క్రీడలతో ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన సమాజ నిర్మాణం. యువత క్రీడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: డీకే అరుణ, పీవీ సింధు జాతీయ క్రీడా దినోత్సవం–2026 సందర్భంగా మేరా యువ భారత్ (MY Bharat) ఆధ్వర్యంలో ‘ఖేలో ఇండియా సంవాద్–ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్’ కార్యక్రమాన్ని సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (SIBM)లో గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ముస్కాన్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా యువత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం క్రీడా రంగంలో వస్తున్న మార్పులు, మౌలిక వసతులు, క్రీడా ప్రతిభను వెలికితీయడం, అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధత, వికసిత్ భారత్ @2047లో యువత పాత్రపై చర్చించారు. క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని, ఫిట్‌నెస్, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో లక్ష్యాలను సాధించాలని పీవీ సింధు సూచించారు. దేశ నిర్మాణంలో యువత, క్రీడల పాత్ర కీలకమని డీకే అరుణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న క్రీడా అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని, ఫిట్ ఇండియా–వికసిత్ భారత్ లక్ష్యాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. MY Bharat పోర్టల్‌లో నమోదు చేసుకుని స్వచ్ఛంద సేవ, నాయకత్వం, అనుభవాత్మక అభ్యాస అవకాశాలను వినియోగించుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ స్నేహల్ జ్ఞానేశ్వర్ బసుత్కర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ ప్రతిజ్ఞను యువతతో చేయించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకర జీవన విధానాన్ని పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. యువ సంవాద్‌లో యువత తమ ఆలోచనలు, ఆశయాలను పంచుకున్నారు.
క్రీడలతో ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన సమాజ నిర్మాణం. యువత క్రీడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: డీకే అరుణ, పీవీ సింధు జాతీయ క్రీడా దినోత్సవం–2026 సందర్భంగా మేరా యువ భారత్ (MY Bharat) ఆధ్వర్యంలో ‘ఖేలో ఇండియా సంవాద్–ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్’ కార్యక్రమాన్ని సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (SIBM)లో గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ముస్కాన్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా యువత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం క్రీడా రంగంలో వస్తున్న మార్పులు, మౌలిక వసతులు, క్రీడా ప్రతిభను వెలికితీయడం, అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధత, వికసిత్ భారత్ @2047లో యువత
పాత్రపై చర్చించారు. క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని, ఫిట్‌నెస్, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో లక్ష్యాలను సాధించాలని పీవీ సింధు సూచించారు. దేశ నిర్మాణంలో యువత, క్రీడల పాత్ర కీలకమని డీకే అరుణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న క్రీడా అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని, ఫిట్ ఇండియా–వికసిత్ భారత్ లక్ష్యాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. MY Bharat పోర్టల్‌లో నమోదు చేసుకుని స్వచ్ఛంద సేవ, నాయకత్వం, అనుభవాత్మక అభ్యాస అవకాశాలను వినియోగించుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ స్నేహల్ జ్ఞానేశ్వర్ బసుత్కర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ ప్రతిజ్ఞను యువతతో చేయించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకర జీవన విధానాన్ని పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. యువ సంవాద్‌లో యువత తమ ఆలోచనలు, ఆశయాలను పంచుకున్నారు.
- Ghar Par Behtar Elder Care – Apno Ki Dekhbhal, Samarth Ke Saath! #ElderCareIndia #SamarthCare #GharParCare #SeniorCare #24x7Support #TrustedElderCare #NRICare #HealthAtHome #ApnoKiDekhbhal #CareWithCompassion Ghar Par Behtar Elder Care – Apno Ki Dekhbhal, Samarth Ke Saath! #ElderCareIndia #SamarthCare #GharParCare #SeniorCare #24x7Support #TrustedElderCare #NRICare #HealthAtHome #ApnoKiDekhbhal #CareWithCompassion1
- ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి: కవిత ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తుందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ పదవులను పక్క రాష్ట్రం వారికి ఇవ్వడాన్ని మరియు మన ఉద్యమకారులను దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. తెలంగాణ బ్రాహ్మణులకు గౌరవం దక్కాల్సిందే, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను తక్షణమే తొలగించాలన్నారు.1
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- *కోర్టు పరిధిలో భూమి..! కబ్జాలోకి ఎలా వచ్చింది.?* *ఈదులనాగులపల్లిలో సర్వే నంబర్లు 134, 135పై రైతుల ఆందోళన* *తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తారంటున్న రైతులు* *కోర్టు పరిధిలో ఉన్న భూములలొ జేసీబీలతో రోడ్డు పనులు ఎలా చేస్తారు* *రియల్ వ్యాపారుల పనులను అడ్డుకున్న గ్రామస్తులు* *అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతుల ప్రశ్న* *తహసీల్దార్‌కు ఫిర్యాదు.. కలెక్టర్‌ను కలవనున్న గ్రామస్తులు* *భూముల రక్షణ కొరకు కార్యాచరణ కమిటీ ఏర్పాటు* *రోడ్డు పనులకు అనుమతులు ఎవరు అనుమతులు ఇచ్చారు* *కోర్టు వివాదం నడుస్తుండగానే పనులెలా సాగిస్తారు* తమ భూములు తమకు దక్కేవరకు పోరాటం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామ రైతులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, ఈదులనాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లోని భూములపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థాన పరిధిలో ఉండగానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడం రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు చేపట్టేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారులు జేసీబీలతో భూమి చుట్టూ మట్టి రోడ్డు వేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటికే కొంత దూరం వరకు మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో వివాదం కొనసాగుతున్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు, రోడ్డు పనులు, ఇతర మార్పులు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రైతులు ఆర్‌సీ పురం తహసీల్దార్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆమె ఇది తన పరిధిలోకి రాదని తప్పించుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు జరుగుతున్న అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, భూముల రికార్డులు, కోర్టు కేసు వివరాలను పరిశీలించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. వివాదాస్పద భూములను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. భూముల పరి రక్షణ కోసం కార్యచరణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి పోరాట కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో రియల్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడంపై అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోని భూములలో రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? రికార్డులను పరిశీలించకుండానే పనులు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, రికార్డులు, కోర్టు కేసు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే తమ భూమి తమకు దక్కేవరకు పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.3
- పాలిటెక్నిక్ కళాశాలలపై జీవో 97 రద్దు చేయాలి విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: డా. రామచంద్రరావు హైదరాబాద్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ ఎడ్యుకేషనల్ వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97పై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవో అమలు వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలుగుతుందని, తమకు అన్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవో 97ను పునఃసమీక్షించి రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.1
- మేడ్చల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. బీసీ ఎమ్మెల్యే కోసం ‘సర్జికల్ స్ట్రైక్–59’ మేడ్చల్: నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మేడ్చల్‌లో బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు బలమైన నాయకులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎన్నికవుతూ వచ్చారని ‘సర్జికల్ స్ట్రైక్–59’ ప్రతినిధులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.1
- మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్.. పోలీసుల దురుసు ప్రవర్తన హరీష్ రావు పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన కనీసం వాహనం కూడా ఎక్కించకుండా కలెక్టరేట్ నుంచి పోలీస్ స్టేషన్‌కు కాలినడకన హరీష్ రావుని పోలీసులు తరలించారు. దీంతో హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత TNGO ధర్నాలో పాల్గొన్న హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులను కలవకుండా అదుపులోకి తీసుకొని.. సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.1
- రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాం చందర్ రావు ఆరోపించారు. జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జీలు, కేసులు పెట్టడం సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్టైఫండ్లు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందని, విశ్వవిద్యాలయాలు, పాఠశాలల్లోనూ సమస్యలు ఉన్నాయని విమర్శించారు. విద్యార్థులను కలవకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. బైట్...రాం చందర్ రావు4