శ్రీశైలం దేవస్థానంలో గణపతి నవరాత్రోత్సవములు ప్రారంభం వినాయకచవితిని పురస్కరించుకొని లోకకల్యాణం కోసం 9 రోజులపాటు జరిపే గణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి. సెప్టెంబరు 5వ తేదీ ఉదయం జరిగే పూర్ణాహుతి, అవబృథకార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ నవరాత్రోత్సవాలలో 9 రోజులపాటు ఆలయప్రాంగణంలోని రత్నగర్భగణపతిస్వామివారికి, యాగశాలలో వేంచేబుచేయించిన కాంస్యగణపతిమూర్తికి, సాక్షిగణపతి ఆలయంలోని స్వామివారికి, సాక్షిగణపతి ఆలయంలో నెలకొల్పిన వరసిద్ధివినాయకస్వామి వారికి (మృత్తికాగణపతిస్వామివారికి) విశేషంగా పూజాదికాలు నిర్వహించడం జరుగుతోంది. కాగా ఈ ఉదయం ఉత్సవాల ప్రారంభంలో భాగంగా యాగశాల ప్రవేశం, వేదస్వస్తి, శివసంకల్పం, గణపతిపూజ, కంకణపూజ, ఋత్విగ్వరణం, కంకణధారణ, పుణ్యాహవాచనం, తదితర కార్యక్రమాలు జరిపించబడ్డాయి. యాగశాల ప్రవేశం: ఉత్సవనిర్వహణలో భాగంగా ముందుగా అధ్యాపక (స్థానాచార్యులు), అర్చకస్వాములు, వేదపండితులు, కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు దంపతులు సంప్రదాయబద్ధంగా ఆలయప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు. వేదస్వస్తి: ఆలయప్రవేశం చేసిన తరువాత వేదపండితులు వేదపారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు. శివసంకల్పం: వేదపఠనం అయిన వెంటనే స్థానాచార్యులు వారు లోకక్షేమాన్ని కాంక్షిస్తూ నవరాత్రతోత్సవ సంకల్పాన్ని పఠించారు. ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్పపఠనం చేశారు. అనంతరం నవరాత్రోత్సవాల నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించబడింది. కంకణపూజ, కంకణధారణ అనంతరం కంకణాలకు శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపించబడ్డాయి. తరువాత కంకణధారణ కార్యక్రమం జరిపించబడింది. ఋత్విగ్వరణం: ఉత్సవాలలో భాగంగా ఋత్విగ్వరణం నిర్వహించబడింది. ఉత్సవాలలో ఆయా వైదిక కార్యక్రమాలు నిర్వహించమని ఋత్వికులను ఆహ్వానిస్తూ వారికి దీక్షావస్త్రాలను అందజేసే కార్యక్రమానికే ఋత్విగ్వరణం అని పేరు. పుణ్యాహవచనం : ఉత్సవాలలో భాగంగా వృద్ధి మరియు అభ్యుదయాల కోసం పుణ్యాహవచనం జరిపించబడింది. అఖండస్థాపన: పుణ్యాహవచనం తరువాత అఖండదీపస్థాపన జరిపించబడింది. కలశస్థాపన : అఖండదీప స్థాపన తరువాత మండపారాధన చేసి గణపతి కలశస్థాపన చేయబడింది. కలశస్థాపన తరువాత కలశార్చన జరిపించబడింది. అనంతరం లోకకల్యాణం కోసం జపానుష్ఠానాలు జరిపించబడ్డాయి. అంకురార్పణ : ఈ నవరాత్రతోత్సవాలలో మొదటిరోజు సాయంకాలం జరిగే అంకురార్పణకు ఎంతో విశేషముంది. ఈ కార్యక్రమములో ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత పునీత ప్రదేశములోని మట్టిని సేకరించి యాగశాలకు తీసుకువస్తారు. దీనినే మృత్సంగ్రహణం" అంటారు. తరువాత ఈ మట్టిని తొమ్మిది పాలికలలో (మూకుళ్ళలో) నింపి, దాంట్లో నవధాన్యాలను పోసి వాటిని మొలకెత్తించే పనిని ప్రారంభిస్తారు. పాలికలలో రోజూ నీరు పోసి నవధాన్యాలు పచ్చగా మొలకెత్తేలా చూస్తారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజూ యాగశాలలో మండపారాధనలు, గణపతిహోమం, దేవతా హవనములు, జపాలు, పారాయణలు జరిపించబడుతాయి. కాగా ఉత్సవాల చివరి రోజైన సెప్టెంబరు 5వ తేదీన ఉదయం జరిగే పూర్ణాహుతి, కలశోద్వాసన, అవబృథ కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. రత్నగర్భగణపతికి ప్రత్యేక పూజలు గణపతి నవరాత్రోత్సవాలలో భాగంగానే ఆలయప్రాంగణంలోని రత్నగర్భగణపతి స్వామివారికి విశేషంగా అభిషేకం, అర్చనలు జరిపించబడ్డాయి. ఉత్సవసమయంలో ప్రతిరోజు కూడా ఈ విశేష కార్యక్రమాలు జరిపించబడుతాయి. సాక్షిగణపతిస్వామివారికి ప్రత్యేక పూజలు నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ఈ ఉదయం సాక్షిగణపతి స్వామివారికి ప్రత్యేక అభిషేకం, విశేష అర్చనలు నిర్వహించబడ్డాయి. పంచామృతాలతోనూ, ఫలోదకాలతోనూ, శుద్ధజలంతోనూ ఎంతో శాస్త్రోక్తంగా ఈ అభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. ఉత్సవరోజులలో ప్రతిరోజూ కూడా స్వామివారికి విశేషపూజలను చేయడం జరుగుతుంది. కాంస్య గణపతిమూర్తికి పూజాదికాలు ఉత్సవాలలో భాగంగా యాగశాలలో నెలకొల్పిన కాంస్య గణపతిమూర్తికి వ్రతకల్పపూర్వకంగా పూజాదికాలను జరిపించబడ్డాయి. ప్రతీరోజు కూడా ఉభయవేళలలో ఈ స్వామికి విశేషంగా పూజాదికాలు జరిపించబడుతాయి. వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేకపూజలు గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా సాక్షిగణపతి ఆలయంలో ప్రత్యేకంగా వరసిద్ధివినాయక స్వామిని (మృత్తికాగణపతిస్వామి) నెలకొల్పడం జరిగింది. ఉత్సవాలలో భాగంగా వరసిద్ధి వినాయకస్వామి వారికి (మృత్తికా గణపతి వారికి) విశేషంగా పూజాదికాలు జరిపించబడ్డాయి. ఉత్సవాలలో ప్రతిరోజు కూడా వరసిద్ధివినాయకస్వామివారికి విశేష పూజాదికాలు నిర్వహించబడుతాయి.

- Post by KLakshmi Devi2
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- Post by Nagesh Thalari3
- Post by Omnamashivaya S1
- Post by Madhavpatil Jadav2
- Post by Ravi Poreddy1
- మీరు ఇది చూశారా?1
- స్వామియే శరణమయ్యప్ప...1