పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ త్వరగా పూర్తి చేయాలి:కలెక్టర్ జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయం నుండి జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శనివారం సాయంత్రానికి జిల్లావ్యాప్తంగా కనీసం 80 శాతం పాసుపుస్తకాల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజన్ల వారీగా పంపిణీ పురోగతిని సమీక్షించిన కలెక్టర్, క్షేత్రస్థాయిలో ఏవైనా సాంకేతిక లేదా ఇతర సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి రైతులకు పుస్తకాలు అందేలా చూడాలన్నారు. జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రైతులందరికీ పారదర్శకంగా, వేగంగా పాసుపుస్తకాలు అందజేయడంలో తహసీల్దార్లు చొరవ చూపాలని, నిర్దేశించిన గడువులోగా పని పూర్తి చేయాలని ఆదేశించారు.

- ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్ళ కోసం సరళమైన అలవాట్లను చూపించే దంత పరిష్కారాల చెక్‌లిస్ట్.1
- నరసన్నపేట ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆకట్టుకున్న సంక్రాంతి వేడుకలు నరసన్నపేట సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో శనివారం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ కన్వీనర్ బగ్గు అర్చన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థినిలు భోగి మంటలు, హరిదాసుల వేషధారణతో అలరించారు. సంక్షేమ అధికారిని సూర్యప్రభపర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో, వసతి గృహ ప్రాంగణంలో విద్యార్థినిలు వేసిన రంగవల్లులను అర్చన ప్రశంసించారు.1
- భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో స్థానిక కోర్టు కూడలి వద్ద రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహాన్ని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- 🙏🙏1
- అక్షర స్కూల్ లో వైభవంగా సంక్రాంతి సంబరాలు.... మండపేట న్యూస్... రిపోర్టర్ నందికోళ్ల రాజు.... స్థానిక గొల్లపుంత రోడ్డులోని అక్షర స్కూల్ లో డైరెక్టర్స్ విజ్ఞాన్ రాంబాబు, బొప్పన వెంకటరావుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగువారి సంస్కృతికి ప్రతీకగా రంగు రంగుల ముగ్గులతో స్కూల్ ఆవరణను అలంకరించడంతోపాటు గాలిపతంగులు, హరిదాసు కీర్తనలతో విద్యార్థులు ఆనందంగా గడిపారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులపై భోగిపళ్ళు వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు...3
- 🙏🙏1
- 🙏🙏1
- నరసన్నపేట: పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ వేగవంతం చేయండి ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తహశీల్దార్ సత్యనారాయణ తెలిపారు. శనివారం నరసన్నపేట మండలం యారబాడు, ఉర్లాం, కంబకాయ, కరగాం రెవెన్యూ గ్రామాలలో ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ, రెవెన్యూ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. శత శాతం ఈరోజు పంపిణీ కావాలన్నారు. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.1