తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి.. కరీంనగర్‌లో బీజేపీ తిరంగా ర్యాలీ! తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ సూచన మేరకు కరీంనగర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీ అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పి, అధికారంలోకి వచ్చాక విస్మరించిందని మండిపడ్డారు. అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండన్నర సంవత్సరాలు గడుస్తున్నా, తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరవేసి, ఈ దినాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు...
తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి.. కరీంనగర్‌లో బీజేపీ తిరంగా ర్యాలీ! తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ సూచన మేరకు కరీంనగర్‌లో ఘనంగా
తిరంగా ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీ అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పి,
అధికారంలోకి వచ్చాక విస్మరించిందని మండిపడ్డారు. అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండన్నర సంవత్సరాలు గడుస్తున్నా, తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరవేసి, ఈ దినాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు...
- తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని కూరగాయల మార్కెట్ వద్ద సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం వీరోచితంగా పోరాడిందన్నారు. ఈ చరిత్రను వక్రీకరించొద్దన్న చాడ... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో సాయుధ పోరాట స్మృతివనం ఏర్పాటు చేయాలని, అమరవీరుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని గ్రామపంచాయతీల్లో జాతీయ జెండాలు ఎగురవేయాలని, పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.3
- కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ కు అమెరికాలో అపురూపమైన స్వాగతం పలికిన పూర్వ విద్యార్థులు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో కిమ్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ డా. పేర్యాల రవిందర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఇండియా నుంచి అమెరికా టెక్సాస్ లోని డల్లాస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు టెక్సాస్ రాష్ట్రంలో కిమ్స్ పూర్వ విద్యార్థులు అయిన గుడి విష్ణువర్ధన్ రెడ్డి, మరియు YSRCP ఇంచార్జ్ నాయకులు రమణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా.పి. రవీందర్ రావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ కలిసి మెలిసి ఉండాలని, అమెరికా అభి వృద్ధితో పాటు మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అదే విధంగా మన భారత దేశానికి ఏదో ఒక విధంగా 'సేవలందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నా తల్లి దండ్రులను మరియు కన్న తల్లిలాంటి మన మాతృ దేశాన్ని మరువకుండా సాధ్యమైనంత మేరకు సేవలు అందించాలని కోరారు. ఈ రెండు దేశాల అభివృద్ధి మీలాంటి యువత మీదనే ఆధారపడి ఉన్నందున కష్టపడి ఇష్టంగా మనస్ఫూర్తిగా సేవలందించాలని చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ పూర్వ అధ్యాపకులు బత్తిని గంగాధర్, బి.ఆర్. ఎస్ పార్టీ సభ్యులు సూర్యపుకాష్, వేల్బురి అజయ్, శ్రీకాంత్ రెడ్డి, కొండూరి సుమన్, ముప్పాల శరత్ ఫైనాన్సియల్ అడ్వైజర్, శరత్ రెడ్డి దేశీ చౌరస్తా పౌండE శేషావతారం, సునీల్ బ్రిస్టా రెస్టారెంటు, చెన్నోజ్వల ఆదిత్స బ్రిస్టా రెస్టారెంట్ పౌండర్, అజయ్ కలువాల ప్రముఖ పారిశ్రామిక వెత్త, మరియు 250 కి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు.1
- వీర్నపల్లి మండలంలో తండావాసుల వినూత్న నిరసన... బురదమయంగా మారిన రోడ్డుపై నాట్లేసి రోడ్డు బాగు చేయాలని డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిని కేలోత్ తండా వాసులు వినోద్ నిరసన తెలిపారు. నిన్న కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయంగా మారడంతో నడవడానికి వీలు లేని రోడ్డుపై వరి నాట్లు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. చినుకు పడితే రోడ్డు చిత్తడై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ కోడు ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. పాలకులకు అధికారులకు జ్ఞానోదయం కావాలని బురద రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపామని చెప్పారు. ఇప్పటికైనా రోడ్డు బాగు చేసి తమ ఇబ్బందులు తీర్చాలని కోరారు.1
- వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ రాజన్న ఆలయం నుంచి రాజన్న ప్రసాదంగా సన్న, చిన్నకారు రైతులకు కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నేడు 500 కోడెలను రైతులకు పంపిణీ చేస్తున్నాం.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి కోడెలను అందిస్తున్నాం.గతంలో కోడెలను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిజమైన రైతులకు రాజన్న ప్రసాదంగా అందిస్తున్నాం. రైతులు కోడెలను రాజన్న ప్రసాదంగా భావించి సొంతింటి బిడ్డల్లా సంరక్షించాలి. కోడెలను రైతుల పేరుతో తీసుకుని అక్రమంగా తరలిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.కోడెల ఆరోగ్య పరిరక్షణ కోసం దేవస్థానం పరిధిలోనే ప్రత్యేక వెటర్నరీ డాక్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.వారం నుంచి పది రోజుల్లో వైద్యుడిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అనారోగ్యానికి గురైన కోడెలను ఇతర వాటి నుంచి వేరు చేసి చికిత్స అందించేందుకు ఒక ఎకరం స్థలాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించారు.పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోడెలకు టీకాలు, వైద్యం, నాణ్యమైన పోషకాహారం, దాణా అందిస్తున్నాం. పలు మరవని చిన్న కోడెలను మొక్కుగా సమర్పించవద్దు. ఆరోగ్యంగా, ఎదిగిన కోడెలను మాత్రమే స్వామివారికి సమర్పించాలి.దూర ప్రాంతాల నుంచి చిన్న కోడెలను వాహనాల్లో తీసుకురావడం వల్ల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.జెర్సీ కోడెలకు స్థానిక వాతావరణం అనుకూలించక పోవడంతో సమస్యలు వస్తున్నాయి. వీలైనంత వరకు దేశీ జాతి, ఆరోగ్యకరమైన కోడెలను సమర్పించాలని భక్తులను కోరుతున్నాం.రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, వసతులు, మొక్కు బడులకు సంబంధించిన ఏర్పాట్లు మెరుగుపరుస్తున్నాం.శ్రావణ మాసంలోని ఒక సోమవారం 13 వేలకుపైగా కోడె మొక్కు టికెట్లు విక్రయమయ్యాయి.మొక్కుబడి టికెట్ల ద్వారా రూ.54 లక్షల ఆదాయం వచ్చింది.వేములవాడలో 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించాం. గోశాల ఏర్పాటును త్వరితగతిన ముందుకు తీసుకెళ్తాం.రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులతో పనులు కొనసాగుతున్నాయి.ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాలు, కోడెల సంరక్షణ, వైద్య సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం.భక్తుల విశ్వాసానికి, మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రాజన్న ఆశీస్సులతో రైతులు ఆర్థికంగా ఎదగాలి.3
- ఇంజనీర్లు పాత్ర కీలకం. ఇంజినీర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సౌజన్యంతో సత్కరించిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి రామగుండం పునర్నిర్మాణంలో ఇంజనీర్లు పోషిస్తున్న పాత్ర కీలకమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఇంజనీర్స్ డే పురస్కరించుకొని మంగళ వారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఇంజినీర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సౌజన్యంతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఇంజనీరింగ్ సిబ్బంది శక్తి కి మించి శ్రమిస్తూ అభివృద్దిలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారని ఆయన కొనియాడారు. ప్రస్తుత ఇంజినీర్లు చిత్త శుద్దితో సేవలందిస్తూ నాణ్యత లో ఏ మాత్రం రాజీ పడకుండా మన్నికగా సుదీర్ఘ కాలం నిలిచి ఉండేలా రోడ్లు , కాలువల నిర్మాణం చేపడుతున్నారని అభినందించారు. రామగుండం నగరాన్ని అధ్భుతoగా తీర్చి దిద్దాలనే స్థానిక ఎం ఎల్ ఎ లక్ష్యానికి అనుగుణంగా ఇదే ఒరవడి కొనసాగిస్తూ ఇంజనీర్లు పని చేసి పాలవర్గానికి మంచి పేరు తీసుకు రావాలని ఆశిస్తున్నామని అన్నారు. అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతి స్వరూప్ , ఎ ఇ లు మీర్ , తేజస్విని , సౌమ్య , మనోజ్ , అన్వేష్ , నవీన్ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు నవీన్ , అశోక్ , కళ్యాణ్ , శ్రావణ్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ సత్కారం అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి కజంపురం రాజేందర్ తో పాటు , నగర పాలక సంస్థ కార్పొరేటర్లు గట్ల రమేష్ , వడ్లూరి రవి , కొలని కవిత , బాలసాని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.1
- అక్షిత రాణి మృతికి కారణమైన ఓవర్‌మన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని MRPS, నాయకులు దళిత సంఘాలు మరియు 1630/1982 ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ గోదావరిఖని, సెప్టెంబర్ 14 (జన తెలంగాణ ప్రతినిధి కాంపల్లి రాజేష్ కుమార్): GDK-2 ఇన్క్లైన్‌లో శిక్షణార్థిగా పనిచేస్తున్న తాండ్ర అక్షిత రాణి తనపై అత్యాచారం జరిగిందని సూసైడ్ నోట్‌లో పేర్కొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని MRPS, దళిత సంఘాలు మరియు 1630/1982 ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ పులి మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్షిత రాణి మృతికి కారణమైన ఓవర్‌మన్‌పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగారపు లింగమూర్తి, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికెల కృష్ణ, సెంట్రల్ నాయకుడు ఆరెపల్లి రామచందర్, సెంట్రల్ సోషల్ మీడియా ఆర్గనైజేషన్ సెక్రటరీ కాంపల్లి రాజేష్ కుమార్ MRPS,నాయకులు దళిత సంఘాలతో పాటు పలువురు నాయకులు పాల్గొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. “అక్షిత రాణి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం. బాధ్యులను చట్టపరంగా శిక్షించే వరకు వెనక్కి తగ్గేది లేదు” అని MRPS,నాయకులు అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు.1
- రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see1
- విశ్వేశ్వరయ్య ఆశయ సాధనే ఇంజనీర్లకు నివాళి గ్రంధాలయ చైర్మన్ సత్తు మల్లేశం అన్నారు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఇంజనీర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. చదువు కేవలం ఉద్యోగానికే పరిమితం కాకుండా, సమాజంలోని సమస్యలను పరిష్కరించే సాధనంగా మారాలని విశ్వేశ్వరయ్య నమ్మారన్నారు. నీటిపారుదల, రోడ్లు, నిర్మాణ రంగాల్లో ఆయన అందించిన సేవలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.3