logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విధుల్లోనే గుండెపోటుచిలకలపూడి ఎస్ఐ రంగనాథరావు మృతి సమాజ రక్షణలో ఎల్లప్పుడూ ముందుండే ఖాకీ దళం మరోసారి దుఃఖంలో మునిగిపోయింది. విధి నిర్వహణలో ఉండగానే చిలకలపూడి ఎస్ఐ ఆర్.ఎస్. రంగనాథరావు గుండెపోటుతో మృతి చెందారు. మంత్రి పార్థసారథి ఎస్కార్టులో భాగంగా గుడివాడ మీదుగా నూజివీడుకు వెళ్తుండగా, మార్గమధ్యంలో రంగనాథరావు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సహచరులు ఆయనను గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతుండగానే ప్రాణం విడిచారు. ఈ ఘటనతో పోలీస్‌శాఖలో విషాదం నెలకొంది. డీఎస్పీ ధీరజ్‌, సీఐ కొండపల్లి శ్రీనివాస్‌ రంగనాథరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధి నిర్వర్తించడంలో అలసిన మరో ఖాకీ మృతి పట్ల సహచరులు, అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

on 10 November
user_User7105
User7105
Citizen Reporter Atmakur, Nandyal•
on 10 November

విధుల్లోనే గుండెపోటుచిలకలపూడి ఎస్ఐ రంగనాథరావు మృతి సమాజ రక్షణలో ఎల్లప్పుడూ ముందుండే ఖాకీ దళం మరోసారి దుఃఖంలో మునిగిపోయింది. విధి నిర్వహణలో ఉండగానే చిలకలపూడి ఎస్ఐ ఆర్.ఎస్. రంగనాథరావు గుండెపోటుతో మృతి చెందారు. మంత్రి పార్థసారథి ఎస్కార్టులో భాగంగా గుడివాడ మీదుగా నూజివీడుకు వెళ్తుండగా, మార్గమధ్యంలో రంగనాథరావు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సహచరులు ఆయనను గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతుండగానే ప్రాణం విడిచారు. ఈ ఘటనతో పోలీస్‌శాఖలో విషాదం నెలకొంది. డీఎస్పీ ధీరజ్‌, సీఐ కొండపల్లి శ్రీనివాస్‌ రంగనాథరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధి నిర్వర్తించడంలో అలసిన మరో ఖాకీ మృతి పట్ల సహచరులు, అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

  • user_User1808
    User1808
    Chintapalle, Alluri Sitharama Raju
    🙏
    on 11 November
  • user_User8164
    User8164
    Tadepalligudem, West Godavari
    🙏
    on 11 November
  • user_A Raju
    A Raju
    Sangareddy, Telangana
    😂
    on 10 November
  • user_A Raju
    A Raju
    Sangareddy, Telangana
    🙏
    on 10 November
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • జిల్లా కేంద్రమైన కర్నూలు పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో మంగళవారం ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కూటమి పార్టీల ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు మరియు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మిగనూరు అసెంబ్లీ తరపున దేశాయ్ నెట్‌వర్క్ అధినేత, జిల్లా అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులను మర్యాదపూర్వకంగా కలుసుకుని… ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అర్హులైన బీజేపీ కార్యకర్తలకు పథకాలు అందడం లేదని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటూ… అర్హులైన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వ పథకాలు తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు. ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం కూటమిలో భాగమైన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు సమన్వయంతో పనిచేయడం అని తెలిపారు. కూటమి ధర్మాలను పాటిస్తూ… అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలకు సమాన న్యాయం జరిగేలా ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
    1
    జిల్లా కేంద్రమైన కర్నూలు పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో మంగళవారం ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కూటమి పార్టీల ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు మరియు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌లతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఎమ్మిగనూరు అసెంబ్లీ తరపున దేశాయ్ నెట్‌వర్క్ అధినేత, జిల్లా అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మంత్రులను మర్యాదపూర్వకంగా కలుసుకుని… ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అర్హులైన బీజేపీ కార్యకర్తలకు పథకాలు అందడం లేదని తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటూ… అర్హులైన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వ పథకాలు తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు.
ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం కూటమిలో భాగమైన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు సమన్వయంతో పనిచేయడం అని తెలిపారు.
కూటమి ధర్మాలను పాటిస్తూ… అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలకు సమాన న్యాయం జరిగేలా ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • రామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు అనే బాలుడు పుట్టుకతోనే అంతుచిక్కని వ్యాధితో జన్మించడం జరిగింది బాబుకి చెకప్ చేపించగా LAD బిగ్ డిసీస్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. పిల్లాడికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వారు సూచించారు కానీ ఆపరేషన్ కి 30 లక్షల దాకా ఖర్చవుతుంది అని డాక్టర్లు చెప్పారు. కావున దాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత సహాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మానవతా వాదంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆ పసిబిడ్డ ప్రాణాలని కాపాడాలని అందరూ భావిస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న స్కానర్ కి గాని కింద ఇవ్వబడిన 7207217664 నెంబర్ కి ఫోన్ పే చేసి పిల్లవాడి ప్రాణం కాపాడిన వారు అవుతారు.
    1
    రామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు అనే బాలుడు పుట్టుకతోనే అంతుచిక్కని వ్యాధితో జన్మించడం జరిగింది బాబుకి చెకప్ చేపించగా LAD బిగ్ డిసీస్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. పిల్లాడికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వారు సూచించారు కానీ ఆపరేషన్ కి 30 లక్షల దాకా ఖర్చవుతుంది అని డాక్టర్లు చెప్పారు. కావున దాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత సహాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మానవతా వాదంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆ పసిబిడ్డ ప్రాణాలని కాపాడాలని అందరూ భావిస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న స్కానర్ కి గాని కింద ఇవ్వబడిన 
7207217664 నెంబర్ కి ఫోన్ పే చేసి పిల్లవాడి ప్రాణం కాపాడిన వారు అవుతారు.
    user_Veera
    Veera
    జమ్మలమడుగు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • కేశంపేట మండల కేంద్రంలో పేటీఎం పేరుతో వ్యాపారులను మోసం చేసే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామని నకిలీ స్క్రీన్‌షాట్లు చూపించి నగదు తీసుకుని పరారవుతున్నారు. ఇటీవల ఓ జిరాక్స్ షాపులో రూ.16 వేల మోసం చోటుచేసుకుంది. మొదట డబ్బులు పంపినట్టు నమ్మబలికి నగదు తీసుకుని పారిపోయారు. బాధితుడు వెంబడించగా కొంత మొత్తం ఇచ్చి మళ్లీ తప్పించుకున్నారు. ఈ ఘటనతో స్థానిక వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అపరిచితులను నమ్మవద్దని, నగదు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
    2
    కేశంపేట మండల కేంద్రంలో పేటీఎం పేరుతో వ్యాపారులను మోసం చేసే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామని నకిలీ స్క్రీన్‌షాట్లు చూపించి నగదు తీసుకుని పరారవుతున్నారు. ఇటీవల ఓ జిరాక్స్ షాపులో రూ.16 వేల మోసం చోటుచేసుకుంది. మొదట డబ్బులు పంపినట్టు నమ్మబలికి నగదు తీసుకుని పారిపోయారు. బాధితుడు వెంబడించగా కొంత మొత్తం ఇచ్చి మళ్లీ తప్పించుకున్నారు. ఈ ఘటనతో స్థానిక వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అపరిచితులను నమ్మవద్దని, నగదు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • బద్వేలు:బద్వేలు పట్టణం రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జనసేన నేతలు హల్చల్ చేశారు. కళ్యాణ మండపం పరిధిలోని ఇంటిలోనికి ప్రవేశించి తాళాలు పగలగొట్టి మహిళలపై దౌర్జన్యం చేసి ఇండ్లు ఖాళీ చేయకపోతే జెసిపి తో కూల్చి వేస్తామని భయబ్రాంతులకు జనసేన నేతలు చేసినట్లు స్థానికులు తెలిపారు. దినిపై బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.
    1
    బద్వేలు:బద్వేలు పట్టణం రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జనసేన నేతలు హల్చల్ చేశారు.
కళ్యాణ మండపం పరిధిలోని ఇంటిలోనికి ప్రవేశించి తాళాలు పగలగొట్టి మహిళలపై దౌర్జన్యం చేసి ఇండ్లు ఖాళీ చేయకపోతే జెసిపి తో కూల్చి వేస్తామని భయబ్రాంతులకు జనసేన నేతలు చేసినట్లు స్థానికులు తెలిపారు. దినిపై బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్లో  బాధితులు ఫిర్యాదు చేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • ఈ సందర్భంగా పట్టణంలో ప్రమాద రహిత నగరంగా చేయాలని లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారని సిఐ లక్ష్మయ్య తెలిపారు... తాగి వాహనాలు నడిపి తమ ప్రాణాలకే ముప్పు కాకుండా ఇతరులకు ప్రాణహాని కలిగించే విధంగా చేసుకోకూడదని.... డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలు శిక్ష కాకుండా భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక! ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి... మైనర్లకు తమ తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి ఉంచి వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలి... మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి భవిష్యత్తే కాకుండా తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ... *నల్గొండ ట్రాఫిక్ సిఐ–మహా లక్ష్మయ్య..* ఈ కార్యక్రమంలో నల్గొండ ట్రాఫిక్ ఎస్ఐ విజయబాయి మరియు సిబ్బంది పాల్గొన్నారు...
    1
    ఈ సందర్భంగా పట్టణంలో ప్రమాద రహిత నగరంగా చేయాలని  లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారని సిఐ లక్ష్మయ్య తెలిపారు...
తాగి వాహనాలు నడిపి  తమ ప్రాణాలకే ముప్పు కాకుండా ఇతరులకు ప్రాణహాని కలిగించే విధంగా చేసుకోకూడదని....
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలు శిక్ష కాకుండా భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక! 
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి...
మైనర్లకు తమ తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి ఉంచి వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలి...
మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి భవిష్యత్తే కాకుండా తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ...
*నల్గొండ ట్రాఫిక్ సిఐ–మహా లక్ష్మయ్య..*
ఈ కార్యక్రమంలో నల్గొండ ట్రాఫిక్ ఎస్ఐ విజయబాయి మరియు సిబ్బంది పాల్గొన్నారు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    19 hrs ago
  • ఆలూరు లో మంగళవారం మధ్యాహ్నం వర్షం పడింది ఉదయం నుండి విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఆకాశం నల్లబడి పెద్ద పెద్దగా గాలులు వేస్తూ వర్షం కురిసింది. వేరుశనగ, మొక్కజొన్న, పంట చేతికి వచ్చే సమయంలో వర్షం రావడంతో పంట నష్టపోయి ప్రమాదం ఉందని పలువురు రైతులు తెలిపారు.
    1
    ఆలూరు లో మంగళవారం మధ్యాహ్నం  వర్షం పడింది ఉదయం నుండి విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఆకాశం నల్లబడి పెద్ద పెద్దగా గాలులు వేస్తూ వర్షం కురిసింది. వేరుశనగ, మొక్కజొన్న, పంట చేతికి వచ్చే సమయంలో వర్షం రావడంతో పంట నష్టపోయి ప్రమాదం ఉందని పలువురు రైతులు తెలిపారు.
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • సిద్దిపేట జిల్లా : మార్చ్ 31, ప్రజా తెలంగాణ న్యూస్ / (హుస్నాబాద్ నియోజకవర్గం / కోహెడ మండలం ) అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ (ఏ. ఐ. సీ. సీ ) అధ్యక్షులు సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ... కోహెడ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) సీనియర్ నాయకులు, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ అగ్రనేత,నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేరవేర్చిన గొప్ప నాయకురాలు(తెలంగాణ దేవత ) అనారోగ్యంతో గత ఐదు రోజులుగా సర్ గంగారాం(న్యూఢిల్లీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా వారు త్వరగా కోలుకోవాలని, ప్రజా క్షేత్రoలో ఉండాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    3
    సిద్దిపేట జిల్లా : మార్చ్ 31, ప్రజా తెలంగాణ న్యూస్ /
(హుస్నాబాద్ నియోజకవర్గం / కోహెడ మండలం ) అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ (ఏ. ఐ. సీ. సీ ) అధ్యక్షులు సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ...
కోహెడ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) సీనియర్ నాయకులు, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ....
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత,నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేరవేర్చిన గొప్ప నాయకురాలు(తెలంగాణ దేవత ) అనారోగ్యంతో గత ఐదు రోజులుగా సర్ గంగారాం(న్యూఢిల్లీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా వారు త్వరగా కోలుకోవాలని, ప్రజా క్షేత్రoలో  ఉండాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి ముందు నుంచే చేనేత కార్మికులు భారీగా చేరుకుని ఆప్కోలో విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుక ఆధ్వర్యంలో చేనేత కార్మికులు సొసైటీ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్మికులు నినాదాలతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ… ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడం ఎమ్మెల్యే డాక్టర్ బీ.వి. జయనాగేశ్వర రెడ్డి కుట్ర అని ఆరోపించారు. అప్పుల్లో ఉన్న ఆప్కోలో సంఘాన్ని కలిపి, ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అలాగే… చేనేత కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపరంగా పోరాడతామని బుట్టా రేణుక హెచ్చరించారు.
    1
    ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి ముందు నుంచే చేనేత కార్మికులు భారీగా చేరుకుని ఆప్కోలో విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
వైసీపీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుక ఆధ్వర్యంలో చేనేత కార్మికులు సొసైటీ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్మికులు నినాదాలతో ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ… ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడం ఎమ్మెల్యే డాక్టర్ బీ.వి. జయనాగేశ్వర రెడ్డి కుట్ర అని ఆరోపించారు. అప్పుల్లో ఉన్న ఆప్కోలో సంఘాన్ని కలిపి, ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
అలాగే… చేనేత కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపరంగా పోరాడతామని బుట్టా రేణుక హెచ్చరించారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.