logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు సామగ్రి పంపిణీ విద్యార్థుల విద్యాభివృద్ధి,సంక్షేమానికి ప్రాధాన్యత కలెక్టర్ కే. హరిత కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కే. హరిత గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలు, బెడ్‌షీట్లు, కార్పెట్లు, షూస్, ప్లేట్లు, గ్లాసులు, కిట్ బ్యాగులు తదితర విద్యా, వసతి సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ బాధ్యతను విద్యార్థులు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ విద్యార్థులు, వసతి గృహ బోర్డర్లతో నేరుగా ముచ్చటించి వారి చదువు, ప్రతిభ, ఆరోగ్యం, భోజనం, పరిశుభ్రత, వసతి సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధిపై ఉపాధ్యాయులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ జాదవ్ అంబాజీ, డీఆర్డీఏ పీడీ బానోత్ దత్తారం, ఏసీఎంఓ పూర్కా ఉద్దవ్, ఏటీడీఓ చిరంజీవి, డీఎస్‌ఓ మాడావి శేఖు, జీసీడీఓ కొట్నాక్ శకుంతల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, వార్డెన్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

1 hr ago
user_Krishna
Krishna
ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
1 hr ago
10aac31d-c3f4-4565-a479-59532f7868c1

ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు సామగ్రి పంపిణీ విద్యార్థుల విద్యాభివృద్ధి,సంక్షేమానికి ప్రాధాన్యత కలెక్టర్ కే. హరిత కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కే. హరిత గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలు, బెడ్‌షీట్లు, కార్పెట్లు,

c960cac7-5a99-4a70-8321-7ac3adab7b95

షూస్, ప్లేట్లు, గ్లాసులు, కిట్ బ్యాగులు తదితర విద్యా, వసతి సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ బాధ్యతను విద్యార్థులు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ విద్యార్థులు, వసతి గృహ బోర్డర్లతో నేరుగా ముచ్చటించి వారి

8446a67b-adc9-4fda-82af-9f6721e64f4c

చదువు, ప్రతిభ, ఆరోగ్యం, భోజనం, పరిశుభ్రత, వసతి సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధిపై ఉపాధ్యాయులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ విద్యార్థులకు

18f93211-9699-4e82-b8f1-3f9280010d78

సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ జాదవ్ అంబాజీ, డీఆర్డీఏ పీడీ బానోత్ దత్తారం, ఏసీఎంఓ పూర్కా ఉద్దవ్, ఏటీడీఓ చిరంజీవి, డీఎస్‌ఓ మాడావి శేఖు, జీసీడీఓ కొట్నాక్ శకుంతల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, వార్డెన్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • స్వగ్రామాలకు బయలుదేరిన మహిళలు, బస్టాండులలో ప్రయాణికుల సందడి మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయింది. రక్షాబంధన్ పురస్కరించుకొని శుక్రవారం రాత్రి లక్షెట్టిపేట, జన్నారం. ఆర్టీసీ బస్టాండ్లు మహిళా ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయాయి. ప్రభుత్వం బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళా ప్రయాణికులే ఎక్కువమంది కనిపిస్తున్నారు. అదనపు బస్సులు లేకపోవడంతో మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అదనపు బస్సులు నడపాలని మహిళా ప్రయాణికులు కోరుతున్నారు.
    1
    స్వగ్రామాలకు బయలుదేరిన మహిళలు, బస్టాండులలో ప్రయాణికుల సందడి
మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయింది. రక్షాబంధన్ పురస్కరించుకొని శుక్రవారం రాత్రి లక్షెట్టిపేట, జన్నారం. ఆర్టీసీ బస్టాండ్లు మహిళా ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయాయి. ప్రభుత్వం బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళా ప్రయాణికులే ఎక్కువమంది కనిపిస్తున్నారు. 
అదనపు బస్సులు లేకపోవడంతో మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అదనపు బస్సులు నడపాలని మహిళా ప్రయాణికులు కోరుతున్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • మంచిర్యాలలో బీసీ రాజకీయాలకు బలం.. మహేష్‌ వర్మ నాయకత్వంలో ముందడుగు మంచిర్యాల: నియోజకవర్గంలో బీసీ రాజకీయ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోంది. పార్టీ తరఫున బలమైన బీసీ నాయకత్వాన్ని మహేష్‌ వర్మ వహిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కొని బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. తీన్మార్‌ మల్లన్న అధ్యక్షతన పార్టీ ఆధ్వర్యంలో మహేష్‌ వర్మ నాయకత్వంలో బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆత్మగౌరవంతో రాజకీయ అధికారాన్ని సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
    1
    మంచిర్యాలలో బీసీ రాజకీయాలకు బలం.. మహేష్‌ వర్మ నాయకత్వంలో ముందడుగు
మంచిర్యాల: నియోజకవర్గంలో బీసీ రాజకీయ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోంది. పార్టీ తరఫున బలమైన బీసీ నాయకత్వాన్ని మహేష్‌ వర్మ వహిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కొని బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. తీన్మార్‌ మల్లన్న అధ్యక్షతన పార్టీ ఆధ్వర్యంలో మహేష్‌ వర్మ నాయకత్వంలో బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆత్మగౌరవంతో రాజకీయ అధికారాన్ని సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Mancherial, Telangana•
    8 hrs ago
  • కామారెడ్డి జిల్లా బాన్సువాడ లొ ప్రారంభమైన ఎస్ఐఆర్ నోటీసుల ప్రక్రియ. అయోమయ పరిస్థితిలో ఓటర్లు. నోటీస్ ఇచ్చిన సమయ గడువులో ఆధారాలు సమర్పించాలని తెలిపిన కమిషనర్ గోపు గంగాధర్.
    1
    కామారెడ్డి జిల్లా

బాన్సువాడ లొ ప్రారంభమైన ఎస్ఐఆర్ నోటీసుల ప్రక్రియ.

అయోమయ పరిస్థితిలో ఓటర్లు.

నోటీస్ ఇచ్చిన సమయ గడువులో ఆధారాలు సమర్పించాలని తెలిపిన కమిషనర్ గోపు గంగాధర్.
    user_Banswada news
    Banswada news
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    26 min ago
  • స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కోరుట్లలో డా. రఘు టీఆర్ఎస్ నాయకుల ఆందోళన.
    1
    స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కోరుట్లలో డా. రఘు టీఆర్ఎస్ నాయకుల ఆందోళన.
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • Germany is rethinking its place in a rapidly changing world, from defence and energy to its dependence on China and its relationships with Europe and the US. And in that rethink, India is moving from the margins to the centre. Berlin’s “Focus on India” strategy calls India its most important partner in the region. Chancellor Friedrich Merz’s January 2026 visit to India further strengthened this shift, with both sides discussing deeper defence cooperation and joint weapons production. From a strategic partnership to defence manufacturing and a potential mega submarine deal, India and Germany are taking their relationship to a new level. • Watch as German MP and CDU/CSU foreign policy spokesperson Jürgen Hardt sheds light on the growing strategic ties between India and Germany. 🇮🇳🇩🇪
    1
    Germany is rethinking its place in a rapidly changing world, from defence and energy to its dependence on China and its relationships with Europe and the US.
And in that rethink, India is moving from the margins to the centre.
Berlin’s “Focus on India” strategy calls India its most important partner in the region. Chancellor Friedrich Merz’s January 2026 visit to India further strengthened this shift, with both sides discussing deeper defence cooperation and joint weapons production.
From a strategic partnership to defence manufacturing and a potential mega submarine deal, India and Germany are taking their relationship to a new level.
• Watch as German MP and CDU/CSU foreign policy spokesperson Jürgen Hardt sheds light on the growing strategic ties between India and Germany. 🇮🇳🇩🇪
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయాలి... ADB: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని కొమరం భీమ్ చౌక్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
    1
    ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయాలి...
ADB: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని కొమరం భీమ్ చౌక్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • హలో విద్యార్థి చలో హైదరాబాద్ అక్టోబర్ 6న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయండి..చెంచల నవీన్ మాదిగ MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి పిలుపునిచ్చారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు MSF నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా నేడు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎలగందుల బిక్షపతి మాదిగ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా MSF మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కనకం గంగ నరేష్ మాదిగ సమన్వయం చేయడం జరిగింది.. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి చెంచల నవీన్ మాదిగ హాజరై మాట్లాడుతూ.. సమాజంలో సబ్బండ వర్గాలకు పోరాటం చేసి సేవలు అందించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు ఉంది ఆరోగ్యశ్రీ పథకం వృద్ధులు వితంతువుల పెన్షన్ తెల్ల రేషన్ కార్డ్ బియ్యం కోట పెంపు ఇలా చూసుకుంటే ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి జాతీయస్థాయిలో మాదిగ కులానికి పేరు తెచ్చిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న నాయకత్వంలో విద్యార్థి విద్యార్థినిలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం జరిగింది.. సమావేశం అనంతరం కళాశాల నూతన కమిటీ వేయడం జరిగింది.. అధ్యక్షులుగా గుడిసె సందీప్ అధికార ప్రతినిధిగా బడుగు చరణ్ చందర్ ఉపాధ్యక్షులుగా బడుగు సుశాంత్ ప్రధాన కార్యదర్శిగా నౌండ్ల శ్రీనిథ్ సహాయ కార్యదర్శిగా బడుగు హర్షవర్ధన్ కార్యవర్గ సభ్యులుగా కే అభినయ్ కార్తీక్ మనీ రామ్ చరణ్ తదితరున ఎన్నుకోవడం జరిగింది..
    1
    హలో విద్యార్థి చలో హైదరాబాద్ 
అక్టోబర్ 6న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయండి..చెంచల నవీన్ మాదిగ 
MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి పిలుపునిచ్చారు
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ  ఆదేశాల మేరకు MSF నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా నేడు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎలగందుల బిక్షపతి మాదిగ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా MSF మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కనకం గంగ నరేష్ మాదిగ సమన్వయం చేయడం జరిగింది..
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి చెంచల నవీన్ మాదిగ హాజరై మాట్లాడుతూ.. సమాజంలో సబ్బండ వర్గాలకు పోరాటం చేసి సేవలు అందించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు ఉంది ఆరోగ్యశ్రీ పథకం వృద్ధులు వితంతువుల పెన్షన్ తెల్ల రేషన్ కార్డ్ బియ్యం కోట పెంపు ఇలా చూసుకుంటే ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి జాతీయస్థాయిలో మాదిగ కులానికి పేరు తెచ్చిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న నాయకత్వంలో విద్యార్థి విద్యార్థినిలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం జరిగింది..
సమావేశం అనంతరం కళాశాల నూతన కమిటీ వేయడం జరిగింది..
అధ్యక్షులుగా గుడిసె సందీప్ 
అధికార ప్రతినిధిగా బడుగు చరణ్ చందర్ ఉపాధ్యక్షులుగా బడుగు సుశాంత్ ప్రధాన కార్యదర్శిగా నౌండ్ల శ్రీనిథ్ సహాయ కార్యదర్శిగా బడుగు హర్షవర్ధన్ కార్యవర్గ సభ్యులుగా 
కే అభినయ్ కార్తీక్ మనీ రామ్ చరణ్ తదితరున ఎన్నుకోవడం జరిగింది..
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    4 hrs ago
  • లక్షెట్టిపేటలో బిజెపి నాయకుల ఆందోళన, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ విద్యార్థుల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ లక్షేట్టిపేట పట్టణంలో బిజెపి నాయకులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా వారు గురువారం పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా ప్రధాన రహదారిపై ఆందోళన చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులకు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    లక్షెట్టిపేటలో బిజెపి నాయకుల ఆందోళన, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్
విద్యార్థుల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ లక్షేట్టిపేట పట్టణంలో బిజెపి నాయకులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా వారు గురువారం పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా ప్రధాన రహదారిపై ఆందోళన చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులకు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.