పి 4 తోనే పేదరిక నిర్మూలన: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాతపట్నం నియోజకవర్గాన్ని పేదరికం రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, పీ4 కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం కల్పించడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. జీరో పావర్టీ పీ4 తొలి వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గాన్ని పేదరికం లేని ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుందన్నారు. పీ4 లో భాగస్వామమైన మార్గదర్శకులు జాబితాలో వెలమల గోవిందరావుని జిల్లా కి ఎంపిక చేశారు. పోతురాజు శ్రీధర్, గేదెల వెంకట రమణ (టీచర్), నల్లి జగదీశ్వరరావుని సన్మానించి అవార్డులు అందించారు. ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి డి.సత్యనారాయణ, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పి 4 తోనే పేదరిక నిర్మూలన: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాతపట్నం నియోజకవర్గాన్ని పేదరికం రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, పీ4 కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం కల్పించడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. జీరో పావర్టీ పీ4 తొలి వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గాన్ని పేదరికం లేని ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుందన్నారు. పీ4 లో భాగస్వామమైన మార్గదర్శకులు జాబితాలో వెలమల గోవిందరావుని జిల్లా కి ఎంపిక చేశారు. పోతురాజు శ్రీధర్, గేదెల వెంకట రమణ (టీచర్), నల్లి జగదీశ్వరరావుని సన్మానించి అవార్డులు అందించారు. ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి డి.సత్యనారాయణ, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- మెలియాపుట్టి మండల కేంద్రంలో ఐటీడీఏ మంజూరు చేయాలని గిరిజన సంఘ నాయకులు స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన ఆందోళన చేశారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వంకల మాధవరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేసి గిరిజనుల అభివృద్ధి కొరకు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. తాసిల్దార్ రామారావుకు వారు వినతి పత్రం అందజేశారు.1
- శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత వైసీపీదే అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత వైసీపీదేనని మాజీ మంత్రిఅప్పలరాజు అన్నారు. సోమవారం సంతబొమ్మాలి మండలం నౌపాడలో జరిగినబహిరంగ సభలోఆయనమాట్లాడారు. జగన్ స్ఫూర్తితోనే మూలపేట పోర్టు ఆవిష్కరించడం జరిగిందన్నారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఆయనే శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాజన్న హయాంలో రిమ్స్ కాలేజీ వచ్చిందన్నారు. అసెంబ్లీలో జగన్ పై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.1
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న P4 కార్యక్రమంలో మూడు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి సహాయ సహకారులు అందించి మండల స్థాgయిలో ఉత్తమ మార్గదర్శిగా నిలిచిన శ్రీ కొండదాడి రాజేష్ ని గౌరవ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయ కృష్ణ, సబ్ కలెక్టర్ ఐఏఎస్ స్వప్నిల్ పవర్. సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజేష్ ని ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది కొన్ని కుటుంబాలను దత్తత తీసుకొని ఆ కుటుంబ అభివృద్ధికి పాటుపడాలని వాళ్లు ఈ సందర్భంగా కోరారు.1
- *వంగలపూడి అనిత, ఇంచార్జి మంత్రి కామెంట్స్* లా అండ్ ఆర్డర్ విషయంలో పటిష్టంగా పని చేస్తున్నాం. ఈవిటీజింగ్ జరగకుండా శక్తి టీమ్స్ పని చేస్తున్నాయి. మూలపేట పోర్టు 70 శాతం కంప్లీట్ చేసింది కూటమి ప్రభుత్వం. ప్రతీ విషయంలో క్రెడిట్ చోరీ కొట్టాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మాది పని చేస్తున్న ప్రభుత్వం. వాటాలు అడగని ప్రభుత్వం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులను ఎత్తేసిన పరిస్థితి. వైసీపీ వాళ్ళు వాటాలు, పార్టనర్శిప్లు అడిగారు కాబట్టి చాలా ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళిపోయాయి. అమరావతి రాజధానిపై మండలిలో కూడా తీర్మానం చేయాలని చెప్తున్నారు. అసలు ఇంతకీ వైసీపీ నేతలు అమరావతి రాజధానిగా ఒప్పుకుంటున్నారా లేదా....సమాధానం చెప్పాలి. ఒకవేళ స్వాగతిస్తే ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ప్రాజెక్టులకు ఏ రైతు కన్నీరు కారుస్తూ భూమి ఇవ్వకూడదు. అది మా పాలసీ. అభివృద్ధి,సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అహర్నిశలు కష్టపడుతున్నారు..1
- *విశాఖలో నాగరిక సమాజం తలదించుకునే ఘాతుకం: *పెళ్లి చేసుకోమన్నందుకే కిరాతకం.. నిన్న రాత్రి లొంగిపోయిన నిందితుడు.. గజవాకలో కలకలం* గాజువాక... విశాఖ నగరంలో మరో 'శ్రద్ధా వాకర్' తరహా ఉదంతం వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కోపంతో ఒక నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని అత్యంత పాశవికంగా హత్య చేసి, ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిపెట్టిన భయంకర ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గాజువాక సమీపంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోరం నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. నిందితుడు చింతాడ రవీంద్ర (35) ఇండియన్ నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా విజయనగరం జిల్లాకు చెందిన మౌనిక (29) అనే మహిళతో అతనికి పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, గత కొన్ని రోజులుగా తనను పెళ్లి చేసుకోవాలని లేదా తనకు భారీగా డబ్బు సెటిల్ చేయాలని మౌనిక రవీంద్రపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్ళిన సమయాన్ని ఆసరాగా చేసుకుని, గత వారం మౌనికను తన నివాసమైన ఎల్.వి. నగర్‌కు పిలిపించుకున్నాడు. అక్కడ ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో రవీంద్ర ఆమెను గొంతు పిసికి చంపేశాడు. అనంతరం నేరం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ కవర్లలో చుట్టి తన ఇంట్లోని డబుల్ డోర్ ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. శరీరం నుంచి వచ్చే దుర్వాసన బయటకు రాకుండా గదిలో సెెంట్ స్ప్రేలు చల్లుతూ ఐదు రోజుల పాటు ఏమీ తెలియనట్లుగా అక్కడే గడిపాడు. మృతదేహాన్ని పూర్తిగా మాయం చేయడం సాధ్యం కాదని గ్రహించిన రవీంద్ర, తన పాపం పండుతుందన్న భయంతో నిన్న (ఆదివారం) రాత్రి నేరుగా మల్కాపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. తాను తన ప్రియురాలిని చంపి ఫ్రిజ్‌లో పెట్టానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే అతని ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా, ఫ్రిజ్‌లో కుళ్ళిన స్థితిలో ఉన్న శరీర భాగాలు లభ్యమయ్యాయి. మౌనిక తల మరియు చేతులను నిందితుడు నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతాల్లో పారవేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఈరోజు ఉదయం నుంచి పోలీసులు నిందితుడిని వెంటబెట్టుకుని ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై నేవీ ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నారు. వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అవుతున్నాయి, ప్రాణాలు ఎలా పోతున్నాయనే దానికి ఈ ఘటన ఒక పరాకాష్టగా నిలిచింది. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.3
- గిరిజనులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందళం అశోక్ వెంటనే రాజీనామా చేయాలని ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అసభ్య పదజాలం ఉపయోగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. గిరిజనులకు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.1
- Post by Shyam1
- శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టుకు నిధులు మంజూరు చేసి ప్రారంభించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. సోమవారం సంతబొమ్మాళి మండలం నౌపడ వైసిపి బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. దేశ పటంలో ఈ మూలపేటను చేర్పించిన ఘనత జగన్ కు మాత్రమే చెల్లిందని వివరించారు. జిల్లాలో ఉన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు మూలపేట పోర్టు అభివృద్ధిపై దృష్టి సారించలేదని అన్నారు.1