logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామారెడ్డి జిల్లా బిబిపేట పరిధిలోని 13వ వార్డులో సర్ ఫామ్ నమోదు ప్రక్రియ నిర్వహించారు. ఈ నమోదులో భాగంగా ఈ రోజు ఓటర్ల నుండి సర్ ఫామ్స్‌ను సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఓటరు పూర్తిగా సహకరించాలని కోరారు.

6 hrs ago
user_Korivi Narsimlu
Korivi Narsimlu
బీబీపేట్, కామారెడ్డి, తెలంగాణ•
6 hrs ago
16a7303f-f0d2-4702-b7a2-8e2921f6bcdf

కామారెడ్డి జిల్లా బిబిపేట పరిధిలోని 13వ వార్డులో సర్ ఫామ్ నమోదు ప్రక్రియ నిర్వహించారు. ఈ నమోదులో భాగంగా ఈ రోజు ఓటర్ల నుండి సర్ ఫామ్స్‌ను సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఓటరు పూర్తిగా సహకరించాలని కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల పట్టణంలో శనివారం జీ తెలుగు 'జయం' డైలీ సీరియల్ నటీనటులు సందడి చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా ఈ సీరియల్‌లో 'రుద్ర' పాత్ర పోషిస్తున్న శ్రీరామ్‌ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపించారు. శ్రీరామ్‌తో పాటు ఇతర నటీనటులు కూడా హాజరు కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమం అంతా ఎంతో సందడిగా సాగింది.
    1
    రాజన్న సిరిసిల్ల పట్టణంలో శనివారం జీ తెలుగు 'జయం' డైలీ సీరియల్ నటీనటులు సందడి చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా ఈ సీరియల్‌లో 'రుద్ర' పాత్ర పోషిస్తున్న శ్రీరామ్‌ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపించారు. శ్రీరామ్‌తో పాటు ఇతర నటీనటులు కూడా హాజరు కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమం అంతా ఎంతో సందడిగా సాగింది.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూజల అనంతరం బండి సంజయ్ కుమార్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ స్వామివారికి కోడెమొక్కు చెల్లించారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ, ఆయన ప్రజాసేవలో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని, ప్రజలకు సేవ చేసే శక్తిని, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పూజల అనంతరం బండి సంజయ్ కుమార్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ స్వామివారికి కోడెమొక్కు చెల్లించారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ, ఆయన ప్రజాసేవలో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని, ప్రజలకు సేవ చేసే శక్తిని, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
  • తెలంగాణలో కరువు వస్తున్న నేపథ్యంలో పంటలకు, రైతులకు నీళ్ళు ఎలా అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద సమాధానం ఇచ్చారు. ఏముంది వాళ్ళను కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి బదులిచ్చారు.
    1
    తెలంగాణలో కరువు వస్తున్న నేపథ్యంలో పంటలకు, రైతులకు నీళ్ళు ఎలా అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద సమాధానం ఇచ్చారు. ఏముంది వాళ్ళను కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి బదులిచ్చారు.
    user_ప్రేమ్ కుమార్
    ప్రేమ్ కుమార్
    Interior designer Nagireddypet, Kamareddy•
    4 hrs ago
  • చిలిపిచేడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలోని ఎరువుల దుకాణాన్ని ఎమ్మార్వో శివప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా బస్తాల పంపిణీ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించాలని, పంపిణీలో పారదర్శకత పాటిస్తూ ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దని డీలర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల కోసం వచ్చిన రైతులతో మాట్లాడిన ఎమ్మార్వో, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ఫారాలు నింపి ఓటరు వివరాలను సరిచేసుకోవాలని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
    1
    చిలిపిచేడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలోని ఎరువుల దుకాణాన్ని ఎమ్మార్వో శివప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా బస్తాల పంపిణీ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించాలని, పంపిణీలో పారదర్శకత పాటిస్తూ ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దని డీలర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఎరువుల కోసం వచ్చిన రైతులతో మాట్లాడిన ఎమ్మార్వో, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ఫారాలు నింపి ఓటరు వివరాలను సరిచేసుకోవాలని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని మరియు ప్రైవేట్ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శనివారం మార్కెట్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మార్కెట్లోని చిరు వ్యాపారస్తులను, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రైవేటు విద్యా వ్యవస్థ చేస్తున్న దోపిడీని వివరించారు. ఈ సందర్భంగా కనకం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రైవేట్ విద్య పేద, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను చదివించడం కోసం తల్లిదండ్రులు తమ ఆస్తులను సైతం అమ్ముకోవాల్సి వస్తోందని ఆరోపించారు. చదువును వ్యాపారంగా మార్చుకుని ప్రైవేటు విద్యాసంస్థలు పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నాయని మండిపడ్డారు. కరీంనగర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని, ప్రైవేటు విద్యా విధానం సామాన్యులకు అందుబాటులోకి వచ్చేవరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వచ్చే ఆగస్టు 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన ప్రైవేటు విద్యా బాధితుల భారీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడిగల రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గరిగే కోటేశ్వర్, చొప్పరి సుధాకర్, కనపర్తి శ్రీనివాస్, గాలి రమేష్, బూడిద వినోద్ కుమార్, కుడిది శ్రీనివాస్, పల్లపు చిన్నారెడ్డి, మహిళా ప్రతినిధులు మేకల మాధవి, కారుపాకల మున్న, గర్షకుర్తి ఉమారాణి, అంజలి దేవేంద్రతో పాటు పలువురు ప్రతినిధులు, విద్యా విధాన బాధితులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
    1
    ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని మరియు ప్రైవేట్ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శనివారం మార్కెట్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మార్కెట్లోని చిరు వ్యాపారస్తులను, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రైవేటు విద్యా వ్యవస్థ చేస్తున్న దోపిడీని వివరించారు.

ఈ సందర్భంగా కనకం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రైవేట్ విద్య పేద, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను చదివించడం కోసం తల్లిదండ్రులు తమ ఆస్తులను సైతం అమ్ముకోవాల్సి వస్తోందని ఆరోపించారు. చదువును వ్యాపారంగా మార్చుకుని ప్రైవేటు విద్యాసంస్థలు పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నాయని మండిపడ్డారు. కరీంనగర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని, ప్రైవేటు విద్యా విధానం సామాన్యులకు అందుబాటులోకి వచ్చేవరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

వచ్చే ఆగస్టు 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన ప్రైవేటు విద్యా బాధితుల భారీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడిగల రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గరిగే కోటేశ్వర్, చొప్పరి సుధాకర్, కనపర్తి శ్రీనివాస్, గాలి రమేష్, బూడిద వినోద్ కుమార్, కుడిది శ్రీనివాస్, పల్లపు చిన్నారెడ్డి, మహిళా ప్రతినిధులు మేకల మాధవి, కారుపాకల మున్న, గర్షకుర్తి ఉమారాణి, అంజలి దేవేంద్రతో పాటు పలువురు ప్రతినిధులు, విద్యా విధాన బాధితులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీఇంబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పిలుపునిచ్చింది. శనివారం కరీంనగర్‌లోని ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11 వేల కోట్ల మేర విద్యార్థుల బకాయిలను పెండింగ్‌లో పెట్టడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను విస్మరించి విద్యార్థులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలను పరిష్కరించాలని, మంగళవారం నాటి బంద్‌ను విద్యార్థులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
    2
    పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీఇంబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పిలుపునిచ్చింది. శనివారం కరీంనగర్‌లోని ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11 వేల కోట్ల మేర విద్యార్థుల బకాయిలను పెండింగ్‌లో పెట్టడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను విస్మరించి విద్యార్థులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలను పరిష్కరించాలని, మంగళవారం నాటి బంద్‌ను విద్యార్థులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    8 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కేంద్ర హోం సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో, పార్టీ మండల అధ్యక్షులు కోడె రమేష్ నేతృత్వంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అమరవీరుల స్తూపం వద్ద కేక్ కట్ చేసి, టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నాయకులు బండి సంజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు దేవసాని కృష్ణ, డాక్టర్ సత్యనారాయణ, గంట అశోక్, మల్లేష్ యాదవ్, పత్యం ఆంజనేయులు, దేవేందర్ యాదవ్, సర్వోత్తమ్, రాజుతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కేంద్ర హోం సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో, పార్టీ మండల అధ్యక్షులు కోడె రమేష్ నేతృత్వంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అమరవీరుల స్తూపం వద్ద కేక్ కట్ చేసి, టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నాయకులు బండి సంజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు దేవసాని కృష్ణ, డాక్టర్ సత్యనారాయణ, గంట అశోక్, మల్లేష్ యాదవ్, పత్యం ఆంజనేయులు, దేవేందర్ యాదవ్, సర్వోత్తమ్, రాజుతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన ఆరుగురి దారుణ హత్యలకు పోలీసుల వైఫల్యమే కారణమని కేటీఆర్ గారు అన్నారు. నిందితుడికి పోక్సో (POCSO) కేసులో బెయిల్ రావడమే ఈ దారుణానికి దారితీసిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రధాన విమర్శలు చేస్తూ, హోం మంత్రి రేవంత్ రెడ్డికి తన శాఖపై ఏమాత్రం పట్టు లేదని కేటీఆర్ గారు విమర్శించారు. దీని కారణంగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు.
    1
    రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన ఆరుగురి దారుణ హత్యలకు పోలీసుల వైఫల్యమే కారణమని కేటీఆర్ గారు అన్నారు. నిందితుడికి పోక్సో (POCSO) కేసులో బెయిల్ రావడమే ఈ దారుణానికి దారితీసిందని పేర్కొన్నారు.

ఈ ఘటనపై ప్రధాన విమర్శలు చేస్తూ, హోం మంత్రి రేవంత్ రెడ్డికి తన శాఖపై ఏమాత్రం పట్టు లేదని కేటీఆర్ గారు విమర్శించారు. దీని కారణంగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు.
    user_ప్రేమ్ కుమార్
    ప్రేమ్ కుమార్
    Interior designer Nagireddypet, Kamareddy•
    7 hrs ago
  • అందోల్ మండలం అన్నసాగర్ గ్రామ శివారులో శనివారం సాయంత్రం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన తీవ్ర కలకలం రేపింది. నర్సాపూర్ డిపోకు చెందిన బస్సు జోగిపేట వైపు వెళ్తుండగా, హైదరాబాద్ డిపోకు చెందిన మరో బస్సు ఎదురుగా వస్తూ ఈ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నర్సాపూర్ డిపో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    1
    అందోల్ మండలం అన్నసాగర్ గ్రామ శివారులో శనివారం సాయంత్రం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన తీవ్ర కలకలం రేపింది. నర్సాపూర్ డిపోకు చెందిన బస్సు జోగిపేట వైపు వెళ్తుండగా, హైదరాబాద్ డిపోకు చెందిన మరో బస్సు ఎదురుగా వస్తూ ఈ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నర్సాపూర్ డిపో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.