డివిజన్ కోర్టులో ఈ-సేవా కేంద్రం, లీగల్ సెల్‌ను ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి, జనగామ అడ్మినిస్ట్రేషన్ జడ్జి శ్రీమతి సూరేపల్లి నంద జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ పట్టణ కేంద్రంలోని కోర్టుకు ముఖ్యఅతిదిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి, జనగామ అడ్మినిస్ట్రేషన్ జడ్జి శ్రీమతి సూరేపల్లి నంద మంజూరైన మండల లీగల్ సెల్, ఈ సేవ కేంద్రంను ప్రారంభించారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకం రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు, కక్షిదారులకు మండల లీగల్ సెల్ ద్వారా ఎన్నో కేసులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందన్నారు. కక్షిదారులకు ఇబ్బంది కాకుండా కేసు అప్డేట్స్ ఆన్లైన్లో చూసుకునే విధంగా ఈ సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. యువ అడ్వకేట్స్ అధికంగా ఉన్న ఈ కోర్టు పరిధిలోని కేసులను త్వరితగతిన పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేకూర్చాలని ఆమె న్యాయవాదులను కోరారు. అనంతరం కోర్టు ఆవరణంలో సెటిల్ ఆడారు. కార్యక్రమంలో జనగామ జిల్లా జడ్జి ప్రతిమ, స్థానిక జడ్జి శివలీల, సందీప, శశి, శ్రీదేవి, హనుమకొండ, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సొల్లేటి రామకృష్ణ, చకిలం ఉపేందర్, జనగామ జనరల్ సెక్రెటరీ మన్నే సత్యం, ఉపాధ్యక్షుడు సోలోమోన్ రాజ్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీలు మునగాల రవీందర్, శర్మ కుమారి, బార్ కౌన్సిల్ సభ్యులు ముందసాని సహోదర రెడ్డి, కొప్పుల సందీప, గుర్రపు బాబు, శ్రీనివాస్, మారపాక ప్రలక్ష్మణ్, పనికర శ్రీశైలం, తాడూరు వనిత, అనూష, విజయ భాస్కరరావు, తాడం శ్వేత, తాళ్లపెళ్లి ప్రేమ్ కుమార్, న్యాయవాదులు వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ కోర్టులో ఈ-సేవా కేంద్రం, లీగల్ సెల్‌ను ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి, జనగామ అడ్మినిస్ట్రేషన్ జడ్జి శ్రీమతి సూరేపల్లి నంద జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ పట్టణ కేంద్రంలోని కోర్టుకు ముఖ్యఅతిదిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి, జనగామ అడ్మినిస్ట్రేషన్ జడ్జి శ్రీమతి సూరేపల్లి నంద మంజూరైన మండల లీగల్ సెల్, ఈ సేవ కేంద్రంను ప్రారంభించారు. అనంతరం బార్
అసోసియేషన్ అధ్యక్షుడు కనకం రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు, కక్షిదారులకు మండల లీగల్ సెల్ ద్వారా ఎన్నో కేసులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందన్నారు. కక్షిదారులకు ఇబ్బంది కాకుండా కేసు అప్డేట్స్ ఆన్లైన్లో చూసుకునే విధంగా ఈ సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. యువ అడ్వకేట్స్ అధికంగా ఉన్న ఈ కోర్టు
పరిధిలోని కేసులను త్వరితగతిన పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేకూర్చాలని ఆమె న్యాయవాదులను కోరారు. అనంతరం కోర్టు ఆవరణంలో సెటిల్ ఆడారు. కార్యక్రమంలో జనగామ జిల్లా జడ్జి ప్రతిమ, స్థానిక జడ్జి శివలీల, సందీప, శశి, శ్రీదేవి, హనుమకొండ, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సొల్లేటి రామకృష్ణ, చకిలం ఉపేందర్, జనగామ జనరల్ సెక్రెటరీ మన్నే సత్యం, ఉపాధ్యక్షుడు సోలోమోన్
రాజ్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీలు మునగాల రవీందర్, శర్మ కుమారి, బార్ కౌన్సిల్ సభ్యులు ముందసాని సహోదర రెడ్డి, కొప్పుల సందీప, గుర్రపు బాబు, శ్రీనివాస్, మారపాక ప్రలక్ష్మణ్, పనికర శ్రీశైలం, తాడూరు వనిత, అనూష, విజయ భాస్కరరావు, తాడం శ్వేత, తాళ్లపెళ్లి ప్రేమ్ కుమార్, న్యాయవాదులు వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
- ఒకే ఊరికి 100 ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మేస్త్రీలు ఇసుక డైమండ్ పెరుగుతుంది: మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకేసారి ఒకే గ్రామంలో 100 ఇందిర ఇండ్లు ఇస్తే, మేస్త్రీలు, ఇసుక డిమాండ్ పెరుగుతుంది అందుకే దశలవారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నాం -కలూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.1
- మండల కేంద్రంలో బెజ్జంకి లో ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలు బెజ్జంకి, ఆగస్టు 1: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సేవలను కొనియాడుతూ, ప్రజల దైనందిన జీవితంలో వారి పాత్ర ఎంతో కీలకమని వక్తలు పేర్కొన్నారు. ఎండ, వాన, చలి తేడా లేకుండా నిత్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ సమాజానికి విశేష సేవలందిస్తున్న ఆటో కార్మికులను అభినందించారు. "మూడు చక్రాలపై ప్రయాణం... వెనుక వేలాది కుటుంబాల జీవనం" అనే సందేశంతో ఆటో డ్రైవర్ల శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజలు కూడా వారికి సహకారం అందించాలని కోరారు. అనంతరం మండలంలోని ఆటో డ్రైవర్లందరికీ ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.2
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షణలో హరినామ సంకీర్తన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండ చుట్టూ శనివారం ఉదయం గిరిప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. భజన బృందాలు, స్థానికులు, భక్తులు, ఆలయ సిబ్బంది, అధికారులు హరినామ సంకీర్తనలతో స్వామివారి గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి, భువనగిరి అంజయ్య, కిరణ్, సత్తిరెడ్డి, సాయిబాబా, మహిళా భక్తులు, భజన బృందాలు పాల్గొన్నారు.1
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జూలై 31 . నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలు శుక్రవారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి నల్లబెల్లి లో నిర్వహించే అంతిమ సంస్కారానికి హాజరై నివాళులర్పించారు.అంతిమయాత్రలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య గౌరవ వందనం నిర్వహించారు. అంతిమ యాత్ర లో ప్రజా ప్రతినిధులు , జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అంతిమ నివాళులర్పించారు.1
- కరీంనగర్‌లో కళాకారుల ఆధ్వర్యంలో బోనాల జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో కళాకారుల ఆధ్వర్యంలో వైభవంగా బోనాల జాతర నిర్వహించనున్నారు. ఈ నెల 5వ తేదీ, బుధవారం రోజున జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ నుంచి కోతీరాంపూర్ పోచమ్మ ఆలయం వరకు ఈ జాతర కార్యక్రమం అత్యంత వైభవంగా సాగనుంది. గోడపత్రిక ఆవిష్కరణ ఈ జాతర కార్యక్రమానికి సంబంధించి కళాకారులు నేడు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం జాతరకు సంబంధించిన గోడపత్రికల ను వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాకారుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి,కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ - శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్,కళాకారులు గోగుల ప్రసాద్,సంద స్వప్న పలువురు బీఆర్ఎస్ నాయకులు, మరియు కళాకారులు తదితరులు ఉన్నారు.1
- చీకుపల్లి కల్వర్టును పరిశీలించిన మంత్రి సీతక్క.. వరద నష్టాల నివారణకు వేగవంతమైన చర్యలు ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద జాతీయ రహదారిపై వరదలతో దెబ్బతిన్న కల్వర్టును మంత్రి సీతక్క శనివారం పరిశీలించారు. అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించిన ఆమె, రాకపోకలను త్వరితగతిన పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఏర్పాట్లతో పాటు శాశ్వత పరిష్కారానికి అవసరమైన పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు రెండేళ్లుగా ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి చేరుకున్నప్పటికీ ముందస్తు ఏర్పాట్ల వల్ల పెద్దగా నష్టం జరగలేదని పేర్కొన్నారు. రామన్నగూడెం వద్ద లీకేజీల నివారణకు తాత్కాలిక పనులు పూర్తయ్యాయని, శాశ్వత పరిష్కారం కోసం రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.1
- భారత దేశంలో 5 శక్తి పీఠాలలో ఒకటిగా మన ఆలేరు నియోజకవర్గం లోని కొలనుపాక కోటిలింగాల శివుడు భారతదేశంలోనే ఐదు శివశక్తి పీఠాలు అందులో ఒకటిగా మన భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కొలనుపాక లో ఉన్న కోటిలింగాల శివుడు ని దర్శించుకున్న వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి1
- కరీంనగర్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొస్తా...విమర్శించే వారికి అభివృద్ధి పనులతో సమాధానం చెప్పాలి- కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని గల్లీగల్లీని అభివృద్ధి చేస్తానని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. గతంలో తప్పులు చేసి ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న వారిని విమర్శించే వారిపై చర్యలు తీసుకునేలా కృషి చేయాలని మేయర్ డిప్యూటీ మేయర్ ను ఆదేశించారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పరామర్శలతో బిజీబిజీగా గడిపారు. ఉదయం తన నివాసం వద్దకు వచ్చిన సందర్శకులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్పొరేటర్లు, బీజేపీ నాయకులతో కలిసి పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 48వ డివిజన్ లోని విద్యానగర్ కురుమవాడలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తోపాటు స్థానిక కార్పొరేటర్ కర్ర పద్మ అనిల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ నిధుల్లో 80 లక్షలు యూఐడీఎఫ్ నిధులు కాగా, మిగిలిన రూ.20 లక్షలు మున్సిపల్ సాధారణ ఫండ్ కు సంబంధించినవని తెలిపారు. 19వ డివిజన్ లోని రేకుర్తి ముదిరాజ్ కాలనీకి వెళ్లిన కేంద్ర మంత్రి 40 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీ నరసింహ కాలనీలో 57 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుండి మొగ్దుంపూర్ వెళ్లిన కేంద్ర మంత్రి 10 లక్షల జాతీయ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన మహిళాశక్తి ధరణి గ్రామైఖ్య సంఘ భవనాన్ని స్థానిక సర్పంచ్ శివకుమార్ తో కలిసి ప్రారంభించారు. 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్ ను ప్రారంభించారు. చింతకుంట వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంబేద్కర్ భవన్ సమీపంలో నిర్వహించిన ‘‘వన మహోత్సవం-2026’’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు అధికారులతోపాటు మహిళలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి స్వయంగా మొక్కలను నాటారు. కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు తన పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తానని స్పష్టం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 22 వేల కోట్లు నిధులు ఖర్చు పెట్టామని త్వరలోనే వివిధ కేంద్ర పథకాల కింద మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు.1
- కరీంనగర్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం... పలువురు బిజేవైఎం నాయకుల అరెస్ట్ విద్యార్థుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్ లో బీజేవైఎం కార్యకర్తల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులను సీఎం క్రిమినల్స్ అన్నాడని బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్ లో ధర్నాకు దిగి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుని స్వల్ప ఉద్రిక్తకు దారి తీసింది. పోలీసులు కళ్ళుగప్పి బీజేవైఎం కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు దగ్ధమవుతున్న దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకొని , బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.2