logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు* ఖమ్మం గడ్డపై వెలుగుమట్ల భూ బాధితుల కన్నీళ్లు తుడవడానికి, వారికి న్యాయం చేయాలని నడుం బిగించిన విశారధన్ మహారాజ్ గారు ఈరోజు ఎక్కడున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి! ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును నొక్కేయాలని చూడటం పిరికిపంద చర్య. బాధితులకు అండగా నిలబడటం నేరమా? పేదవాడి భూమి కోసం పోరాడటం తప్పా? మహారాజ్ గారిని ఎక్కడ దాచారో, ఏ కండిషన్ లో ఉన్నారో వెంటనే ప్రజల ముందుకు తీసుకురావాలి. అక్రమంగా బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలి. లేనిపక్షంలో, ఈ సెగ కేవలం ఖమ్మం జిల్లాకే పరిమితం కాదు... ఇది రాష్ట్రవ్యాప్త దావాగ్నిలా మారుతుంది! ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం... మా సహనాన్ని పరీక్షించవద్దు. వెంటనే విశారదన్ మహారాజ్ గారిని విడుదల చేయకపోతే, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, ధర్నాలతో సర్కార్‌ను గడగడలాడిస్తాం. న్యాయం గెలిచే వరకు, మా పోరాటం ఆగదు! *జై వెలుగుమట్ల బాధితుల పోరాటం!* *విశారధన్ మహారాజ్ గారిని వెంటనే విడుదల చేయాలి!"*

1 hr ago
user_Akhil kumar
Akhil kumar
Farmer Pudur, Vikarabad•
1 hr ago
e70e2f8f-3d3c-46aa-a566-a5a5839a2ffa

*అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు* ఖమ్మం గడ్డపై వెలుగుమట్ల భూ బాధితుల కన్నీళ్లు తుడవడానికి, వారికి న్యాయం చేయాలని నడుం బిగించిన విశారధన్ మహారాజ్ గారు ఈరోజు ఎక్కడున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి! ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును నొక్కేయాలని చూడటం పిరికిపంద చర్య. బాధితులకు అండగా నిలబడటం నేరమా? పేదవాడి భూమి కోసం పోరాడటం తప్పా? మహారాజ్ గారిని ఎక్కడ దాచారో, ఏ కండిషన్ లో ఉన్నారో వెంటనే ప్రజల ముందుకు తీసుకురావాలి. అక్రమంగా బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలి. లేనిపక్షంలో, ఈ సెగ కేవలం ఖమ్మం జిల్లాకే పరిమితం కాదు... ఇది రాష్ట్రవ్యాప్త దావాగ్నిలా మారుతుంది! ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం... మా సహనాన్ని పరీక్షించవద్దు. వెంటనే విశారదన్ మహారాజ్ గారిని విడుదల చేయకపోతే, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, ధర్నాలతో సర్కార్‌ను గడగడలాడిస్తాం. న్యాయం గెలిచే వరకు, మా పోరాటం ఆగదు! *జై వెలుగుమట్ల బాధితుల పోరాటం!* *విశారధన్ మహారాజ్ గారిని వెంటనే విడుదల చేయాలి!"*

More news from తెలంగాణ and nearby areas
  • మహిళలు పురుషులతో సమానంగా ఎదుగుతున్నారు: సంగారెడ్డిలో TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి
    1
    మహిళలు పురుషులతో సమానంగా ఎదుగుతున్నారు: సంగారెడ్డిలో TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • *హైదరాబాద్‌లో మున్సిపల్ నిర్లక్ష్యం – చెత్త తగలబెట్టడంతో చెట్లకు, విద్యుత్ వైర్లకు మంటలు* హైదరాబాద్: జిహెచ్ఎంసి శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్‌పేట్ సర్కిల్‌లో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా చెత్తను సక్రమంగా తరలించకుండా అక్కడికక్కడే తగలబెట్టడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ ఘటన మీర్పేట్ ప్రధాన రహదారిపై, మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది స్థానికుల సమాచారం ప్రకారం, మున్సిపల్ సిబ్బంది తగలబెట్టిన చెత్త మంటలు సమీపంలోని చెట్లకు అంటుకున్నాయి. అక్కడి నుంచి మంటలు పైగా వెళ్లే విద్యుత్ వైర్ల వరకు వ్యాపించడంతో కొంతసేపు ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. బడంగ్పేట్ సర్కిల్ కమిషనర్ సరస్వతి సంఘటనపై ఫోన్లు చేసిన స్పందించలేదని స్థానిక మాజీ కార్పొరేటర్ బిక్షపతి చారి తెలిపారు ఫైర్స్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు చెత్తను బహిరంగంగా తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు
    3
    *హైదరాబాద్‌లో మున్సిపల్ నిర్లక్ష్యం – చెత్త తగలబెట్టడంతో చెట్లకు, విద్యుత్ వైర్లకు మంటలు*
హైదరాబాద్: జిహెచ్ఎంసి  శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్‌పేట్ సర్కిల్‌లో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. 
99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా చెత్తను సక్రమంగా తరలించకుండా అక్కడికక్కడే తగలబెట్టడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది.
ఈ ఘటన మీర్పేట్ ప్రధాన రహదారిపై, మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది
స్థానికుల సమాచారం ప్రకారం, మున్సిపల్ సిబ్బంది తగలబెట్టిన చెత్త మంటలు సమీపంలోని చెట్లకు అంటుకున్నాయి. అక్కడి నుంచి మంటలు పైగా వెళ్లే విద్యుత్ వైర్ల వరకు వ్యాపించడంతో కొంతసేపు ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.
బడంగ్పేట్ సర్కిల్ కమిషనర్ సరస్వతి సంఘటనపై ఫోన్లు చేసిన స్పందించలేదని స్థానిక మాజీ కార్పొరేటర్ బిక్షపతి చారి తెలిపారు
ఫైర్స్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో  సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు 
చెత్తను బహిరంగంగా తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు 
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    38 min ago
  • రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన వేమ్ నరేందర్ రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన వేమ్ నరేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభలో రాష్ట్ర ప్రజల సమస్యలను సమర్థంగా ప్రస్తావిస్తూ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంపై కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. వేమ్ నరేందర్ రెడ్డి కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.
    1
    రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన వేమ్ నరేందర్ రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన వేమ్ నరేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభలో రాష్ట్ర ప్రజల సమస్యలను సమర్థంగా ప్రస్తావిస్తూ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంపై కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. వేమ్ నరేందర్ రెడ్డి కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    49 min ago
  • యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి.. వర్ధన్నపేట అవగాహన సదస్సులో ఏసీపీ పిలుపు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కదలాలి, పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన.: ఏసీపీ నర్సయ్య. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం మరియు పిల్లల భద్రతపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, నేటి యువత దేశానికి వెన్నెముక అని, అలవాటుగా మారే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ​తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సమాజంలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, తహసిల్దార్ విజయసాగర్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి.. వర్ధన్నపేట అవగాహన సదస్సులో ఏసీపీ పిలుపు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కదలాలి,
పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన.: ఏసీపీ నర్సయ్య.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం మరియు పిల్లల భద్రతపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, నేటి యువత దేశానికి వెన్నెముక అని, అలవాటుగా మారే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
​తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సమాజంలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, తహసిల్దార్ విజయసాగర్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • **గజ్వేల్, సిద్దిపేట జిల్లా మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్‌హౌస్‌ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్‌లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్‌స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో మల్లన్నసాగర్‌కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
    4
    **గజ్వేల్, సిద్దిపేట జిల్లా  మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/
గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్‌హౌస్‌ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్‌లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్‌స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి.
కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో మల్లన్నసాగర్‌కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • రాష్ట్ర ప్రభుత్వ 'ప్రజా పాలన -- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఎంపీడీవో విగ్నేశ్వర్ పోతాన్ శెట్టిపల్లి గ్రామంలోని డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్త విభజన, కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రమోద, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    రాష్ట్ర ప్రభుత్వ 'ప్రజా పాలన -- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఎంపీడీవో విగ్నేశ్వర్ పోతాన్ శెట్టిపల్లి గ్రామంలోని డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్త విభజన, కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రమోద, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
    user_Sk report PRESS
    Sk report PRESS
    Local Politician మసాయిపేట్, మెదక్, తెలంగాణ•
    21 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 10 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నిరసన గజ్వేల్: కరెంట్ సరఫరాలో కోత విధించడంతో పoటలు ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితి మారక పోతే సహించేదీలేదని ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం గజ్వే ల్లో లోని సబ్స్టే స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్శాఖ డీఈ భానుప్రకాశకు వినతిపత్రం అందజేశారు. అనం తరం ఆయన మాట్లాడుతూ గతంలో కేసీఆర్ రైతులకు 24గంటలూ విద్యుత్ సరఫరా అందజేసి అండగా నిలిస్తే.. నేడు పరిస్థితి భిన్నంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో 9గంటలకు మించి సరఫరా కావడం లేదన్నారు. దీంతో పం టలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన, దేవీ రవీందర్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 10 ప్రజా తెలంగాణ న్యూస్/
గజ్వేల్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నిరసన
గజ్వేల్: కరెంట్ సరఫరాలో కోత విధించడంతో పoటలు ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితి మారక పోతే సహించేదీలేదని ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం గజ్వే ల్లో లోని సబ్స్టే స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్శాఖ డీఈ భానుప్రకాశకు వినతిపత్రం అందజేశారు. అనం తరం ఆయన మాట్లాడుతూ గతంలో కేసీఆర్ రైతులకు 24గంటలూ విద్యుత్ సరఫరా అందజేసి 
అండగా నిలిస్తే.. నేడు పరిస్థితి భిన్నంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో 9గంటలకు మించి సరఫరా కావడం లేదన్నారు. దీంతో పం టలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన, దేవీ రవీందర్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • యాంకర్:గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించి,భారతదేశంలో గోవధ నిషేద ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని గోమాత గౌరవ ప్రచారాన్నీ హైద్రాబాద్,గోశామహల్ బేగంబజార్ నుండి ప్రారంభించింది.ఏప్రిల్ 27న భారతీయులు,గో ప్రేమికులు అందరూ గో సంరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి తహసీల్దార్, పోస్టాఫీస్ ల ద్వారా దరఖాస్తులు,లేటర్ లు రాష్ట్రపతి, ప్రధానమంత్రి,గవర్నర్, ముఖ్యమంత్రులకు సమర్పించాలని కోరుతూ గోమాత ప్రచారాం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
    2
    యాంకర్:గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించి,భారతదేశంలో గోవధ నిషేద ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని గోమాత గౌరవ ప్రచారాన్నీ హైద్రాబాద్,గోశామహల్ బేగంబజార్ నుండి ప్రారంభించింది.ఏప్రిల్ 27న భారతీయులు,గో ప్రేమికులు అందరూ గో సంరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి తహసీల్దార్, పోస్టాఫీస్ ల ద్వారా దరఖాస్తులు,లేటర్ లు రాష్ట్రపతి, ప్రధానమంత్రి,గవర్నర్, ముఖ్యమంత్రులకు సమర్పించాలని  కోరుతూ గోమాత ప్రచారాం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    44 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.