logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చింతూరు సీహెచ్‌సీలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ప్రారంబించిన డి సి హెచ్ ఎస్ డా సాంబశివరావు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో ఆగస్టు 1 నుండి 7 వరకు వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తల్లులు, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు మరియు వైద్య సిబ్బందికి తల్లిపాల ప్రాముఖ్యత, వాటి వల్ల తల్లి-శిశువులకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డా. వి. దివ్య గారి ఆధ్వర్యంలో, పోలవరం జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా సాంబశివరావు ప్రారంభించడం జరిగింది. పిల్లల వైద్య నిపుణులు, ఎస్‌ఎన్‌సీయూ మెడికల్ ఆఫీసర్ డా. బి. మహేష్ తల్లిపాల ప్రాముఖ్యత, పుట్టిన గంటలోనే తల్లిపాలను ప్రారంభించడం, మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, అనంతరం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పరిపూరక ఆహారంతో పాటు తల్లిపాలను కొనసాగించడం వంటి అంశాలపై వివరించారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించి ఆరోగ్యకరమైన ఎదుగుదల, మానసిక వికాసానికి దోహదపడతాయని, శిశువుల్లో ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, న్యూమోనియా, ఆకస్మిక శిశు మరణం (SIDS) వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయని తెలిపారు. అలాగే తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి-శిశువుల మధ్య భావోద్వేగ బంధం బలపడటంతో పాటు, ప్రసవానంతర రక్తస్రావం తగ్గడం, గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి చేరడం, రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్ల ప్రమాదం తగ్గడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. ఈ సందర్భంగా తల్లులకు తల్లిపాలు ఇచ్చే సరైన పద్ధతులు, శిశువును సరైన విధంగా పట్టుకుని పాలివ్వడం, తల్లిపాలపై ఉన్న అపోహలను నివృత్తి చేయడం, సందేహాలకు సమాధానాలు ఇవ్వడం వంటి అంశాలపై ప్రత్యేక ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల ప్రోత్సాహంలో ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు మరియు ఆరోగ్య సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా. వి. దివ్య, ఎస్‌ఎన్‌సీయూ మెడికల్ ఆఫీసర్ డా. బి. మహేష్, డా. శివకుమార్ (ఆర్థోపెడిక్), డా. రమణరావు, డా. భరద్వాజ్, డా. శశికళ (స్త్రీ & ప్రసూతి వైద్య నిపుణులు), డా. స్పందన, డా నిఖిల ENT డా మాధవీలత NRC మెడికల్ ఆఫీసర్,ప్రసూతి అనంతర తల్లులు, గర్భిణులు ,ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

1 hr ago
user_Sode Prasad
Sode Prasad
Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
c9a52511-504c-4683-9e07-6fab027f831d

చింతూరు సీహెచ్‌సీలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ప్రారంబించిన డి సి హెచ్ ఎస్ డా సాంబశివరావు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో ఆగస్టు 1 నుండి 7 వరకు వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తల్లులు, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు మరియు వైద్య సిబ్బందికి తల్లిపాల ప్రాముఖ్యత, వాటి వల్ల తల్లి-శిశువులకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డా. వి. దివ్య గారి ఆధ్వర్యంలో, పోలవరం జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా సాంబశివరావు ప్రారంభించడం జరిగింది. పిల్లల వైద్య నిపుణులు, ఎస్‌ఎన్‌సీయూ మెడికల్ ఆఫీసర్ డా. బి. మహేష్ తల్లిపాల ప్రాముఖ్యత, పుట్టిన గంటలోనే తల్లిపాలను ప్రారంభించడం, మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, అనంతరం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పరిపూరక ఆహారంతో పాటు తల్లిపాలను కొనసాగించడం వంటి అంశాలపై వివరించారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించి ఆరోగ్యకరమైన ఎదుగుదల, మానసిక వికాసానికి దోహదపడతాయని, శిశువుల్లో ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, న్యూమోనియా, ఆకస్మిక శిశు మరణం (SIDS) వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయని తెలిపారు. అలాగే తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి-శిశువుల మధ్య భావోద్వేగ బంధం బలపడటంతో పాటు, ప్రసవానంతర రక్తస్రావం తగ్గడం, గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి చేరడం, రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్ల ప్రమాదం తగ్గడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. ఈ సందర్భంగా తల్లులకు తల్లిపాలు ఇచ్చే సరైన పద్ధతులు, శిశువును సరైన విధంగా పట్టుకుని పాలివ్వడం, తల్లిపాలపై ఉన్న అపోహలను నివృత్తి చేయడం, సందేహాలకు సమాధానాలు ఇవ్వడం వంటి అంశాలపై ప్రత్యేక ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల ప్రోత్సాహంలో ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు మరియు ఆరోగ్య సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా. వి. దివ్య, ఎస్‌ఎన్‌సీయూ మెడికల్ ఆఫీసర్ డా. బి. మహేష్, డా. శివకుమార్ (ఆర్థోపెడిక్), డా. రమణరావు, డా. భరద్వాజ్, డా. శశికళ (స్త్రీ & ప్రసూతి వైద్య నిపుణులు), డా. స్పందన, డా నిఖిల ENT డా మాధవీలత NRC మెడికల్ ఆఫీసర్,ప్రసూతి అనంతర తల్లులు, గర్భిణులు ,ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే పాయం సారపాక: గోదావరి వరదల నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం సారపాక ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బూర్గంపాడులో 28, సారపాకలో 55 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సర్పంచ్‌ బాధితులకు అండగా ఉంటున్నారని అన్నారు. గోదావరి 56 అడుగులకు చేరిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
    1
    ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే పాయం
సారపాక: గోదావరి వరదల నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం సారపాక ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బూర్గంపాడులో 28, సారపాకలో 55 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సర్పంచ్‌ బాధితులకు అండగా ఉంటున్నారని అన్నారు. గోదావరి 56 అడుగులకు చేరిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
  • భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది ఆ సంస్థ ప్రతినిధుల నుంచి గిన్నిస్ అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అందుకుని థింసా నృత్యంలో పాల్గొన్నారు...
    1
    భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది
ఆ సంస్థ ప్రతినిధుల నుంచి గిన్నిస్ అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అందుకుని థింసా నృత్యంలో పాల్గొన్నారు...
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    10 hrs ago
  • కాంగ్రెస్ అంటేనే ఎవుసానికి పట్టిన దరిద్రం! రేవంత్ రెడ్డి అడుగు పడగానే... రాష్ట్రంలో ఎవుసం మొత్తం ఆగమైంది. నీళ్లు వస్తలేవు, యూరియా దొరుకుతలేదు, రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు. – అన్నదాత ఆవేదన 😢 కాంగ్రెస్ అంటేనే ఎవుసానికి పట్టిన దరిద్రం! రేవంత్ రెడ్డి అడుగు పడగానే... రాష్ట్రంలో ఎవుసం మొత్తం ఆగమైంది. నీళ్లు వస్తలేవు, యూరియా దొరుకుతలేదు, రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు. – అన్నదాత ఆవేదన 😢
    1
    కాంగ్రెస్ అంటేనే 
ఎవుసానికి పట్టిన దరిద్రం!

రేవంత్ రెడ్డి అడుగు పడగానే...
రాష్ట్రంలో ఎవుసం మొత్తం ఆగమైంది.

నీళ్లు వస్తలేవు, యూరియా దొరుకుతలేదు,
రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు.

– అన్నదాత ఆవేదన 😢
కాంగ్రెస్ అంటేనే 
ఎవుసానికి పట్టిన దరిద్రం!
రేవంత్ రెడ్డి అడుగు పడగానే...
రాష్ట్రంలో ఎవుసం మొత్తం ఆగమైంది.
నీళ్లు వస్తలేవు, యూరియా దొరుకుతలేదు,
రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు.
– అన్నదాత ఆవేదన 😢
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    6 hrs ago
  • భారీ పెట్టుబడి మోసం కేసును ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ప్రధాన నిందితుడి అరెస్టు.. నేరార్జిత ఆస్తులుగా గుర్తించిన 35 వాహనాలు స్వాధీనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.134/2026 కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలు, ఇతర చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వివరాలను వెల్లడించడం జరిగింది. భార్పాటీ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడు తాను భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్‌లో లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని, తనతో భాగస్వామిగా ఉంటే కాంట్రాక్ట్ పనులు ఇప్పించి అధిక లాభాలు అందిస్తానని నమ్మబలికి పలువురు బాధితుల నుంచి సుమారు రూ.52 కోట్ల మేర పెట్టుబడుల పేరుతో మోసపూరితంగా డబ్బులు సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాధితుల విశ్వాసాన్ని పొందేందుకు నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు పత్రాలు రూపొందించి, లాభాల్లో 4 శాతం వాటా ఇస్తామని హామీలు ఇచ్చి మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. అలాగే బీకే నాయుడు అండ్ కో., రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ ఈ మోసపూరిత కార్యకలాపాలు సాగించినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడిని కేరళ రాష్ట్రంలోని పాలా ప్రాంతంలో అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై జిల్లాకు తీసుకువచ్చి పోలీసు కస్టడీలో విచారించినట్లు తెలిపారు. విచారణలో భాగంగా నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 6 బస్సులు, ఒక వాటర్ ట్యాంకర్ లారీ, 3 ట్రాక్టర్లు, 2 వ్యవసాయ పరికరాలు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు, 2 ట్రైలర్లు కలిపి మొత్తం 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా బాధితుల నుంచి మోసపూరితంగా సేకరించిన డబ్బుతో భద్రాచలంలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఒక మూడు అంతస్తుల భవనం, ఒక ప్లాట్ కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సంబంధిత పత్రాల పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. మరిన్ని బాధితులను గుర్తించడం, నేరార్జిత ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకోవడం, పూర్తి మనీ ట్రైల్‌ను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అధిక లాభాలు వస్తాయని, తక్కువ సమయంలో పెట్టుబడికి రెట్టింపు లేదా భారీ రాబడులు వస్తాయని చెప్పే వ్యక్తులు లేదా సంస్థలను గుడ్డిగా నమ్మి డబ్బులు పెట్టవద్దని ప్రజలకు సూచించారు. ఆకర్షణీయమైన హామీలు, నకిలీ పత్రాలు, తప్పుడు ఒప్పందాలతో మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద పెట్టుబడి పథకాలపై సమాచారం తెలిసినా లేదా మోసానికి గురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల అప్రమత్తతతోనే ఇటువంటి ఆర్థిక నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బందిని, జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు .
    1
    భారీ పెట్టుబడి మోసం కేసును ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు
ప్రధాన నిందితుడి అరెస్టు.. నేరార్జిత ఆస్తులుగా గుర్తించిన 35 వాహనాలు స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.134/2026 కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలు, ఇతర చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వివరాలను వెల్లడించడం జరిగింది.
భార్పాటీ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడు తాను భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్‌లో లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని, తనతో భాగస్వామిగా ఉంటే కాంట్రాక్ట్ పనులు ఇప్పించి అధిక లాభాలు అందిస్తానని నమ్మబలికి పలువురు బాధితుల నుంచి సుమారు రూ.52 కోట్ల మేర పెట్టుబడుల పేరుతో మోసపూరితంగా డబ్బులు సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
బాధితుల విశ్వాసాన్ని పొందేందుకు నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు పత్రాలు రూపొందించి, లాభాల్లో 4 శాతం వాటా ఇస్తామని హామీలు ఇచ్చి మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. అలాగే బీకే నాయుడు అండ్ కో., రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ ఈ మోసపూరిత కార్యకలాపాలు సాగించినట్లు గుర్తించినట్లు వెల్లడించారు.
సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడిని కేరళ రాష్ట్రంలోని పాలా ప్రాంతంలో అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై జిల్లాకు తీసుకువచ్చి పోలీసు కస్టడీలో విచారించినట్లు తెలిపారు. విచారణలో భాగంగా నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 6 బస్సులు, ఒక వాటర్ ట్యాంకర్ లారీ, 3 ట్రాక్టర్లు, 2 వ్యవసాయ పరికరాలు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు, 2 ట్రైలర్లు కలిపి మొత్తం 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అదేవిధంగా బాధితుల నుంచి మోసపూరితంగా సేకరించిన డబ్బుతో భద్రాచలంలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఒక మూడు అంతస్తుల భవనం, ఒక ప్లాట్ కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు.
ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సంబంధిత పత్రాల పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. మరిన్ని బాధితులను గుర్తించడం, నేరార్జిత ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకోవడం, పూర్తి మనీ ట్రైల్‌ను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
అధిక లాభాలు వస్తాయని, తక్కువ సమయంలో పెట్టుబడికి రెట్టింపు లేదా భారీ రాబడులు వస్తాయని చెప్పే వ్యక్తులు లేదా సంస్థలను గుడ్డిగా నమ్మి డబ్బులు పెట్టవద్దని ప్రజలకు సూచించారు. ఆకర్షణీయమైన హామీలు, నకిలీ పత్రాలు, తప్పుడు ఒప్పందాలతో మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద పెట్టుబడి పథకాలపై సమాచారం తెలిసినా లేదా మోసానికి గురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల అప్రమత్తతతోనే ఇటువంటి ఆర్థిక నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బందిని, జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  అభినందించారు .
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    3 hrs ago
  • వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    1
    వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్......

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • భద్రాచలం రామాలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు భద్రాచలం కరకట్ట వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడి స్థానాలవాటిక వద్దకు చేరుకున్న గోదావరి వరద నీరు భద్రాచలం లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు
    1
    భద్రాచలం రామాలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు 
భద్రాచలం కరకట్ట వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడి స్థానాలవాటిక వద్దకు చేరుకున్న గోదావరి వరద నీరు భద్రాచలం లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు
    user_Banatha. Raja
    Banatha. Raja
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.