Shuru
Apke Nagar Ki App…
వెల్దుర్తిలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఆవు పాలు తాగుతున్న పందిపిల్ల కర్నూలు జిల్లా వెల్దుర్తిలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఓ పంది పిల్ల ఆవు వద్దకు వెళ్లి ఆకలితో పాలు తాగింది. ఆ సమయంలో ఆవు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ప్రశాంతంగా ఉంది. తల్లి జంతువులా ఆవు పందిపిల్లకు పాలివ్వడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వింత దృశ్యాన్ని పలువురు ఆసక్తిగా వీక్షించారు.
కామవరం సురేష్ రిపోర్టర్
వెల్దుర్తిలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఆవు పాలు తాగుతున్న పందిపిల్ల కర్నూలు జిల్లా వెల్దుర్తిలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఓ పంది పిల్ల ఆవు వద్దకు వెళ్లి ఆకలితో పాలు తాగింది. ఆ సమయంలో ఆవు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ప్రశాంతంగా ఉంది. తల్లి జంతువులా ఆవు పందిపిల్లకు పాలివ్వడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వింత దృశ్యాన్ని పలువురు ఆసక్తిగా వీక్షించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *మధ్యప్రదేశ్:**4 కాళ్లు, 4 చేతులతో జన్మించిన* *మగ శిశువు...* లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు.అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు...1
- ବିଜେପି କେତେ ନୀଳଜା ଅଛି1
- హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.1
- రాయదుర్గంలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు..భక్తి శ్రద్ధలతో ఊరేగింపు రాయదుర్గం పట్టణంలో ముస్లింలు మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం బళ్లారి రోడ్డులోని దుర్గా మస్జిద్ వద్ద నుంచి జులూస్-ఏ-ముహమ్మదీ ప్రారంభమైంది.జులూస్ ఆత్మకూరు వీధి, ఊరువాకిలి,వినాయక సర్కిల్, లక్ష్మీ బజార్ మీదుగా సాగి తిరిగి దర్గా మస్జిద్ వద్దకు చేరుకుంది. ఊరేగింపులో మక్కా, మదీనా నమూనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రదర్శించారు. నాత్‌లు, సలాత్‌లు చదువుతూ భక్తిశ్రద్ధలతో సాగిన ఈ ఊరేగింపుతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.ఊరేగింపు సాగిన మార్గంలో ప్రవక్త హజ్రత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు, మానవాళికి ఆయన అందించిన సందేశాలు, గొప్పతనాన్ని వివరిస్తూ నాత్‌ఖ్వాన్లు, మౌలానాలు ప్రసంగించారు.1
- కొండా సుష్మిత అదెవతి... దానికెందుకు ఇస్తాం మేము టికెట్.. మా పార్టీకే సంబంధం లేదు.. మా పార్టీలో సభ్యత్వం లేదు.. కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం. కొండా సుష్మిత అదెవతి... దానికెందుకు ఇస్తాం మేము టికెట్.. మా పార్టీకే సంబంధం లేదు.. మా పార్టీలో సభ్యత్వం లేదు.. కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం.1
- ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు నంద్యాల నుంచి కొత్తూరు వెళ్లే ప్రధాన రహదారిలో బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలు పూర్తిగా ఒరిగి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. పెద్ద గాలి వీచినా, వర్షం పడినా అవి రోడ్డుపై పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, ఒరిగిన స్తంభాల వల్ల ఏ క్షణమైనా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఒరిగిన స్తంభాలను సరిచేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- రాయదుర్గంలో ఘనంగా శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతి వేడుకలు నిర్వహణ రాయదుర్గం పట్టణంలో బుధవారం భగవాన్ శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. హాటకేశ్వరస్వామి దేవాలయం నుంచి జయంతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం నిర్వహించారు.అనంతరం శ్రీ జిహ్వేశ్వరస్వామి వారి భావచిత్రపటాన్ని వెండి రథంలో అలంకరించి పట్టణ ప్రధాన వీధుల్లో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ ఊరేగింపు బళ్లారి రోడ్, వినాయక సర్కిల్ మీదుగా ఓబులాచారి రోడ్డు వరకు కొనసాగింది.ఊరేగింపులో స్వకుళ సాళి సమాజ బాంధవులు, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా స్వకుళ సాళి సమాజ అధ్యక్షుడు వెంకటేశులు మాట్లాడుతూ, సభ్య సమాజంలో యుగపురుషుడిగా అవతరించిన శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతిని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం నామకరణ మహోత్సవం,అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెంకటేశులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సమాజ బాంధవులు, భక్తులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.1
- *హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి* హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.1
- *బస్సు-కంటైనర్ - "ఢీ"* *6గురు మృతి* *20 మందికి తీవ్ర గాయాలు* *దొరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం* రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మృతి *ఏలూరు వెళ్తున్న* బస్సుకు ఘోర ప్రమాదం..దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.2