కుంఫిణీ సైన్యాన్ని ఎదిరించిన వీరయోధుడు వడ్డే ఓబన్న శ్రీకాకుళం, జనవరి 11: బ్రిటిష్ కుంఫిణీ సైన్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఉరుకులు పెట్టించిన వీరయోధుడు వడ్డే ఓబన్న అని కలెక్టరేట్ పర్యవేక్షక అధికారి సూర్యనారాయణ కొనియాడారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓబన్న 219వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సూర్యనారాయణ మాట్లాడుతూ.. రేనాటి గడ్డపై జన్మించిన ఓబన్న, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో ప్రధాన అనుచరుడిగా ఉండి ఆంగ్లేయులపై వీరోచిత పోరాటం చేశారని గుర్తుచేశారు. నల్లమల అడవుల్లో సంచార జాతుల సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించి కుంఫిణీ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టిన ఘనత ఓబన్నదేనని ఆయన పేర్కొన్నారు. ఇంతటి చరిత్ర ఉన్న వీరుడికి స్వాతంత్ర్య పోరాట చరిత్రలో తగిన గుర్తింపు లభించకపోవడం విచారకరమన్నారు. ఆయన జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం ద్వారా బడుగు, బలహీన వర్గాలకు సమాజంలో గౌరవం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, వడ్డెర కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కుంఫిణీ సైన్యాన్ని ఎదిరించిన వీరయోధుడు వడ్డే ఓబన్న శ్రీకాకుళం, జనవరి 11: బ్రిటిష్ కుంఫిణీ సైన్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఉరుకులు పెట్టించిన వీరయోధుడు వడ్డే ఓబన్న అని కలెక్టరేట్ పర్యవేక్షక అధికారి సూర్యనారాయణ కొనియాడారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో
ఓబన్న 219వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సూర్యనారాయణ మాట్లాడుతూ.. రేనాటి గడ్డపై జన్మించిన ఓబన్న, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో ప్రధాన అనుచరుడిగా ఉండి ఆంగ్లేయులపై వీరోచిత
పోరాటం చేశారని గుర్తుచేశారు. నల్లమల అడవుల్లో సంచార జాతుల సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించి కుంఫిణీ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టిన ఘనత ఓబన్నదేనని ఆయన పేర్కొన్నారు. ఇంతటి చరిత్ర ఉన్న వీరుడికి స్వాతంత్ర్య పోరాట చరిత్రలో తగిన గుర్తింపు లభించకపోవడం విచారకరమన్నారు.
ఆయన జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం ద్వారా బడుగు, బలహీన వర్గాలకు సమాజంలో గౌరవం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, వడ్డెర కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
- భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో స్థానిక కోర్టు కూడలి వద్ద రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహాన్ని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్ళ కోసం సరళమైన అలవాట్లను చూపించే దంత పరిష్కారాల చెక్‌లిస్ట్.1
- అక్షర స్కూల్ లో వైభవంగా సంక్రాంతి సంబరాలు.... మండపేట న్యూస్... రిపోర్టర్ నందికోళ్ల రాజు.... స్థానిక గొల్లపుంత రోడ్డులోని అక్షర స్కూల్ లో డైరెక్టర్స్ విజ్ఞాన్ రాంబాబు, బొప్పన వెంకటరావుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగువారి సంస్కృతికి ప్రతీకగా రంగు రంగుల ముగ్గులతో స్కూల్ ఆవరణను అలంకరించడంతోపాటు గాలిపతంగులు, హరిదాసు కీర్తనలతో విద్యార్థులు ఆనందంగా గడిపారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులపై భోగిపళ్ళు వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు...3
- 🙏🙏1
- గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- గుంటూరు జిల్లా/ తెనాలి ఆంధ్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. తెనాలిలో జరిగిన షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు త్వరగా చేపట్టాలని కోరారు. రేట్లు పెంచడం వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని, ప్రభుత్వ స్థలాల్లో మినీ థియేటర్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.1
- 🙏🙏1