logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కమ్యూనిస్టు సిద్ధాంత విత్త ఖరారు జోహార్ వర్ధంతి ఘనంగా తెలంగాణ రాష్ట్రంలో జరుపుకున్నారు కారల్ మార్క్స్ వర్ధంతి. ( మే 5, 1818 - మార్చి14, 1883) జంపన్న మార్క్సిజం ఆవిర్భావ నేపథ్యం 18వ శతాబ్దం మలి భాగము నుండి 19వ శతాబ్దం మధ్య వరకు వాయువ్య యూరప్ అమెరికా ప్రాంతాలలో పెట్టుబడిదారీ విధానం నాటకీయంగాను విప్లవకరంగాను వృద్ధి చెందింది. ఈ కాలంలోనే ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన గొప్ప పరిణామాలుగా ఇంగ్లాండ్ లో జరిగిన 1789 పారిశ్రామిక విప్లవం,ప్రెంచి ఇంగ్లాండ్ వగైరా దేశాలలో జరిగిన ప్రజాస్వామిక విప్లవాలు కొనసాగిన కాలం. ఆనాడు ప్రబలమైనదిగా ఉండిన భూస్వామ్య విధానం పైన పెట్టుబడిదారీ విధానం తిరుగులేని విజయం సాధించింది. పశ్చిమ యూరప్ ప్రభుత్వాల ప్రత్యేకించి బ్రిటిష్ వారి ప్రపంచ అధిపత్యము ఏర్పడిన కాలమది. ఆ అధిపత్యం పెట్టుబడిదారీ దేశాలలో విప్లవ కరమైన సామాజిక ఆర్థిక పరివర్తనకు దారి తీసింది. అంతేకాదు అది ప్రపంచంలోని పురాతన నాగరికతలు సామ్రాజ్యాలు పెద్ద సంఖ్యలో లొంగిపోవడానికి లేదా కుప్పకూలిపోవడానికి కూడా దారితీసింది. భారతదేశం బ్రిటిష్ గవర్నర్ల పాలన కింద ఉండే ఒక రాష్ట్రంగా మారిపోయింది .ఇస్లామిక్ దేశాలు సంక్షోభంలోకి తోసి వేయబడ్డాయి. 1839- 42 మధ్య కాలంలో గొప్ప చైనా సామ్రాజ్యం సైతం పాశ్చాత్య దోపిడికి తలుపులు తెరవవలసిన స్థితికి నెట్టబడింది.పెట్టుబడి దారీ వ్యాపారపు పురోగమనానికి మరే అడ్డంకి లేకుండా పోయింది. వారు ప్రతి వెనుకబడిన దేశాన్ని వలసలుగా మార్చుకొని పెట్టుబడి దారి వలస సామ్రాజ్య ఆధిపత్యం నెలకొల్పిన కాలం. ప్రపంచ వ్యాప్తంగా ఎదురులేని అధికారంతో విర్ర వీగుతున్న బూర్జువా వర్గాన్ని ప్రతిఘటించ డానికి ,దానిని ఓడించేటటువంటి కార్మిక వర్గ శక్తుల సంఘటిత పోరాటానికి ,కమ్యునిస్ట్ సిద్ధాంత ఆవిర్భావానికి కూడా దారితీసాయి. మానవ చరిత్రలో అతి గొప్ప మార్పులు సంభవిస్తూ కొన్ని పాశ్చాత్య పెట్టుబడిదారీ రాజ్యాలు ప్రపంచం పై పెత్తనాన్ని నెలకొల్పుతూ ఉన్న కాలములో మార్క్సిజం పుట్టింది . మార్క్సిజం పుట్టుకకు కారణమైన వస్తు గత పరిస్థితులను ఎత్తిచూపుతూ కామ్రేడ్ మావో ఇలా అన్నాడు. "చరిత్రలో చాలా దీర్ఘకాలం పాటు మానవులు సమాజ చరిత్ర గురించిన అవగాహనలో అనివార్యంగానే ఏకపక్ష అవగాహనకు పరిమితమైపోయారు. దీనికి కారణం దోపిడి వర్గాల పక్షపాత బుద్ధి ఎల్లప్పుడూ చరిత్రను వక్రీకరించడం ఒకటైతే , చిన్న తరహా ఉత్పత్తి మానవుల దృక్పథాన్ని పరిమితం చేయడం రెండవ కారణం .బ్రహ్మాండమైన ఉత్పత్తి శక్తుల ( భారీ పరిశ్రమల)తో పాటు ఆధునికమైన కార్మిక వర్గం ఆవిర్భవించిన తర్వాతనే మానవుడు సమాజ అభివృద్ధిని గురించి సమగ్రమైన చారిత్రక అవగాహననుసంపాదించు కోగలిగాడు. ఆ జ్ఞానాన్ని ఒక విజ్ఞాన శాస్త్రంగా మార్క్సిజం అనే విజ్ఞాన శాస్త్రంగా మలుచుకోగలిగాడు." మార్క్స్ జీవిత విశేషాలు మార్క్స్ 1818 మే 5న జర్మనీ దేశానికి చెందిన రైన్ రాష్ట్రంలోని టీయర్ నగరంలో జన్మించాడు తండ్రి న్యాయవాది . మార్క్స్ మొదటగా న్యాయ శాస్త్రం చదివినాడు .చరిత్ర తత్వశాస్త్రంపై ప్రధానంగా తన అధ్యయనాన్ని కేంద్రీకరించాడు. తత్వశాస్త్ర సిద్ధాంతాలపై రచనలు కొనసాగిస్తూ ఒక పత్రికకు సైతం చీఫ్ ఎడిటర్ గా పనిచేసినాడు.తన అధ్యయనంలో ప్రపంచాన్ని గతి తార్కిక భౌతిక వాద దృక్పథంతో పరిశీలించిన ఫలితంగానే మార్క్స్ ప్రపంచ శ్రామిక వర్గ మహోపాధ్యాయుడుగా మారినాడు. మార్క్స్ తన ప్రేమికురాలు అయిన జెన్నీవాన్ వెస్ట్ ఫాలిన్ 1843 లో వివాహం చేసుకున్నప్పటి నుండి జెన్నీ అన్ని రకాల బలమైన తోడ్పాటుతో మాత్రమే మార్క్స్ సిద్దాంతాలు అభివృద్ధి చేయగలిగినాడు 1844లో మార్క్ ఎంగెల్స్ లు పారిస్ లో కలిసి అత్యంత కార్మిక వర్గ మిత్రులుగా చివరి వరకు కొనసాగినారు. 1847 మార్క్స్ ఎంగెల్స్ లు కమ్యూనిస్టు లీగ్ ప్రచార సంఘంలో చేరినారు 1847వ సంవత్సరములో కమ్యూనిస్టు ప్రణాళిక సమర్పించినారు . మార్క్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంగెల్స్ తో 1864లో అంతర్జాతీయ కార్మిక సంఘం స్థాపించి కమ్యూనిజం ప్రచారం ,కార్మిక ,కమ్యునిస్ట్ సంస్థల నిర్మాణ కృషి చేసినారు. మార్క్స్ ఎంతో నికృష్ట జీవితాన్ని గడిపాడు ఎంగెల్స్ సహాయం చేయబట్టి గాని లేకపోతే పెట్టుబడి గ్రంథాన్ని పూర్తి చేయకపోవడమే కాక ఆర్థికలేమితో ముందే చనిపోయేవాడు. మార్క్స్ ఎంగెల్స్ సహాయంతో మార్క్సిజం అనే కార్మిక వర్గ విజ్ఞాన శాస్త్రం రూపొందింది. మార్క్స్ ఎంగెల్స్ రచనలే మార్క్సిజంగా మార్క్స్ తో ఎంగెల్స్ చేసిన గొప్ప చేర్పులు విడదీసి చూడరానివి ఎంగెల్స్ తో కలిసే మార్క్స్ తన సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచాడు. చరిత్ర పరిణామ క్రమం గురించి తత్వవేత్తల్లో వెనుకటి కాలం నుంచి దైవము ఆశించే దాన్ని బట్టొ ,దైవంశ సంభూతులైన రాజు, మత గురువుల ఇష్టా ఇష్టాన్ని బట్టి మానవాతిత శక్తులను బట్టి సాగుతుందని భావ వాద దృక్పథం ప్రబలంగా వుంది.ఇదే భావ వాద దృక్పథం తో ప్రజలను తర తరాలుగా దోపిడీ చేస్తున్నది. మానవ చరిత్ర పరిణామానికి ప్రధాన భౌతిక కారణంగా శ్రమ సంబంధాల నుంచి పుట్టుకొచ్చేదిగానే ఉంటుంది అని మార్క్స్ బహిర్గత పరిచినాడు. చరిత్ర గురించిన భౌతికవాద భావనను కనుగొనేందుకు సామాజిక అభివృద్ధి చలన నియమాలు ఏమిటి అనే గతితార్కిక పద్ధతిని కనుగొన్నారు. పెట్టుబడిదారీ విధానంలో వర్గ వైరుధ్యాలతో సహా ఆ విధానపు చలన నియమాలను దోపిడి మూలాన్ని బట్టబయలు చేసినారు. శ్రమ దోపిడికి కారణమైన అదనపు విలువ సిద్ధాంతాన్ని ఆవిష్కరించి కార్మిక వర్గ రాజకీయ అర్థ శాస్త్రం అభివృద్ధి చేశారు. వర్గ పోరాట సిద్ధాంతం పునాదిగా శాస్త్రీయ సోషలిజాన్ని అభివృద్ధి చేశారు. కార్మిక వర్గపు పోరాట వ్యూహము ఎత్తుగడలను నియంత్రించే సూత్రాలను రూపొందించారు. కార్మిక వర్గం పెట్టుబడిదారీ విధానాన్ని కూలదోసి తనను తాను విముక్తం కావించుకోవాలంటే అది తన సొంత కార్మిక వర్గ పార్టీని ఏర్పరుచుకోవాలని మార్స్ ఎంగెల్స్ లు ప్రబోధించినారు. కార్మిక వర్గ పార్టీ అంటే కమ్యునిస్ట్ పార్టీ పెట్టుబడి దారి వర్గానికి వ్యతిరేక పార్టీ గానే వుంటూ రైతులు ఉద్యోగులు వగైరా శ్రామిక వర్గ ప్రజల మధ్య బలమైన ఐక్య సంఘటన ఏర్పడాలని చెప్పినారు. వర్గ సమాజంలో ఉత్పత్తి శక్తులకు ఉత్పత్తి సంబంధాలకు మధ్య ఉండే వైరుధ్యం వర్గ వైరుధ్యంగా ప్రతి పలిస్తుందని వారు నిరూపించారు. ఈ వర్గ పోరాటమే సమాజానికి శోదక శక్తిగా పనిచేస్తుంది .అందువల్లనే వారు ప్రపంచ చరిత్ర అంటే వర్గ పోరాటాల చరిత్రని వర్ణించారు .కార్మిక వర్గం సమాజం లోని సకల శ్రామిక వర్గాలతో ఐక్యత ద్వారా మానవ సమాజాన్ని అన్ని రకాల దోపిడి అసమానతల నుండి విముక్తి చేయడానికి వర్గ పోరాట శాస్త్రాన్ని రచించినారు. బానిస సమాజం నుండి కమ్యూనిజం వరకు మానవ సమాజపు అభివృద్ధి క్రమంలో రాజ్యం ఎలా పుట్టి అభివృద్ధి చెంది అంతరించిపోతుందో మార్క్స్ ఎంగెల్స్ లు వివరించారు." ఆధునిక రాజ్యం యొక్క పరిపాలన విభాగం అంటే మొత్తంగా బూర్జువా వర్గం యొక్క ఉమ్మడి కార్యకలాపాలను చక్కబెట్టే ఒక కమిటీ తప్ప మరేమీ కాదు" అని కమ్యూనిస్టు ప్రణాళికలో చేసిన ప్రకటన పెట్టుబడి దారి వర్గం పై వివిధ బూర్జువా పార్టీ ల పై ఖచ్చితమైన శ్రామిక వర్గ వైఖరి వెల్లడించారు. మార్క్సిజం అంటే తత్వశాస్త్రం (గతి తార్కిక భౌతిక వాదం )రాజకీయ అర్థశాస్త్రం (పెట్టుబడి) శాస్త్రీయ సోషలిజం, శ్రామిక వర్గ పోరాటాల ఎత్తుగడల సమగ్ర సమహారం. మార్క్స్ రచనలు వందల కొలది వున్నప్పటికీ మార్క్స్ బోధనలోని అతి ముఖ్యమైన అంశాలను క్లుప్తంగా ఏడు శీర్షికల కింద లెనిన్ విభజించి నాడు. 1)భౌతిక వాద తత్వశాస్త్రం 2) గతి తర్కం 3) చారిత్రక భౌతిక వాదం 4) వర్గ పోరాటం 5)మార్క్స్ ఆర్థిక సిద్ధాంతం 6) సోషలిజం 7)కార్మిక వర్గ పోరాట ఎత్తుగడలు. మార్క్స్ జీవితంలో ఆఖరి కొద్ది సంవత్సరాలు అనేక వ్యాధులతో బాధ పడ్డాడు. అవి అతని రాజకీయ, రచనా వ్యాసంగానికి ఆటంకంగా పరిణమించాయి. దానితో మార్క్స్ తాను రచించదలచుకున్న వాటిలో కొన్నింటిని రచించలేక పోయి చివరకు లండన్ లోనే మార్చి 14, 1883 న మరణించాడు. మార్క్స్ సమాధి వద్ద ఎంగెల్స్ చేసిన ప్రసంగంలో. డార్విన్ ఏ విధంగానైతే జీవ ప్రకృతి యొక్క అభివృద్ధి నియమాన్ని కనుగొన్నాడో సరిగ్గా అదే విధంగా మార్క్స్ మానవ చరిత్ర యొక్క అభివృద్ధి నియమాన్ని కనుగొన్నాడు. మార్క్స్ కనిపెట్టిన సమగ్రమైన శాస్త్రీయమైన చారిత్రక భౌతిక వాద సిద్ధాంతం అంతవరకు చరిత్ర గురించి ఉనికిలో ఉన్న అన్ని రకాల తప్పుడు సిద్ధాంతాలను చావు దెబ్బ కొట్టింది. కారల్ మార్క్స్ ఒక గొప్ప మానవ విజ్ఞాన శాస్త్రవేత్త .అన్నింటికంటే ముఖ్యంగా ఆయన గొప్పశ్రామిక విప్లవవాది.ఆయన మానవ సమాజ విముక్తి పథ నిర్దేశకుడు. 19వ శతాబ్దం మానవ సమాజానికి సమర్పించిన ఒక మహోన్నత మానవుడు. పెట్టుబడిదారీ సమాజాన్ని కూల్చివేయడానికి ఆధునిక శ్రామిక వర్గ విముక్తికి తోడ్పడడమే ఆయన జీవిత పరమోద్దేశం. ఆయన పేరు యుగయుగాల దాకా అమరంగా ఉంటుంది .అలాగే ఆ కృషి కూడా చిరస్థాయిగా ఉంటుంది. అదనపు విలువ ఆవిష్కారంతో సమకాలిన పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని శాసించే ప్రత్యేక గతి నియమాన్ని మార్క్స్ కనుగొనడంలో చరిత్రలో మొదటి సారిగా వెలుగు ప్రసరించబడింది. కామ్రేడ్ మార్క్స్ పరిశోధన జరిపిన ప్రతి రంగంలోనూ ,తాత్విక ,చారిత్రక, ఆర్థిక ,సామాజిక వర్గ పోరాట రంగాల్లోని ప్రతి ఒక్క విషయంపై కూడా ఆయన స్వతంత్రమైన లోతైన ఆవిష్కరణ చేశాడు . "మార్క్సిజము అంటే ప్రకృతి మానవ సమాజాల అభివృద్ధిని నియంత్రించే నియమాల విజ్ఞాన శాస్త్రం .దోపిడికి పీడనకు గురయ్యే ప్రజారాశుల విప్లవ శాస్త్రం. సకల దేశాలలో సోషలిజానికి విజయాన్ని సాధించే శాస్త్రం కమ్యూనిస్టు సమాజాన్ని నిర్మించే శాస్త్రం". కామ్రేడ్ స్టాలిన్. "మార్క్సిజం నిర్జీవమైన పిడివాదం కాదు పరిపూర్ణమైన తయారై సిద్ధంగా ఉన్న మార్పు చెందని సిద్ధాంతం కాదు ఆచరణకు అది సజీవ మార్గదర్శి "కామ్రేడ్ లెనిన్. కార్మిక కమ్యూనిస్టు ఉద్యమాలు నేడు అనేక బలహీనతలతో వెనుకంజలో ఉండడానికి గల కారణాలని మార్క్సిజము దృష్టి కోణం నుండి సమీక్షించుకొని శ్రామిక వర్గ అధికారం కోసం ప్రజలను సోషలిస్టు చైతన్యం వంతం చేయడమే నేటి ప్రధాన కర్తవ్యం. కమ్యూనిస్ట్ సిద్ధాంత వేత్త కారల్ మార్క్స్ కు జోహార్లు. మార్చ్ 14-2026 జంపన్న (డెమొక్రటిక్ సోషలిస్టు నాయకుడు)

on 14 March
user_Vijay Kumar
Vijay Kumar
Reporter మసాయిపేట్, మెదక్, తెలంగాణ•
on 14 March
fdbdf7ee-dad9-4160-ba6f-90bd0afc99be

More news from తెలంగాణ and nearby areas
  • 15 ఆర్థిక సంఘం నిధుల వ్యయంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలి కలెక్టర్ ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరించాలి. సమ్మర్ యాక్షన్ ప్లాన్ తో గ్రామాలలో డ్రింకింగ్ వాటర్ సమస్యలను నిర్మూలించాలి ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ సమన్వయంతో గ్రామంలో సుపరిపాలన అందించాలి. 15వ ఆర్థిక సంఘం విధుల వినియోగంపై సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు వర్క్ షాప్ నిర్వహణ గ్రామాల్లో సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలి మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలని.ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరిం. చాలని. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాలలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సర్పంచులు ,పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లకు 15 ఆర్ధిక సంఘం నిధుల వినియోగం పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో 15 వ ఆర్ధిక సంఘం నిధులు సక్రమంగా వినియోగించి గ్రామా అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలన్నారు. జిల్లాలోని గ్రామపంచాయతీలు మోడల్ గా తీర్చిదిద్దాలని, గ్రామాలలో అన్ని రకాల మౌలిక వసతులపై దృష్టి సారించాలన్నారు, అంగన్వాడీ బిల్డింగ్స్, జిపి బిల్డింగ్స్ లేని గ్రామాలకు నూతన బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రత్యేక అధికారి, పంచాయతీ సెక్రెటరీ సర్పంచ్ సమన్వయంతో గ్రామ పంచాయతీలో పనులు సవ్యంగా నడవాలన్నారు. గ్రామాల్లో సమస్యలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని 15 ఆర్ధిక సంఘం నిధులను అన్ని గ్రామాలకు ప్రభుత్వం అందించిందని ,వాటితో గ్రామాల్లో సమస్యలు లేకుండా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలన్నారు. నిధుల వినియోగం లో అక్రమాలకు తావులేదన్నారు. నిధులు సక్రమంగా వినియోగించక పోతే ,అక్రమాలు జరిగితే సర్పంచ్ , కార్యదర్శుల పై చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. గ్రామాల్లో త్రాగు నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ఈ.ఈ మిషన్ భగీరథ ఇంట్రా సంపత్ కుమార్, గ్రిడ్ డి.ఈ నాగభూషణం, డిఎల్పిఓలుసాయి బాబు, తిరుపతి రెడ్డి ,అధికారులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    15 ఆర్థిక సంఘం నిధుల వ్యయంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 
పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలి కలెక్టర్ 
ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరించాలి. 
సమ్మర్ యాక్షన్ ప్లాన్ తో గ్రామాలలో డ్రింకింగ్ వాటర్ 
సమస్యలను నిర్మూలించాలి
ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ సమన్వయంతో గ్రామంలో సుపరిపాలన అందించాలి.
15వ ఆర్థిక సంఘం విధుల వినియోగంపై సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు వర్క్ షాప్ నిర్వహణ
గ్రామాల్లో సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలి 
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలని.ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరిం. చాలని.  సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాలలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు
శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సర్పంచులు ,పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లకు 15 ఆర్ధిక సంఘం నిధుల వినియోగం పై వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో 15 వ ఆర్ధిక సంఘం నిధులు సక్రమంగా వినియోగించి గ్రామా అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలన్నారు. జిల్లాలోని గ్రామపంచాయతీలు మోడల్ గా తీర్చిదిద్దాలని, గ్రామాలలో అన్ని రకాల మౌలిక వసతులపై దృష్టి సారించాలన్నారు, అంగన్వాడీ బిల్డింగ్స్, జిపి బిల్డింగ్స్  లేని గ్రామాలకు నూతన బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకునేందుకు  చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రత్యేక అధికారి, పంచాయతీ సెక్రెటరీ సర్పంచ్ సమన్వయంతో గ్రామ పంచాయతీలో పనులు సవ్యంగా నడవాలన్నారు. గ్రామాల్లో సమస్యలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని 15 ఆర్ధిక సంఘం నిధులను అన్ని గ్రామాలకు ప్రభుత్వం అందించిందని ,వాటితో గ్రామాల్లో సమస్యలు లేకుండా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో   పని చేయాలన్నారు. నిధుల వినియోగం లో అక్రమాలకు తావులేదన్నారు. నిధులు సక్రమంగా వినియోగించక పోతే ,అక్రమాలు జరిగితే సర్పంచ్ , కార్యదర్శుల పై చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. 
గ్రామాల్లో త్రాగు నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో  జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ఈ.ఈ మిషన్ భగీరథ ఇంట్రా సంపత్ కుమార్, గ్రిడ్ డి.ఈ నాగభూషణం, డిఎల్పిఓలుసాయి బాబు, తిరుపతి రెడ్డి ,అధికారులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    36 min ago
  • గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16, గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
    4
    గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి 
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16,
గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    23 hrs ago
  • Post by Shyam sunder Yadav Pulapally
    1
    Post by Shyam sunder Yadav Pulapally
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    4 hrs ago
  • దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భోజనం విరమణ సమయంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. జిల్లా చైర్మన్ జావిద్ అని మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సి వెంటనే ప్రకటించాలని కోరారు. సమస్యలు పరిష్కరించుకుంటే మే ఐదవ తేదీన కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు.
    1
    దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ  టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భోజనం విరమణ సమయంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. జిల్లా చైర్మన్ జావిద్ అని మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సి వెంటనే ప్రకటించాలని కోరారు. సమస్యలు పరిష్కరించుకుంటే మే ఐదవ తేదీన కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • Bharat Institutions Pharmacy Mein Placement Ka Jalwa: Apollo Pharmacies Drive Mein 60 Students Select, Hetero Labs Mein Bhi 8 Ko Mila Mauka Hashtags: #BharatInstitutions #PharmacyPlacements #CampusDrive #ApolloPharmacies #HeteroLabs #HyderabadJobs #BPharmStudents #PlacementSuccess #CareerOpportunity #StudentAchievement #PharmacyCareer #CampusPlacement2026 #EducationNews #JobAlertIndia #FuturePharmacists
    1
    Bharat Institutions Pharmacy Mein Placement Ka Jalwa: Apollo Pharmacies Drive Mein 60 Students Select, Hetero Labs Mein Bhi 8 Ko Mila Mauka
Hashtags:
#BharatInstitutions #PharmacyPlacements #CampusDrive #ApolloPharmacies #HeteroLabs #HyderabadJobs #BPharmStudents #PlacementSuccess #CareerOpportunity #StudentAchievement #PharmacyCareer #CampusPlacement2026 #EducationNews #JobAlertIndia #FuturePharmacists
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • *रायपुर उपखंड क्षेत्र मैं RTI कार्यकर्ता से दुर्व्यवहार,सूचना मांगने पर ग्राम विकास अधिकारी की दादागिरी, ग्राम पंचायत कार्यालय से कार्यकर्ता को धक्के देकर निकाला बाहर, रायपुर के झूठा ग्राम पंचायत का मामला, वीडियो सोशल मीडिया पर वायरल, क्षेत्र वासियों से ऐसे लापहरवा अधिकारी पर कारवाही की मांग की ।*
    1
    *रायपुर उपखंड क्षेत्र मैं RTI कार्यकर्ता से दुर्व्यवहार,सूचना मांगने पर ग्राम विकास अधिकारी की दादागिरी, ग्राम पंचायत कार्यालय से कार्यकर्ता को धक्के देकर निकाला बाहर, रायपुर के झूठा ग्राम पंचायत का मामला, वीडियो सोशल मीडिया पर वायरल, क्षेत्र वासियों से ऐसे लापहरवा अधिकारी पर कारवाही की मांग की ।*
    user_Kishor vaishnav
    Kishor vaishnav
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • సదాశివపేట మున్సిపాలిటీలో మంచినీటి సరఫరా కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి
    1
    సదాశివపేట మున్సిపాలిటీలో మంచినీటి సరఫరా కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
  • సి ఐటీయుచొరవ కార్మికుల ఐక్యత తో మెరుగైన వేతన ఒప్పందం.... సిఐటియు చొరవ కార్మికుల ఐక్యమత్యం ద్వారా మెరుగైన వేతన ఒప్పందం సాధ్యమైందని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అన్నారు.మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు శివారులోని నియాపోలి పరిశ్రమ కార్మికుల వేతన ఒప్పందం పై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి వద్ద శుక్రవారం నాడు సంతకాలు పూర్తి అయిన సందర్భంగా ఏ.మల్లేశం మాట్లాడినారు.కార్మికుల వేతన ఒప్పందం గడువు 2026 మార్చి 31 తో పూర్తి కాగా ఏప్రిల్ నెలలో యాజమాన్యం తో ఏప్రిల్ 12 వ తేదీన వేతన ఒప్పందం పై చర్చలు జరిగినాయన్నారు.ఆ ఒప్పందం ప్రకారం కార్మికులకు నెలకు గరిష్టంగా 7080 రూపాయలు, కనిష్టంగా 6000 రూపాయల వేతనం పెంపుదల, నెలకు 30 రూపాయల సర్వీస్ వెయిటేజ్, 1982 సిరీస్ ప్రకారం వి.డి. ఏ 7 రూపాయల నుండి 8 రూపాయలకు పెంపుదల, ముగ్గురు క్యాజువల్ కార్మికులను పెర్మనెంట్ చేయడం కోసం ఒప్పందం కుదిరిందన్నారు.జిల్లా లో చాలా పరిశ్రమల్లో నెలల తరబడి చర్చలు జరిగే సాంప్రదాయం ఉండగా CITU ఒకే దఫా చర్చలు చేసి ఒప్పందం చేయడం జిల్లాలోనే రికార్డు అన్నారు.ఇది కేవలం CITU నిజాయితీ,కార్మికుల ఐక్యమత్యం తోనే సాధ్యం అయిందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ఒక వైపు 12 గం.ల పని విధానం,ఉన్న కార్మికుల్నే కాంట్రాక్ట్ కార్మికులు గా మారుస్తుంటే ఉన్న క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేసే చరిత్ర CITU దే అని ఏ.మల్లేశం అన్నారు.జిల్లాలో అనేక పరిశ్రమల్లో ఎప్పుడో నిర్ణయించిన కనీస వేతనాలు అమలు చేయకపోవడం, ఇ.ఎస్. ఐ, పి.ఎఫ్, బోనస్ లాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఏ.మల్లేశం అన్నారు.కేంద్రం ప్రభుత్వం పాత చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్స్ తీసుకురావడం ద్వారా ప్రైవేట్ యాజమాన్యాలు మరింత రెచ్చి పోయి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు.హక్కుల కోసం యూనియన్స్ ఏర్పాటు చేసుకుని పోరాడటమే అంతిమ పరిష్కారం అని అన్నారు.పోరాడే కార్మికులకు CiTU పూర్తి అండగా నిలుస్తుందని అన్నారు.వేతన ఒప్పందం పై యజమ్యం తరపున పరిశ్రమ పార్టనర్ దక్షిత్ మోర్, ప్రతినిధి ఆదర్శ్, నియాపోలి ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITU తరపున CITU జిల్లా కార్యదర్శి ఆ యూనియన్ అధ్యక్షులు ఏ.మల్లేశం ,ప్రధాన కార్యదర్శి కె.నవీన్, ఉపాధ్యక్షులు మురళి గౌడ్,సహాయ కార్యదర్శి మహేష్, కోశాధికారి శేఖర్, కార్మిక శాఖ తరపున డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రవీందర్ రెడ్డి సంతకాలు చేశారు. ఐ.డి యాక్ట్ 12(3)ప్రకారం ఈ వేతన ఒప్పందం కాల పరిమితి 2026 ఏప్రిల్ 1 నుండి 2029 మార్చి 31 వరకు ఉంటుందన్నారు.
    1
    సి ఐటీయుచొరవ కార్మికుల ఐక్యత తో మెరుగైన వేతన ఒప్పందం....
సిఐటియు చొరవ కార్మికుల ఐక్యమత్యం ద్వారా మెరుగైన వేతన ఒప్పందం సాధ్యమైందని సిఐటియు  జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అన్నారు.మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు శివారులోని నియాపోలి పరిశ్రమ కార్మికుల వేతన ఒప్పందం పై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి వద్ద శుక్రవారం నాడు సంతకాలు పూర్తి అయిన సందర్భంగా ఏ.మల్లేశం మాట్లాడినారు.కార్మికుల వేతన ఒప్పందం గడువు 2026 మార్చి 31 తో పూర్తి కాగా ఏప్రిల్ నెలలో యాజమాన్యం తో ఏప్రిల్ 12 వ తేదీన వేతన ఒప్పందం పై చర్చలు జరిగినాయన్నారు.ఆ ఒప్పందం ప్రకారం కార్మికులకు నెలకు  గరిష్టంగా 7080 రూపాయలు, కనిష్టంగా 6000 రూపాయల వేతనం పెంపుదల, నెలకు 30 రూపాయల సర్వీస్ వెయిటేజ్, 1982 సిరీస్ ప్రకారం వి.డి. ఏ 7 రూపాయల నుండి 8 రూపాయలకు పెంపుదల, ముగ్గురు క్యాజువల్ కార్మికులను పెర్మనెంట్ చేయడం కోసం ఒప్పందం కుదిరిందన్నారు.జిల్లా లో చాలా పరిశ్రమల్లో నెలల తరబడి చర్చలు జరిగే సాంప్రదాయం ఉండగా CITU ఒకే దఫా చర్చలు చేసి ఒప్పందం చేయడం జిల్లాలోనే రికార్డు అన్నారు.ఇది కేవలం CITU నిజాయితీ,కార్మికుల ఐక్యమత్యం తోనే సాధ్యం అయిందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ఒక వైపు 12 గం.ల పని విధానం,ఉన్న కార్మికుల్నే కాంట్రాక్ట్ కార్మికులు గా మారుస్తుంటే ఉన్న క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేసే చరిత్ర CITU దే అని ఏ.మల్లేశం అన్నారు.జిల్లాలో అనేక పరిశ్రమల్లో ఎప్పుడో నిర్ణయించిన కనీస వేతనాలు అమలు చేయకపోవడం, ఇ.ఎస్. ఐ, పి.ఎఫ్, బోనస్ లాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఏ.మల్లేశం అన్నారు.కేంద్రం ప్రభుత్వం పాత చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్స్ తీసుకురావడం ద్వారా ప్రైవేట్ యాజమాన్యాలు మరింత రెచ్చి పోయి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు.హక్కుల కోసం యూనియన్స్ ఏర్పాటు చేసుకుని పోరాడటమే అంతిమ పరిష్కారం అని అన్నారు.పోరాడే కార్మికులకు CiTU పూర్తి అండగా నిలుస్తుందని అన్నారు.వేతన ఒప్పందం పై యజమ్యం తరపున పరిశ్రమ పార్టనర్ దక్షిత్ మోర్, ప్రతినిధి ఆదర్శ్, నియాపోలి ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITU తరపున CITU జిల్లా కార్యదర్శి ఆ యూనియన్ అధ్యక్షులు ఏ.మల్లేశం ,ప్రధాన కార్యదర్శి కె.నవీన్, ఉపాధ్యక్షులు మురళి గౌడ్,సహాయ కార్యదర్శి మహేష్, కోశాధికారి శేఖర్, కార్మిక శాఖ తరపున డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రవీందర్ రెడ్డి సంతకాలు చేశారు. ఐ.డి యాక్ట్ 12(3)ప్రకారం ఈ వేతన ఒప్పందం కాల పరిమితి 2026 ఏప్రిల్ 1 నుండి 2029 మార్చి 31 వరకు ఉంటుందన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.