సముద్రంలో ‘గుండు’సూది కోసం అమెరికా వేట..! ఇరాన్ సీమైన్స్’ను ఊడ్చేసి హర్మూజ్ జలసంధిని క్లీన్ చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నా. ఇంటర్నెట్ డెస్క్: ఒక భారీ జలాంతర్గామి మునిగినా.. విమానం కూలినా విశాల సముద్రంలో దాని కచ్చితమైన జాడను కనుక్కోవడానికి వారాలు పట్టొచ్చు.. ఏళ్లు పట్టొచ్చు. మలేసియా విమానం జాడ ఇప్పటికీ దొరక్కపోవడమే దీనికి ఉదాహరణ. అలాంటిది నీటి కింద అమర్చిన చిన్న సైజు సీమైన్స్ (SeaMines in Hormuz)ను వెతకడం అంటే.. సముద్రంలో ‘గుండుసూది’ కోసం జల్లెడ పట్టినట్లే. ప్రస్తుతం అమెరికా పరిస్థితి ఇదే. ‘ఇరాన్ సీమైన్స్’ను ఊడ్చేసి హర్మూజ్ జలసంధిని క్లీన్ చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నా.. అదంత సులువైన విషయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు మైన్స్ ఎక్కడ పరిచామో తెలియదని ఇరాన్ గందరగోళం సృష్టించి వదిలేసింది. దీంతో ఇప్పుడు వాటిని గుర్తించి తొలగించడం అమెరికాకు కత్తిమీద సాములా మారింది. మైన్స్ పనిపట్టే డెస్ట్రాయర్లు.. హర్మూజ్ (Strait of Hormuz) మార్గంలో ఇరాన్ (Iran) పరిచిన సీమైన్స్‌ను తొలగించేందుకు అమెరికా రెండు గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లు యూఎస్‌ఎస్ ఫ్రాంక్ ఇ పీటర్సన్, యూఎస్‌ఎస్ మైఖేల్ ముర్ఫీని రంగంలోకి దింపింది. అయితే, ఇవి నేరుగా మైన్స్ ఉన్న ప్రాంతానికి వెళ్లవు. ఇందుకోసం ఎంకే 18, మాడ్ 2 కింగ్‌ఫిష్ లాంటి మానవరహిత అండర్‌వాటర్ వెహికల్స్‌ను అగ్రరాజ్యం ఉపయోగిస్తోంది. టోర్పిడో ఆకారంలో ఉండే ఈ డ్రోన్లు సముద్ర జలాల్లో వేగంగా కదులుతూ.. హైటెక్ సోనార్ల సాయంతో పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి. వీటితో పాటు ఎంహెచ్-60ఎస్ వంటి హెలికాప్టర్లను కూడా అమెరికా హర్మూజ్ వద్ద మోహరించింది. ఇవి గగనతలం నుంచే సముద్రాన్ని స్కాన్ చేస్తాయి. వీటిలోని ఎయిర్‌బ్రోన్ లేజర్ మైన్ డిటెక్షన్ సిస్టమ్.. సముద్ర ఉపరితలంపై తేలే, కొంచెం లోతులో ఉండే మైన్లను వేగంగా గుర్తిస్తుంది. సీమైన్స్ కనబడిన వెంటనే హెలికాప్టర్ లేదా డ్రోన్ సాయంతో వాటిని నౌకాదళం నిర్వీర్యం చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎయిర్‌బ్రోన్ మైన్ న్యూట్రలైజేషన్ సిస్టమ్‌ను అమెరికా ఉపయోగిస్తోంది. ఈ సిస్టమ్‌తో హెలికాఫ్టర్/డ్రోన్ల నుంచి చిన్నపాటి రోబోటిక్ పరికరాన్ని పంపిస్తారు. అది నేరుగా మైన్ మీదకు వెళ్లి పేల్చేస్తుంది. ఇక, అమెరికా డెస్ట్రాయర్లు కేవలం మైన్లను తొలగించడం మాత్రమే గాక.. సముద్ర ఉపరితలంపై ఎదురయ్యే ముప్పులను పసిగట్టి.. క్షిపణులతో ఛేదించగలవు. మైన్‌స్వీపింగ్ ఈజీ కాదు.. మైన్లను తొలగించే ప్రక్రియ అంత సులువైందని కాదని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా సీమైన్స్‌లో చాలా రకాలుంటాయి. సముద్ర జలాల్లో నౌకలు కదిలినప్పుడు ఏర్పడే పీడనం, తరంగాల శబ్దం, నౌకల విద్యుత్ శక్తి ఆధారంగా పనిచేసే మైన్స్ ఉంటాయి. వీటిల్లో కొన్నింటిని లేజర్ లేదా రాడార్ల సాయంతోనూ గుర్తించలేమని, ఒకవేళ గుర్తించినా వాటిని పేల్చడం కష్టతరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు అమెరికా వద్ద ప్రస్తుతమున్న మైన్‌స్వీపింగ్ సామర్థ్యం సరిపోదని అంచనా వేస్తున్నారు. అగ్రరాజ్యం గతేడాది పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న నాలుగు ప్రత్యేక మైన్‌స్వీపర్లను నేవీ విధుల నుంచి పక్కనబెట్టింది. ప్రస్తుతం ఈ బాధ్యతలను లిట్టోరల్ కాంబాట్ షిప్‌లు నిర్వర్తిస్తున్నాయి. అమెరికా వద్ద ఈ రకం నౌకలు మూడు ఉండగా.. అవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయన్నది రహస్యమే. గత నెల ఇందులో రెండు సింగపూర్ జలాల్లో కన్పించినట్లు వార్తలు వచ్చాయి. అందువల్ల క్లిష్టతరమైన మైన్లను తొలగించేందుకు అమెరికా ఇప్పుడు మిత్ర దేశాలపై ఆధారపడొచ్చనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ చుట్టూ 15 యుద్ధ నౌకలు.. శాంతి చర్చలు విఫలమవడంతో ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాలను అమెరికా నౌకాదళం దిగ్బంధించింది. ఈ ప్రక్రియ కోసం ఇరాన్ పోర్టులు, తీరప్రాంతాల చుట్టూ 15కు పైగా యుద్ధనౌకలను అమెరికా మోహరించింది. ఇందులో యూఎస్‌ఎస్ ట్రిపోలి (ఎల్‌హెచ్‌ఏ 7) కూడా ఉంది. ఈ యుద్ధనౌకపై ఎఫ్-35బి లైటెనింగ్ 2 స్టెల్త్‌ఫైటర్లు, ఎంవీ-22 ఆస్‌ప్రేస్, హెలికాప్టర్లు వంటివి అందుబాటులో ఉంటాయి. ఇవి హర్మూజ్‌లో ఇరాన్ నుంచి ఎదురయ్యే ముప్పును సమర్థంగా అడ్డుకోగలవని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.

- అనంతపురం జిల్లాలో గత 20 రోజుల నుండి రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా ,ఆపరేషన్ నైట్ సేఫ్టీ అంటూ రోడ్డు పై స్టంట్స్ చేస్తున్న వారిని పట్టుకొని,బండి సీజ్ చేసి,వారి తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఇలా1
- ధర్మవరం.. ధర్మవరం మండలంలోని చిగిచెర్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎస్సీ కాలనీకి చెందిన అంబేద్కర్ యూత్ కలిసికట్టుగా గ్రామస్తులతో కలిసి లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా అక్కడే కేక్ కట్ చేసి కాలనీ ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం పెద్ద ఎత్తున యువకులు గ్రామంలో బైక్ ర్యాలీ లో అంబేద్కర్ నినాదాలు చేస్తూ చేపట్టారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించి కాలనీ అభివృద్ధికి పాటుపడదామని వక్తలు ప్రసంగించారు. విద్యతోనే ప్రతి ఒక్కరి జీవితాలు మెరుగుపడతాయని కావున తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను చదివించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు బ్యాంక్ మేనేజర్ లక్ష్మీనరసింహలు, శ్రావణ్, శ్రీకాంత్, బద్రి, నరేంద్ర, సతీష్, పవన్, ఓం శేఖర్, నవీన్, భార్గవ్, నవీన్ కుమార్,మధు,వంశీ,కదరయ్య, కాటమయ్య, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.2
- కర్నూలు జిల్లా ఆలూరు లో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు , కార్యకర్తలు అంబేద్కర్ సర్కిల్ చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలను అనుసరిస్తూ సామాజిక న్యాయ సాధనలో ముందుకు సాగాలని వైకుంఠం జ్యోతి పిలుపునిచ్చారు. సమాజంలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదని అందరూ సమానమే అని చాటిచెప్పారన్నారు . మన రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తిని ప్రపంచమే మన రాజ్యాంగం వైపు చూసేలా ఆయన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు.అంబేడ్కర్ జీవించే హక్కు కల్పించారని ఆమె స్పష్టం చేశారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- *ఈతోడు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు* కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఈతోడు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రత్నా డా బి.ఆర్. అంబేడ్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో కలిసి కేక్ కట్ డా బి ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో తనకల్లు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఆనందంతో జీవించాలని దశ మహా విద్యల పేరుతో పది రోజులపాటు హోమాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో 20వ తేదీ వరకు హోమాలు జరుగుతాయన్నారు. నాలుగవ రోజు మంగళవారం భువనేశ్వరి దేవి హోమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.1
- అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి... అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత... భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడు సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి. చెన్నూరు మహమ్మద్ అబ్బాస్ కాంగ్రెస్ నాయకులు, కడప జిల్లా.1
- నందికొట్కూరు పట్టణంలో మండల కేంద్రాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జయ సూర్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేశాడని పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని యువత అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. బజార సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక నివాళులర్పించారు.1
- పుట్టపర్తి, ఏప్రిల్ 14: దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ మురళి నాయక్ త్యాగం మరువలేనిదని జిల్లా కలెక్టర్. శ్యామ్ ప్రసాద్ కొనియాడారు. గోరంట్ల మండలం,కల్లితాండాలో నిర్వహించిన మురళి నాయక్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మురళి నాయక్ వంటి వీరులు జిల్లాకే గర్వకారణం.వారి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.దేశం కోసం ప్రాణాలర్పించిన వారి స్ఫూర్తిని యువత కొనసాగించాలి. ఈ కార్యక్రమంలో గోరంట్ల తహసీల్దార్ మధు నాయక్, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొని అశ్రునివాలర్పించారు.2