పంట కోలుకునేందుకు ఎకరాకు 15 కిలోల యూరియా,15 కిలోల పొటాష్ వేయాలని సూచన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఆచంట మండలం వేమవరం గ్రామంలో ముంపునకు గురైన వరి చేలను వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం పరిశీలించారు. పాలకొల్లు సహాయ వ్యవసాయ సంచాలకులు పి. మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పంట పరిస్థితిని పరిశీలించారు.ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ ఇటీవల ముంపునకు గురైన వరి చేలు ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాయని తెలిపారు. ఇప్పటికే సుమారు 90 శాతం ముంపు నీరు తొలగిపోయిందని, బుధవారం సాయంత్రానికి పూర్తిస్థాయిలో నీరు తొలగిపోయే అవకాశం ఉందన్నారు.రైతులు అప్రమత్తంగా ఉండి ముంపునకు గురైన వరి పంట త్వరగా కోలుకునేందుకు బూస్టర్ డోస్‌గా ఎకరాకు 15 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ ఎరువులు వేసుకోవాలని సూచించారు.మండల వ్యవసాయ అధికారి బి.నాగరాజు మాట్లాడుతూ ముంపునకు గురైన వరి పంటను తెగుళ్ల నుంచి కాపాడేందుకు లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున సాఫ్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలని రైతులకు సూచించారు.పంట పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.
పంట కోలుకునేందుకు ఎకరాకు 15 కిలోల యూరియా,15 కిలోల పొటాష్ వేయాలని సూచన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఆచంట మండలం వేమవరం గ్రామంలో ముంపునకు గురైన వరి చేలను వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం పరిశీలించారు. పాలకొల్లు సహాయ వ్యవసాయ సంచాలకులు పి. మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పంట పరిస్థితిని పరిశీలించారు.ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ ఇటీవల ముంపునకు గురైన వరి చేలు ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాయని తెలిపారు. ఇప్పటికే సుమారు 90 శాతం ముంపు నీరు తొలగిపోయిందని, బుధవారం
సాయంత్రానికి పూర్తిస్థాయిలో నీరు తొలగిపోయే అవకాశం ఉందన్నారు.రైతులు అప్రమత్తంగా ఉండి ముంపునకు గురైన వరి పంట త్వరగా కోలుకునేందుకు బూస్టర్ డోస్‌గా ఎకరాకు 15 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ ఎరువులు వేసుకోవాలని సూచించారు.మండల వ్యవసాయ అధికారి బి.నాగరాజు మాట్లాడుతూ ముంపునకు గురైన వరి పంటను తెగుళ్ల నుంచి కాపాడేందుకు లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున సాఫ్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలని రైతులకు సూచించారు.పంట పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.
- పెనుగొండలో ఉధృతమైన వీఆర్ఏల సమ్మె న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ధర్నా తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వీఆర్ఏ సంఘాల జేఏసీ పిలుపు మేరకు వీఆర్ఏలు బుధవారం పెనుగొండలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు.గాంధీ బొమ్మల రోడ్డులోని కచేరి సెంటర్ వద్ద నరసాపురం డివిజన్ వీఆర్ఏల అధ్యక్షుడు తానేటి నాగరాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మందికి పైగా వీఆర్ఏలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తానేటి నాగరాజు మాట్లాడుతూ గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థకు కీలకంగా పనిచేస్తూ ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.తమ సమస్యలపై పలుమార్లు విన్నవించినప్పటికీ స్పష్టమైన పరిష్కారం లభించకపోవడంతో సహాయ నిరాకరణకు దిగాల్సి వచ్చిందన్నారు.డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. వీఆర్ఏలకు తక్షణమే పేస్కేల్ అమలు చేయాలని ఏళ్లుగా నామిని వీఆర్ఏలుగా పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.అర్హత కలిగిన వీఆర్ఏలకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ విధానంలో వీఆర్‌ఓలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. వీఆర్‌ఓ,అటెండర్,నైట్‌వాచ్‌మన్ పోస్టుల్లో వీఆర్ఏలకు ఉన్న పదోన్నతి కోటాను 20 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల వీఆర్ఏల సంఘం ప్రతినిధులు,వివిధ గ్రామాల వీఆర్ఏలు,మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.1
- చించినాడ గ్రామంలో.. విద్యార్థులకు సైకిల్ పంపిణీ అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు1
- రోడ్డు వేయండి మహాప్రభో.. మా కష్టాలు తీర్చండి.......... అంబేద్కర్ కోనసీమ జిల్లా: పల్లంకూరు గ్రామపంచాయతీ పరిధిలోని దాసరి వారి పేటకు వెళ్లే రహదారి అత్యంత దయనీయంగా మారింది. గుంతలు, బురదతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం కోసం గ్రామస్తులు పలుమార్లు గ్రామపంచాయతీ కార్యాలయం, మండల కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారులకు వినతులు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు. ఈ రహదారిపై ఆధారపడి సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు కూడా గ్రామానికి చేరుకోవడం కష్టంగా మారుతోందని తెలిపారు. తమ సమస్యను జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా పరిశీలించి, దాసరి వారి పేట రహదారికి నూతన రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- ఫ్లెక్సీ చింతివేతపై వైసిపి శ్రేణులు ఆందోళన.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నాయకులు తాడేపల్లిగూడెం పాతూరులో వైసీపీ నాయకుడు వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు చించి వేశారు. దీంతో వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని వైసీపీ పట్టణాధ్యక్షుడు గొర్రెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిందితులపై చర్య తీసుకోవాలని కోరుతూ పట్టణ ఎస్సై వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. నాయకులు సూర్యచంద్రరావు పాల్గొన్నారు.1
- వినాయక చవితి 14-09-2026 ఆది గణపతి, అయినవిల్లి గణపతి ఘనం గా జరిగిన వేడుకలు1
- తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం *డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం* జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో.. తుమ్మలపల్లి రమేష్ సొంత నిధులతో నిర్వహణ కాకినాడ జిల్లా, జగ్గంపేట, సెప్టెంబర్ 15: జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించారు. ముందుగా డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం సుమారు 500 మందికి ఉచితంగా భోజనం అందించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సేవా స్ఫూర్తితో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తన సొంత నిధులతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలు, కూలీలు, వృద్ధులు, ప్రయాణికులు, ఆపదలో ఉన్న వారికి భోజనం అందించి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని రమేష్ తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు తుమ్మలపల్లి రమేష్ స్వయంగా భోజనం వడ్డించారు. భోజనం చేస్తున్న వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, పాఠం శెట్టి రమేష్, పులి ప్రసాద్, గోకేడ ప్రసాద్,అడబాల వీరబాబు,గుంటముక్కల పెద్ద, పబ్బిరెడ్డి మణికంఠ, డ్రిల్ మాస్టారు,కోలమూరు బుజ్జి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.3
- వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన *దంతాలపల్లి ఎస్సై రవికుమార్ వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళనకి దిగారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణకేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారుఎస్సై బి. రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు గూగులోత్ రూప్సింగ్ మరియు వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ బాధితుల ఉన్నతాధికారులు స్పందించాలని విజ్ఞప్తి.1
- మీ ఎముకలు అత్యంత వహిస్తే, గుల్లగా తయారవుతాయి. అరిగిపోతాయి జాగ్రత్త వహించండి.. ఇప్పటి నుండే మంచి ఆహారం తీసుకోండి1