logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

దండేపల్లి: మంచిర్యాల - అదిలాబాద్ ప్రధాన రహదారి పై గుంతతో వాహనదారుల ఇబ్బందులు దండేపల్లి మండల కేంద్రంలోని మంచిర్యాల -అదిలాబాద్ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. రాత్రివేళల్లో గుంత కనిపించక మరింత ప్రమాదకరంగా మారుతోందని వాహనదారులు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

55 min ago
user_M S SRIDHAR
M S SRIDHAR
Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
55 min ago

దండేపల్లి: మంచిర్యాల - అదిలాబాద్ ప్రధాన రహదారి పై గుంతతో వాహనదారుల ఇబ్బందులు దండేపల్లి మండల కేంద్రంలోని మంచిర్యాల -అదిలాబాద్ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. రాత్రివేళల్లో గుంత కనిపించక మరింత ప్రమాదకరంగా మారుతోందని వాహనదారులు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి పూజ, అన్నదానం.. కార్యక్రమంలో పాల్గొన్న : మున్సిపల్ చైర్ పర్సన్ సమిల్లా వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
    1
    జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి పూజ, అన్నదానం.. కార్యక్రమంలో  పాల్గొన్న : మున్సిపల్ చైర్ పర్సన్ సమిల్లా వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • ధర్మపురి పట్టణంలో ఘనంగా విశ్వకర్మ జయంతి ప్రత్యేక పూజలు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని గోదావరి తీరంలో గల విశ్వబ్రాహ్మణ సంఘ భవనంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 15న స్థానిక విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన విశ్వకర్మ జయంతి ఉత్సవాలు చివరి రోజు స్థాపిత మండపారాధన... విశ్వకర్మ హోమం... పూర్ణాహుతి కార్యక్రమాలను వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు.శ్రీ లలిత సహస్రనామ దేవి ఖడ్గమాల సహిత కుంకుమార్చన కార్యక్రమాన్ని మహిళలు సామూహికంగా నిర్వహించారు. సాయంత్రం విశ్వకర్మ భగవానుని విగ్రహాన్ని పురవీధుల్లో శోభాయాత్రగా తీసుకొని వెళ్లి స్థానిక గోదావరి నదిలో నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    ధర్మపురి పట్టణంలో ఘనంగా విశ్వకర్మ జయంతి ప్రత్యేక పూజలు 
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని గోదావరి తీరంలో గల విశ్వబ్రాహ్మణ సంఘ భవనంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 15న స్థానిక విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన విశ్వకర్మ జయంతి ఉత్సవాలు చివరి రోజు స్థాపిత మండపారాధన... విశ్వకర్మ హోమం... పూర్ణాహుతి కార్యక్రమాలను వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు.శ్రీ లలిత సహస్రనామ దేవి ఖడ్గమాల సహిత కుంకుమార్చన కార్యక్రమాన్ని మహిళలు సామూహికంగా నిర్వహించారు. సాయంత్రం విశ్వకర్మ భగవానుని విగ్రహాన్ని పురవీధుల్లో శోభాయాత్రగా తీసుకొని వెళ్లి స్థానిక గోదావరి నదిలో నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_కర్ణాల నాగరాజు
    కర్ణాల నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • జన్నారం మండలంలోని విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ జన్నారం: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని జన్నారం మండలంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి, విశ్వకర్మ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. సంఘం అధ్యక్షుడు కడర్ల నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సింగ్ ఓజి శ్రీనివాస్, కోశాధికారి కొత్త శ్రీనివాస్‌తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ ఐక్యత, సమాజ అభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
    1
    జన్నారం మండలంలోని విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ
జన్నారం: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని జన్నారం మండలంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి, విశ్వకర్మ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. సంఘం అధ్యక్షుడు కడర్ల నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సింగ్ ఓజి శ్రీనివాస్, కోశాధికారి కొత్త శ్రీనివాస్‌తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ ఐక్యత, సమాజ అభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే.! - సీ పీ ఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజన్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాల్ని బలోపేతం చేయాలి. కే రాజన్న. జిల్లా కార్యదర్శి సీ పీ ఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ. ఈరోజు సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో "సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా" పాటిస్తూ గోదావరిఖని ఐ ఎఫ్ టీ యు కార్యాలయంలో సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో *సీ పీ ఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ. జిల్లా కార్యదర్శి కే రాజన్న* మాట్లాడుతూ... తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 వరకు జరిగిందని. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 3000.గ్రామాలు విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలకు పంచడం జరిగిందన్నారు. ఈ పోరాటంలో 4,000 మంది అమర వీరులైనారు.తొలి అమర వీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య భూమి కోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం భూస్వాముల అరాచకం, వెట్టి చాకిరి విముక్తి కోసం, బానిసత్వం పై తిరగబడి విరోచితంగా రైతంగ సాయుధ పోరాటం సాగిందన్నారు. చరిత్రను మరచిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అమర వీరుల త్యాగాలను పోరాటాలను పక్కదోవ పట్టిస్తూ, విలీనమని, విమోచ అని పాలకులు ఈ రోజు వక్రీకరిస్తున్నారని అన్నారు. "సెప్టెంబర్.17. ముమ్మాటికి విద్రోహమే" అని సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ. భావిస్తుందన్నారు. ఈ దేశంలో పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ పోరాట స్ఫూర్తితో బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ఎస్ సి సి డబ్ల్యూ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న,ఐ ఎఫ్ టీ యు. జిల్లా అధ్యక్షులు ఈ నరేష్,ఉపాధ్యక్షులు చిలుక శంకర్, ప్రధాన కార్యదర్శి బి అశోక్,ఏ ఐ కే ఎం ఎస్. జిల్లా అధ్యక్షులు గుండేటి మల్లేశం, ఉపాధ్యక్షులు మేరుగు చంద్రయ్య, నాయకులు ఐ రాజేశం,ఎం దుర్గయ్య, అరుణోదయ జిల్లా అధ్యక్షులు బతుకుల రాజన్న, కాసర్ల మల్లేష్,ఎం కొమరయ్య,కోట వెంకన్న , పోగుల శేఖర్, రామారావు, జనగామ రాజన్న, చంటి బానయ్య, సతీష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
    1
    సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమే.!
- సీ పీ ఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజన్న
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాల్ని బలోపేతం చేయాలి.
కే రాజన్న. జిల్లా కార్యదర్శి సీ పీ ఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ. 
ఈరోజు సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో "సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా" పాటిస్తూ గోదావరిఖని ఐ ఎఫ్ టీ యు కార్యాలయంలో సభ నిర్వహించడం జరిగింది. 
ఈ సభలో *సీ పీ ఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ. జిల్లా కార్యదర్శి కే రాజన్న* మాట్లాడుతూ...
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 వరకు జరిగిందని.
ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 3000.గ్రామాలు విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలకు పంచడం జరిగిందన్నారు. 
ఈ పోరాటంలో 4,000 మంది అమర వీరులైనారు.తొలి అమర వీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య భూమి కోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం భూస్వాముల అరాచకం, వెట్టి చాకిరి విముక్తి కోసం, బానిసత్వం పై తిరగబడి విరోచితంగా రైతంగ సాయుధ పోరాటం సాగిందన్నారు. 
చరిత్రను మరచిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అమర వీరుల త్యాగాలను పోరాటాలను పక్కదోవ పట్టిస్తూ, విలీనమని, విమోచ అని  పాలకులు ఈ రోజు వక్రీకరిస్తున్నారని అన్నారు. "సెప్టెంబర్.17. ముమ్మాటికి విద్రోహమే" అని సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ. భావిస్తుందన్నారు.
ఈ దేశంలో పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ పోరాట స్ఫూర్తితో బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.
ఈ సభలో ఎస్ సి సి డబ్ల్యూ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న,ఐ ఎఫ్ టీ యు. జిల్లా అధ్యక్షులు ఈ నరేష్,ఉపాధ్యక్షులు చిలుక శంకర్, ప్రధాన కార్యదర్శి బి అశోక్,ఏ ఐ కే ఎం ఎస్. జిల్లా అధ్యక్షులు గుండేటి మల్లేశం, ఉపాధ్యక్షులు మేరుగు చంద్రయ్య, నాయకులు ఐ రాజేశం,ఎం దుర్గయ్య, అరుణోదయ జిల్లా అధ్యక్షులు బతుకుల రాజన్న, కాసర్ల మల్లేష్,ఎం కొమరయ్య,కోట వెంకన్న , పోగుల శేఖర్, రామారావు, జనగామ రాజన్న, చంటి బానయ్య, సతీష్, సంతోష్
తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    52 min ago
  • మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం ఘటన: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్ పేలింది. కారణం: కారు క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాంతం: మహబూబాబాద్‌లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నష్టం: డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. ప్రస్తుత పరిస్థితి: భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్‌కు పయనమయ్యారు.
    1
    మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
ఘటన: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్ పేలింది.
కారణం: కారు క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రాంతం: మహబూబాబాద్‌లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
నష్టం: డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు.
ప్రస్తుత పరిస్థితి: భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్‌కు పయనమయ్యారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    8 hrs ago
  • వార్డులో పర్యటించి వార్డులో కొనసాగుతున్న పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన : జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి
    1
    వార్డులో పర్యటించి వార్డులో కొనసాగుతున్న పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన : జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • NSUI ఆధ్వర్యంలో ఖనిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ MLA మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఖని రీగల్ షూ మార్ట్ వద్ద తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ మాట్లాడుతూ... 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలోనే కొనసాగిందని తెలిపారు. నిజాం పాలకుల నిరంకుశ పాలనకు, రజాకారుల అరాచకాలకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఆనాడు సామాన్య ప్రజలు ప్రజా చైతన్యంతో సాగించిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజా పోరాటానికి మద్దతుగా అప్పటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేతృత్వంలో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు నిర్వహించిన సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని తెలిపారు. ప్రజా పోరాటాల ఫలితంగా రాచరిక పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్య వ్యవస్థకు మార్గం సుగమం కావడం చారిత్రక పరిణామమని అన్నారు. ఈ ప్రజా పోరాటానికి గుర్తుగా సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడం స్వాగతించదగిన పరిణామమని మెంటం ఉదయ్ రాజ్ పేర్కొన్నారు. చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించవద్దు: మెంటం ఉదయ్ రాజ్ తెలంగాణ విముక్తి పోరాట చరిత్రను కొందరు బీజేపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ప్రజల మధ్య మతపరమైన విభేదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మెంటం ఉదయ్ రాజ్ విమర్శించారు. సెప్టెంబర్ 17నాటి తెలంగాణ విముక్తి పోరాటంలో రాజకీయ పార్టీల పాత్ర గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నాయకులు కూడా కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ పోలో నిర్వహించిన అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడని,దేశ స్వాతంత్ర సమయంలోనే హైదరాబాద్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన స్వామి రామానంద తీర్థ గారు స్టేట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని తెలిపారు. అదేవిధంగా, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం తదితరులు కమ్యూనిస్టు ఉద్యమానికి చెందిన ప్రముఖ పోరాట యోధులని గుర్తుచేశారు. తెలంగాణ విముక్తి పోరాట సమయంలో బీజేపీకి చెందిన నాయకుల పాత్రను చారిత్రక ఆధారాలతో పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రజా పోరాటాల చరిత్రను మతపరమైన, రాజకీయ విభజనలకు ఉపయోగించకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని మెంటం ఉదయ్ రాజ్ కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, NSUI నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
    1
    NSUI ఆధ్వర్యంలో ఖనిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
MLA మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్  ఆదేశాల మేరకు NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఖని రీగల్ షూ మార్ట్ వద్ద తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ మాట్లాడుతూ...
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలోనే కొనసాగిందని తెలిపారు. నిజాం పాలకుల నిరంకుశ పాలనకు, రజాకారుల అరాచకాలకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఆనాడు సామాన్య ప్రజలు ప్రజా చైతన్యంతో సాగించిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ప్రజా పోరాటానికి మద్దతుగా అప్పటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేతృత్వంలో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు నిర్వహించిన సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని తెలిపారు. ప్రజా పోరాటాల ఫలితంగా రాచరిక పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్య వ్యవస్థకు మార్గం సుగమం కావడం చారిత్రక పరిణామమని అన్నారు.
ఈ ప్రజా పోరాటానికి గుర్తుగా సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడం స్వాగతించదగిన పరిణామమని మెంటం ఉదయ్ రాజ్ పేర్కొన్నారు.
చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించవద్దు: మెంటం ఉదయ్ రాజ్
తెలంగాణ విముక్తి పోరాట చరిత్రను కొందరు బీజేపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ప్రజల మధ్య మతపరమైన విభేదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మెంటం ఉదయ్ రాజ్ విమర్శించారు.
సెప్టెంబర్ 17నాటి తెలంగాణ విముక్తి పోరాటంలో రాజకీయ పార్టీల పాత్ర గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నాయకులు కూడా కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు.
ఆపరేషన్ పోలో నిర్వహించిన అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడని,దేశ స్వాతంత్ర సమయంలోనే హైదరాబాద్‌లో  త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన స్వామి రామానంద తీర్థ గారు స్టేట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని తెలిపారు.
అదేవిధంగా, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం తదితరులు కమ్యూనిస్టు ఉద్యమానికి చెందిన ప్రముఖ పోరాట యోధులని గుర్తుచేశారు.
తెలంగాణ విముక్తి పోరాట సమయంలో బీజేపీకి చెందిన నాయకుల పాత్రను చారిత్రక ఆధారాలతో పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని పేర్కొన్నారు.
ప్రజా పోరాటాల చరిత్రను మతపరమైన, రాజకీయ విభజనలకు ఉపయోగించకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని మెంటం ఉదయ్ రాజ్ కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, NSUI నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్‌: గంజ్ హైస్కూల్ రోడ్డుపై లీకవుతున్న వాటర్ పైప్‌లైన్ కరీంనగర్ నగరంలోని గంజ్ హైస్కూల్ రోడ్డులో వాటర్ పైప్‌లైన్ లీకై నీరు రోడ్డుపై ఏరులై పారుతోంది. రహదారి మధ్యలోనే పైపు పగిలిపోవడంతో లక్షలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతోంది. రోడ్డంతా నీరు నిలిచి బురదమయంగా మారడంతో అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, పాఠశాల విద్యార్థులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు జారి పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి, తక్షణమే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    కరీంనగర్‌: గంజ్ హైస్కూల్ రోడ్డుపై లీకవుతున్న వాటర్ పైప్‌లైన్
కరీంనగర్  నగరంలోని గంజ్ హైస్కూల్ రోడ్డులో వాటర్ పైప్‌లైన్ లీకై నీరు రోడ్డుపై ఏరులై పారుతోంది. రహదారి మధ్యలోనే పైపు పగిలిపోవడంతో లక్షలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతోంది.
రోడ్డంతా నీరు నిలిచి బురదమయంగా మారడంతో అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, పాఠశాల విద్యార్థులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు జారి పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి, తక్షణమే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    33 min ago
  • నిజామాబాద్ రాజా రాజేంద్ర చౌరస్తాలో దారుణ హత్య కోరుట్లకు చెందిన హరిబాబును నరికి చంపిన దుండగులు కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో హరిబాబుపై దాడి కారులో వచ్చిన పలువురు వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం హరిబాబుపై కత్తులతో విచక్షణారహితంగా దాడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం హత్య అనంతరం కారులో పరారైన దుండగులు ఐదు నెలల క్రితం భార్య, యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో హరిబాబు నిందితుడు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన హరిబాబు బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్దికాలానికే హరిబాబు హత్య పాత కక్షలే హత్యకు కారణమా? అన్న కోణంలో అనుమానాలు రాజా రాజేంద్ర చౌరస్తాలో హత్యతో కలకలం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుల కోసం పోలీసులు గాలింపు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం
    1
    నిజామాబాద్ రాజా రాజేంద్ర చౌరస్తాలో దారుణ హత్య

కోరుట్లకు చెందిన హరిబాబును నరికి చంపిన దుండగులు


కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో హరిబాబుపై దాడి
కారులో వచ్చిన పలువురు వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం
హరిబాబుపై కత్తులతో విచక్షణారహితంగా దాడి
తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం
హత్య అనంతరం కారులో పరారైన దుండగులు
ఐదు నెలల క్రితం భార్య, యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో హరిబాబు నిందితుడు
ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన హరిబాబు
బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్దికాలానికే హరిబాబు హత్య
పాత కక్షలే హత్యకు కారణమా? అన్న కోణంలో అనుమానాలు
రాజా రాజేంద్ర చౌరస్తాలో హత్యతో కలకలం
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
దుండగుల కోసం పోలీసులు గాలింపు
సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.