కామారెడ్డి జిల్లా బీబీపేట్‌లో జూన్ 21న తెలంగాణ కల్లుగీత సహకార అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్‌ను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, జిల్లా కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను అందించేలా, ఆర్థికంగా భరోసా కల్పించే విధంగా చూడాలని, అలాగే గౌడ కులస్తులకు గీత వృత్తిలో ఆధునిక పద్ధతులలో నైపుణ్య శిక్షణ అమలుకై ప్రత్యేక చొరవ చూపాలని కాంగ్రెస్ నాయకులు ఛైర్మన్‌ను విన్నవించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం పాటుపడుతూ ప్రజాపాలన కొనసాగిస్తుందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా బీబీపేట్‌లో జూన్ 21న తెలంగాణ కల్లుగీత సహకార అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్‌ను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, జిల్లా కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను అందించేలా, ఆర్థికంగా భరోసా కల్పించే విధంగా చూడాలని, అలాగే గౌడ కులస్తులకు గీత వృత్తిలో ఆధునిక పద్ధతులలో నైపుణ్య శిక్షణ అమలుకై ప్రత్యేక చొరవ చూపాలని కాంగ్రెస్ నాయకులు ఛైర్మన్‌ను విన్నవించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం పాటుపడుతూ ప్రజాపాలన కొనసాగిస్తుందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
- జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తన సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొని యోగ సాధన చేశారు.3
- తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, సిద్ధాంతకర్త, ఉద్యమ మేధావి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన త్యాగాలు, అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని, ఆయన సేవలు చిరస్మరణీయమని, తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువలేనివని పేర్కొన్నారు. ఆంజనేయులు తన ప్రసంగంలో, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించి, ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని బలంగా వినిపిస్తూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల కోసం "మన నీళ్లు – మన నిధులు – మన ఉద్యోగాలు" అనే నినాదంతో ఉద్యమాన్ని బలోపేతం చేసిన ప్రముఖుల్లో ఆయన ముందువరుసలో నిలిచారని తెలిపారు. ఆయన ఆశయాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, నేడు దేశానికే ఆదర్శంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారితో కలిసి ఆయన కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, ధ్యాసగా జీవించిన జయశంకర్ సార్ పోరాటం, జీవితం యువతకు ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కోకన్వీనర్ గడ్డమీది క్రిష్ణ గౌడ్, కౌన్సిలర్ దీపక్ కుమార్, మాజీ కౌన్సిలర్ మాయ మల్లేశం, నాయకులు ఏనుగుల రాజు, ఇస్మాయిల్, సునీల్, బబ్లు, రవి, వేణు తదితరులు పాల్గొన్నారు.1
- ఆదివారం వీర్నపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ అనుబంధ రంగాల కార్మికుల విస్తృత స్థాయి సమావేశం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని భవన నిర్మాణం, హమాలీ, గ్రామపంచాయతీ, ఆశా, బీడీ, విద్యుత్ మరియు అన్ని రంగాల కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా 15 మంది సభ్యులతో కూడిన నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ, కేంద్ర బిజెపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం కార్మిక చట్టాలను రద్దుచేసి, తమ కష్టంతో దేశానికే సంపదను సృష్టిస్తున్న కార్మికుల హక్కులను హరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రంగాల కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీ నాయకులు వీర్నపల్లి మండలంలోని అన్ని రంగాల కార్మికులు, కష్టజీవులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఉద్యమ పోరాటాలు నిర్వహించి వారికి అండగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ నూతన వీర్నపల్లి మండల కమిటీకి గుంటుకు నరేందర్ మండల కన్వీనర్‌గా, ఈసంపేల్లి రాజెల్లయ్య, అన్నారం రాజేశం కో కన్వీనర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజెల్లయ్య, అంజయ్య, చంద్రయ్య, లింగయ్య, రాజు, కత్తిలాల్, శ్రీహరి, నర్సయ్య, మనోహర్, నవత, అనిత, లావణ్యలు మండల కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్, జిల్లా సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, వివిధ రంగాల యూనియన్ల నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు.3
- వేములవాడ పట్టణానికి చెందిన తెలంగాణ రాష్ట్ర మోచీ సంఘం అధ్యక్షుడు కొండ్లెపు ముత్యం, తనను కులం పేరుతో దూషించి, దుకాణంలోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆయన ఈ ఫిర్యాదులో కోరారు. ముత్యం తెలిపిన వివరాల ప్రకారం, వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న తన కొబ్బరికాయల దుకాణాన్ని తొలగించాలని గత నెల రోజులుగా దేవస్థాన అధికారుల నుంచి ఒత్తిడి వస్తోంది. ఈ క్రమంలో జూన్ 18న రాత్రి సుమారు 8 గంటల సమయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఆదేశాల మేరకు సుమారు 30 మంది దేవస్థాన సిబ్బంది తన దుకాణం వద్దకు వచ్చి తొలగించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో తనను కులం పేరుతో దూషించడంతో పాటు అవమానకరంగా మాట్లాడారని, తన అనుమతి లేకుండా దుకాణంలోకి ప్రవేశించి పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారని ముత్యం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో దేవస్థానం ఈవో రమాదేవి, ఏఈవో శ్రావణ్, సూపరింటెండెంట్ నూగూరి నరేందర్, రాంకిషన్‌రావు, భగవంతరావు, జయకుమారి, రాజేందర్, భరత్, గంగిశెట్టి సాయి తదితరులపై చర్యలు తీసుకోవాలని ముత్యం కోరారు. సంఘటన జరిగిన సమయంలో రేగుల శ్రీకాంత్, వంగళ శ్రీనివాస్, మైలారపు శ్రీనివాస్, బోనాల శివ, మామిండ్ల లక్ష్మిరాజం తదితరులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై జూన్ 19న వేములవాడ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని ఆయన తెలిపారు. అందువల్ల, సంబంధిత అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, తనకు న్యాయం చేయాలని కొండ్లెపు ముత్యం జాతీయ ఎస్సీ కమిషన్‌ను కోరారు.4
- ఆదివారం రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సహకారంతో నిర్వహించిన ఉచిత గర్భాశయ క్యాన్సర్ స్కానింగ్ శిబిరంలో డాక్టర్ సింధు మాధవనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే చికిత్స విజయవంతంగా అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. మహిళలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాంతక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని డాక్టర్ సింధు సూచించారు. గ్రామీణ ప్రాంత మహిళల్లో అవగాహన పెంపొందించడానికి ఇటువంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆమె పేర్కొంటూ, మహిళలు ఈ స్కానింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.1
- జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ యోగా ప్రాధాన్యాన్ని వివరించారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని ఆయన పేర్కొన్నారు. నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని శ్రీధర్ అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా దోహదపడుతుందని, ఆరోగ్యకర జీవనానికి యోగా ఉత్తమ మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో యోగా సాధన కోసం సమయం కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో, మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు అవుతున్నా వరుణ దేవుడు కరుణించకపోవడంతో, గ్రామ ప్రజలు కప్పతల్లి ఆట ఆడి గ్రామంలోని దేవాలయాల్లోని దేవతామూర్తులకు జలాభిషేకాలు చేశారు. అనంతరం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరుణ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం కష్టాలు తొలగి, పంటలు బాగా పండాలని, చెరువులు, కుంటలు నిండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని దేవుళ్లను ప్రార్థించినట్లు తెలిపారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- కరీంనగర్-హైదరాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న కరీంనగర్-2 డిపోకు చెందిన ఓ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అప్రమత్తమైన డ్రైవర్ తక్షణమే బస్సును నిలిపివేయగా, డ్రైవర్, కండక్టర్లు కలిసి అందులో ఉన్న 37 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటికి దించారు. ప్రయాణికులను దించిన అనంతరం మంటలు బస్సు మొత్తం వ్యాపించి, అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.1