గజ్వేల్ లో... గ్రూపులను ప్రోత్సహిస్తున్న మైనంపల్లి హన్మంతరావు దొరల కబంధహస్తాల్లో ఇంకెన్నాళ్లు బతుకుదాం దొరలను తరిమేసే టైంలో మళ్లీ ప్రోత్సహిద్దామా...? దొరల మోచేతి నీళ్లు ఇంకెన్ని రోజులు తాగుదాం...? గజ్వేల్ నియోజకవర్గ దళితులు అర్థం చేసుకోండి... దళితులను ప్రోత్సహిస్తున్న నర్సారెడ్డిపై అట్రాసిటీ కేసు సిగ్గుచేటు - వర్గల్ మండల మాజీ ఎంపీపీ మోహన్ 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఆగస్టు 6 ప్రజా తెలంగాణ న్యూస్/బ్యూరో రిపోర్టర్ గజ్వేల్ లో జరిగిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి ప్రోటోకాల్ లేని కొండపాక విజయకుమార్ వేదికపైకి వెళ్లి గొడవ సృష్టించగా, ఆయనపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం సిగ్గుచేటని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ లో గ్రూపులను ప్రోత్సహిస్తున్న మైనoపల్లి హన్మంతరావు వత్తడితో డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్నీ నిరసిస్తూ బుధవారం గజ్వేల్ పట్టణంలో దళితులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు వెంకటస్వామి, కొడకండ్ల నర్సింలు, వీరేశం, అనిల్, అండాలమ్మ, శివులు తదితరులు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో కెసిఆర్, హరీష్ రావు లాంటి దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ దళితులను ప్రోత్సహిస్తున్న నర్సారెడ్డిపై అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేయించడం సిగ్గుచేటని నిలదీశారు. ముఖ్యంగా వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు గజ్వేల్, కొండపాక, మార్కెట్ కమిటీలు, నాచగిరి పాలకమండలిలలో పలువురికి డైరెక్టర్ పదవులు కట్టబెట్టి దళితులకు సముచిత స్థానం కల్పించినట్లు చెప్పారు. అయితే దీనిని జీర్ణించుకోలేని హన్మంత రావు, ప్రతాప్ రెడ్డిలకు అమ్ముడుపోయిన కొందరు దళితులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి లక్ష్యంగా విమర్శిస్తూ ప్రకటనలు ఇవ్వడం మన ఎదుగుదలను మనమే అడ్డుకున్నట్లు అవుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన కొండపాక విజయకుమార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేర్చి వారికి పావుగా వాడుకుంటున్నట్లు ఎద్దేవా చేశారు. ముఖ్యంగా నర్సారెడ్డిపై దళిత వ్యతిరేకి ముద్ర వేస్తుండడం తగదని, అయితే ఆయన వెంట ఎప్పుడూ దళితులు ఉంటారనే విషయాన్ని దొరలకు మద్దతు పలుకుతున్న దళిత నేతలు గ్రహించాలని సూచించారు. దళిత జాతి అభ్యున్నతిని అడ్డుకుంటున్న నేతలకు తగిన బుద్ధి చెప్తామని, నర్సారెడ్డిపై నమోదైన అట్రాసిటీ కేసు వెంటనే ఉపసంహరించని పక్షంలో కొండపాక విజయ్ కుమార్ కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. స్వప్రయోజనాల కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఆయన దుర్వినియోగం చేయడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒత్తిడితో నర్సారెడ్డిపై అక్రమంగా నమోదు చేసిన అట్రాసిటీ కేసును పోలీసులు విరమించుకోని పక్షంలో పెద్ద ఎత్తున దళితులను సమీకరించి ఆందోళనలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి మహేందర్ శ్రీనివాస్ నాచారం టెంపుల్ డైరెక్టర్ వెంకటేష్ కొమ్ము మల్లికార్జున్ రత్నాకర్ బాబు తప్పు గణేష్ సుంకం సురేష్ కొడకల్లా బాలు దయల యాదగిరి అరుణ్ తదితరులు పాల్గొన్నారు
గజ్వేల్ లో... గ్రూపులను ప్రోత్సహిస్తున్న మైనంపల్లి హన్మంతరావు దొరల కబంధహస్తాల్లో ఇంకెన్నాళ్లు బతుకుదాం దొరలను తరిమేసే టైంలో మళ్లీ ప్రోత్సహిద్దామా...? దొరల మోచేతి నీళ్లు ఇంకెన్ని రోజులు తాగుదాం...? గజ్వేల్ నియోజకవర్గ దళితులు అర్థం చేసుకోండి... దళితులను ప్రోత్సహిస్తున్న నర్సారెడ్డిపై అట్రాసిటీ కేసు సిగ్గుచేటు - వర్గల్ మండల మాజీ ఎంపీపీ మోహన్ 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఆగస్టు 6 ప్రజా తెలంగాణ న్యూస్/బ్యూరో రిపోర్టర్ గజ్వేల్ లో జరిగిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి ప్రోటోకాల్ లేని కొండపాక విజయకుమార్ వేదికపైకి వెళ్లి గొడవ సృష్టించగా, ఆయనపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం సిగ్గుచేటని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ లో గ్రూపులను ప్రోత్సహిస్తున్న మైనoపల్లి హన్మంతరావు వత్తడితో డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్నీ నిరసిస్తూ బుధవారం గజ్వేల్ పట్టణంలో దళితులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు వెంకటస్వామి, కొడకండ్ల నర్సింలు, వీరేశం, అనిల్, అండాలమ్మ, శివులు తదితరులు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో కెసిఆర్, హరీష్ రావు లాంటి దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ దళితులను ప్రోత్సహిస్తున్న నర్సారెడ్డిపై అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేయించడం సిగ్గుచేటని నిలదీశారు. ముఖ్యంగా వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు గజ్వేల్, కొండపాక, మార్కెట్ కమిటీలు, నాచగిరి పాలకమండలిలలో పలువురికి డైరెక్టర్
పదవులు కట్టబెట్టి దళితులకు సముచిత స్థానం కల్పించినట్లు చెప్పారు. అయితే దీనిని జీర్ణించుకోలేని హన్మంత రావు, ప్రతాప్ రెడ్డిలకు అమ్ముడుపోయిన కొందరు దళితులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి లక్ష్యంగా విమర్శిస్తూ ప్రకటనలు ఇవ్వడం మన ఎదుగుదలను మనమే అడ్డుకున్నట్లు అవుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన కొండపాక విజయకుమార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేర్చి వారికి పావుగా వాడుకుంటున్నట్లు ఎద్దేవా చేశారు. ముఖ్యంగా నర్సారెడ్డిపై దళిత వ్యతిరేకి ముద్ర వేస్తుండడం తగదని, అయితే ఆయన వెంట ఎప్పుడూ దళితులు ఉంటారనే విషయాన్ని దొరలకు మద్దతు పలుకుతున్న దళిత నేతలు గ్రహించాలని సూచించారు. దళిత జాతి అభ్యున్నతిని అడ్డుకుంటున్న నేతలకు తగిన బుద్ధి చెప్తామని, నర్సారెడ్డిపై నమోదైన అట్రాసిటీ కేసు వెంటనే ఉపసంహరించని పక్షంలో కొండపాక విజయ్ కుమార్ కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. స్వప్రయోజనాల కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఆయన దుర్వినియోగం చేయడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒత్తిడితో నర్సారెడ్డిపై అక్రమంగా నమోదు చేసిన అట్రాసిటీ కేసును పోలీసులు విరమించుకోని పక్షంలో పెద్ద ఎత్తున దళితులను సమీకరించి ఆందోళనలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి మహేందర్ శ్రీనివాస్ నాచారం టెంపుల్ డైరెక్టర్ వెంకటేష్ కొమ్ము మల్లికార్జున్ రత్నాకర్ బాబు తప్పు గణేష్ సుంకం సురేష్ కొడకల్లా బాలు దయల యాదగిరి అరుణ్ తదితరులు పాల్గొన్నారు
- జై హొ సనాతన ధర్మం1
- Post by Ravi Poreddy1
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1
- ఇలాంటి స్వామీజీలు కూడా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి1
- ✍️*కొటి సంతకాల ర్యాలీ విజయవంతం చేయండి* ************************* ✍️ *15 న శ్రీకాకుళం లో టౌన్ హాల్ నుండి.. భారీ ర్యాలీ* ************************** ✍️ *వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తప్పక హాజరు కావాలి* ****************************** ✍️ *59,865 సంతకాలతో నరసన్నపేట నియోజకవర్గం జిల్లాలకే తలమానికం* ******************************** ✍️ *యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య*✊✊✊✊✊✊✊✊✊✊ ............................................. *Team Chaitanya*🔥 ............................................... *Dr. DARMANA KRISHNA CHAITANYA* 🩵🙏 ...................................... 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 #Team_Chaitanya #dr_dharmana_Krishna_Chaitanya #AndhraPradesh #JaganannaConnects #Narasannapeta #Srikakulam_ysrcp .......................................... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥2
- తమిళనాడు లో మన హిందువుల పరిస్థితి చూడండి దేవాలయం లో పూజలు నిర్వహించిన భక్తుల ను కర్రల తో కొడుతున్న పోలీసులు1
- భారత్ మాత కి జై 🇮🇳1