*ఎల్‌నినో వేళ ఏలేరును కాపాడతాం: నిమ్మల రామానాయుడు* *పురుషోత్తపట్నం వల్లే ఆయకట్టుకు జీవం: జ్యోతుల నెహ్రూ* *కాకినాడ జిల్లా, జగ్గంపేట/కిర్లంపూడి: జూలై 31 * సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ఏలేరు ఆయకట్టు, ఈస్ట్ డెల్టా రైతాంగాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. జలవనరుల శాఖ మంత్రి *నిమ్మల రామానాయుడు* జగ్గంపేట ఎమ్మెల్యే *జ్యోతుల నెహ్రూ*, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి జగ్గంపేట మండలం రామవరం వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల స్టేజ్-2 పంపింగ్ స్టేషన్‌ను, కిర్లంపూడి మండలం కృష్ణవరం పోలవరం ఎడమ కాలువ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. *మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ:* సూపర్ ఎల్‌నినో వేళ ఏలేరు ఆయకట్టు, డెల్టా రైతాంగాన్ని కాపాడడమే ప్రభుత్వ ధ్యేయం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రెండో రోజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం. పిఠాపురం బ్రాంచ్ కెనాల్‌లో గుర్రపునాచు, ఏలేరు మెయిన్ కెనాల్ 18 కి.మీలో పూడిక, పెద్ద వృక్షాల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఖర్చుతో సంబంధం లేకుండా వెంటనే ఎస్టిమేషన్లు వేసి గుర్రపునాచు తొలగింపు, డీసిల్టింగ్ పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించాం. క్యాబినెట్ ద్వారా ర్యాటిఫికేషన్ చేసి నిధులు మంజూరు చేస్తాం. ఏలేరు రిజర్వాయర్ స్థానిక వర్షాలపై ఆధారపడి ఉంటుంది. 10-12 ఏళ్లకు ఒకసారి మాత్రమే నిండుతుంది. అలాంటి ఆయకట్టుకు నేడు పురుషోత్తపట్నం ఎత్తిపోతలే జీవం పోస్తోంది. చంద్రబాబు ముందుచూపుతో ఈ పథకం నిర్మించడం వల్లే ఈరోజు నీరు అందుతోంది. స్టేజ్-2 లో 8 పంపుల ద్వారా రోజుకు 1,400 క్యూసెక్కుల గోదావరి నీటిని ఏలేరుకు తరలిస్తున్నాం. రిజర్వాయర్ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇందులో 6 టీఎంసీలు డెడ్ స్టోరేజ్. మిగిలిన 2 టీఎంసీలతో విశాఖ తాగునీరు, స్టీల్ ప్లాంట్ అవసరాలకు 5 టీఎంసీలు కావాలి. 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి జూలైలోనే గోదావరి ఇన్‌ఫ్లో 6 వేల క్యూసెక్కులకు పడిపోయింది. నీటిమట్టం తగ్గితే లిఫ్ట్ నిర్వహణ కష్టం. కాబట్టి ప్రతి చుక్క నీరు పొదుపుగా వాడాలి. 57వ కి.మీ వద్ద కొత్త ఆఫ్‌టేక్ నిర్మాణంతో లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా పురుషోత్తపట్నం నీటిని ఏలేరుకు ఇచ్చే ప్రత్యామ్నాయ పనులు వేగవంతం చేశాం. సీజన్ తర్వాత బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తాం. వర్షాభావం, ఉష్ణోగ్రతల వల్ల దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. రైతుల ఆర్థిక భద్రతకు ప్రతి రైతు, ప్రతి ఎకరానికి తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాలి. గ్రామాల్లో ఇరిగేషన్, అగ్రి, రెవెన్యూ శాఖలు చాటింపులు, మైక్ కాన్వాలతో అవగాహన కల్పించాలి. వంతులవారీ విధానంతో చివరి ఆయకట్టు వరకు నీరందించాలి. *ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ:* ఏలేరు ఆయకట్టును కాపాడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోంది. మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ వరదల్లో చూపిన బాధ్యతను ఇక్కడా ప్రదర్శిస్తున్నారు. పోలవరం నీరు ఏలేరుకు చేరడానికి 6 నెలలు పడుతుంది. అప్పటివరకు 53 వేల ఎకరాలకు నీరందించే పనులతో పాటు వెంటనే 1000 క్యూసెక్కుల నీటి విడుదలకు మంత్రి ఆదేశించారు. చంద్రబాబు విజన్, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు దూరదృష్టి వల్లే పురుషోత్తపట్నంతో ఈ కరువును తట్టుకుంటున్నాం. తాళ్లూరు ఎత్తిపోతలకు మంత్రి ప్రత్యేక శ్రద్ధతో క్యాబినెట్ ఆమోదం, టెండర్లు పూర్తి చేయించారు. ఈ నెలాఖరుకు ఒక పంపు ద్వారా పైప్‌లైన్ ద్వారా నీరందిస్తాం. ఇందుకు సీఎం, ఇరిగేషన్ మంత్రికి జగ్గంపేట రైతాంగం తరపున కృతజ్ఞతలు. ప్రభుత్వం ఇంత చేస్తున్నందున నీటి సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు రోజూ 2 గంటలు కేటాయించి నీరు వృథా కాకుండా పర్యవేక్షించాలి. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్, డిసిబి చైర్మన్, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు, పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అడబాల భాస్కరావు, కన్నబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, జీను మణి బాబు, అడబాల వెంకటేశ్వరరావు, తోట రవి, తోట గాంధీ, అనుకూల శ్రీకాంత్, నీలం శ్రీను, పిల్లా చంటిబాబు, ఎన్ సి నరసింహ మూర్తి, ఇరిగేషన్ అడ్వైజర్ ఎం. వెంకటేశ్వరరావు,ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్, పోలవరం ఎస్ఈ ఏసు బాబు,డి సి సి బి చైర్మన్ తుమ్మల రామ స్వామి, ఏలేరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ కోటా నాని బాబు, ఇరిగేషన్ సిఈ చిన్నబాబు,ఈ ఈ రామకృష్ణ, శేషగిరి, డిఈ ఆనంద్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- డీఎస్సీపై లోకేష్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారు – ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి వ్యాఖ్యలు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మీడియా సమావేశంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణ, విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడిన ఆయన, ప్రభుత్వ చర్యలను వివరించారు. అలాగే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తూ పలు రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించబడగా, అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు.1
- కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్‌హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.1
- ఆగస్టు 2న మూలారెడ్డి వర్ధంతి కార్యక్రమాలు :ఎమ్మెల్యే నల్లమిల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆగస్టు 2న బలభద్రపురంలో స్మారక పురస్కారాల సభ, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరవుతారని, సత్యవాణి, డాక్టర్ రామచంద్రరెడ్డిలకు పురస్కారాలు అందజేస్తామన్నారు.పసలపూడిలో మూలారెడ్డి విగ్రహావిష్కరణ జరుగుతుందని,కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.1
- ఆషాడ మాసం సందర్భంగా శాకంబరీ దేవిగా అలంకరణలో దర్శనమిస్తున్న నూకాలమ్మ ఆషాడ మాసం పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఎస్ అన్నవరం నుకాలమ్మ ఆలయంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ని పలు రకాల కూరగాయలు పళ్ళు తో శాకంబరీ దేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి వేద పండితులు ఆధ్వర్యంలో శాస్త్రాకంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిని ఇచ్చారు. నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.1
- బాధితులను కాదు.. నిందితులను పరామర్శించడం దారుణం: కొల్లు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన పర్యటనపై రాష్ట్ర గనులు, భూగర్భశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. పరామర్శల పేరుతో కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఓదార్చడం కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. పరామర్శ పేరుతో గంజాయి బ్యాచ్‌ను పోగేసి ప్రదర్శనలు నిర్వహించడం అవసరమా అని జగన్‌ను ప్రశ్నించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కేసులో ఓ యాదవ యువకుడు మృతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా జైలులో ఉన్న నిందితులను ములాఖత్ పేరుతో కలవడం సిగ్గుచేటని అన్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఓదార్చకుండా నిందితులను పరామర్శించడం ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే బందోబస్తు విధుల్లో ఉన్న ఓ మహిళా ఎస్ఐ పట్ల జగన్ ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు. జైలు వద్ద ప్రదర్శనలు నిర్వహించేందుకే కావాలనే సాయంత్రం 5 గంటల వరకు వెళ్లకుండా రాజకీయ డ్రామా చేశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో స్పందించాల్సిన ప్రతిపక్ష నాయకుడు, పరామర్శల పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం తగదని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసేలా వ్యవహరించడం మానుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జగన్‌కు సూచించారు.1
- కల్లూరు ప్రజాదర్బార్ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి ప్రజాదర్బార్‌లో 3,500కి పైగా, అలాగే పాలేరు నియోజకవర్గంలో 25,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే అభ్యర్థనలు వస్తున్నాయని, పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇళ్లు మంజూరు చేయడం వల్ల నిర్మాణ వ్యయం అదుపులో ఉంటుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై 8 లక్షల 21 వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోపిందని పొంగులేటి ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, నిషేధిత జాబితా (22A) భూముల కేటాయింపులపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన 'సిట్' సమగ్ర విచారణ జరుపుతోందని తెలిపారు. త్వరలోనే ధరణి అక్రమాల గుట్టు రట్టు చేసి నివేదికను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ సర్వే వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. పింక్ కలర్ షర్టు వేసుకున్న పేదవాడైనా సరే... కుల, మత, రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.1
- కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్‌హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.1
- శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రం సమీపానికి గోదావరి బ్యాక్‌వాటర్ శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రం సమీపానికి గోదావరి బ్యాక్‌వాటర్ భద్రాచలం: గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో వరద బ్యాక్‌వాటర్ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం సమీపంలోని అన్నదాన సత్రం వద్దకు చేరింది. శుక్రవారం మధ్యాహ్నం 3.48 గంటలకు గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరగా 11,44,645 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.1