రైతుల కోసం ఏఐ ఆగ్రోనమిస్ట్ * ఇప్పటికే 5.45లక్షల మంది రైతుల నమోద * రైతులంతా దీన్ని ఉపయోగించుకునేలా చూడాలి * ఎల్‌నినో తీవ్రత పొంచి ఉంది * జూన్-ఆగస్టు మధ్య సాధారణ స్థాయిని మించి ఎండలు * ప్రభుత్వం తదనుగుణంగా సన్నద్ధంగా ఉంది * జిల్లాల్లోనూ సమస్యలు రాకుండా చూడాలి * వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ రైతులకు బహుళ ప్రయోజనకరంగా ఉండేలా ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా ఏఐ ఆగ్రోనమిస్ట్ యాప్ తీసుకొచ్చిందని, దీన్ని రైతులందరూ తప్పనిసరిగా ఉపయోగించుకునేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ సూచించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన వ్యవసాయరంగ ప్రగతి గురించి వివరించారు. ఏఐ ఆగ్రోనమిస్ట్‌ను ఇప్పటికే రాష్ట్రంలో 5.45 లక్షల మంది రైతులు నమోదు చేసుకుని, ఉపయోగిస్తున్నారని తెలిపారు. జిల్లాల్లో ఈ ఏఐ ఆగ్రోనమిస్ట్ యాప్ గురించి రైతుల్లో అవగాహన కల్పించి ప్రతి రైతూ దీన్ని ఉపయోగించుకునేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఈ యాప్ ద్వారా తాము వేసే పంటలకు సంబంధించి సలహాలు, సూచనలు, మార్కెట్ ధరలు, రైతులకు ప్రభుత్వం నుంచి అందే లబ్ది, పంటలకు సోకే తెగుళ్లు, పురుగుల గురించి ముందస్తు సమాచారం తెలుసుకునే వీలుంటుందని అన్నారు. ఆర్ ఎస్ కే అధికారులకు కూడా ఇదే తరహాలో ప్రత్యేక యాప్‌ను రూపొందించామన్నారు. రాష్ట్రంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాల్లో నిర్వహించే రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఈ యాప్ ఉపయోగాల గురించి రైతులకు అవగాహన కల్పించి రైతులంతా ఏఐ ఆగ్రోనమిస్ట్ యాప్‌ను తప్పపకుండా ఉపకయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. *ఎల్‌నినో తీవ్రత పొంచి ఉంది* రాష్ట్రంలో ఎల్‌నినో తీవ్రత ప్రభావం ఈ సారి ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. జూన్-ఆగస్టు మధ్య సాధారణ స్థాయిని మించి గరిష్టంగా ఎండలు కాసే సేచనలు కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు కూడా కనిపించే సూచనలున్నాయన్నారు. అయితే రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కొత్త కాదని, గతంలో 2015, 2016, 2018లోనూ వచ్చిందన్నారు. జులైలో తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఎల్‌నినో తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధం అవుతోందని, జిల్లాల్లో కలెక్టర్లు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

- ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు డేవిడ్ డిమాండ్ చేశారు. బండి ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద కూలీలు, మేటీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీ రూ. 600 చెల్లించాలని, ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. పెండింగ్ నిధులు విడుదల చేసి కూలీలను ఆదుకోవాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- వరి పంట లో నూకలు చల్లడం వల్లన కలుపు నివారణ అవుతుంది1
- గోపాల్ పేట మండలం తాడిపర్తి నుంచి చెన్నూరు కు వెళ్లే మార్గంలోని లక్ష్మీ సముద్రం అలుగు వద్ద వంతెన నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో అలుగు పారినప్పుడు రాకపోకలు నిలిచిపోయి, వాహనదారులు ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రహదారి గుంతలమయమై తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి బ్రిడ్జి పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.1
- బుట్టా ఫౌండేషన్ నుంచి తాగునీటి సహాయం – సోగునూరు, టీఎస్ కూలూరు గ్రామాలకు ట్యాంకర్ పంపిణీ1
- పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో ఒంటికోట బడులు కావడం ఆపై అధికంగా ఎండ ఉండడంతో ఎస్సారెస్పీ నీటిని అధికారులు విడుదల చేయగా చిన్నారులు ఎంచక్కా కెనాల్ లో ఈత కొడుతూ ఎండ వేడిని సేద తీరుతున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రత అతి ఎండ ఉండడం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అప్రమత్తం చేయడంతో పాటు చిన్నారులకు ఇంటికి వెళితే అధికంగా వేడి ఉండడంతో ఉపశమనం కొరకు కెనాల్ కాలువలో చల్లని నీటిలో ఈత కొడుతూ సేద తీరుతున్నారు1
- రైతు రాజన్నాడం తప్పు రైతుకు గిట్ట పట్టేలార కావాలి అంటూ ఆహ్వానిస్తున్నారు1
- ఉపాధి హామీ కూలీల హాజరు నమోదులో మల్దకల్ గ్రామ పంచాయతీ రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. కొత్తగా వచ్చిన ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, 620 మంది కూలీల డేటాను నమోదు చేయడం ద్వారా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. 9 మంది వర్కింగ్ మెట్ల కృషితో తెల్లవారుజామునే లక్ష్యాన్ని చేరుకోవడం గమనార్హం. కార్యదర్శి చొరవను జిల్లా అధికారులు అభినందించారు. సాంకేతిక వినియోగంలో మల్దకల్ ఆదర్శనీయమని ప్రశంసించారు. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడంలో ఈ పంచాయతీ ప్రత్యేక గుర్తింపు పొందింది.1
- బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1