడును. ముఖ్యంగా కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ పోలీస్ తరఫున విన్నపం ఏమనగా ఎవరు కూడా ఇలాంటి భయాలకు ఆందోళనలకు గురికావాల్సిన పనిలేదు మిమ్మల్ని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసిన బెదిరించిన నిర్భయంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వవచ్చు అదేవిధంగా మీ వివరాలు చాలా రహస్యంగా ఉంచబడతాయి.1
- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం. మాజీ డిప్యూటీ స్పీకర్ యం.పద్మ దేవేందర్ రెడ్డి..మెదక్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం అపారమని కొనియాడారు. దేశ స్వపరిపాలనకు ఆదర్శంగా నిలిచేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దూరదృష్టి గల నాయకుడని తెలిపారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టడంతో పాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.అంబేద్కర్ ఆశయాలతో నవ సమాజ నిర్మాణానికి కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అకిరెడ్డి.కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు,న్యాయవాది జీవన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్,సంధ్య నవీన్, ఉదయ్ కుమార్,గౌస్,సోహెల్, జుబేర్ అహ్మద్, మహిళా నాయకురాలు అంకం.చంద్రకళ రాధ,నాయకులు, కిష్ట గౌడ్, అంజ గౌడ్, కిష్టయ్య, విశ్వం,లింగా రెడ్డి, ప్రభు రెడ్డి,కిషన్, మాయ. మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, ఏనుగుల రాజు, సునీల్,రవి లక్ష్మీనారాయణ,దశరథం,ఇందాడ్,సంతోష్ ,వెంకట్,ఆంజనేయులు,ప్రభాకర్ ,లక్ష్మణ్,కిషన్,మోహన్,ఇస్మాయిల్, రవి తదితరులు పాల్గొన్నారు.1
- నెరడిగొండ మండల కేంద్రంలో రాజ్యాంగ రహిత డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ 135వ జయంతి సందర్భంగా నెరడిగొండ మండల కేంద్రంలో జరిగిన అంబెడ్కర్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బోరును ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ తోనే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాయని అన్నారు. ఎన్నో పుస్తకాలు చదివిన అంబెడ్కర్ సమాజాన్ని అంతకంటే లోతుగా చదివి రాజ్యాంగాన్ని రాశారని గుర్తుచేశారు. ఆనాడు బాబా సాహెబ్ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించకపోయి ఉంటే భారత సమాజం ఏమయ్యేదో ఆలోచించాలన్నారు. భారత పౌరులకు తమ నాయకున్ని తామే ఎన్నుకునే అవకాశం కల్పించిన గొప్ప మహనీయులు అంబెడ్కర్ గారని అన్నారు.1
- Post by Vishwamber Rao1