*అంబులెన్సులో బ్రెయిన్-డెడ్ మహిళ.. ‘భారీ కుదుపు’తో తిరిగివచ్చిన ప్రాణం!* ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. బ్రెయిన్-డెడ్ అయినట్లు భావించి, ఆశలు వదులుకుని ఇంటికి తీసుకెళ్తున్న ఒక మహిళ, అంబులెన్స్ ప్రయాణంలో తగిలిన ఒక భారీ కుదుపు వల్ల తిరిగి స్పృహలోకి వచ్చింది. బాధితురాలు: పిలిభిత్ జిల్లాకు చెందిన బింజా కున్వర్. ఆమె స్థానిక జిల్లా కోర్టులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. సంఘటన: ఫిబ్రవరి 22న ఇంట్లో పని చేసుకుంటుండగా ఆమె అకస్మాత్తుగా కింద పడిపోయారు. మెరుగైన చికిత్స కోసం బరేలీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి: మూడు రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ, ఆమె కోలుకునే అవకాశాలు లేవని, బ్రెయిన్-డెడ్ అయిందని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. అద్భుతం: ఫిబ్రవరి 24న అంబులెన్సులో ఇంటికి తీసుకెళ్తుండగా, బరేలీ-హరిద్వార్ జాతీయ రహదారిపై ఒక భారీ గుంత కారణంగా వాహనం గట్టిగా కుదుపునకు గురైంది. ఆ వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న ఆమె ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం ప్రారంభించి, కళ్లు తెరిచారు. ప్రస్తుత పరిస్థితి: వెంటనే ఆమెను తిరిగి ఆసుపత్రికి తరలించారు. ఆమె శరీరంలో విషపూరిత అంశాలు ఏవైనా ఉన్నాయేమో అని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. దాదాపు 12 రోజుల చికిత్స తర్వాత ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

- User2170Mahabubnagar Rural, Telangana😤on 12 March
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.1
- సీఎం రేవంత్ రెడ్డి పై మాజీమంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని, బ్యాండ్ వాగన్ గా కోనసాగలేనని బయటకు వచ్చానని స్పష్టం చేశారు. జగిత్యాలలో మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి సూచనల మేరకే కాంగ్రెస్ అధిష్టానం నడుస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో తాను చేయడం ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ను దోషిగా చూపే ప్రయత్నం చేశారని విమర్శించారు.పదవులు కావాలి అనుకుంటే నీ దగ్గర పడిగాపులు కాసేవాన్ని....కానీ పదవులు శాశ్వతం కాదనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి సూచించారు. ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు చూశానని, రేవంత్ నువ్వు ఎమ్ చూసావో నాకు తెలియదన్నారు. కెసిఆర్ నా వయసును గౌరవిస్తాడని, నన్ను అన్న అని పిలుస్తాడని, కెసిఆర్ కు ప్రజలంటే గౌరవం, నీలాగా కాదని అన్నారు. కేసీఆర్ పై విధానపరమైన విమర్శ చేశానే తప్ప వ్యక్తిగతంగా తాను ఏనాడు ఎవ్వరిని విమర్శించలేదన్నారు. పార్టీ సూచన తో ప్రభుత్వం నడువాలి కానీ, తెలంగాణ లో ప్రభుత్వ సూచన తో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని విమర్శించారు. పిల్లిని లోపల వేసి కొడితే తిరుగపడుద్దని జీవన్ రెడ్డి అన్నారు.1
- ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- అగ్నిమాపక వారోత్సవాల్లో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్ వద్ద అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిమాన్స్టెస్టసన్ కార్యక్రమాన్ని నిర్వహించగా నీటితో పాలు రకాల విన్యాసాలను చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి నరేందర్ మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అలాగే విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుంటూ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు.3
- వరంగల్ జిల్లా లో: ఎన్ఐటి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. హనుమకొండ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న ఆటో, హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సును వెనుక నుంచి ఢీకొంది. దీంతో డ్రైవర్ ఆటోలోనే ఇరుక్కుపోగా, ఎడమ కాలు విరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి అతడిని బయటకు తీసి 30 నిమిషాల్లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.1
- ఈరోజు లింగాల ఘనపూర్ మండల్ గుమ్మడవెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అమల సుమలత మరియు వార్డ్ నెంబర్లు యూత్ సభ్యులు ముఖ్య నాయకులు అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ సిద్ధవటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది4
- జీతం పెంచాలని కోరినందుకు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ రాంప్రసాద్పై యజమానులు అనిల్రెడ్డి, బాలరాజు దాడికి పాల్పడ్డారు. దీనిని నిరసిస్తూ తోటి డ్రైవర్లు బస్సులు నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్పై దాడిని సీపీఐ నేత గడిపే మల్లేశం ఖండించారు. కార్మికులపై ఇలాంటి దాడులు సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో హుస్నాబాద్ డిపో వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.1