logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*శ్రావణమాసంలో కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధం..!!* *సురేఖ తో పాటు మరో ఇద్దరికి ఉద్వాసన..???* కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రావణ మాసంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతున్నది. ఒకరిద్దరు మంత్రులను తొలగించి, వారి స్థానంలో కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతున్నది. కేబినెట్ నుంచి తప్పించే జాబితాలో కొండా సురేఖ పేరు తప్పనిసరిగా ఉంటుందని తెలుస్తున్నది. అదేసమయంలో మంత్రుల శాఖలను సైతం మార్చేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో డిస్కషన్ ఉంది. *సెప్టెంబరు 10 వరకు తేల్చేద్దాం..!!* సెప్టెంబరు 10 వరకు శ్రావణమాసం ఉంది. ఈలోపే కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాలని ఏఐసీసీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే వర్షకాల అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబరు7 నుంచి ప్రారంభించి, రెండు మూడు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనితో పునర్వ్యవస్థీకరణ సమావేశాలలోపు చేయాలా ? లేకపోతే ఆ తరువాత చేపట్టాలా ? అనే అంశంపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అయితే ఉన్నపళంగా కొండా సురేఖను మాత్రమే కేబినెట్ నుంచి తప్పిస్తే, మహిళా, బీసీ సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆమె కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసినందుకు ప్రతికారంగానే మంత్రి వర్గం నుంచి తొలగించారని విమర్శలు వచ్చే చాన్స్ ఉంది. అందుకని పనితీరు సరిగాలేని మంత్రులను తప్పిస్తే రాజకీయంగా విమర్శలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందనే కోణంలో ఏఐసీసీ నేతలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. పనిలో పనిగా మంత్రుల వద్ద ఉన్న శాఖలను సైతం మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. కొందరు మంత్రులు తమ శాఖలను అడ్డంపెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీనితో అటు మంత్రివర్గ రిషఫ్లింగ్, ఇటు మంత్రుల శాఖల్లో మార్పులు చేపడితే పాలన వ్యవహారంలో భాగంగా మార్పులు, చేర్పులు చేశారని సంకేతాలు వెళ్తాయని అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. *ఒ(త)ప్పించే బాధ్యత ఏఐసీసీ పైనే..!!* కేబినెట్ నుంచి తప్పించే మంత్రుల జాబితాను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం ముందు పెట్టినట్టు తెలిసింది. సదరు మంత్రులను తప్పించేందుకు ఉన్న కారణాలను సైతం వివరించినట్టు సమాచారం. ఆ మంత్రులతో రాజీనామా చేయించే బాధ్యతలను మాత్రం ఏఐసీసీ పెద్దలు తీసుకునే చాన్స్ ఉందని తెలిసింది. రాజీనామాకు ఒప్పుకోకపోతే నయానో, భయానో దారిలోకి తెచ్చుకునే అవకాశం ఉంది. అయినా ఒప్పుకోకపోతే మాత్రం అప్పుడు బర్తరఫ్ అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉంటుందని ఏఐసీసీకి సన్నిహితంగా ఉండే ఓ నేత అభిప్రాయపడ్డారు. అయితే పదవి కోల్పోయిన తరువాత సదరు లీడర్లు మౌనంగా ఉంటారా ? ప్రభుత్వంపై ప్రతిరోజు విమర్శలు చేస్తే ఎలా ?అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. అందుకని కేబినెట్ ప్రక్షాళన తరువాత తలెత్తే రాజకీయ పరిణామాలను సైతం అంచనా వేసి, వాటిని కౌంటర్ చేసేందుకు కూడా వ్యూహరచన చేస్తున్నట్టు తెలిసింది. *ప్రక్షాళన చేయకుంటే పట్టుతప్పేలా ఉంది..!!* మొన్నటి వరకు కేబినెట్ విస్తరణ అవసరం లేదని అటు కాంగ్రెస్ హైకమాండ్, ఇటు రాష్ట్రనేతలు భావించారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను నింపడం పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే మంత్రి పదవులు ఆశిస్తోన్న ఎమ్మెల్యేల జాబితా చాలా పెద్దగా ఉండటంతో ఎవరిని సంతృప్తి పరచాలో అర్థం కాక మౌనంగా ఉన్నారు. కానీ కొండా సురేఖ కుమార్తె సృష్టించిన వివాదానికి తెర పడాలంటే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తప్పదని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కేబినెట్‌లోకి కొత్తగా మున్నూరు కాపు, ఓసీ సామాజిక వర్గంతో పాటు ఎస్టీ సామాజిక వర్గం వారికి అవకాశం దక్కునుంది. *పనిలో పనిగా వర్షకాల సమావేశాల్లో పెండింగ్ లో ఉన్న డిప్యూటీ స్పీకర్ ఎన్నికను సైతం పూర్తి చేయాలని భావిస్తున్నారు.* సామాజిక,జిల్లాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది.

3 hrs ago
user_JADI RAJU
JADI RAJU
Financial Analyst ఖానాపూర్, వరంగల్, తెలంగాణ•
3 hrs ago
8144b437-8390-42c1-b0df-b498dcda2c10

*శ్రావణమాసంలో కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధం..!!* *సురేఖ తో పాటు మరో ఇద్దరికి ఉద్వాసన..???* కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రావణ మాసంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతున్నది. ఒకరిద్దరు మంత్రులను తొలగించి, వారి స్థానంలో కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతున్నది. కేబినెట్ నుంచి తప్పించే జాబితాలో కొండా సురేఖ పేరు తప్పనిసరిగా ఉంటుందని తెలుస్తున్నది. అదేసమయంలో మంత్రుల శాఖలను సైతం మార్చేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో డిస్కషన్ ఉంది. *సెప్టెంబరు 10 వరకు తేల్చేద్దాం..!!* సెప్టెంబరు 10 వరకు శ్రావణమాసం ఉంది. ఈలోపే కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాలని ఏఐసీసీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే వర్షకాల అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబరు7 నుంచి ప్రారంభించి, రెండు మూడు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనితో పునర్వ్యవస్థీకరణ సమావేశాలలోపు చేయాలా ? లేకపోతే ఆ తరువాత చేపట్టాలా ? అనే అంశంపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అయితే ఉన్నపళంగా కొండా సురేఖను మాత్రమే కేబినెట్ నుంచి తప్పిస్తే, మహిళా, బీసీ సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆమె కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసినందుకు ప్రతికారంగానే మంత్రి వర్గం నుంచి తొలగించారని విమర్శలు వచ్చే చాన్స్ ఉంది. అందుకని పనితీరు సరిగాలేని మంత్రులను తప్పిస్తే రాజకీయంగా విమర్శలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందనే కోణంలో ఏఐసీసీ నేతలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. పనిలో పనిగా మంత్రుల వద్ద ఉన్న శాఖలను సైతం మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. కొందరు మంత్రులు తమ శాఖలను అడ్డంపెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీనితో అటు మంత్రివర్గ రిషఫ్లింగ్, ఇటు మంత్రుల శాఖల్లో మార్పులు చేపడితే పాలన వ్యవహారంలో భాగంగా మార్పులు, చేర్పులు చేశారని సంకేతాలు వెళ్తాయని అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. *ఒ(త)ప్పించే బాధ్యత ఏఐసీసీ పైనే..!!* కేబినెట్ నుంచి తప్పించే మంత్రుల జాబితాను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం ముందు పెట్టినట్టు తెలిసింది. సదరు మంత్రులను తప్పించేందుకు ఉన్న కారణాలను సైతం వివరించినట్టు సమాచారం. ఆ మంత్రులతో రాజీనామా చేయించే బాధ్యతలను మాత్రం ఏఐసీసీ పెద్దలు తీసుకునే చాన్స్ ఉందని తెలిసింది. రాజీనామాకు ఒప్పుకోకపోతే నయానో, భయానో దారిలోకి తెచ్చుకునే అవకాశం ఉంది. అయినా ఒప్పుకోకపోతే మాత్రం అప్పుడు బర్తరఫ్ అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉంటుందని ఏఐసీసీకి సన్నిహితంగా ఉండే ఓ నేత అభిప్రాయపడ్డారు. అయితే పదవి కోల్పోయిన తరువాత సదరు లీడర్లు మౌనంగా ఉంటారా ? ప్రభుత్వంపై ప్రతిరోజు విమర్శలు చేస్తే ఎలా ?అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. అందుకని కేబినెట్ ప్రక్షాళన తరువాత తలెత్తే రాజకీయ పరిణామాలను సైతం అంచనా వేసి, వాటిని కౌంటర్ చేసేందుకు కూడా వ్యూహరచన చేస్తున్నట్టు తెలిసింది. *ప్రక్షాళన చేయకుంటే పట్టుతప్పేలా ఉంది..!!* మొన్నటి వరకు కేబినెట్ విస్తరణ అవసరం లేదని అటు కాంగ్రెస్ హైకమాండ్, ఇటు రాష్ట్రనేతలు భావించారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను నింపడం పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే మంత్రి పదవులు ఆశిస్తోన్న ఎమ్మెల్యేల జాబితా చాలా పెద్దగా ఉండటంతో ఎవరిని సంతృప్తి పరచాలో అర్థం కాక మౌనంగా ఉన్నారు. కానీ కొండా సురేఖ కుమార్తె సృష్టించిన వివాదానికి తెర పడాలంటే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తప్పదని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కేబినెట్‌లోకి కొత్తగా మున్నూరు కాపు, ఓసీ సామాజిక వర్గంతో పాటు ఎస్టీ సామాజిక వర్గం వారికి అవకాశం దక్కునుంది. *పనిలో పనిగా వర్షకాల సమావేశాల్లో పెండింగ్ లో ఉన్న డిప్యూటీ స్పీకర్ ఎన్నికను సైతం పూర్తి చేయాలని భావిస్తున్నారు.* సామాజిక,జిల్లాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది.

More news from తెలంగాణ and nearby areas
  • రాఖీ పండుగ వేళ ఆయుర్వేద విద్యార్థుల నిరసన.. స్టైఫండ్ పెంపు జీవో కోసం ఆందోళన వరంగల్: రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా కుటుంబ సభ్యులు పండుగను ఆనందంగా జరుపుకుంటుండగా, అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థులు, హౌస్ సర్జన్లు మాత్రం తమ డిమాండ్ల సాధన కోసం నిరసన కొనసాగించారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ హక్కులు, భవిష్యత్తు కోసం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. స్టైఫండ్ పెంపు కోసం ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఆయుష్ వైద్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. స్టైఫండ్ పెంపు జీవో విడుదల చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో విడుదల చేసే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని విద్యార్థులు, హౌస్ సర్జన్లు స్పష్టం చేశారు.
    1
    రాఖీ పండుగ వేళ ఆయుర్వేద విద్యార్థుల నిరసన.. స్టైఫండ్ పెంపు జీవో కోసం ఆందోళన
వరంగల్: రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా కుటుంబ సభ్యులు పండుగను ఆనందంగా జరుపుకుంటుండగా, అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థులు, హౌస్ సర్జన్లు మాత్రం తమ డిమాండ్ల సాధన కోసం నిరసన కొనసాగించారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ హక్కులు, భవిష్యత్తు కోసం ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. స్టైఫండ్ పెంపు కోసం ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఆయుష్ వైద్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
స్టైఫండ్ పెంపు జీవో విడుదల చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో విడుదల చేసే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని విద్యార్థులు, హౌస్ సర్జన్లు స్పష్టం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • ములుగు జిల్లా కేంద్రంలో సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
    1
    ములుగు జిల్లా కేంద్రంలో సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
    user_Swathi
    Swathi
    గ్రాఫిక్ డిజైనర్ ములుగు, ములుగు, తెలంగాణ•
    4 hrs ago
  • ములుగు లో ఘనంగా రాఖీ వేడుకలు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు. ములుగు లో ఘనంగా రాఖీ వేడుకలు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు. ములుగు జిల్లా కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరితో కలిసి రక్షాబంధన్ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా పలువురు సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సోదరభావం, ప్రేమ, ఆప్యాయతలు మరింత పెంపొందాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, ఆరోగ్యం, భద్రత, అభివృద్ధి కలగాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి సీతక్కకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజలతో కలిసి పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
    1
    ములుగు లో ఘనంగా రాఖీ వేడుకలు.
మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు.
ములుగు లో ఘనంగా రాఖీ వేడుకలు.
మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు.
ములుగు జిల్లా కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరితో కలిసి రక్షాబంధన్ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా పలువురు సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
సమాజంలో సోదరభావం, ప్రేమ, ఆప్యాయతలు మరింత పెంపొందాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, ఆరోగ్యం, భద్రత, అభివృద్ధి కలగాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి సీతక్కకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజలతో కలిసి పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
    user_Matla sampath
    Matla sampath
    ములుగు, ములుగు, తెలంగాణ•
    13 hrs ago
  • రైతులు ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రైతులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం పొందాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లికి చెందిన రైతు పిట్టల రాజు వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించారు. రైతు పందిళ్ల విధానంలో సాగు చేస్తున్న దొండ, సొర, పొట్లకాయ పంటలను పరిశీలించారు. తోట నిర్వహణ తీరు, పంట ఎదుగుదల, నీటి వినియోగం, దిగుబడి అవకాశాలపై రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తోటను చక్కగా నిర్వహిస్తున్నందుకు రైతును అభినందించారు. పంటలు మరింత ఆరోగ్యంగా ఎదగాలంటే పిచ్చి మొక్కలను తొలగించి కలుపు నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి యాజమాన్యం, పందిళ్ల నిర్వహణ, పంట సంరక్షణ చర్యలను క్రమం తప్పకుండా చేపట్టాలని తెలిపారు. రైతు సాగు చేస్తున్న పంటల విస్తీర్ణం, పెట్టుబడి వ్యయం, నీటి వనరు, ప్రభుత్వ సబ్సిడీ ద్వారా పొందిన లబ్ధి, దిగుబడి, మార్కెటింగ్ తదితర అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలో సాగు చేస్తున్న పంటలను కూడా పరిశీలించి పంట ఆరోగ్యం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణపై పలు సూచనలు చేశారు. పంటల వైవిధ్యీకరణతో పాటు ఉద్యానవన పంటల సాగు చేపట్టడం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ వ్యవసాయ, ఉద్యానవన పథకాలను రైతులు వినియోగించుకుని ఆధునిక సాగు విధానాల వైపు అడుగులు వేయాలని సూచించారు. కలెక్టర్ పర్యటనలో ఉద్యానవన శాఖ అధికారి సందీప్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    రైతులు ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రైతులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం పొందాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లికి చెందిన రైతు పిట్టల రాజు వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించారు. రైతు పందిళ్ల విధానంలో సాగు చేస్తున్న దొండ, సొర, పొట్లకాయ పంటలను పరిశీలించారు. తోట నిర్వహణ తీరు, పంట ఎదుగుదల, నీటి వినియోగం, దిగుబడి అవకాశాలపై రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ తోటను చక్కగా నిర్వహిస్తున్నందుకు రైతును అభినందించారు. పంటలు మరింత ఆరోగ్యంగా ఎదగాలంటే పిచ్చి మొక్కలను తొలగించి కలుపు నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి యాజమాన్యం, పందిళ్ల నిర్వహణ, పంట సంరక్షణ చర్యలను క్రమం తప్పకుండా చేపట్టాలని తెలిపారు.
రైతు సాగు చేస్తున్న పంటల విస్తీర్ణం, పెట్టుబడి వ్యయం, నీటి వనరు, ప్రభుత్వ సబ్సిడీ ద్వారా పొందిన లబ్ధి, దిగుబడి, మార్కెటింగ్ తదితర అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలో సాగు చేస్తున్న పంటలను కూడా పరిశీలించి పంట ఆరోగ్యం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణపై పలు సూచనలు చేశారు.
పంటల వైవిధ్యీకరణతో పాటు ఉద్యానవన పంటల సాగు చేపట్టడం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ వ్యవసాయ, ఉద్యానవన పథకాలను రైతులు వినియోగించుకుని ఆధునిక సాగు విధానాల వైపు అడుగులు వేయాలని సూచించారు.
కలెక్టర్ పర్యటనలో ఉద్యానవన శాఖ అధికారి సందీప్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    53 min ago
  • అడ్డంగా వచ్చిన బైక్ ను తప్పించబోయి పల్టీ కొట్టిన వోల్వో బస్సు కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు కక్కూర్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అడ్డుగావచ్చిన బైక్ ను తప్పించబోయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న పెట్రోల్ పంపు ప్రాంగణంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 35 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
    1
    అడ్డంగా వచ్చిన బైక్ ను తప్పించబోయి పల్టీ కొట్టిన వోల్వో బస్సు
కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు కక్కూర్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అడ్డుగావచ్చిన బైక్ ను తప్పించబోయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న పెట్రోల్ పంపు ప్రాంగణంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 35 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    6 hrs ago
  • బెయిల్ .. 40 ఏళ్లు పరార్... హత్య కేసులో జీవిత ఖైదీ.. పేరు మార్చుకుని ఉద్యోగం.. 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు.. చివరకు అరెస్టు.. ఒక హత్య కేసులో జీవిత ఖైదు.. జైల్లో గడిపింది కేవలం ఆరు నెలల ఏడు రోజులు.. పెరోల్ పై బయటకు వచ్చి జైలుకు వెళ్లకుం డా ఏకంగా 40 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం గడిపాడు .. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం.. ఏకంగా 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు. గెలుచుకొన్నాడు .. చివరకు 73 ఏళ్ల వయసులో మళ్లీ అరెస్టు.. అయ్యాడు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మం డలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది 1982లో మహబూబాబాద్ లో ఓ పాన్ షాప్ వద్ద జరిగిన ఘర్షణలో మార్వాడీ వ్యాపారి జవార్ పండరిని తూకం బాటుతో మోది హత్య చేశారు, ఈ కేసులో నిందితుడుగా ఉన్న వీరన్న కు వరంగల్ అద నపు జిల్లా కోర్టు 1983 జూన్ 9న అతడికి జీవిత ఖైదు విధించింది. అనంతరం వీరన్నను వరంగల్ సెంట్రల్ జైలులో (ఖైదీ నంబర్ 1567) ఉంచారు. మొత్తం శిక్షలో కేవలం 6 నెలల 7 రోజులు జైలు జీవితం గడిపిన ఆయన 1983 డిసెంబర్ 17న 30 రోజుల పెరోల్పై బయటకు వచ్చాడు. పెరోల్ పై 1984 మార్చి 17 వరకు పొడిగించారు. మార్చి 18న తిరిగి జైలుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తిరిగి వెళ్లలేదు. అక్కడి నుంచి మొదలైంది నాలుగు దశాబ్దాల పాటు పోలీస్ ల కళ్ళకు దొరకకుండా తిరిగాడు. హైకోర్టు రికార్డుల ప్రకారం 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న వరంగల్ సెంట్రల్ జైలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అతడిని పట్టు కుంది. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలు మూసివేత కారణంగా చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇంతకాలం అధికారులకు చిక్కకుండా ఉన్న వీరన్న పేరు మార్చుకుని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జిల్లా గుడివాడలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి 2013లో పదవీ విరమణ చేశాడు. కోసమేరుపు ఏమిటంటే పెన్షన్ కూడా పొందుతున్నాడు. ఉద్యోగ కాలంలో 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు కూడా అందుకున్నరు 2013 నుంచి మహబూబాబాద్ జిల్లాలోనే నివసిస్తున్నప్పటికీ 2024 వరకు అధికారులు అతడిని పట్టు కోలేకపోయారు. స్వగ్రామమైన పెద్దముప్పారానికి అప్పుడప్పుడు వచ్చేవాడని సమాచారం. వీరన్నను పట్టుకునేందుకు అధికారులు పలు దశల్లో ప్రయ త్నాలు చేశారు 2012 నవంబర్ 19 నుంచి 2020 అక్టోబర్ 3 వరకు మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాల పోలీసు అధికారులకు లేఖలు పంపినట్లు, చివరిగా తెలిసిన చిరునామా, సమీప గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు ఎట్టకేలకు 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వీరన్న ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలు కు తరలించారు.... అయితే వీరన్న భార్య సందుల చారమ్మ 2026లో హైకోర్టును ఆశ్రయించారు. 2024లో జైలు అధికారులు విధించిన 27 రోజుల రిమిషన్ రద్దు. మూడేళ్ల పాటు పెరోల్ తిరస్కరణ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి. మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెరోల్ పై వెళ్లి తిరిగి జైలుకు రాకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా తప్పించుకుని తిరిగిన జీవిత ఖైదీ విషయంలో హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పెరోల్ పై వెళ్లిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పాందడం ఆశ్చర్యకరమని.... అంతే కాకుండా జైళ్ల శాఖలోని లోపాలను ఎత్తిచూపుతోందని, అధికారుల అలసత్వం తెలియజేస్తోందని అందోళన వ్యక్తం చేసింది. శిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా తన నేర చరిత్రను దాచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మోసపూరితంగా పొందడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి ఘటనలు ఇతర ఖైదీలు నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రోత్సాహకంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. భవిష్య త్లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన నిఘా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెరోల్ గడువు ముగిసే తేదీని నిరంతరం పర్యవేక్షించడం, గడువు ముగిసిన వెంటనే ఖైదీ జైలుకు హాజరయ్యాడా చూడాలని హాజరుకాని వారిపై తక్షణ చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కోర్టు తెలియజేసింది ఇక ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాక రిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. గతంలో అతడిపై విధించిన జీవిత ఖైదులో మిగిలిన శిక్షను అనుభవించాల్సిం దేనని స్పష్టం చేశారు న్యాయమూర్తి.... ఫెరోల్ నిరాకరణతో..ప్రస్తుతం వీరన్న చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నాడు.
    1
    బెయిల్ .. 40 ఏళ్లు పరార్... హత్య కేసులో జీవిత ఖైదీ..

పేరు మార్చుకుని ఉద్యోగం.. 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు.. చివరకు అరెస్టు..
ఒక హత్య కేసులో జీవిత ఖైదు.. జైల్లో గడిపింది కేవలం ఆరు నెలల ఏడు రోజులు.. పెరోల్ పై బయటకు వచ్చి జైలుకు వెళ్లకుం డా ఏకంగా 40 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం గడిపాడు .. పేరు మార్చుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం.. ఏకంగా 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు. గెలుచుకొన్నాడు .. చివరకు 73 ఏళ్ల వయసులో మళ్లీ అరెస్టు.. అయ్యాడు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మం డలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది 
1982లో మహబూబాబాద్ లో ఓ పాన్ షాప్ వద్ద జరిగిన ఘర్షణలో మార్వాడీ వ్యాపారి జవార్ పండరిని తూకం బాటుతో మోది హత్య చేశారు, ఈ కేసులో  నిందితుడుగా ఉన్న వీరన్న కు వరంగల్ అద నపు జిల్లా కోర్టు 1983 జూన్ 9న అతడికి జీవిత ఖైదు విధించింది. అనంతరం వీరన్నను వరంగల్ సెంట్రల్ జైలులో (ఖైదీ నంబర్ 1567) ఉంచారు. మొత్తం శిక్షలో కేవలం 6 నెలల 7 రోజులు జైలు జీవితం గడిపిన ఆయన 1983 డిసెంబర్ 17న 30 రోజుల పెరోల్పై బయటకు వచ్చాడు. 
పెరోల్ పై 1984 మార్చి 17 వరకు పొడిగించారు. మార్చి 18న తిరిగి జైలుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తిరిగి వెళ్లలేదు. అక్కడి నుంచి మొదలైంది నాలుగు దశాబ్దాల పాటు పోలీస్ ల కళ్ళకు దొరకకుండా తిరిగాడు. హైకోర్టు రికార్డుల ప్రకారం 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న వరంగల్ సెంట్రల్ జైలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అతడిని పట్టు కుంది. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలు మూసివేత కారణంగా చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇంతకాలం అధికారులకు చిక్కకుండా ఉన్న వీరన్న పేరు మార్చుకుని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జిల్లా గుడివాడలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి  2013లో పదవీ విరమణ చేశాడు. కోసమేరుపు ఏమిటంటే పెన్షన్ కూడా పొందుతున్నాడు. ఉద్యోగ కాలంలో 'ఉత్తమ ఉపాధ్యాయుడు' అవార్డు కూడా అందుకున్నరు 2013 నుంచి మహబూబాబాద్ జిల్లాలోనే నివసిస్తున్నప్పటికీ 2024 వరకు అధికారులు అతడిని పట్టు కోలేకపోయారు. స్వగ్రామమైన పెద్దముప్పారానికి అప్పుడప్పుడు వచ్చేవాడని సమాచారం. వీరన్నను పట్టుకునేందుకు అధికారులు పలు దశల్లో ప్రయ త్నాలు చేశారు 2012 నవంబర్ 19 నుంచి 2020 అక్టోబర్ 3 వరకు మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాల పోలీసు అధికారులకు లేఖలు పంపినట్లు, చివరిగా తెలిసిన చిరునామా, సమీప గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు ఎట్టకేలకు 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న ప్రత్యేక టాస్క్ ఫోర్స్   వీరన్న ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలు కు తరలించారు....
అయితే 
వీరన్న భార్య సందుల చారమ్మ 2026లో హైకోర్టును ఆశ్రయించారు. 2024లో జైలు అధికారులు విధించిన 27 రోజుల రిమిషన్ రద్దు.  మూడేళ్ల పాటు పెరోల్ తిరస్కరణ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి. మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెరోల్ పై వెళ్లి తిరిగి జైలుకు రాకుండా ఏకంగా 40 ఏళ్లకు పైగా తప్పించుకుని తిరిగిన జీవిత ఖైదీ విషయంలో హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పెరోల్ పై వెళ్లిన వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పాందడం ఆశ్చర్యకరమని....  అంతే కాకుండా జైళ్ల శాఖలోని లోపాలను ఎత్తిచూపుతోందని, అధికారుల అలసత్వం తెలియజేస్తోందని అందోళన వ్యక్తం చేసింది. శిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా తన నేర చరిత్రను దాచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మోసపూరితంగా పొందడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి ఘటనలు ఇతర ఖైదీలు నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రోత్సాహకంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. భవిష్య త్లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన నిఘా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెరోల్ గడువు ముగిసే తేదీని నిరంతరం పర్యవేక్షించడం, గడువు ముగిసిన వెంటనే ఖైదీ జైలుకు హాజరయ్యాడా  చూడాలని హాజరుకాని వారిపై తక్షణ చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కోర్టు  తెలియజేసింది ఇక ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాక రిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది. గతంలో అతడిపై విధించిన జీవిత ఖైదులో మిగిలిన శిక్షను అనుభవించాల్సిం దేనని స్పష్టం చేశారు న్యాయమూర్తి.... ఫెరోల్ నిరాకరణతో..ప్రస్తుతం వీరన్న చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నాడు.
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • 🎯 “నడిరోడ్డుపై పోలీసుల దాష్టీకం.. కోదాడలో అసలేం జరిగింది?” సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో షాపుల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు తమ షాపులను తొలగించారని బాధితులు ఆరోపిస్తున్నారు.అంతేకాదు.. మున్సిపల్ కమిషనర్‌కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే తమ షాపులను తొలగించారని బాధితులు ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరును నిరసిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కోదాడ టౌన్ సీఐ.. ఆందోళన చేస్తున్న బాధితులపై దాడికి పాల్పడి, కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లారని బాధితులు ఆరోపిస్తున్నారు. అడ్డొచ్చిన మహిళలను సైతం పోలీసులు నెట్టివేసి, పలువురు బాధితులను అరెస్ట్ చేశారని వారు పేర్కొన్నారు.నడిరోడ్డుపై సీఐ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షాపుల తొలగింపుపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    🎯 “నడిరోడ్డుపై పోలీసుల దాష్టీకం.. కోదాడలో అసలేం జరిగింది?”
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో షాపుల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు తమ షాపులను తొలగించారని బాధితులు ఆరోపిస్తున్నారు.అంతేకాదు.. మున్సిపల్ కమిషనర్‌కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే తమ షాపులను తొలగించారని బాధితులు ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరును నిరసిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కోదాడ టౌన్ సీఐ.. ఆందోళన చేస్తున్న బాధితులపై దాడికి పాల్పడి, కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లారని బాధితులు ఆరోపిస్తున్నారు. అడ్డొచ్చిన మహిళలను సైతం పోలీసులు నెట్టివేసి, పలువురు బాధితులను అరెస్ట్ చేశారని వారు పేర్కొన్నారు.నడిరోడ్డుపై సీఐ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షాపుల తొలగింపుపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • జనగామలో ఇంటి దొంగ అరెస్ట్.. 45 గ్రాముల బంగారం స్వాధీనం.. జనగామ: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా రాయవరం గ్రామానికి చెందిన దబ్బేట బాలలింగం అలియాస్ బాలు అలియాస్ ప్రవీణ్ రాజు (29)ను జనగామ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో జనగామలో ఓ ఇంటి తాళం పగులగొట్టి బంగారం చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. వరంగల్‌లో బంగారం విక్రయించేందుకు వెళ్తుండగా అతడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి రెండు జతల కమ్మలు, రెండు వరుసల చైన్, మరో చైన్ కలిపి 44.990 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో సుమారు 90 కేసులు ఉండగా, పీడీ యాక్ట్ కింద కూడా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
    1
    జనగామలో ఇంటి దొంగ అరెస్ట్.. 45 గ్రాముల బంగారం స్వాధీనం..
జనగామ: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా రాయవరం గ్రామానికి చెందిన దబ్బేట బాలలింగం అలియాస్ బాలు అలియాస్ ప్రవీణ్ రాజు (29)ను జనగామ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో జనగామలో ఓ ఇంటి తాళం పగులగొట్టి బంగారం చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. వరంగల్‌లో బంగారం విక్రయించేందుకు వెళ్తుండగా అతడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి రెండు జతల కమ్మలు, రెండు వరుసల చైన్, మరో చైన్ కలిపి 44.990 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో సుమారు 90 కేసులు ఉండగా, పీడీ యాక్ట్ కింద కూడా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.