Shuru
Apke Nagar Ki App…
చిలకలూరిపేటలో విషాదం.. టిడ్కో గృహంలో వ్యక్తి ఆత్మహత్య పల్నాడు జిల్లా: చిలకలూరిపేట ఎన్టీఆర్ నగర్‌లోని టిడ్కో గృహ సముదాయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య గతంలోనే మరణించగా, పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆ మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
SIVA
చిలకలూరిపేటలో విషాదం.. టిడ్కో గృహంలో వ్యక్తి ఆత్మహత్య పల్నాడు జిల్లా: చిలకలూరిపేట ఎన్టీఆర్ నగర్‌లోని టిడ్కో గృహ సముదాయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య గతంలోనే మరణించగా, పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆ మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పం కొలువుదీరింది.* కేసీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఒక అభిమాని ఈ అద్భుత శిల్పాన్ని రూపొందించారు. గులాబీ రంగులో మెరుస్తున్న ఈ కళాఖండం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ అభివృద్ధిలో ఆయన పాత్రను స్మరిస్తూ రూపొందించిన ఈ సైకత చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.1
- గుంటూరు కోదండ రామయ్య నగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా మెటల్ రోడ్డుపై తేలిన రాళ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్న మున్సిపల్ అధికారులు, ఇక్కడ మాత్రం బడ్జెట్ లేదంటూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు1
- బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా *ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,* జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- మచిలీపట్నం పోతేపల్లి గ్రామంలో జిల్లా కోర్టు ఉద్యోగి అర్జా లక్ష్మీ ఇంట్లో గ్యాస్ లీకేజ్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.7 లక్షల నష్టం వాటిల్లగా కుటుంబం ప్రాణాలతో బయటపడింది. బాధితులకు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ నిత్యావసర వస్తువులు, బియ్యం, బట్టలు, వంట సామాగ్రి, రూ.5,000 నగదు అందజేశారు. ప్రభుత్వం అగ్ని బాధితులకు పక్కా ఇల్లు, ఆర్థిక సాయం కల్పించాలని ఆయన కోరారు.1
- Post by ఉంగరాల కార్తీక్1
- బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో రోడ్డుకి ప్రక్కల ఆక్రమించి వ్యాపారాలు పెట్టుకున్న వారి ఆక్రమణలను మంత్రి కోమటిరెడ్డి తెల్లవారుజామున సిబ్బందితో కలిసి తొలగించారు. ఫుట్పాత్ ద్వారా ట్రాఫిక్ సమస్య ఉందని వెంటనే తొలగించేశారు.1
- బిస్మిల్లా హోటల్ లక్ష్మీపురం ఫుడ్ కమిషనర్ రైడ్ చేసిన హోటల్ ఈరోజు ఫుల్ రష్ గా సాగుతోంది హోటల్ సీజ్ చేయలేదా మరి ఆరోజు అంత హడావుడి చేశారు పబ్లిసిటీ కోసమా కమిషనర్ గారు సమాధానం చెప్పాలి1