Shuru
Apke Nagar Ki App…
యువత క్రీడలపై దృష్టి సారించాలి: సుప్రజా మురళీ బుచ్చి పట్టణంలోని డీఎల్ఎన్ఆర్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను ఛైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని ఆమె సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కలుగుతుందని తెలిపారు. యువ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు.
SRIHARI POONDLA
యువత క్రీడలపై దృష్టి సారించాలి: సుప్రజా మురళీ బుచ్చి పట్టణంలోని డీఎల్ఎన్ఆర్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను ఛైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని ఆమె సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కలుగుతుందని తెలిపారు. యువ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కోవూరు ఏఎంసీ చైర్మన్ ని బెజవాడ వంశీ కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు, అభినందన వెల్లువ కోవూరు ఏఎంసీ చైర్మన్ ని బెజవాడ వంశీ కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు కోవూరు నియోజకవర్గం కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన బెజవాడ వంశీకృష్ణారెడ్డిని మిడవలూరు మండలం టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయన్ని శాలువాతో సత్కరించి, పూలమాలవేసి బాణాసంచా పేల్చి శుభాకాంక్షలు తెలపటం జరిగింది. టిడిపి నాయకులు మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి నాయకులంతా కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు పార్టీ కోసం కష్టపడుతుంటాడనిఇలాంటి పదవి ఇవ్వటం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు.4
- బద్వేలు, ఆగస్టు 01: స్మార్ట్ కిచెన్ పేరుతో బద్వేలు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కడుపులు మాడ్చుతున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు టి.నాగేంద్ర బాబు ఆరోపించారు.బద్వేలులోని స్థానిక ఎమ్మార్సీ వద్ద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వేలాపాలా లేకుండా నాణ్యతలేని భోజనాన్ని ఇష్టారాజ్యంగా అందజేయడాన్ని నిరసిస్తూ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎస్.కె.ఆదిల్, ఎస్ఎఫ్ఐ నాయకులు టి.నాగేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేసిన స్మార్ట్ కిచెన్ విధానంలో భాగంగా బద్వేలు మండల పరిధిలోని చిన్నకేశం పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్మార్ట్ కిచెన్ ను ఏర్పాటు చేశారన్నారు. స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసినప్పటి నుండి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. అలాగే సమయపాలన లేకుండా ఇష్టారాజ్యంగా భోజనాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలల షెడ్యూల్ ప్రకారం 12.15 నిమిషాలకు విద్యార్థులకు భోజనాన్ని అందజేయాల్సి ఉండగా పలు పాఠశాలల్లో 2 గంటలు దాటిన తర్వాత కూడా భోజనం సరఫరా చేస్తున్నారన్నారు. స్మార్ట్ కిచెన్ వారు భోజన సరఫరాకు తగినన్ని వాహనాలు, తగినన్ని వంట పాత్రలు ఏర్పాటు చేసుకోకపోవడం మూలాన దూర ప్రాంతాలకు చాలా ఆలస్యంగా భోజనం అందుతున్నదన్నారు. భోజనం ఆలస్యం కారణంగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తూ పలు పాఠశాలల్లో కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలున్నాయని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్తారని, భోజనం ఆలస్యమైనప్పుడు విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తినే అవకాశం కూడా లేదన్నారు. బద్వేల్ మండలంలో స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఐదారుసార్లు మండల పరిధిలోని విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత భోజనం సరఫరా చేశారన్నారు. భోజనం కోసం పిల్లలు గంటలు గంటలు నిరీక్షించాల్సి రావడం దారుణమన్నారు. స్మార్ట్ కిచెన్ నిర్వాహకులు మెనూ కూడా సక్రమంగా అనుసరించడం లేదని, వారి ఇష్టారాజ్యంగా భోజనం పెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం స్మార్ట్ కిచెన్ ద్వారా నెరవేరడం లేదని పేర్కొన్నారు. రుచి లేని ఆహార పదార్థాలను విద్యార్థులకు వడ్డిస్తున్నారని వారు ఆరోపించారు. గంటలు గంటలు ఆలస్యం కావడం వల్ల పాఠశాలల్లో తరగతులు కూడా విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పత్రికల్లో కథనాలు వచ్చాయని, సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ అధికారి ఆరోపణలపై విచారణకు వచ్చారని తెలిపారు. అయినప్పటికీ పరిస్థితులలో ఎలాంటి మార్పులు లేవని వారు ఆరోపించారు. మెనూ ప్రకారం వారంలో రెండు మార్లు గుడ్డు కూర, మూడు సార్లు ఉడకబెట్టిన గుడ్డును అందజేయాల్సి ఉండగా, గుడ్డు కూర ఇవ్వకుండా ఉడకబెట్టిన గుడ్డును అందజేస్తున్నారన్నారు. ఈ విషయంలో బద్వేలు మండల విద్యాశాఖ అధికారి సక్రమంగా స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకొని నాణ్యమైన భోజనాన్ని, కాలంలో అందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్, విద్యా శాఖ మంత్రి కి ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి సి.సుధాకర్, నాయకులు రామాంజనేయులు, అబ్దుల్ రెహమాన్, రాజు, భాష తదితరులు పాల్గొన్నారు.1
- విమానయాన శాఖ మంత్రిగా ఉత్తరాంధ్రకి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నా.. మన రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. 2024-25లో ప్రధాన విమానాశ్రయాల్లో 11% ఉన్న సర్వీసులు.. 2025-26 నాటికి 2% పడిపోయింది. అలానే ప్రయాణికులు కూడా తగ్గిపోయారు. -పుత్తా శివశంకర్ రెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి విమానయాన శాఖ మంత్రిగా ఉత్తరాంధ్రకి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నా.. మన రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. 2024-25లో ప్రధాన విమానాశ్రయాల్లో 11% ఉన్న సర్వీసులు.. 2025-26 నాటికి 2% పడిపోయింది. అలానే ప్రయాణికులు కూడా తగ్గిపోయారు. -పుత్తా శివశంకర్ రెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి1
- అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు. అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు.1
- వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.1
- పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నాటికి నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని నేడు పరిశీలించడం జరిగిందని, వేగంగా పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పేర్కొన్నారు. ఈ పరిశీలనలో భాగంగా ప్రత్యేక వాహనాల్లో జంట సొరంగాల్లోకి వెళ్లి ముందుగా టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ బీ ఎం ) పనులను పరిశీలించి, పురోగతి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ: టన్నెల్-2 లైనింగ్ పనుల్లో పురోగతి: వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్-2 లో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు నెల రోజుల క్రితం 2,000 మీటర్లకు పైగా బ్యాలెన్స్ ఉన్నటువంటి లైనింగ్ పనిని, ప్రస్తుతం దాదాపు 460 మీటర్ల వరకు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు.15 రోజుల్లో మిగిలిన పనుల పూర్తి: మిగిలిన 460 మీటర్ల లైనింగ్ పనిని కూడా ప్రణాళికాబద్ధంగా (Plan of Action), వీలైనంత వేగంగా, ఆగష్టు 15 లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కాలనీల (R&R) అభివృద్ధి: ముంపునకు గురవుతున్న (Submergence) 11 గ్రామాలకు సంబంధించిన పునరావాస కాలనీల్లో ప్రాథమిక సౌకర్యాలు (Basic Amenities), మౌలిక సదుపాయాలు / ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అత్యంత వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నిర్వాసితుల తరలింపు ఏర్పాట్లు: సత్వరమే పనులన్నీ పూర్తి చేసి, ఇప్పటికే పరిహారం అందుకున్న నిర్వాసితులను ఆయా కాలనీలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. సెప్టెంబర్ 1 నాటికి నీటి విడుదల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, సెప్టెంబర్ 1వ తేదీ కల్లా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పనులను పూర్తి చేసి, నీటిని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఇతర జిల్లా అధికారులు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1
- కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తాత రమేష్ కోవూరు ఏఎంసీ చైర్మన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తాత రమేష్ కోవూరు నియోజకవర్గం కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన బెజవాడ వంశీకృష్ణారెడ్డిని తాతా రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన్ని ఘనంగా సన్మానించారు.2
- కాణిపాకంలో టిడిపి వైసిపి నాయకుల మధ్య ఉద్రిక్త వాతావరణం ఐరాల మండలం కాణిపాకంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య నినాదాలతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్య ప్రమాణ కార్యక్రమం సందర్భంగా వైసీపీ నేతలు, టీడీపీ నాయకులను ఉద్దేశించి నినాదాలు చేయడంతో ఆలయ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.1