అందరి భాగస్వామ్యంతో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక -- జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ -- ములుగులో 2 కే రన్ ఏర్పాటు -- 2 కే రన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ ములుగు :అందరి భాగస్వామ్యంతో జిల్లాలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ములుగు పురపాలక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నగరంలో 2 కే రన్ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి జంక్షన్ బండారుపల్లి రోడ్డు నుంచి చేపట్టిన ఈ పరుగును జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., మున్సిపల్ చైర్మన్ చింతనిప్పుల చంద్ర కళ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రి జంక్షన్ బండారుపల్లి రోడ్డు ప్రధాన మార్గం మీదుగా జీవాంతరావు పల్లి ఎక్స్ రోడ్డు నుండి తిరిగి ప్రభుత్వ ఆసుపత్రి జంక్షన్ వరకు 2 కే రన్ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి 2కే రన్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని, ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంచేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను చాటేలా కార్యక్రమాలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. వివిధ వర్గాల ప్రజలకు పెద్ద ఎత్తున మేలు చేకూరేలా సమర్ధవంతంగా కార్యక్రమాలు అమలు చేయాలని, అందరినీ భాగస్వాములు చేయాలని సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది ములుగు మున్సిపల్ కు మంచి పేరు తేవాలన్నారు. వైద్య శాఖతో సమన్వయం చేసుకుని మహిళలు అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా, 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ నిరోధం కోసం హెచ్.పీ.వీ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించి చక్కటి పేరు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, మున్సిపల్ సిబ్బంది, యువత, తదితరులు పాల్గొన్నారు.

- దేశాయిపేటలోని జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులకు ఓ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. పదో తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, స్కేలు, ఇతర అవసరమైన వస్తువులతో కూడిన పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ నటుడు మరియు సేవా కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన Sonu Sood వీడియో కాల్ ద్వారా విద్యార్థులతో మాట్లాడి వారికి ప్రోత్సాహం అందించారు. చదువుపై దృష్టి పెట్టాలని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన సూచించారు.1
- గంగారం మండలం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామంలో ఓ రైతుకు చెందిన చేనులో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో రైతు గుండా గాని రాజుకు చెందిన మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామానికి సమీపంలోని పొలంలో ఉన్న మొక్కజొన్న కంకులు అకస్మాత్తుగా మంటలు చెలరేగి కాలిపోవడంతో స్థానికులు గమనించారు. అనంతరం గ్రామస్థులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే పంటలో కొంత భాగం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన వల్ల రైతు గుండా గాని రాజుకు ఆర్థికంగా నష్టం వాటిల్లినట్లు తెలిసింది. చేనులో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే నిప్పు పెట్టి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే నష్టపోయిన రైతుకు ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- వరంగల్ జిల్లా : ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందు తండాలో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం గోవిందు తండాలో గుడి పండగ చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ ట్రాన్స్ జెండర్ అక్కడికి చేరుకుంది. అత్యుత్సాహంతో పెట్రోల్ తో విన్యాసాలు చేసేందుకు ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో అనుకోకుండా చుట్టు ఉన్న జనాల్లో కొందరి మీద పెట్రోల్ పడింది. విన్యాసం మొదలు పెట్టే క్రమంలో మంటలు చెలరేగి ముందు వరుసలో ఉన్న ముంసావత్ దేవేందర్, బోడ పుల్య, దరావత్ బుజ్జి లకు మంటలు అంటున్నాయి. వీరితో పాటుగా చందు, నరేష్, గణేష్ అనే వ్యక్తులకు సైతం మంటలు అంటున్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. గాయపడిన వీరిని నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం.3
- మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గుండాగాని రాజు అనే రైతుకు చెందిన మొక్కజొన్న చేనులో నిప్పు పెట్టారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకున్నది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం, మొక్కజొన్న కంకి పూర్తిగా కాలిపోగా, సుమారు రూ.2 లక్షల వరకు ఆర్థిక నష్టం నమోదైనట్టు ఆయన తెలిపారు. పోలీసులు ఘటన పై విచారణ చేపట్టారు.1
- మాంచెరియల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదవ డివిజన్ కార్పొరేటర్ తోటపెల్లి రాజేశ్వరి గారి ఆదేశానుసారం11.మార్చి 2026. బుధవారం రోజున గణేష్ నగర్, సుభాష్ నగర్, గాంధీ నగర్ లోని డ్రైనేజి కాలువలను దగ్గర వుండి శుభ్రం చేపించడం జరిగింది ఇందుకు సహకరించిన పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు.1
- ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ బంజారా భవన్ లో శ్రీ సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన కారణజన్ముడు సంత్ సేవాలాల్ మహారాజు అని వారి ఆశీషులతో అందరి సంక్షేమనికి కృషిచేస్తానన్నారు. సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఎక్కడున్నా ఒకే, భాష, సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్పవిషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి సంత్ సేవాలాల్ జయంతిని 15 ఫిబ్రవరి రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తి గా ఉన్నా బంజారా భవన్ నిర్మానాన్ని పూర్తి చేసే భాద్యత నాదేనని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకునుటకు కలిసి రావాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుదామని తెలిపారు..3
- మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్‌కు ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులతో పాటు పోలీసు సిబ్బందిని కూడా గేటు వద్దే ఆపి లోపలికి అనుమతించలేదు.హెల్మెట్ ధరించిన తర్వాత మాత్రమే వారికి కలెక్టరేట్‌లోకి ప్రవేశం కల్పించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన కొంత మంది వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.1
- డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.1