Shuru
Apke Nagar Ki App…
కడప జిల్లా పెళ్లి మరి మండలం నంది మండల గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ సభ పెళ్లి మరి మండలం నంది మండల గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ సభ జరిగింది గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి వి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు హాజరయ్యారు
అశోక్ కుమార్ రెడ్డి
కడప జిల్లా పెళ్లి మరి మండలం నంది మండల గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ సభ పెళ్లి మరి మండలం నంది మండల గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ సభ జరిగింది గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి వి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు హాజరయ్యారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Palakattu nagendra1
- వై.ఎస్.ఆర్ కడప జిల్లా.. వై.ఎస్.ఆర్ కడప జిల్లా పులివెందులలో పోలీసుల మెరుపు దాడి ...15 కిలోల గంజాయి స్వాధీనం.. 👉 18 మంది నిందితుల అరెస్ట్.. 👉 110 లీటర్ల నాటు సారాయి పట్టివేత.. 👉 కదిరి రింగ్ రోడ్ వద్ద గంజాయి రవాణా అడ్డగింత.. 👉 గంజాయి కేసులో 10 మంది అరెస్ట్... 👉 నాటు సారా కేసులో 8 మంది అదుపులోకి.. 👉 ప్రధాన నిందితుడు గొర్ల భారత్ యాదవ్‌కు పాత కేసుల లింక్... 👉 వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం : జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ గంజాయి వ్యాపారం .. గంజాయి కొనుగోలుకు రూ.30 వేల పెట్టుబడి... పులివెందుల అర్బన్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్.. ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాలపై దాడులు.. SDPO మురళి ఆధ్వర్యంలో చర్యలు పట్టుబడ్డ వారిని రిమాండ్‌కు తరలింపు... డ్రగ్స్, నాటు సారాయిపై కఠిన చర్యలు కొనసాగుతాయి.. కడప జిల్లాలోని పులివెందులలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి మరియు నాటు సారాయి అక్రమ రవాణాపై దాడులు చేసి మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు, పులివెందుల SDPO బి.మురళి ఆధ్వర్యంలో పులివెందుల అర్బన్ పోలీసులు ఈ ప్రత్యేక దాడులు చేపట్టారు. ఉదయం కదిరి రింగ్ రోడ్ సమీపంలో గంజాయి రవాణా చేస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అదే సమయంలో పులివెందుల పట్టణంలో నాటు సారాయి అమ్ముతున్న మరో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు మంగళవారం మీడియా కు తెలిపారు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ గారు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు కేసు వివరాలు వెల్లడించారు. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 110 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు గొర్ల భరత్ యాదవ్‌కు పాత కేసులు ఉన్నట్లు, జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ ఈ వ్యాపారంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు తెలిపారు. జిల్లాలో డ్రగ్స్, నాటు సారాయి అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు కఠినంగా హెచ్చరించారు. ➡️ వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం : ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గా పేర్కొన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ప్రణాళిక ప్రకారం నేరం చేసి సంపాదించిన వారు, నేరంలో పాల్గొన్న వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు సీరియస్ గా పరిగణించి కఠిన శిక్ష విధించేలా చట్టంలో పొందు పరిచారన్నారు.1
- అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి... అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత... భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడు సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి. చెన్నూరు మహమ్మద్ అబ్బాస్ కాంగ్రెస్ నాయకులు, కడప జిల్లా.1
- బద్వేలు ,ఏప్రిల్ 14: బద్వేలు స్థానిక సిపిఎం కార్యాలయంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవులు అలంకరించిన వారు పరోక్షంగా నైనా కుల వివక్షతను సమర్పించడం నేరం అవుతుందని వారు తెలిపారు. మతం మారిన, కులాంతరవివాహం జరిగిన, కులఆధిపత్యం విషయంలో తర్జన, భర్జన జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వేసిన రాజేంద్ర సచార్, రంగనాథ్ మిశ్రా రెండు కమిషన్లు క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధం మతాలలోకి దళితులు స్వచ్ఛందంగా మత మార్పిడి చేసుకున్న కుల వివక్షత కొనసాగుతున్నదని ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఒక నిర్ధారణకు వచ్చి తీర్పు ఇచ్చిందని ఇది తొందరపాటు నిర్ధారణగాళనూ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగాను ఉన్నట్లు రాజ్యాంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిపారు. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గారు ఆకివీడు ఘటనలో హిందూ, క్రిస్టియన్ వివాదం సృష్టించి నేరం చేశారని వారు ఆరోపించారు. హిందూ, క్రైస్తవుల మధ్య వైశ్యామ్యాలు, వైరుధ్యాలు పెంచేందుకు పాలక పార్టీల నాయకులు పాట్లు పడుతున్నారని విమర్శించారు. మతం పేరుతో దళితుల్ని చీల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. కుల నిర్మూలన కోసం, కుల సంఘాలు పనిచేయాలని కోరారు. కుల నిర్మూలన కోసం సాగే ప్రజాస్వామిక ఉద్యమాలను బలహీనపర్చకూడదని తెలిపారు. సామాజిక ప్రజాస్వామ్యం లేనిదే పాలకులకు రాజకీయ మనుగడ లేదని జోష్యం చెప్పారు. ప్రజల పక్షాన నిలిచే ఏకైక శక్తి మార్క్సిస్టు పార్టీ ఒకటేనని తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సభలో పట్టణ కమిటీ సభ్యులు ఎం చిన్ని, పి.చాద్ బాషా, మస్తాన్ షరీఫ్, మోక్షమ్మ, సుబ్బరాయుడు, బద్వేల్ రూరల్ కార్యదర్శి డి.వెంకటేష్, అట్లూరు మండల కార్యదర్శి ఈ.రమణయ్య, సిపిఎం పట్టణ నాయకులు సత్తారు, అన్వర్, మూర ప్రసాద్, వెంకటపతి, వెంకటేశ్వర్లు, పి.శ్రీనివాసులు, బాబయ్య, బాలమ్మ, సుబ్బమ్మ, రాణమ్మ , రత్నమ్మ, రోజమ్మ, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.1
- *ఈతోడు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు* కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఈతోడు గ్రామ ప్రజల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రత్నా డా బి.ఆర్. అంబేడ్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో కలిసి కేక్ కట్ డా బి ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో తనకల్లు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- ధర్మవరం.. ధర్మవరం మండలంలోని చిగిచెర్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎస్సీ కాలనీకి చెందిన అంబేద్కర్ యూత్ కలిసికట్టుగా గ్రామస్తులతో కలిసి లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా అక్కడే కేక్ కట్ చేసి కాలనీ ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం పెద్ద ఎత్తున యువకులు గ్రామంలో బైక్ ర్యాలీ లో అంబేద్కర్ నినాదాలు చేస్తూ చేపట్టారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించి కాలనీ అభివృద్ధికి పాటుపడదామని వక్తలు ప్రసంగించారు. విద్యతోనే ప్రతి ఒక్కరి జీవితాలు మెరుగుపడతాయని కావున తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను చదివించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు బ్యాంక్ మేనేజర్ లక్ష్మీనరసింహలు, శ్రావణ్, శ్రీకాంత్, బద్రి, నరేంద్ర, సతీష్, పవన్, ఓం శేఖర్, నవీన్, భార్గవ్, నవీన్ కుమార్,మధు,వంశీ,కదరయ్య, కాటమయ్య, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.2
- Post by Nageshwari Nageshwari4
- కడప జిల్లా కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలి ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లుతూ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన అపార సేవలను స్మరించుకొని, ఆయన చూపిన మార్గంలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.1