యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్–2026 ప్రవేశ పరీక్షలను పూర్తి పారదర్శకతతో, నిబంధనలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా గదులు, హాజరు నమోదు, ప్రశ్నాపత్రాల పంపిణీ, ఇన్విజిలేషన్ విధానాన్ని తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినులకు త్రాగునీరు, విద్యుత్, పరిశుభ్రత వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం తాండూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పరీక్షా ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. మరోవైపు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. తాండూరు గ్రామపంచాయతీలో డిజిటలైజేషన్ పురోగతిపై మండల పంచాయతీ అధికారి, డిప్యూటీ తహసీల్దార్, గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శితో కలిసి సమీక్ష నిర్వహించారు. తక్కువ పురోగతి నమోదు చేసిన బూత్ స్థాయి అధికారులతో సమావేశమై, పెండింగ్ ఫారాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి ఫారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అలాగే నెన్నెల మండలంలోని నెన్నెల, ఆవడం, గంగారం గ్రామపంచాయతీలలో ఈ ప్రక్రియను స్థానిక అధికారులతో కలిసి పరిశీలించి, త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్–2026 ప్రవేశ పరీక్షలను పూర్తి పారదర్శకతతో, నిబంధనలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా గదులు, హాజరు నమోదు, ప్రశ్నాపత్రాల పంపిణీ, ఇన్విజిలేషన్ విధానాన్ని తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినులకు త్రాగునీరు, విద్యుత్, పరిశుభ్రత వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం తాండూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పరీక్షా ఏర్పాట్లను
పరిశీలించి అధికారులతో సమీక్షించారు. మరోవైపు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. తాండూరు గ్రామపంచాయతీలో డిజిటలైజేషన్ పురోగతిపై మండల పంచాయతీ అధికారి, డిప్యూటీ తహసీల్దార్, గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శితో కలిసి సమీక్ష నిర్వహించారు. తక్కువ పురోగతి నమోదు చేసిన బూత్ స్థాయి అధికారులతో సమావేశమై, పెండింగ్ ఫారాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి ఫారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అలాగే నెన్నెల మండలంలోని నెన్నెల, ఆవడం, గంగారం గ్రామపంచాయతీలలో ఈ ప్రక్రియను స్థానిక అధికారులతో కలిసి పరిశీలించి, త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ ప్రాంగణంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ జోన్-2 చీఫ్ జోనల్ ఇంచార్జ్ దాగిల్ల దయానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో పార్టీ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కాదాసి రవీందర్, వర్కిల్ల మల్లేష్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దాగిళ్ల దయానందరావు మాట్లాడుతూ, భారతదేశ చరిత్రను తిరగరాసేది బహన్ మాయావతి గారేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ రక్షణ, అణగారిన వర్గాల అభివృద్ధి సాధించడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. 2027లో ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని, అదే స్ఫూర్తితో 2028లో తెలంగాణలోనూ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చిన ఆయన, జిల్లాలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెట్టం చంద్రశేఖర్, మహనీయుల ఆలోచనలకు ఆకర్షితులై బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ముఖ్య అతిథి దయానందరావు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి, మంచిర్యాల నియోజకవర్గం ఇంచార్జిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్పల్లి సంతోష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిళ్ళ మురళి, బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌లు గోమాస బ్రహ్మానందం, గోలేటి నారాయణ, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు బండారి రాజ్ కుమార్, చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు గాజుల శంకర్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎండి మాతిన్ ఖాన్, నస్పూర్ మండల అధ్యక్షుడు వేముల కిరణ్, నాయకుడు జాగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.1
- తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైపోయాయని ఆటో యూనియన్ ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిందని, కుటుంబాలను పోషించలేక డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళ్లు తెరిపించేందుకు ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున ఆటోలు బంద్ చేసి, సమ్మెకు దిగాలని వారు తీర్మానించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాష్ట్రంలోని 33 జిల్లాల ఆటో డ్రైవర్ల అధ్యక్ష, కార్యదర్శులతో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం యూనియన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఆటో డ్రైవర్‌కు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని మరియు ఆటో డ్రైవర్ల కోసం ఒక ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు, ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని స్పష్టం చేశారు. అలాగే ఆర్టీవో ఆఫీసులో వాహనాల ఫిట్నెస్ పైన రేడియం వేస్తూ చేస్తున్న కాంట్రాక్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆగస్టు నెలలో ఆటో డ్రైవర్లందరూ ఏకమై సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.1
- మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలో ఆదివారం నిర్వహించిన అఖిల భారత విశ్వకర్మ మహాసభలో ఆ సంఘం అధ్యక్షులు కౌలే జగన్నాథం పాల్గొని మాట్లాడారు. విశ్వబ్రాహ్మణులు చైతన్యవంతులై అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ మహాసభలో విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై నాయకులు చర్చించారు. విశ్వబ్రాహ్మణులు చైతన్యవంతులై అన్ని రంగాల్లో రాణిస్తేనే అభివృద్ధి సాధ్యమని జగన్నాథం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని చర్ల బూత్కూరు గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఓటరు ప్రక్రియకు సంబంధించిన సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ పిలుపు మేరకు బూత్ ఇన్‌ఛార్జులు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, సుంకిశాల సంపత్ రావు ఈ కేంద్రాన్ని ప్రారంభించి, పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు హక్కు నమోదు ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ సహాయ కేంద్రంలో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మధుకర్, మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, వార్డ్ మెంబర్ తప్పెట్ల నరేష్‌తో పాటు బీఎల్ఏలు, బీఎల్ఓలు పాల్గొన్నారు.1
- వడ్లను లారీల కొద్దీ యథేచ్ఛగా అక్రమంగా అమ్ముకుంటున్నా అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ధాన్యపు కొనుగోలు కేంద్రాలు ముగిసి నెల రోజులు గడుస్తున్నా, వరి ధాన్యం ఎక్కడికి తరలిపోతుందనే అంశంపై ఎటువంటి నిఘా లేకపోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చెక్ పోస్టులలో కనీస తనిఖీలు కూడా నిర్వహించకపోవడం అధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయనడానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. ఈ వరి ధాన్యం కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రైస్ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, రైస్ మిల్లర్లు, అధికారులు, బడా నేతలు కుమ్మక్కై ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. లారీల కొద్దీ వడ్లను అక్రమంగా అమ్ముకుంటుంటే అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.1
- జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల మోతే రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం జరగనున్న కేంద్రీయ విద్యాలయం భూమి పూజ కార్యక్రమం గురించి ఆయన ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తామే పోరాటం చేశామని కొందరు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి స్థానిక ఎంపీ కృషి చేయాలని, అలాగే విద్యార్థులకు రెగ్యులర్ సిబ్బందితో బోధన సాగేలా చొరవ చూపాలని ఆయన కోరారు. అభివృద్ధి పనుల విషయంలో తనకు ఎలాంటి భేషజాలు లేవని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీతో కలిసి పనిచేస్తూ జగిత్యాల అభివృద్ధికి శ్రమిస్తానని, రేపటి భూమి పూజ కార్యక్రమం గురించి ఇప్పటికే వారితో మాట్లాడడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వివరించారు.1
- కేంద్ర ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారం వెలువడింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు డిగ్రీ విద్యార్హత ఉండాలి. ఈ ఉద్యోగ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వీడియోను 'Cryancreations5191' అనే యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు.1
- కరీంనగర్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన నిర్వహించబోయే శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని మాజీమంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్‌ను కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఎమ్మెల్యే గంగుల నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయన చేతుల మీదుగా ఈ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, వైద్యులు రాజ భాస్కర్ రెడ్డి, ఎస్ ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బుర్ర మధుసూదన్ రెడ్డి, రమేష్ రెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.2